క్షమించండి !

నా ఈ బ్లాగును అప్డేట్ చెయ్యడం లేదు. ప్రస్తుతం నా మరో తెలుగు బ్లాగ్ రెగ్యులరుగా అప్డేట్ అవుతూంది. అందులోని టపాలను చదవడానికి ఇక్కడ నొక్కండి
Showing posts with label Congress. Show all posts
Showing posts with label Congress. Show all posts

Tuesday, 22 January 2013

తెలంగాన సమస్యకు శాస్వత పరిష్క్తారం

మళ్ళీ ఆల్ పార్టి మీటింగ్ . జనవరి 28 లోపు పరిష్కారం. ఇదీ ఈ రోజుటికున్న పరిస్థితి. నాకైతే కేంద్ర ప్రభుత్వం తెలంగాన సమస్యకు శాస్వత పరిష్కారం చూపుతుందన్నవిశ్వాసం  ఏమాత్రం  లేదు. ఎందుకంటే ఎంత కాదన్నా  సోనియా ఒక విదేశీయురాలు. కనీశం గతంలోలాగా ఆమె విదేశీయతను కప్పి పుచ్చ గల అరుదైన వ్యక్తిత్వం -నాయకత్వ లక్షణాలు గల వై.ఎస్ వంటి నేత ఇక్కడ లేక పోవడమే.

తెలంగాన రాష్ఠ్ర్ర డిమాండు ఎప్పట్లో నుండో  ఉంది. ఆ డిమాండు వెనుక ఉన్న కారణాల్లో నిజం ఉంది.
ఆ కారణాలు ఇంకా సజీవంగానే ఉన్నాయి.

మరి అది ఈ రోజు తారా స్థాయికి చేరడానికి కారణం కె.సి.ఆర్ స్యాడిజమే. ఎంత మంది చస్తే అంతగా పొంగిపోయే విడ్డూర మనస్తత్వం ఆయనది.  పైగా కె.సి.ఆర్ని  అతని విచ్చలవిడి తనాన్ని ఎదుర్కొనే దమ్ము,ధైర్యం ఉండే నేత ఎవ్వడూ లేడు. ఉన్న ఒక్క వై.ఎస్ మనకు లేకుండా పోయారు.

జగన్ పరిస్థితి వేరు. వై.ఎస్. అభిమానులు కేవలం కోస్తా ,రాయలసీమల్లోనే కాదు తెలంగానలోను లక్షల మంది ఉన్నారు.వారిలో తెలంగాన కోరుకునేవారూ ఉన్నారు. ఈ పరిస్థితిలో జగన్ తెలంగాన కోసం పోరాడనూ లేడు.తెలంగానను అడ్డుకోను లేడు.

మరి ఈ సమస్యకు పరిష్క్రారమంటూ ఏమైనా ఉందా లేదా? ఉంది. దాన్ని అమలు చెయ్యడానికి కావల్సింది కాసింత చిత్త శుద్ది మాత్రమే.

ఏకాభిప్రాయంతోనే తెలంగాణా అంటూ చెబుతూ  వచ్చారు. యావద్రాష్ఠ్ర్రంలోనైతే ఏకాభిప్రాయం కుదిరేది లేదు చచ్చేది లేదు. అభిప్రాయం కోరాల్సింది తెలంగాణ ప్రజల వద్దనే. కాబట్టి కలిసుంటారా? విడిపోతారా? అనే ప్రశ్నతో తెలంగానలో  పోలింగ్ నిర్వహించాలి.

మెజారిటి ప్రజలు విడిపోదామంటే యుద్ద ప్రాతిపదికన తెలంగాణ రాష్ఠ్ర్ర ఏర్పాటు జరగాలి.  కలిసుంటామంటే కలిపే ఉంచాలి. కేసిఆర్ సరికదా అతని తలలో జేజమ్మ దిగి వచ్చి అడ్డుతగిలినా సరే శాశ్వతంగా  శ్రీ కృష్ణ జన్మ స్థానానికి పంపాలి.

అయితే ఈ పోలింగుకు పూర్వం ఏడు రోజుల పాటు సమైక్యవాదులు తమ వాణిని తెలంగాన ప్రజలకు  వినిపించే వెసలు బాటు కల్పించాలి.

తెలంగాన ఏదో తమ జాగీరు అన్నట్టుగా విర్ర వీగుతూ అడ్డుకుంటాం -అడ్డంగా నరుకుతామని ఎవడన్నా రెచ్చి పోతే ఎన్ కౌంటర్ చెయ్యాలి.

తెలంగాన సమస్యకు ఇదే అసలు సిసలైన పరిష్కారం.

Wednesday, 9 January 2013

సోనియా పై ఒక ఎఫ్.ఐ.ఆర్

1. స్వదేశి అయిన మేనకాను విదేశి అయిన సోనియా అర్థ రాత్రి ఇంటినుండి గెంటించడం గుర్తుందా?

2.ఇందిర మరణానంతరం మనకీ పాడు రాజకీయాలు వద్దే వద్దు ఇటలీకి వెళ్ళిపోతామని రాజీవ్ మీద వత్తిడ్ తెచ్చిన మాట వాస్తవం కాదా?

3.ఇందిర మరణానంతరం ప్రధాని పదవి పోటిపడి - అది కుదరక - వేరే పార్టి కూడ పెట్టుకున్న  ప్రణబ్ ముకర్జిని తన పక్కనే ఉంచుకోవడం - అందలమెక్కించడంలోని ఆంతర్యం ఏమిటి?

4.రాజీవ్ మరణానంతర ఎన్నికల్లో పూర్తి మెజారిటి దక్కక పోవడంతో రాజకీయాల్లోనుండి తప్పుకుని ఇంటికి పరిమితమైన్ మాట నిజం కాదా? ఆ సమయంలో కేవలం వై.ఎస్ వంటి వేళ్ళ మీద లెక్క పెట్ట కలిగినంత నాయకులే తరచూ కలుస్తూ ఉన్న మాట నిజం కాదా?

5.ప్రధాని పదవిలో ఉన్న తెలుగువాడు పి.వి నేటి మన్మోహన్లా తన మనసెరిగి నడుచుకోలేదని అతని పార్థివ దేహాన్ని సైతం దిల్లిలో నిమిషమైనా ఉంచని స్యాడిస్ట్ సోనియా కాదా?


6.వరుణ్ గాంథి ఏమన్నాడు? హిందువుల పై ఎవడన్నా చెయ్యి చేసుకుంటే చెయ్యి నరుకుతానన్నాడు. ఆ రోజు నానా గందరగోళం చేసిన సోనియా అభిమతం అతను రాకుమారుడు రాహుల్కి అడ్డుగా ఉండకూడదన్నదేగా?

ఈ రోజు అక్బరుద్దీన్ ఓవైసి ఇన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినా సాఫిగా -అతను లండన్నుండి వచ్చేందుకు వేచి ఉండడం .. సాఫిగా  వైద్య పరీక్షలు .. అంటే మీ ఉద్దేశం  అటు వెళ్ళిన ఓవైసి ఇటు రాడా అన్న సంకుచిత కోరికేగా?

7.వై.ఎస్ బతికుండగానే 2004 ఎన్నికల్లో పర్ మెజారిటితో గెలిచి సి.ఎం అయిన కొన్ని నెలలకే  వై.ఎస్ ను మార్చాలని సెంట్రల్ సర్వే చెయ్యించిన మాట వాస్తవం కాదా?
ఆ సర్వేలో మళ్ళీ రెడ్డి కాంగ్రెస్ వస్తుందని కాంగ్రెస్ నిలువునా చీలి వై.ఎస్. రెడ్డి కాంగ్రెస్ సి.ఎంగా కొనసాగుతారని తేలడంతో తోక ముడిచిన మాట వాస్తవం కాదా?

8.రాజీవ్ గాంథి చంపబడటానికి సరిగ్గా పావుగంట ముందు జనతా పార్టి అధ్యక్షులు సుబ్రమణ్యం స్వామికి జనతా పార్టి నేత ఒకరు ఫోన్ చేసారు.ఇతను మాట మొదలు పెట్టక మునుపే ఏంది ..రాజీవ్ గాంథిని చంపేసారన బోతున్నావు అంతేగా అన్నాడుట. ఇది కాకుండా మరో 24 గంటల దాక సుబ్రమణ్యం స్వామి ఎక్కడ ఉన్నారో రికార్డ్స్ లెవట.  ఈ విషయాన్ని సతరు నేత సోనియాకు చెబితే ఈ రోజుదాకా దాని పై స్పందించలేదు.  కారణం ఏమిటి?
భర్త చావు వెనుక ఎవరున్నారో తెలుసుకోవలసిన బాధ్యత ఆమెకు లేదా ? వారు శిక్షించబడాలన్న తపన ఆవిడకు లేదా?

 జనతా పార్టి నేత కంటికి కట్టినట్టు నిజాలు వెల్లడిస్తే పట్టించుకోని సోనియా -రాజీవ్ హత్య వెనుక ఉన్న సుబ్రమణ్యం స్వామి -చంద్రా స్వామి - విదేశి హస్తాలను పట్టించుకోని సోనియా శ్రీలంకలోని తమిళ జాతీయుల పై పగ పట్టారు. అభం శుభం తెలియని పిల్లలను సైతం విడిచిపెట్టకుండ లంక ప్రభ్తువం నరమేధం చేస్తుంటే లంక ప్రభుత్వానికి ఆయుధాలు సమకూర్చడమే కాక ,ర్యేడార్లు , యుద్ద నిఫుణుల సాయాన్ని అందచేసారు.వేల కోట్ల రూపాయలు నిధులు అందచేసారు.


9.ఇంతే కాదు  రాజీవ్ హత్య కేసులో బాంబు కట్టుకుని పేల్చిన థను సంఘఠణాస్థలిలోనే మరణించింది - శివరాజన్ ఎన్కౌంటర్లో చచ్చాడు.కాని ఏ పాపం తెలీని అమాయకులు ఇంకా ఉరికంభం నీడలో చచ్చి బతుకుతున్నారు.. నళిని ఉరిశిక్షను రద్దు చెయ్యాలని చెప్పడమే కాక  ప్రియంకను నళిని వద్దకు పంపి డ్రామా నడిపిన సోనియా ఈ రోజు దాక లంకలో దయనీయ పరిస్థితిలో బతుకుతున్న తమిళ జాతీయులను పట్టించుకోలేదు. పైగా నర రూప రాక్షసుడు రాజపక్షేకు భారత్ ఎర్ర తివాచి పరచి స్వాగతం పలుకుతూనే ఉంది


10.బోఫర్స్ కుంభకోణంలో కత్రోచిని దేశం దాటించింది ఎవరు? ఇంతే కాదు..సుబ్రమణ్యం స్వామి టు జి స్కామ్లో అసలు సిసలైన భోక్త సోనియా.స్కామ్లో సింహ భాగం అందింది సోనియాకే అంటూ అరిచి గగ్గోలు పెడుతుంటే కనీశం అతని పై ఒక పరువు నష్ఠ దావా వేసే సాహసంకూడ చెయ్యలేదు సోనియా..


11.మేము అవినీతికి వ్యతిరేకం. అవినీతికి పాల్పడ్డవారు ఎవరైనా సరే మా మిత్ర పక్ష నాయకుని గారాల పట్టి అయినా సరే - వై.ఎస్. తనయుడైనా సరే పొడిచేస్తాం అని విర్ర వీగే సోనియమ్మ అదే మిత్రపక్ష నాయకుని మనముడు మాజి కేంద్ర మంత్రి దయానిధిమారన్ విషయంలొ ఎందుకు మీన మేషాలు లెక్కిస్తున్నారు. (వాటా అంది పోయిందనా -లేక అందుతుందనా? ). పోనీ స్వయాన తమ అల్లుడు అవినీతికి పాల్పడ్డాడని ప్రతిపక్షాలు - మీడియా గగ్గోలు పెడుతుంటే కనీశం విచారణ  జరపమని సి.బి.ఐని ఎందుకు పురమాయించలేదో చెప్పగలరా?

Sunday, 24 June 2012

మళ్ళీ సాక్షి మీడియా ఖాతాలు స్థంభన !


నిండా మునిగాక చలి ఏంటి అన్న చందంగా తన కుట్రలు ఒక్కొక్కటే భయిట పడుతున్న కొద్ది సి.బి.ఐ బరితహించి పోతూంది. ఒక సారి సాక్షి మీడియా ఖాతాలు స్థంభనకు పూనుకొన్నారు. హై కోర్టు చీవాట్లు పెట్టడంతో వెనక్కి తగ్గేరు.కాని ఏ పెద్దలు ఎటువంటి వత్తిడి పెట్టారో గాని .. మళ్ళీ ఖాతాల స్థంభనకు దిగేరు. ఈ విడత సాక్షి మీడియాకు జిల్లాల్లో ఉన్న ఖాతాలను స్థంభింప చేసేరు.

న్యాయ వ్యవస్థలో స్పీడు పెరిగాక సామాన్యుడికి సైతం కోర్టు పరిబాషలు ఇట్టే అర్థమై పోతున్నాయి. కొందరైతే ఐ.పి.సి సెక్షన్లను సైతం ఏకరవు పెట్టే పరిస్థితి ఉంది.

ఒక సారి హై కోర్టు కాదు ,కూడదన్న తరువాత మళ్ళీ అదే కార్యక్రమం పెట్టుకోవడం కోర్టు దిక్కారం కాదా అని వారు ప్రశ్నిస్తున్నారు. జగన్ నిర్ధోషిత్వాన్ని నిరూపించాల్సిన పని జగన్ తరపు లాయర్లది. జగన్ దోషి అని తేలితే శిక్షించాల్సింది కోర్టుల పని. ఎవరి పని వారు చేస్టే విమర్శలకు తావే లేదు.

సి.బి.ఐ అన్నది కేవలం ఒక దర్యాప్తు సంస్థ. దాని పని దర్యాప్తు చెయ్యడం. 9 నెలలుగా అదే పని చేస్తున్నారని మనమనుకుంటూ ఉంటే సి.బి.ఐ జె.డి ఆ పనిని గాలికొదిలేసి లీకు వీరుడై - ఒక రాజకీయ ప్రత్యర్దికంటే హీనంగా - జగన్ పరువును మంట కలపడమే పని అంటూ ఎంత కష్ఠించారో చూసాం.

ఎలాగూ సి.బి.ఐ గొంతుదాకా ఆరోపణల్లో ఇరుక్కుంది. కనీశం ఇప్పటికైనా ఓవర్ యాక్షన్ మాని -చేసేది తప్పుడు పనే అయినా -కనీశం అవి తప్పనిపించకుండా -ఒక పద్దతి ప్రకారం చేసుకునే ఉద్దేశం కూడ దానికి లేక పోయింది.

బహుసా సి.బి.ఐ కోర్టు ద్వారా ఆదేశాలు పొంది ఖాతాలు స్థంభింప చేస్తే ఇంతగా దానిని ఆడిపోసుకునేవారం కాదు కదా? ఎందుకీ తొందర పాటు? ఎందుకీ అత్యుత్సాహం? ఎవరిని సంతృప్తిపరచడం కోసం ఈ పాట్లు?

ఇప్పటికే జగన్ కేసును దర్యాప్తు చేసే నైతికత సి.బి.ఐ జె.డికి లేదంటూ గళం విప్పుతుంటే ఈ ఓవరాక్షన్ ఎందుకు?


ఎలాగూ సి.బి.ఐ "పెద్దల చేతిలో" ఆయుధంగా మారింది కాబట్టి ఆ పెద్దలనే సూటిగా ప్రశ్నిస్తున్నాను. జగన్ను రాజకీయంగా ఎదుర్కోలేక - రాక్షసంగా జైల్లో పెట్టేరు. అయినా లాభం లెక పోయింది. భౌతికంగా అంతం చెయ్యాలనుకునేరు. కుట్రలు భహిర్గతం కావడంతో అదీ కాస్త అసంభవమైంది.

ఇప్పటికైనా నిజం తెలుసుకుని తోక ముడుస్తే కనీసం ప్రతిపక్ష హోదానన్నా మిగుల్తుంది. అలా కాక చేసిన తప్పులనే మళ్ళీ మళ్ళీ చేస్తూ పోతే ప్రజలు కాంగ్రెసుకు బొంత పెట్టడం ఖాయం.

ఇంతకీ ఓ పెద్దలారా !
మీ ఉద్దేశం కాంగ్రెస్ పార్టిని గట్టెక్కించడమా.. లేక జగన్ను గద్దెనెక్కించడమా? మీరేంచేస్తున్నారో కూడ మీకు తెలియడం లేదా? ఉప ఎన్నికల ఫలితాలు మీ మైండును బ్లాంక్ చేసి ఉన్నా ఫర్వాలేదు కాని సెప్టిక్ ట్యాంకు చేసినట్టుంది..

చంద్రబాల -జె.డి -ఆర్.కె కాల్ లిస్ట్:

ఒకటి రెండు రోజుల్లో తన/తమ కాల్ లిస్టులను భయిట పెట్టిన వారి పై పోలీసులకు ఫిర్యాదు చేస్తారట.. భయిట పడింది ఒక కుట్ర - భయిట పడింది ఒక నేరం.

నేరం గురించి -కుట్ర గురించి వివరణ ఇచ్చుకోవడం మాని దానిని భయిట పెట్టిన వారి పై ఫిర్యాదులు చేస్తే ఏమనుకోవాలి? రాజకీయ ప్రబుద్దులకు లంచాలు ఇచ్చి ట్రాప్ చేసే స్టింగ్ ఆపరేషన్లకే కోర్టులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉన్న సందర్భంలో వారికి కోర్టులో సైతం భంగ పాటు ఖాయం.



Friday, 13 May 2011

మళ్ళీ పప్పులో కాలేసిన జగన్


కని విని ఎరుగని చరితాత్మక విజయం సాధించినప్పటికి మరుక్షణమే పప్పులో కాలేసారు అదేంటో ఈ టపా చివర చెబుతాను.

ఇదవరకే జగన్ విషయంలో రెండు పర్యాయాలు నా సలహాలు ఇవ్వగా ఒక సారి పట్టించుకోలేదు (ఇంతకీ అప్పట్లో సంభంధిత టపా యొక్క ప్రింట్ అవుట్ ఫ్యేక్స్,కొరియర్ ద్వారా కూడ పంపాను)

మరో సారి పార్టి అంటే అదేదో ప్రైవేట్ లిమిటడ్ కంపెని అన్న అజ్నానంతో పార్టి ఏర్పాటు తరువాత -పార్టి ఏర్పాటు తరువాత అని జగన్ గౄపు నాయకులు "మాటలు" చెబుతుండగా వళ్ళు మండి మరో టపా వ్రాసాను .

పార్టి అంటే ప్రైవేట్ లిమిటడ్ కంపెని కాదని నొక్కి చెప్పాను. నా మాటలు జగన్ కు చేరాయో -ఎవరైనా శ్రేయోభిలాషులు చేర్చారో తెలీదు కాని వరస పెట్టి జల దీక్ష,ఫీజు పోరు,హరిత యాత్ర అని రెచ్చి పోయేరు.

కాని ఘన విజయానంతరం మీడియాతో మాట్లాడిన జగన్. జూలై 8న వై.ఎస్. జన్మదినం సందర్భంగా ప్లీనరి సమావేశాలు - మేధోమథనం విధి విధానాల నిర్ణయం అది ఇది అంటూ పొడవాటి మాటలు చెప్పేరు.

వై.ఎస్. అనే రెండక్షరాలకు ఓంకారానికి ఉన్నంత శక్తి నేడు రాష్ఠ్ర్రంలో ఉంది. దానికి తోడు నేటి ఘన విజయం కూడ చేరింది. Now or Never అన్న పరిస్థితి నేడు నెలకొంది.

తెలంగాణ భూతానికి భయపడే - కాంగ్రెస్సు వారే పడిలెయ్యని అన్న ఉద్దేశంతోనే ఇలా జూలై 8ముహూర్తం నిర్ణయించుకున్నట్టుంది.

ఎవరో తీసుకునే నిర్ణయానికోసం వేచి ఉంటే అది పుట్టించే తరంగాలు ఒడ్డుకు చేరుస్తాయో ముంచుతాయో తెలీదు.

మనదంటూ ఒక వైఖరిని ముందుగా ప్రకటించి ఇతరులను బెంబేలెత్తించేవాడే అసలైన నాయకుడు.

ఇప్పటికీ మించి పోయిందేమి లేదు టి.ఆర్.ఎస్. తెలంగాణ తె.దే.పా, కాంగ్రెస్ నాయకులు విర్ర వీగుతున్నారుగా..తెలంగాణలోని  ప్రతి ఒక్క పౌరుడు తెలంగాణ కోరుకుంటున్నాడని..

అదేదో ఒక ఓటింగుతో నిరూపించమనాలి. విడిపోతే ఏం నష్ఠమో అక్కడి ప్రజలకు వివరించే అవకాశాన్ని సమైఖ్యవాదులకు కల్పించాలి. తెలంగాణ ప్రజలు కోరుకుంటే తెలంగాణకు మేం వ్యతిరేకం కాదని జగన్ ప్రకటించి వేసి.. ఆ పై రెండు రోజుల ప్లీనరి నిర్వహించి పదిహేను రోజుల్లో గ్రామ స్థాయిదాక కమిటీలు ఏర్పాటు చేసెయ్యాలి.

జూలై 8 నాటికి - ఆ మహానేత జన్మ దినంలోపే ప్రభుత్వం కూలడం - యావత్తు కాంగ్రెస్ ఎమ్.ఎల్.ఏలు జగన్ వెంట నిలబడి కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడం పూర్తి కావాలి.
కనిసం జూలై 8 నాటికి వై.ఎస్. పై భురద చల్లే ప్రభుద్దులు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం  కుప్ప కూలాలి.

ఇలా తన అజెండాను వేగవంతం చేస్తే అన్నీ ఒక కొల్లిక్కి వస్తాయి. జూలై 8కి వాయిదా వేయడం వలన జరుగగల అనర్థాలు:

జగన్ వెంట ఉన్న ఇంకొందరు ఎమ్.ల్.ఏలను బుట్టలో వేసుకునే ప్రయత్నం జరుగవచ్చు. అందులో ప్రభుత్వం సక్సెస్ కూడ కావచ్చు.

జగనే కాంగ్రెస్లోకి రానున్నారని ప్రచారం మొదలు పెట్టొచ్చు ( బా.జా.పాతో కలుస్తాడని ఇటీవల చేసారుగా)

తమ చేతిలో ఉన్న సి.బి.ఐ ని పావుగా వాడుకుని జగన్ పై కేసులు భనాయించవచ్చు.

తృతీయ స్థాయి నాయకులదాక ఎవరెవరైతే జై జగన్ అనగలరో వారందరిని కట్టి చెయ్యడం -లేదా తమ వైపుకు తిప్పుకోవడం ఇలా ఎన్నో ఎన్నెన్నో జరిగిపోవచ్చు.

శతృవు మనం  కొట్టిన దెబ్బకు దిమ్మతిరిగి ఉన్నప్పుడే చావు దెబ్బ తీయాలి. ఇది ప్రాథమిక రాజకీయ సూత్రం.

మరింత కాలం ఈ ప్రభుత్వాన్ని కొనసాగనివ్వడం ప్రజలకు చేసే ద్రోహమే అవుతుంది. జగన్ పునరాలోచించాలి.

Wednesday, 13 April 2011

వై.ఎస్ కాంగ్రెస్ ,ఇందిరా,సోనియా విధేయుడా?

వై.ఎస్ కాంగ్రెస్ ,ఇందిరా,సోనియా విధేయుడని జగన్ ఆయన కడుపున చెడ పుట్టాడని కాంగ్రెస్ నాయకులు వాదిస్తున్నారు. రెడ్డి కాంగ్రెస్ ఉదంతాన్ని వారు మరిచారా?. లేక  మరిపించ చూస్తున్నారా?
ఇందిరమ్మ విశ్రాంతి కోసం  గెస్ట్ హౌస్  వస్తే ఆమెను అడుగు పెట్తనీయక తరిమి తరిమి కొట్టిందెవరన్న విషయాన్ని మరిచారా?. లేక  మరిపించ చూస్తున్నారా?
దిల్లీవారు సి.ఎమ్ గా కూర్చో పెట్టిన ఏ ఒక్కరిని వై.ఎస్. ఏనాడు అంగీకరించిన పాపాన పోలేదు. ప్రతి ఒక్కరిని వ్యతిరేకిస్తునే వచ్చారు
రాజివ్ మరణానంతరం కాంగ్రెస్ పార్టిని నరసింహరావు హైజాక్ చేస్తే  తన రాజకీయ భవిష్యత్ కొసం సోనియాను రాజకీయానికి రా రమ్మని పిలిచినవారెవరో  వారు మరిచారా?. లేక  మరిపించ చూస్తున్నారా?
2004 ఎన్నికలకు పూర్వం వై.ఎస్. పాదయాత్ర మొదలు పెడితే ..ఆ ప్రస్తానానికి అదిష్థానం ఎంతమెరకు మద్దత్తిచ్చిందో .. కనీశం ముగింపు సభకు సైతం అధినేత్రి హాజరయ్యారో లేదో వారు మరిచారా?. లేక  మరిపించ చూస్తున్నారా?
2004 ఎన్నికల్లో పార్టిని గెలిపించిన వై.ఎస్.కి మనస్పూర్తిగా మరో ఆలోచన లేకే  సి.ఎమ్ చేసారా? విధి లేక.. మరో దారిలేక .. చేసారు.
ఆ మధ్యలోనే సెంట్రల్ ఇంటలిజెన్స్ చేత "సి.ఎమ్ ను మారుస్తే ఎలా ఉంటుందని సర్వే చెయ్యించిన మాట నిజమో కాదో   వారు మరిచారా?. లేక  మరిపించ చూస్తున్నారా?
సి.ఎమ్.ను మారుస్తే రెడ్డి కాంగ్రెస్ మళ్ళీ వస్తుందని వై.ఎస్సే సి.ఎమ్ అవుతారని తేలడంతో ఆగే పీచే ముసుకున్న సంగతిని  వారు మరిచారా?. లేక  మరిపించ చూస్తున్నారా?
ఒక్కో సారి వై.ఎస్. దిల్లీ పెద్దలను కలిసి భయిటకొచ్చినప్పుడు విలేకర్లు గుచ్చి గుచ్చి ప్రశ్నలేస్తుంటే " అది మీరు అడగ కూడదు.. నేను చెప్పకూడదని  దాట వేసేవారు - ఈ మాటను  వారు మరిచారా?. లేక  మరిపించ చూస్తున్నారా?
వై.ఎస్ మరణించాక ఆ మహానేతను అవమానించడం ఒక ఎత్తైతే ఆయన బతికున్నప్పుడే ఎన్ని విదాలా అవమాణించేవారో మచ్చుకు కొన్ని...........
చిత్తూరు జిల్లా ప్రఖ్యాత సారా వ్యాపారి డి.కె.కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవాలని ఉవ్విళ్ళూరితే వై.ఎస్. నిరాకరించారు. మరి డి.కెను పార్టిలోకి తెచ్చుకోవడం వై.ఎస్.ను అవమనించడం కాదా?
జయేంద్ర సరస్వతి మెడికల్ కాలేజి పేరిట ఉచితంగా భూమి కాజెయ్య జూస్తే అందుకు వై.ఎస్ అడ్డు తగిలితే వై.ఎస్. ను కాదని జయేంద్రకు భూములు కట్ట పెట్టడం వై.ఎస్.ను అవమనించడం కాదా?
ఇలా ఒకటి కాదు వేల కొలది ఉదాహరణలున్నాయి.
వై.ఎస్. మరణించాక కడప జిల్లాకు పేరు మార్చడం మినహ వీరు పొడిచిందేమి?
వై.ఎస్. మరణించిన ఎంత కాలానికి శాసన సభా పక్షం సానుభూతి ప్రకటించింది అన్న విషయాన్ని వారు మరిచారా?. లేక  మరిపించ చూస్తున్నారా?
ఎకంగా గాంధి భవన్ ను కాంగ్రెస్ శాసన సభా పక్ష కార్యాలయాన్ని వేదిక చేసుకుని వై.ఎస్. పై అడ్డమైన వారు భురద చల్లుతుంటే  ఆ కార్యక్రమం అదిష్ఠానం కను సైగల్లోనే జరిగిందన్న సంగతిని  వారు మరిచారా?. లేక  మరిపించ చూస్తున్నారా?
జగన్ ఓదార్పు యాత్ర చేపడితే సామ,భేద,దాన,దండోపాయాలతో అడ్డుకో చూసారే.. ఇది వై.ఎస్.ను అవమనించడం కాదా? ఈ సంగతిని   వారు మరిచారా?. లేక  మరిపించ చూస్తున్నారా?
ఒక జన హృదయ నేత మరణించిన షాకుతో మరణించిన వారి మరణాలను సైతం తక్కువ చేసి మాట్లాడడం వై.ఎస్.ను అవమనించడం కాదా? ఈ సంగతిని   వారు మరిచారా?. లేక  మరిపించ చూస్తున్నారా?
పార్టి తరుపున మేమే ఓదారుస్తామని ప్రగల్పాలు పలికినవారు నెలలు గడిచినా ఇందాక ఏం పొడిచారు? ఇది   వై.ఎస్.ను అవమనించడం కాదా? ఈ సంగతిని   వారు మరిచారా?. లేక  మరిపించ చూస్తున్నారా?
వై.ఎస్. అవినీతి పరుడని గొంతు చించుకోవడమే కాక కోర్టుల్లో దావాలు వేసి లేఖలు వ్రాసిన వారు తమంతట తామే ఆ పని చేసారా? ఈ కార్యక్రమాలు అదిష్ఠానం అనుమతి లేకనే సాగాయా?
ఈ పని వై.ఎస్.ను అవమనించడం కాదా? ఈ సంగతిని   వారు మరిచారా?. లేక  మరిపించ చూస్తున్నారా? జనం ఈ డొంక తిరుగుడు మాటల్ని నమ్మే పరిస్థితిలో లేరు.
హైదరాబాదులో మాట్లాడినప్పుడు వై.ఎస్. అవినీతి పరుడు. కడప గడపకు వచ్చినప్పుడు మాత్రం దేవుడా? ఈ రాజకీయ వ్యభిచారాన్ని ప్రజలు క్షమించరు గాక క్షమించరు..
చారిత్రిక మెజారిటితో జగన్ ,విజయమ్మలు గెలవడం ఖాయం. అక్కడే క్యేంపు కొట్టి కంపు రాజకీయాలు చేస్తున్న మంత్రులు, నేతలు ఎవరి మెప్పు కొసం ఈ నీచానికి దిగచారారో ఆ అదిష్ఠానం చేతే అవమానింప పడటం తధ్యం.

Sunday, 6 February 2011

చిరంజీవి లెగ్గుతో కాంగ్రెస్ గుగ్గిపాలు

హెశ్చరిక:

నేను సైతం చిరంజీవి అభిమానినే. అల్లుడా మజాకాలోని డబుల్ మీనింగ్ డైలాగులతో అశ్లీల దృశ్యాలతో విసిగి చీ కొట్టి అభిమానాన్ని విరమించుకున్నవాడ్ని. ఎన్.టి.ఆర్ రాజకీయ ప్రవేశానంతరం ఏర్పడిన ఖాళీని పూరించుకోవడం కోసం చిరు అభిమానిగా మారినవాడను.

విషయానికొస్తే చిరు ప్రజారాజ్యం పార్టిని కాంగ్రెస్ తో విలీనం చేసి సోనియమ్మను ఇటలికి పార్సెల్ చేసే భృహత్తర కార్యక్రమానికి నాంది పలికారు . అందుకు వారికి నా అభినందనలు.

చిరును అభిమానించేవారిలో చాలా మందికి ఆయన్ స్వయం కృషితో పైకొచ్చారన్న భ్రమ ఉండేది. ఈ మాట ఎంతమెరకు నిజమంటే ఆయనగారు ఆల్లుగారి అల్లుడైనంత వరకే. ఆతరువాత లాబియింగ్,కుల రాజాకీయం అంతా చేరి పోయినవి.

ఈ పాత చింతకాయ పచ్చళ్ళ గోల ఇప్పుడెందుకు. పార్టీలు అధికారానికొస్తేనే అవినీతికి అవకాశం వస్తుంది. కాని చిరు పార్టి ప్రకటించగానే "వసూలు" మొదలు పెట్టేరు. కుటుంభ రాజకీయాలు వేరే ట్రాక్.

అత్యుత్తమ పతివ్రతలా వేషం కట్టేరు. ప్రేమా ,సేవా అని ఊరించేరు. సామాజిక న్యాయం అనేరు. వై.ఎస్. రాష్ఠ్ర్రాన్ని దోచి సోనియాకు వాటా ఇస్తున్నానన్నాడు. ఇవన్ని మరవాలనుకున్నా మరువలేనివి.

ఎలాగో గూడారం పీకేసి ఒక ఇంటి వాడయ్యేడు. అదీ కాంగ్రెసు గూటికి చేరాడు. ముందు ముందుంది ముసళ్ళ పండుగా. చిరు జాతకం గురించి అందరు పండితులు ఆహా ఓహో అన్నప్పుడే నేను ఆర్కుట్లో "ఇరవై నుండి ముప్పై సీట్లొస్తాయన్నాను. చిరు అభిమానులు నన్ను బండ భూతులు తిట్టేరు.

తనకు ఏ పదవీ లేదట - పార్టీ వారికి ఐదు ఇస్తారట. చిరుగారికి కేంద్రంలో చోటిస్తారేమో. ఇంకెన్ని మంత్రులు అవినీతి ఆరోపణలతో రాజీనామాలు చెయ్యాల్సి వస్తుంది చూసుకుని చేపడతారు కేంద్ర మంత్రి మండలి విస్తరణ. అప్పుడు చిరుగారికి దక్కు ఒక బెర్తు.

ఎన్.టి.ఆర్ అభిమానిగా నాకు ఈ పరిణామం ఎంతో ఆనందాన్నిస్తుంది. పులి పులే (మరీ ఆయన బొబ్బిలి పులి) నక్క నక్కే ( మరీ ఇది జిత్తుల మారి)

వై.ఎస్. అభిమానిగా ,జగన్ శ్రేయోభిలాషిగా ఈ పరిణామం ఎంతో ఆనందాన్నిస్తుంది. చిరు ఇక పై వై.ఎస్.ను విమర్శించ బోరు.లేరు. పైగా డెఫెండింగ్ చెయ్యాల్సిందే.

యాంటి కాంగ్రెస్ మనస్తత్వం గల నాకు ఈ పరిణామం ఎంతో ఆనందాన్నిస్తుంది. ఎందుకంటే చిరు జాతకం నాకు తెలుసు. ఎక్కడున్నా ఆయన భావుంటాడు. ఆయన ఉన్న చోటే గుగ్గిపాలు. ఐరన్ లెగ్ శాస్త్ర్రితో కాంగ్రెసుకి , సోనియమ్మకు జరుగుతుంది తగిన శాస్తి.