క్షమించండి !
నా ఈ బ్లాగును అప్డేట్ చెయ్యడం లేదు. ప్రస్తుతం నా మరో తెలుగు బ్లాగ్ రెగ్యులరుగా అప్డేట్ అవుతూంది. అందులోని టపాలను చదవడానికి ఇక్కడ నొక్కండి
Pages
Friday, 13 May 2011
మళ్ళీ పప్పులో కాలేసిన జగన్
కని విని ఎరుగని చరితాత్మక విజయం సాధించినప్పటికి మరుక్షణమే పప్పులో కాలేసారు అదేంటో ఈ టపా చివర చెబుతాను.
ఇదవరకే జగన్ విషయంలో రెండు పర్యాయాలు నా సలహాలు ఇవ్వగా ఒక సారి పట్టించుకోలేదు (ఇంతకీ అప్పట్లో సంభంధిత టపా యొక్క ప్రింట్ అవుట్ ఫ్యేక్స్,కొరియర్ ద్వారా కూడ పంపాను)
మరో సారి పార్టి అంటే అదేదో ప్రైవేట్ లిమిటడ్ కంపెని అన్న అజ్నానంతో పార్టి ఏర్పాటు తరువాత -పార్టి ఏర్పాటు తరువాత అని జగన్ గౄపు నాయకులు "మాటలు" చెబుతుండగా వళ్ళు మండి మరో టపా వ్రాసాను .
పార్టి అంటే ప్రైవేట్ లిమిటడ్ కంపెని కాదని నొక్కి చెప్పాను. నా మాటలు జగన్ కు చేరాయో -ఎవరైనా శ్రేయోభిలాషులు చేర్చారో తెలీదు కాని వరస పెట్టి జల దీక్ష,ఫీజు పోరు,హరిత యాత్ర అని రెచ్చి పోయేరు.
కాని ఘన విజయానంతరం మీడియాతో మాట్లాడిన జగన్. జూలై 8న వై.ఎస్. జన్మదినం సందర్భంగా ప్లీనరి సమావేశాలు - మేధోమథనం విధి విధానాల నిర్ణయం అది ఇది అంటూ పొడవాటి మాటలు చెప్పేరు.
వై.ఎస్. అనే రెండక్షరాలకు ఓంకారానికి ఉన్నంత శక్తి నేడు రాష్ఠ్ర్రంలో ఉంది. దానికి తోడు నేటి ఘన విజయం కూడ చేరింది. Now or Never అన్న పరిస్థితి నేడు నెలకొంది.
తెలంగాణ భూతానికి భయపడే - కాంగ్రెస్సు వారే పడిలెయ్యని అన్న ఉద్దేశంతోనే ఇలా జూలై 8ముహూర్తం నిర్ణయించుకున్నట్టుంది.
ఎవరో తీసుకునే నిర్ణయానికోసం వేచి ఉంటే అది పుట్టించే తరంగాలు ఒడ్డుకు చేరుస్తాయో ముంచుతాయో తెలీదు.
మనదంటూ ఒక వైఖరిని ముందుగా ప్రకటించి ఇతరులను బెంబేలెత్తించేవాడే అసలైన నాయకుడు.
ఇప్పటికీ మించి పోయిందేమి లేదు టి.ఆర్.ఎస్. తెలంగాణ తె.దే.పా, కాంగ్రెస్ నాయకులు విర్ర వీగుతున్నారుగా..తెలంగాణలోని ప్రతి ఒక్క పౌరుడు తెలంగాణ కోరుకుంటున్నాడని..
అదేదో ఒక ఓటింగుతో నిరూపించమనాలి. విడిపోతే ఏం నష్ఠమో అక్కడి ప్రజలకు వివరించే అవకాశాన్ని సమైఖ్యవాదులకు కల్పించాలి. తెలంగాణ ప్రజలు కోరుకుంటే తెలంగాణకు మేం వ్యతిరేకం కాదని జగన్ ప్రకటించి వేసి.. ఆ పై రెండు రోజుల ప్లీనరి నిర్వహించి పదిహేను రోజుల్లో గ్రామ స్థాయిదాక కమిటీలు ఏర్పాటు చేసెయ్యాలి.
జూలై 8 నాటికి - ఆ మహానేత జన్మ దినంలోపే ప్రభుత్వం కూలడం - యావత్తు కాంగ్రెస్ ఎమ్.ఎల్.ఏలు జగన్ వెంట నిలబడి కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడం పూర్తి కావాలి.
కనిసం జూలై 8 నాటికి వై.ఎస్. పై భురద చల్లే ప్రభుద్దులు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కుప్ప కూలాలి.
ఇలా తన అజెండాను వేగవంతం చేస్తే అన్నీ ఒక కొల్లిక్కి వస్తాయి. జూలై 8కి వాయిదా వేయడం వలన జరుగగల అనర్థాలు:
జగన్ వెంట ఉన్న ఇంకొందరు ఎమ్.ల్.ఏలను బుట్టలో వేసుకునే ప్రయత్నం జరుగవచ్చు. అందులో ప్రభుత్వం సక్సెస్ కూడ కావచ్చు.
జగనే కాంగ్రెస్లోకి రానున్నారని ప్రచారం మొదలు పెట్టొచ్చు ( బా.జా.పాతో కలుస్తాడని ఇటీవల చేసారుగా)
తమ చేతిలో ఉన్న సి.బి.ఐ ని పావుగా వాడుకుని జగన్ పై కేసులు భనాయించవచ్చు.
తృతీయ స్థాయి నాయకులదాక ఎవరెవరైతే జై జగన్ అనగలరో వారందరిని కట్టి చెయ్యడం -లేదా తమ వైపుకు తిప్పుకోవడం ఇలా ఎన్నో ఎన్నెన్నో జరిగిపోవచ్చు.
శతృవు మనం కొట్టిన దెబ్బకు దిమ్మతిరిగి ఉన్నప్పుడే చావు దెబ్బ తీయాలి. ఇది ప్రాథమిక రాజకీయ సూత్రం.
మరింత కాలం ఈ ప్రభుత్వాన్ని కొనసాగనివ్వడం ప్రజలకు చేసే ద్రోహమే అవుతుంది. జగన్ పునరాలోచించాలి.
Subscribe to:
Post Comments (Atom)

అంత లేదండీ. He is going in the right direction. He is simply executing his strategy with conviction. He is not changing his strategy based on the results of some of the intermediate steps or because of the actions of others. He is at least 6 months ahead of other leaders in planning.
ReplyDelete