క్షమించండి !

నా ఈ బ్లాగును అప్డేట్ చెయ్యడం లేదు. ప్రస్తుతం నా మరో తెలుగు బ్లాగ్ రెగ్యులరుగా అప్డేట్ అవుతూంది. అందులోని టపాలను చదవడానికి ఇక్కడ నొక్కండి

Saturday, 28 May 2011

ఎన్.టి.ఆర్ వై.ఎస్.ఆర్ ఉత్త తిక్కలోళ్ళు

నేడు రాజకీయం నడుస్తున్న తీరు దెన్ను చూస్తే  ఎన్.టి.ఆర్ వై.ఎస్.ఆర్ ఉత్త తిక్కలోళ్ళా కనిపిస్తున్నారు. ప్రజా స్వామ్యంలో అమాయకులైన ప్రజలకు ఏవో కొన్ని మాయ మాటలు చెప్పి ఓట్లు దండుకుని ఆ తరువాత ప్రజలు అన్న పదాన్నే బూతు మాటలా చీదరించుకునే  నాయకులు తయారయ్యేరు.

అసలు వై.ఎస్. ఆర్ మరణానంతరం ప్రభుత్వం తరపున  ఏ ఒక్క కార్యక్రమమన్నా మొదలు పెట్టారా? చే పట్టిన ఏకైక కార్యక్రమం రచ్చ భండ. కాని అదీ  రచ్చ రచ్చ ఆయ్యింది. రోశయ్య సంగతి అదో రకం. ఆయన తన అనుభవంతో పరిస్థితి చేజారకుండా సర్దుపాటు చేస్తుండి పోయారు. ఒక్క టి ఆర్ ఎస్ నేత కె.సి.ఆర్ ఆమరణ (?) నిరాహార దీక్ష విషయంలో మాత్రం అవసరానికి మించి గాబరా పడిపోయి, అదిష్ఠానాన్ని బెదర కొట్టి పప్పులో కాలేసారు.

తలంగాణకు అనుకూలంగా ప్రకటణ చేస్తే సరిపోతుంది కదా అని కేంద్రం ప్రకటన చేస్తే ఎంకి పెళ్ళి సుబ్బి చావుకొచ్చిందన్నట్టుగా సమైఖ్యవాదులు రెచ్చిపోవడంతో అన్ని పార్టీలకు పక్షవాతం వచ్చినంత పనైంది.  ఆ తరువాత సి.ఎం కుర్చి ఎక్కిన  కిరణ "పోయినోళ్ళు మంచోళ్ళు" అనిపించే రీతిలో  ఏకంగా జగన్ పార్టీని వీడి  కొత్త పార్టి పెట్టుకునేంతగా పరిస్థితిని దిగ జార్చారు.

ప్రస్తుతం రాష్ఠ్ర్రంలో జగన్-తెలంగాణ సమస్య -కాంగ్రెస్ -తెదెపా గౄపు తగాదాలు మినహా మరె ప్రజా కార్యక్రమం జరిగేట్లు లేదు. మీడియా కూడ దీని పైనే దృష్ఠి కేంద్రికరిస్తుండటం హేయంగా ఉంది.

వీరితో ఎన్.టి.ఆర్ వై.ఎస్.ఆర్లను పోల్చుకుంటే వారు  ఉత్త తిక్కలోళ్ళనిపిస్తున్నారు. కాని పేదవాడు,సామాన్య ప్రజల పరిస్థితి  కొంతలో కొంత మెరుగుపడాలంటే ఎన్నికల సంవత్సరంలోనే కాక అస్తమానం ప్రజలు ప్రజలు అని పరితపించే ఎన్.టి.ఆర్ వై.ఎస్.ఆర్ వంటి తిక్కలోళ్ళు అవసరం.

జగన్లో ఆ తిక్క కనిపిస్తూంది. ఇది అధికారం చేపట్టినాక సైతం కొనసాగుతుందా అన్నదే మిలియన్ డాలర్ ప్రశ్న.
ఇంతకీ ఇంతకాలం టపాలు వ్రాయడమే మానేసిన నన్ను ఈ టపా వ్రాయించింది ఈ రోజు సాక్షి టివిలో ప్రసారమైన రామన్న రాజన్న (ఫోకస్.) కార్యక్రమం. రామన్న రాజన్నల భాటలో సాగే ఈ సాంబారుగాడ్ని ఎంతగానో మెప్పించిన ప్రోగ్రాం ఇచ్చిన సాక్షికి థ్యాంక్స్.

టిప్: అసంతృప్తులై ఉన్న జూ.ఎన్.టి.ఆర్, హరికృష్ణలను జగన్ వై.ఎస్సార్.కాంగ్రెస్ పార్టిలోకి  ఆహ్వాణించాలి

0 comments:

Post a Comment