సి.కె చొరవతో చిత్తూరు కోదండరామస్వామి దేవాలయానికి మహర్దశ
శ్రిరామచంద్రుని సేవలో జయ చంద్రుడు
2011, జూన్ 8 న సా. అంకురార్పణ జూన్12 న ఉ.సంప్రోక్షణలతో
జూన్12 నుండి 23 దాక బ్రహ్మోత్సవములు
చిత్తూరు కోదండ రామ స్వామి దేవాలయ ఉత్సవాలు ఈ ఏడాది మళ్ళీ జరుగుతుందని తెలుసుకున్న క్షణం నుండి పురప్రజలు -రామ భక్తుల మనస్సుల్లో "ఎన్నాళ్ళకెన్నాళ్ళకెన్నాళ్ళకు ఎన్నెల్లు తిరిగొచ్చే మా కళ్ళకు" అంటూ పారంభమైన కోరస్ ఇంకా ఆగలేదు. సి.కె చొరవతో చిత్తూరు కోదండ రామస్వామి దేవాలయానికి మహర్దశ కలిగింది. శ్రిరామచంద్రుని సేవలో జయ చంద్రుడు తరిస్తున్నారు. 2011, జూన్ 8 న సా. అంకురార్పణ జూన్12 న ఉ.సంప్రోక్షణలతో
జూన్12 నుండి 23 దాక బ్రహ్మోత్సవములు జరుగనున్నవి.
గత 12 సం.లుగా ఆగి ఉన్న రాములవారి ఉత్సవాలు చిత్తూరు.ఎం.ఎల్.ఏ -ప్రజానాయకులు- సి.కె బాబుగారి చొరవతొ మళ్ళి జరగడం పట్టణ వాసులను ఎంతగానో ఆనందింప చేస్తూంది. ప్రజాస్వామ్యంలోనే కాదు రాజరికంలో సైతం ప్రజలు ఎంతో శక్తిమంతులు. అయితే తన భలం తానెరుగని హనుమంతుని వలే ’ఎవరో వస్తారని ఏదో చేస్తారని " వేచి ఉంటారు. వారిని ఉత్తేజ పరచి, భుజం తట్టి , ముందుకు నడిపిస్తే ఎంతటి మహత్తర కార్యకరమమైనా రెప్పపాటులో జరిగి పోతాయి.అదే ప్రజా భలం. ప్రజలకున్న భలం.
ఈ ఉత్సవాల విషయంలోను అదే జరిగింది. రథం, వాహణాలు చివరికి వాహణాల మండపం సైతం ఒక్కొక్కటే శిథిలం కావడంతో ప్రజానీకం సెంటిమెంట్ ఫీలవుతూ , నీరసించి ఉన్న సమయాన చిత్తూరు గంగమ్మ గుడి వంశపారంపర్య ధర్మకర్త - చిత్తూరు కట్టమంచిలోని శ్రీ శ్రీ శ్రీ షిర్డిసాయిబాబా ఆలయ మందిర స్థాపకులు సి.కె.చొరవ చూపారు.
కొందరు ఏది సంకల్పించినా అది నిరాటకంగా - సునాయాసంగా జరిగిపోతుంది. వారిని అమృత హస్తులు అనడం ఆనవాయితీ. అలా సి.కె తమ అమృత హస్తంతో ఏ మంచి కార్యక్రమం మొదలు పెట్టినా అది క్రమేణా అభివృద్ది చెంది ఆదర్శప్రాయంగా నిలుస్తుంది. ఉ. పొన్నెమ్మ దేవాలయం.
"ఎన్నాళ్ళుబ్రతికామన్నది కాదు గొప్ప. ఎలా బ్రతికామన్నదే గొప్ప" ఇది దివంగత నేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి తన కొడుకు జగన్మోహన్ రెడ్డికి తరచు చెబుతుండేవరని జగనే స్వయంగా వెల్లడిస్తున్నారు.
వై.ఎస్ తో ౩ దశాబ్దాల పాటు అవినాభావ సంభందాలు కలిగి - వై.ఎస్. ప్రియ శిష్యులుగా పేరొందిన ప్రజానాయకులు చిత్తూరు ఎమ్.ఎల్.ఏ సి.కె.జయచంద్రారెడ్డి మదిలోను వై.ఎస్.మాటలు బాగా నాటుకు పోయినట్టుంది. అందుకే ఏ మంచి కార్యకరమమైనా సరే మదిలో భీజం పడాలే గాని తరచూ దాని పై కసరత్తు చేసి విజయవంతం చేస్తుంటారు.
చిత్తూరు పట్టణంలోని శ్రీ కోదండరామస్వామి దేవాలయం వంద సం.ల క్రితం భజన మందిరముగా ప్రారంభమై క్రమేణా అభివృద్ది చెంది 1932 వ సం. న రాతి శిలలతో నిర్మితమై సంప్రోక్షణ జరిగినట్టు ఆలయంలోని శిలాఫలకాలు చెబుతున్నాయి. ఆనాటి నుండి ఆలయాభివృద్దికి కృషి చేసిన ప్రతి ఒక్కరు వారు అమరులై ఏ లోకాన ఉన్నా వారి ఆలోచనా తరంగాలు మటుకు ఈ ఆలయం చుట్టే పరిభ్రమిస్తూఉండి ఉండాలి. ఆ ఆలోచన తరంగాలు ఎవరినో కదిలించగా, వారి మరొకరిని ,ఆ మరొకరు మరొకరిని కదిలించగా చివరికి అవి సి.కె ను కదిలించగా ఇది నేడు కార్య రూపం దాల్చింది.
ఈ ఉత్సవాలు పూర్తయ్యేదాక ఇతరత్రా ఆలోచనలను ప్రక్కన పెట్టి జపిస్తూ ఉంటాం. రాం రాం రాం.
అక్షరంతో "మ్" కలుస్తే అది భీజమవుతుంది. ఉ. గ+మ్ = గం , ఇది గణపతి భీజం. అందరు దేవుళ్ళకు నామాలు వేరు ,భీజాలు వేరు. కాని ఒక్క శ్రీరామునికే నామం భీజం రెండూ ఒకటై ఉంటుంది.
మీరు కేవలం రాం అని జపిస్తే అది భీజాక్షరంగానూ పని చేసి కుండలిలో చైతన్యాన్ని నింపి ఏకంగా జీవన్ముక్తులను సైతం చెయ్యగలదు. రామనామం ఎక్కడ జపించ బడితే అక్కడ హనుమాన్ యొక్క సాన్నిత్యం ఉంటుంది. హనుమాన్ ఉన్న చోట ఏ కీడూ ఆ దరిదాపుల్లోకి రాదు.
అందుకే జపించండి రాం రాం రాం. కేవలం ఈ ఉత్సవాలు పూర్తయ్యేవరకైనా.. కనీశం ఉత్సవాలు జరుగుతున్న సమయంలోనైనా జపించండి రాం రాం రాం.
0 comments:
Post a Comment