క్షమించండి !

నా ఈ బ్లాగును అప్డేట్ చెయ్యడం లేదు. ప్రస్తుతం నా మరో తెలుగు బ్లాగ్ రెగ్యులరుగా అప్డేట్ అవుతూంది. అందులోని టపాలను చదవడానికి ఇక్కడ నొక్కండి

Tuesday, 7 June 2011

హే రామ్ ! ఈశ్వర అల్లాహ్ తేరే నామ్ !

  హే రామ్ !  ఈశ్వర అల్లాహ్  తేరే నామ్ !
ఈ రెండు మాటలు వినగానే మనకు చప్పున గుర్తొచ్చేది మహాత్ముని పేరే. మొదటి మాట ( హే రామ్!) మహాత్మా గాంథి తుది శ్వాస వీడే ముందు పలికిన మాట.

రెండవది ( ఈశ్వర అల్లాహ్  తేరే నామ్) మహాత్ముడు తన ప్రాణాలు సైతం లెక్క చెయ్యక ,తన జీవితాన్నే ఫణంగా పెట్టి జరిపిన సత్య శోధన ఫలితంగా తెలుసుకున్న మాట. నిత్యం జపిస్తూ, భజిస్తూ వచ్చిన మాట

ఇస్లాం సాంప్రదాయంలో "హరామ్" అనే మాట వినే ఉంటారు. హరామ్ అంటే చేయతగని పని -చేయ కూడని పని అని అర్థం. హరామ్ అంటే నెగటివ్. రామ్ అంటే పాజి టివ్.

మోహన్ దాస్ అనే బాలుడ్ని మహాత్ముడ్ని చేసింది రామ నామమే. ఆథ్యాత్మిక పయనంలో చివరిగట్టంలోనో  ముక్తికి చేరువలోనో - ఉన్నప్పుడే స్ఫురించే మాట ఈశ్వర అల్లాహ్  తేరే నామ్ . ఈ అంతిమ సత్యాన్ని మోహన్ దాస్ ఎరింగి ఉపదేశించే స్థితికి తెచ్చింది రామ నామమే.

శ్రీ రామాంజనేయ యుద్దంలో సాక్షాత్తు  రాముడ్నే ఓడించింది రామ నామమే. ప్రతి ఒక్క యువకుడు రామునిగా, ప్రతి ఒక్క స్త్ర్రీ సీతగా పరిణితి చెందితే  ప్రతి ఇల్లు ఒక పొదరిల్లవుతుంది. ఇక మన దేశ అభ్యున్నతిని అడ్డుకునేదెవరు?

యధ్భావం తధ్భవతి - మీరు దేనిని గురించి సదా ఆలోచించి  ద్యానిస్తే అదై పోతారు.  రాముడ్ని గురించి ఆలోచించండి. రాముని జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయం - ఆచరణీయం.

తండ్రికి ముగ్గురు భార్యలు - రాముడు పిత్ఱు వాఖ్య పరిపాలన చేపట్టి ఉన్నప్పటికి భార్య మాటకొస్తే ఏక పత్ని వ్రతుడుగా కొనసాగాడు. అంటే పరిసరాలతొ ప్రభావింప బడలేని వ్యక్తిత్వం అతనిలో ఉన్నదన్న మాట.

అటువంటి అచంచల వ్యక్తిత్వాన్ని పొందాలంటే - జీవన పోరాటంలో  రాక్షసుల్లా మన మీదకొచ్చే సమస్యలతో నిజాయితీగా పొరాడాలంటే - విజయం సాధించాలంటే రాముడ్ని ద్యానించండి.రామ నామం జపించండి.

నేటి ఆధునిక జీవితంలో ఏకాగ్రత కుదరక రాముడంతటి వారం కాలేక పోయినా కనీశం మానవులుగా కొనసాగుతాం. ( రాక్షసుల్లా మారిపోకుండా)  అందుకోసమైనా జపించండి.. రాం .............. రాం .......... రాం...........

0 comments:

Post a Comment