క్షమించండి !

నా ఈ బ్లాగును అప్డేట్ చెయ్యడం లేదు. ప్రస్తుతం నా మరో తెలుగు బ్లాగ్ రెగ్యులరుగా అప్డేట్ అవుతూంది. అందులోని టపాలను చదవడానికి ఇక్కడ నొక్కండి
Showing posts with label Rama manthram. Show all posts
Showing posts with label Rama manthram. Show all posts

Tuesday, 7 June 2011

హే రామ్ ! ఈశ్వర అల్లాహ్ తేరే నామ్ !

  హే రామ్ !  ఈశ్వర అల్లాహ్  తేరే నామ్ !
ఈ రెండు మాటలు వినగానే మనకు చప్పున గుర్తొచ్చేది మహాత్ముని పేరే. మొదటి మాట ( హే రామ్!) మహాత్మా గాంథి తుది శ్వాస వీడే ముందు పలికిన మాట.

రెండవది ( ఈశ్వర అల్లాహ్  తేరే నామ్) మహాత్ముడు తన ప్రాణాలు సైతం లెక్క చెయ్యక ,తన జీవితాన్నే ఫణంగా పెట్టి జరిపిన సత్య శోధన ఫలితంగా తెలుసుకున్న మాట. నిత్యం జపిస్తూ, భజిస్తూ వచ్చిన మాట

ఇస్లాం సాంప్రదాయంలో "హరామ్" అనే మాట వినే ఉంటారు. హరామ్ అంటే చేయతగని పని -చేయ కూడని పని అని అర్థం. హరామ్ అంటే నెగటివ్. రామ్ అంటే పాజి టివ్.

మోహన్ దాస్ అనే బాలుడ్ని మహాత్ముడ్ని చేసింది రామ నామమే. ఆథ్యాత్మిక పయనంలో చివరిగట్టంలోనో  ముక్తికి చేరువలోనో - ఉన్నప్పుడే స్ఫురించే మాట ఈశ్వర అల్లాహ్  తేరే నామ్ . ఈ అంతిమ సత్యాన్ని మోహన్ దాస్ ఎరింగి ఉపదేశించే స్థితికి తెచ్చింది రామ నామమే.

శ్రీ రామాంజనేయ యుద్దంలో సాక్షాత్తు  రాముడ్నే ఓడించింది రామ నామమే. ప్రతి ఒక్క యువకుడు రామునిగా, ప్రతి ఒక్క స్త్ర్రీ సీతగా పరిణితి చెందితే  ప్రతి ఇల్లు ఒక పొదరిల్లవుతుంది. ఇక మన దేశ అభ్యున్నతిని అడ్డుకునేదెవరు?

యధ్భావం తధ్భవతి - మీరు దేనిని గురించి సదా ఆలోచించి  ద్యానిస్తే అదై పోతారు.  రాముడ్ని గురించి ఆలోచించండి. రాముని జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయం - ఆచరణీయం.

తండ్రికి ముగ్గురు భార్యలు - రాముడు పిత్ఱు వాఖ్య పరిపాలన చేపట్టి ఉన్నప్పటికి భార్య మాటకొస్తే ఏక పత్ని వ్రతుడుగా కొనసాగాడు. అంటే పరిసరాలతొ ప్రభావింప బడలేని వ్యక్తిత్వం అతనిలో ఉన్నదన్న మాట.

అటువంటి అచంచల వ్యక్తిత్వాన్ని పొందాలంటే - జీవన పోరాటంలో  రాక్షసుల్లా మన మీదకొచ్చే సమస్యలతో నిజాయితీగా పొరాడాలంటే - విజయం సాధించాలంటే రాముడ్ని ద్యానించండి.రామ నామం జపించండి.

నేటి ఆధునిక జీవితంలో ఏకాగ్రత కుదరక రాముడంతటి వారం కాలేక పోయినా కనీశం మానవులుగా కొనసాగుతాం. ( రాక్షసుల్లా మారిపోకుండా)  అందుకోసమైనా జపించండి.. రాం .............. రాం .......... రాం...........

Monday, 2 August 2010

మరో రాముడనవుతా

ఓం గం గణపతే స్వాహ
జై శ్రీరాం
హరే రామ హరే కృష్ణ కృష్ణ హరే
రఘుపతి రాఘవరాజా రాం
పతీత పావన సీతారాం
ఈశ్వర అల్లా: తేరే నాం
సబ్ కో సన్మతి దే భగవాన్

రామా!
నీవు  సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడే !
కేవలం  అయోద్య రాజువని ఎలా భావించను !
నువ్వు కేవలం రాజువైయ్యుంటే
వీరు నన్ను బూజూలా దులిపేసుండేవారు
నీవు  సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడు కాబట్టే
కేవలం నీ నామ జపం చేసిన నన్ను ఇంతగా కరుణించి
యద్భావం తద్భవతి అంటూ నన్ను అభినవ రాముడ్ని చేసావు.
నీ దయ  నాకున్నది  కాబట్టే
ఇంత మంది రావణేశ్వరులకు ఎదురు తిరిగినప్పటికి
ఇంకా నా ప్రాణం గాలిలో కలిసి పోకుండా ఉంది.

నీవు సాక్షాత్ పరమాత్ముడవు
అలా కాని పక్షాన అహంకార పూరితమైన నా మనస్సు
నీ పట్ల మొగ్గేది కాదు.
నా అహంకారాన్ని పటాపంచలు చేసిన ఆదర్శ పురుషుడవు నీవు
నువ్వు  పరమాత్ముడవు కాని పక్షంలో
నీ ద్యానంతో నా ఆత్మ స్వరూపం నాకు సాక్షాత్కరించేది కాదు
నా మనస్సు నీకై తపించేది కాదు

వీరు అపార్థం చేసుకోవడంలో దిట్టలు
ప్రతి దానినీ అపార్థం చేసుకుంటారు
నిన్ను సైతం.

నీ అనుమతి లేనిదే నీవర్థం కావు
నీ అనుమతి నాకు లభించింది కాబట్టే
నేను నిన్నర్థం చేసుకు కలిగాను
దాదాపుగా మరణించి ఉన్న నన్ను
నువ్వు  కరుణించావని
మాత్రం నేను అర్థం చేసుకో కలుగుతున్నా
ఎందుకంటే నాలో  కొత్త ప్రాణం నడియాడుతుండటాన్ని నేను
గమనించ కల్గుతున్నా

ఎటో వెళ్ళి కుళ్ళి పోవలసిన నా జీవితం ఈ మాత్రం సాగుతుండటానికి
కొన సాగుతుండటానికి నిన్ను కాక మరెవ్వరిని భాద్యులను చెయ్యగలను?

ఏ జన్మలో నీ నామం జపించానో
ఈ జన్మలో అది మళ్ళీ పున: ప్రారంభమైంది
నేను రావణుడ్ని మించిన  పర స్త్రీ గమనుడను
పర భార్యా మోహితుడను
శక్తి చాలక పోవడంతో అలా దాటుకుంటూ వచ్చేసాను గాని
నేనెంతటి నీచుడనో నాకు తెలుసు
నా గడ్డు కాలాన్ని దాట వేసి నన్ను ఒడ్డున  పడేసిన వాడవు
నన్నే మార్చిందంటే నీ నామం ఎంత శక్తి మంతమైందో
అర్థం చేసుకోలేనంత మూర్ఖుడను కాను

నాలో వెలసి నన్నే నీయంతటి
సుగుణ సంపన్నుడను చేసినవాడవు

నీ నామ జపం చేసినప్పటికి జన్మ రాహిత్యం పొందనిచో
అది నీకే కాదు నిన్నే జయించిన నీ నామానికి కళంకం కాగలదు.

నా జన్మ రాహిత్యం కొరకే ఈ నిస్వార్థ లక్ష్యం గై కొన్నాను.
నా సమకాలీనులకు నీ సాక్షాత్కారం కల్గించలేను
అందుకే ఈ కలిలో ఆకలి దోపిడిలను అంతం చేసి నీ రాజ్యాన్ని నెలకొల్పుతాను
వీరు చూసి తరిస్తారని.

నా జన్మ రాహిత్య లక్ష్యంతో పాటు నీ మహిమ, నీ నామ మహిమ చాటిన వానిగా
మరో మహాత్ముడనవుతాను.
రామా !
నా స్ఫూర్తువి నీవే ! నా  పూజనా మూర్తివి నీవే
నీ నామ జపమే నా తపస్సు !
ఆది కావాలి నా జాతికో ఉషస్సు !

యువార్ ది సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జి
 నీ నామం నాలో ప్రకంపించని క్షణం నేనో శవాన్ని
చచ్చిన శవాన్ని 

నేను  కుహానా ఆస్తిక వాదుల పై ఒంటికాలి పై లేచినా
నా మరో కాలుకి ఆధారం నీవే

రామా!
మరో రాముడనవుతానని  ఆందోళన చెందకు
అంత సీన్ లేదు
నన్ను రక్షించు
నన్ను భక్షించ చూసే పేదరికం నుండి, గ్రహ పీడనలనుండి
నెగటివ్ వేవ్స్ నుండి నన్ను రక్షించు

కనీశం నేను కలలు కంటున్న రామరాజ్యానికి అక్షర రూపమన్నా ఇవ్వనీ..

శ్రీ రామ రామ రామేథి  రమా రామే మనో రమే
సహస్ర నామ తత్తులుయం శ్రీ రామ నామ వరాననే

జై శ్రీరాం! జై శ్రీరాం ! జై శ్రీరాం!