క్షమించండి !

నా ఈ బ్లాగును అప్డేట్ చెయ్యడం లేదు. ప్రస్తుతం నా మరో తెలుగు బ్లాగ్ రెగ్యులరుగా అప్డేట్ అవుతూంది. అందులోని టపాలను చదవడానికి ఇక్కడ నొక్కండి
Showing posts with label Ap. Show all posts
Showing posts with label Ap. Show all posts

Friday, 13 May 2011

మళ్ళీ పప్పులో కాలేసిన జగన్


కని విని ఎరుగని చరితాత్మక విజయం సాధించినప్పటికి మరుక్షణమే పప్పులో కాలేసారు అదేంటో ఈ టపా చివర చెబుతాను.

ఇదవరకే జగన్ విషయంలో రెండు పర్యాయాలు నా సలహాలు ఇవ్వగా ఒక సారి పట్టించుకోలేదు (ఇంతకీ అప్పట్లో సంభంధిత టపా యొక్క ప్రింట్ అవుట్ ఫ్యేక్స్,కొరియర్ ద్వారా కూడ పంపాను)

మరో సారి పార్టి అంటే అదేదో ప్రైవేట్ లిమిటడ్ కంపెని అన్న అజ్నానంతో పార్టి ఏర్పాటు తరువాత -పార్టి ఏర్పాటు తరువాత అని జగన్ గౄపు నాయకులు "మాటలు" చెబుతుండగా వళ్ళు మండి మరో టపా వ్రాసాను .

పార్టి అంటే ప్రైవేట్ లిమిటడ్ కంపెని కాదని నొక్కి చెప్పాను. నా మాటలు జగన్ కు చేరాయో -ఎవరైనా శ్రేయోభిలాషులు చేర్చారో తెలీదు కాని వరస పెట్టి జల దీక్ష,ఫీజు పోరు,హరిత యాత్ర అని రెచ్చి పోయేరు.

కాని ఘన విజయానంతరం మీడియాతో మాట్లాడిన జగన్. జూలై 8న వై.ఎస్. జన్మదినం సందర్భంగా ప్లీనరి సమావేశాలు - మేధోమథనం విధి విధానాల నిర్ణయం అది ఇది అంటూ పొడవాటి మాటలు చెప్పేరు.

వై.ఎస్. అనే రెండక్షరాలకు ఓంకారానికి ఉన్నంత శక్తి నేడు రాష్ఠ్ర్రంలో ఉంది. దానికి తోడు నేటి ఘన విజయం కూడ చేరింది. Now or Never అన్న పరిస్థితి నేడు నెలకొంది.

తెలంగాణ భూతానికి భయపడే - కాంగ్రెస్సు వారే పడిలెయ్యని అన్న ఉద్దేశంతోనే ఇలా జూలై 8ముహూర్తం నిర్ణయించుకున్నట్టుంది.

ఎవరో తీసుకునే నిర్ణయానికోసం వేచి ఉంటే అది పుట్టించే తరంగాలు ఒడ్డుకు చేరుస్తాయో ముంచుతాయో తెలీదు.

మనదంటూ ఒక వైఖరిని ముందుగా ప్రకటించి ఇతరులను బెంబేలెత్తించేవాడే అసలైన నాయకుడు.

ఇప్పటికీ మించి పోయిందేమి లేదు టి.ఆర్.ఎస్. తెలంగాణ తె.దే.పా, కాంగ్రెస్ నాయకులు విర్ర వీగుతున్నారుగా..తెలంగాణలోని  ప్రతి ఒక్క పౌరుడు తెలంగాణ కోరుకుంటున్నాడని..

అదేదో ఒక ఓటింగుతో నిరూపించమనాలి. విడిపోతే ఏం నష్ఠమో అక్కడి ప్రజలకు వివరించే అవకాశాన్ని సమైఖ్యవాదులకు కల్పించాలి. తెలంగాణ ప్రజలు కోరుకుంటే తెలంగాణకు మేం వ్యతిరేకం కాదని జగన్ ప్రకటించి వేసి.. ఆ పై రెండు రోజుల ప్లీనరి నిర్వహించి పదిహేను రోజుల్లో గ్రామ స్థాయిదాక కమిటీలు ఏర్పాటు చేసెయ్యాలి.

జూలై 8 నాటికి - ఆ మహానేత జన్మ దినంలోపే ప్రభుత్వం కూలడం - యావత్తు కాంగ్రెస్ ఎమ్.ఎల్.ఏలు జగన్ వెంట నిలబడి కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడం పూర్తి కావాలి.
కనిసం జూలై 8 నాటికి వై.ఎస్. పై భురద చల్లే ప్రభుద్దులు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం  కుప్ప కూలాలి.

ఇలా తన అజెండాను వేగవంతం చేస్తే అన్నీ ఒక కొల్లిక్కి వస్తాయి. జూలై 8కి వాయిదా వేయడం వలన జరుగగల అనర్థాలు:

జగన్ వెంట ఉన్న ఇంకొందరు ఎమ్.ల్.ఏలను బుట్టలో వేసుకునే ప్రయత్నం జరుగవచ్చు. అందులో ప్రభుత్వం సక్సెస్ కూడ కావచ్చు.

జగనే కాంగ్రెస్లోకి రానున్నారని ప్రచారం మొదలు పెట్టొచ్చు ( బా.జా.పాతో కలుస్తాడని ఇటీవల చేసారుగా)

తమ చేతిలో ఉన్న సి.బి.ఐ ని పావుగా వాడుకుని జగన్ పై కేసులు భనాయించవచ్చు.

తృతీయ స్థాయి నాయకులదాక ఎవరెవరైతే జై జగన్ అనగలరో వారందరిని కట్టి చెయ్యడం -లేదా తమ వైపుకు తిప్పుకోవడం ఇలా ఎన్నో ఎన్నెన్నో జరిగిపోవచ్చు.

శతృవు మనం  కొట్టిన దెబ్బకు దిమ్మతిరిగి ఉన్నప్పుడే చావు దెబ్బ తీయాలి. ఇది ప్రాథమిక రాజకీయ సూత్రం.

మరింత కాలం ఈ ప్రభుత్వాన్ని కొనసాగనివ్వడం ప్రజలకు చేసే ద్రోహమే అవుతుంది. జగన్ పునరాలోచించాలి.

Tuesday, 11 January 2011

తెలంగాణా అంటూ రోడ్డెక్కిడితే నడ్డీ విరిచి

మీకంటే మేమే చాలా వెనుక పడ్డామని సీమాంద్ర నేతలు ఎంత మొత్తుకున్నా తెలంగాణ వాదులు వినిపించుకోలేదు. శంఖంలో పోస్తేనే తీర్థం అన్నట్టుగా శ్రీ కృష్ణా కమిషన్ అదే మాట చెప్పడంతో వారు ఆత్మ రక్షణలో పడేరు.

వీరికి దిల్లీ రాజకీయాలు ఇంకా అర్థమైనట్టు లేదు. దిల్లీ పెద్దల దృష్ఠిలో జగన్ వంటి అశేష ప్రజాధరణ కలిగిన నేతే డోంట్ కేర్ అన్నప్పుడు చంద్ర శేఖర్ రావు వంటివారు ఏ లిస్టులో ఉంటారేమో?

మన రాష్ఠ్ర్రంలో ఉదయం ఐదు, ఐదున్నరకే ఆకాశంలోని చీకటి తొలగడం ప్రారంభిస్తుంది. ఎంతటి ఎఫ్ టివిలు చూసి లేట్ నైట్ నిద్రించినా ఉదయం 9కెల్లా రోడ్డున పడతాం. కానీ దిల్లీ అట్లా కాదు.

వారికి పొద్దు పొడవడమే పదింటికి.పొగ మంచు ,చలి ఈ నేపథ్యంలో వారి స్పందనా తీరు కూడా అలానే ఏడుస్తుంది.

ఇంతకీ జె.ఏ.సి కావచ్చు, టి ఆర్ ఎస్ కావచ్చు పండుగలడ్డొచ్చాయి గాని లేకుంటేనా అని విర్ర వీగుతుంటారు. మన రాజ్యాంగంలో రాష్ఠ్ర్రాలకున్న అధికారాలు అంతంత మాత్రమే. అవీ కేంద్రం తలచుకుని,దయ దలుస్తేనే.

రాష్ఠ్ర్రంలో అటు జగన్ -ఇటు తెలంగాణ సమస్యలు  దిల్లీ పెద్దలను కొంత మెరకు హడావుడికి గురిచేస్తుండడం  నిర్వివాదాంశం. దిల్లీ వారు  ఈ విషయాల పై ఆచి తూచి రంగంలో దిగడానికి కావలసిన సమయాన్ని పండుగలిచ్చాయి.

తెలంగాణా కాంగ్రెస్ నేతలుతిరుగుభాట పట్టడం - జగన్ వెంట ఎమ్.ఎల్.ఏలుండటం కూడ సమస్య కాదు. దిల్లీ జల దీక్షలో " రాష్ఠ్ర్ర ప్రభుత్వ మనుగడ నా దయా దాక్షిణ్యాలమీద ఆధార పడుంది"అన్న జగన్ వ్యాఖ్య ఖచ్చితంగా పుండు మీద కారమే.

ఇక చేసేదేమీ లేక చట్ట సభను సస్పెండ్ చేసినా -నిద్రావస్థలో ఉంచినా -గవర్నర్ పాలనకు ఆదేశించినా.. తెలంగాణా వాదుల పని గోవిందా. ప్రజా స్వామ్యంలో ప్రజలచే ఎన్నుకోబడ్డ ప్రభుత్వం అది ఎంత చెత్త ప్రభుత్వమైనా సరే భవిష్యత్తును ( ఎన్నికలు) దృష్ఠిలో ఉంచుకుని ప్రవస్తింది.గవర్నరుకు గాని/సి.ఎస్./ ఐ.ఏ.ఎస్ లకు గాని ఈ అవసరం ఉండదు కాబట్టి తెలంగాణా అంటూ రోడ్డెక్కిడితే నడ్డీ విరిచి శ్రీ కృష్ణ జన్మ స్థానానికి పంపుతారు.

తె.దే.పా,కాంగ్రెస్ ఎం.ఎల్.ఏలు రెంటికీ చెడి దూబూచులాడుతూ ఉండి పోతారు, ఏదో సందర్భంలో కేసిఆర్ - జేఏసి నడుమ పోరు మొదలవ్వడం కాయం. ఇన్ని అడ్డంకులు సవాళ్ళను ఎదురీది తెలంగాణా సాధించినా దాని పర్యావసనం ఎలా ఉంటుందో టూకీగా చూద్దాం.

1.ఇంత కాలం హైదరా బాదు పై పెట్టిన పెట్టుబళ్ళు హుష్ కాకి అవుతాయి కాబట్టి తెలంగాణ రాష్ఠ్ర్రం ఈ నష్ఠాన్ని ఏదో విదంగా పూడ్చవలసి ఉంటుంది.

2.రాష్ఠ్రాలు రెండైనందున కమాడిటీస్ పై డబుల్ ట్యేక్స్ పడి దరలుపెరిగే అవకాశం

3.ఒక్క తెలంగానా ఇస్తే ఇక గ్రేటర్ రాయల సీమ, జై ఆంథ్రా వంటి ఉధ్యమాలు ఊపందుకుంటాయి

4.రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రజా ప్రతినిదుల ఓట్లకు జనాభా ప్రాతిపదికనే విలువ ఉంటుంది కాబట్టి ఎలక్టోరల్ కాలేజిలో మన ప్రతివిదుల ఓట్లకు విలువ గోవిందా.

5.తెలంగాన ఇచ్చాక లేదా ఆ ప్రక్రియ ప్రారంభమైన వెంటనే టి.ఆర్.ఎస్. కాంగ్రెసులో విలీనమవుతుంది లేదా దాశోహమవుతుంది( మద్యలో కేసిఆర్  జగన్ నినాదం అందుకున్నది కాంగ్రెస్ తో తన  బార్గెయినింగ్ పవరును పెంచుకోవడానికే. ఇదిలా జరిగితే
ఇక తెలంగానలో కాంగ్రెస్ పార్టియే మోనోపలి అవుతుంది. నిరంకుశ పాలన సాగుతుంది
6.ఆదాయం సగమై నిర్వహణా వ్యయం  రెండింతలౌతాయి
7..ఇంత పెద్ద రాష్ఠ్రంగా ఉండగానే నాడు అంజయ్యకు నేడు రోశయ్యకు ఎనలేని పరాభవం జరిగింది. ఇది కిరణ విషయలోను కొనసాగుతూంది. ఇక చిన్న రాష్ఠ్రంగా తయారైతే  నాయకులు సోనియాకి ఫ్లాస్కులు మొయ్యవలసిందే
8.నక్సల్స్ ప్రభావం పెరిగి పోతుంది. ఆదాయం సగమై పోయినందున ప్రజా ప్రతినిదులకు తగిన రక్షణ ఇవ్వడం భారమై రక్షణ సన్నగిల్లి నక్సల్స్ నేతల  కిడ్నాప్స్ కు ఉపక్రమిస్తారు. ఇక జైల్లో ఉన్న నక్సల్స్ అందరిని విడుదల చేసే పరిస్థితి వస్తుంది
9.ఇంత పెద్ద రాష్ఠ్రంగా ఉన్నప్పటికీ  శాంతి బధ్రతల పరిరక్షణకు కేంద్ర బలగాలకు, పొరుగు రాష్ఠ్ర బలగాలకు చేయి చాచ వలసిన పరిస్థితి. ఇక రాష్ఠ్రం విచ్చిన్నమైతే పరిస్థితి మరింత ధారుణం అవుతుంది
10.ఒక వేళ తెలంగాన ఇచ్చినా కే.సి.ఆర్ అక్కడ వివాద రహిత నేతేమి కాదు కాబట్టి ప్రతి ఎన్నికల్లోను హంగ్ వచ్చి మళ్ళీ మళ్ళీ ఎన్నికలొచ్చే ప్రమాదం ఉంటుంది.
11.తెలంగాన ఆంథ్ర ఎం.పిలను విభజించి పాలించి కేంద్రం రెండు రాష్ఠ్రాల నోరూ కొడుతుంది. నిదులు రాబట్ట లేరు, పథకాలు,జల వినియోగంలో  వాటాలు, పరిశ్రమల విషయంలోను మొండి చెయ్యే
12.సమైక్యాంథ్ర ప్రదేశ్ గా ఉండగా వై.ఎస్. తలపెట్టిన జలయజ్ఞం ఏ మాత్రం పూర్తయ్యే అవకాశమే ఉండదు. పైగా ఇందాకా పెట్టిన జల యజ్ఞం పై పెట్టిన డబ్బులు గంగలో కొట్టుకుపోతాయి
13.దేశ వ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా జరిగే కార్యక్రమాలకు ఏ రాష్ఠ్ర ముఖ్యమంత్రిని పిలవాలి, ఏ రాష్ఠ్ర మంత్రులను పిలవాలని తల పట్టుకుని ( పిలిచే వారికి ఖర్చులు డబుల్ అవుతాయి) ఎవరిని పిలవక పోతే పోలేదా అని నిర్ణయిస్తారు
14.తెలంగానాలో తయారైన పంటలను, వస్తువులను ఆంథ్రా వారు, ఆంథ్రాలో తయారైన వస్తువులు పంటలను బహిష్కరించే అవకాశం ఉన్నందున మార్కెటింగ్ సమస్య తలెత్తి పరిశ్రమలన్ని పొరుగు రాష్ఠ్రాలకు తరలే అవకాశం ఉంది. పంటలకు గిట్టు బాటు దరలు లభ్యం కాక రైతు నాశనమవుతాడు
15. సహజంగా ప్రకృతి, పర్యావరణంలో నిర్ణీత కాలంలో పెద్ద మార్పులు చోటు చేసుకుంటాయి. కరవు మొదలైతే పది సం.లు, సకాల వానలు మొదలైతే 5 సం.లకు కొనసాగే అవకాశం ఉంది. ఈ లెక్కన రానున్న 5 సం.లు గడ్డు కాలమే. నిదుల కొరత, యంత్రాంగ ఏర్పాటులో ఆలశ్యం కారణంగా ప్రకృతి ఉత్పాదాలను సైతం ఎదుర్కొనలేని స్థితి వస్తుంది
16.నిదుల కొరత కారణంగా గత ఎన్నికల్లో వై.ఎస్. ఇచ్చిన మాటలు గాలిలో కలిసి పోతాయి. అలాగే వై.ఎస్. అమలు చేసిన సంఖేమ పథకాలకు గండి పడుతుంది.
స్వాతంత్ర్య ఉధ్యమం జరుగుతున్న సమయంలో ప్రతి నేత,ప్రతి వ్యక్తి మనస్సులోను స్వతంత్ర భారతం అంటే అదో స్వర్గ భూమి అన్న భ్రమ ఉండేది. కాని అసలైన నరకం అప్పుడే మొదలైందన్నది గమనార్హం.

తెలంగాణా విషయంలో కూడ అదే జరుగుతుంది. కేసిఆర్ ఏ మాత్రం దూరదృష్ఠి,అంకిత భావం,మనోభలం,విశ్వసనీయత  లేని వ్యక్తి -పైగా అనార్కి -ఇతన్ని కట్టిడి చెయ్యడం జేఏసి కాదు కదా దేవుడితరం కూడ కాదు.

పొరభాటునో -గ్రహపాటునో తెలంగాణా ఏర్పడ్డా రెండేళ్ళకే అక్కడ సమైఖ్యవాదం జోరందుకుంటుంది.సామాన్యునికి బతికు భారమవుతుంది.

Wednesday, 29 December 2010

జగనన్న తమిళ తంబి సందించే 5 ప్రశ్నలు


అఫిషియల్గా చూస్తే మీరు నాకన్నా చిన్నవారే. కాని ప్రతి ఒక్కరు (మీకన్నా పెద్దవారు సైతం) అన్న అంటుంటే మీరెక్కడ ఇగో ఫీల్ అవుతారో అని జగనన్నకు అనే శీర్షిక పెట్టాను. ఇక ప్రశ్నలు :

1. వై.ఎస్. తలచుకుని ఉంటే ..అతను తెలంగాణకు సుముఖుడే అయితే ఎప్పుడో వచ్చేది తెలంగాణ. మీరు సైతం పార్లెమెంటులో సమైఖ్యాంద్రకు మద్దత్తుగా ప్లే కార్డులు కూడ ప్రదర్శించేరు. కాని సాక్షిటివి కథనాలు ( కె.సి.ఆర్ కు ప్రాధన్యత) ఆయన మాటలు చూస్తుంటే మీరూ జై తెలంగాణ అనేసారని పిస్తూంది. మీ వైఖరి ఇప్పటికన్నా స్పష్థం చెయ్యాలిగా?

2. పార్టికి మీరే పేరు పెట్టండి అని - ఎస్.ఎమ్.ఎస్. చెయ్యండని సెల్ నెంబరు కూడ ప్రకటిస్తున్నారు. పార్టీ రూపు రేఖలు ప్రదిపాదించమని వెబ్ సైట్ కూడ పెట్టేరు. ఇవన్ని చంద్రబాబు స్టైల్స్. అతనికింత చెడ్డ పేరు రావడానికి కారణం సలహాలివ్వండని కోరడం - ముసాయిదా మీద మీ అభిప్రాయాలు తెలపండి అనడం -పోస్టు కార్డు వ్రాస్తే స్పందిస్తా అనడం వంటి అతి చేష్ఠలే (తీరా చూస్తే సలహాలు -అభిప్రాయాలన్ని భుట్ట దాకలే)
అసాధ్యమని తెలిసినా ఇటువంటివి ప్రకటించడం మంచిదేనా? పైగా www.i4jagan.in హోం పేజిలోని వై.ఎస్. ఆర్ ఫోటో మరీ డల్ గా ఉంది. ఆ ఫోటొ తొలగించి ఈ పోస్టులో నేను ఉంచినంత తేజోమయంగా ఉన్న ఫోటో పెట్టమనండి


3. మీకు మద్దత్తు తెలిపిన ఎమ్.ఎల్.ఏలు రాజినామా చెయ్యరు. కాంగ్రెస్ పార్టి వారిని సస్పెండూ చెయ్యదు. ఎంతకాలం ఈ నాన్చుడు? వై.ఎస్. మరణానంతరం మీ నాన్చుడు వైఖరివలనే ఎంత నష్ఠం జరగాలో జరిగి పోయింది. ఇంకా నాన్చడం దేనికి?

4.వై.ఎస్. మీద ,మీ మీద, మీ కుటుంభ సభ్యుల మీద అవినీతి ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. వాటిని మీరెందుకు తిప్పి కొట్టరు? ఒక ఇంటర్వ్యూ ద్వారా ఆ పని ఎందుకుమీరే చెయ్య కూడదు (సాక్షిలో కాదు ముర్రో)

5. ఒక టివి చానల్, ఒక పత్రికను సైతం విజయ వంతంగా నడపలేని మీరు రాష్ఠ్ర్రాన్ని ఎలా
సక్రమంగా పరిపాలిస్తారు. ఇంకా కూడ సాక్షి నెంబర్ టూగానే ఉంది. ముందుగా వీటిలో వై.ఎస్., మీ పురాణాలు ఆపి నెంబర్ వన్ స్థానానికి తెచ్చే ప్రయత్నం చెయ్యండి. అప్పుడు గాని ఎన్నికల సమయంలో ఇవి మీకు పెద్దగా సాయపడవు.

Wednesday, 24 November 2010

ఉ.12.10కి పదవి స్వీకరిస్తే కిరణ్ మరో బలి పశువు

వినాశ కాలే విపరీత బుద్ది అన్నట్టుగా ప్రాణ సంఖ్య 9 కావడం, మరి ఎనిమిదవ రౌండ్ జరుగుతుండడంతో సోనియా మేడం గారికి అన్ని తప్పుడు సలహాలే లభిస్తున్నాయి. కిరణ్ కుమార్ రెడ్డి ఎంపిక సంగతి అటుంచితే పదవి స్వీకార ముహూర్తం కొంప ముంచనుంది. కేవలం ప్రయాణ సమయంలోని లోపమే వై.ఎస్. ను పొట్టన పెట్టుకుంది. అటువంటప్పుడు పదవి స్వీకార ముహూర్తం ఎంత కీలకమో వేరే చెప్పక్కర్లేదు.

కొత్త సి.ఎంగా కిరణ్ పదవీ స్వీకారం చేసే ముహూర్తం ఉ.12.10కని ప్రకటించి ఉన్నారు. ఈ సమయంలో కుంభ లగ్నం ఉంటుంది. లగ్నాధిపతి అయిన శనియే ఎనిమిదిన ఉన్నాడు. ఆదిలోనే హంస పాదు అన్నట్టుగా పునాదిలోనే డొల్లతనం కనిపిస్తుంది. దీంతో ఆపదలు,ప్రమాదాలు,ఆరోగ్య సమస్యలు, నిందలు,పదవి గండం మెండు.

పైగా గురు ఒంటరిగా ఉన్నాడు. దీంతో అప నిందలు, ఆరోపణలు వెల్లువెత్తుతాయి. జగన్ జీవితం ఇంత దుర్భరంగా తయారు కావడానికి కారణం అతని ప్రాణ సంఖ్య 21 కావడమే. ( 2+1 =3 ఇది గురు ఆధిక్యతలోని సంఖ్య)

జగన్ గురించిన సంఖ్యా శాస్త్ర్ర్ర అనలైజ్ కు ఇక్కడ  నొక్కండి.

జగన్ జాతక  వివవరాలకు ఇక్కడ  నొక్కండి .

సరే కిరణ్ పదవి స్వీకార లగ్నం కథ ఇప్పుదు  చూద్దాం.

ప్రజాధరణకు కారకుడు చంద్రుడు ఆయన సష్థాధిపత్యం పొంది ఐదున ఉన్నాడు. దీంతో రెండేసి రోజులకో కొత్త అపఖ్యాతి ఎదురయ్యే అవకాశం ఉంది. పైగా చంద్రునితో కేతు కలిసి ఉన్నాడు.దీంతో భంగ పాటు,అవమానాలు,పిల్లలకు హాని కూడ కలుగ వచ్చును.

శనికి వ్యయాధిపత్యం కూడ ఉంది. కాబట్టి మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ కదా అని వాదించ వచ్చు. ఇది ఎటువంటి త్రిప్పుట అలసట లేక కూల్ గా ఉండనిచ్చే గ్రహస్థితి.  కాని సి.ఎం పదవిలో కొనసాగితే ఇదెలా సాధ్యం? కాబట్టి త్వరలోనే పదవీచ్యుతడయ్యే ప్రమాదం ఉంది.

గృహ,సుఖ స్థానాధిపతి, గృహ కారకుడైన  శుక్రుడు భాగ్యమున స్వక్షేత్రం పొందినాడు. ఇది కూడ ఎటువంటి త్రిప్పుట అలసట లేక కుటుంభ సభ్యులతో సుఖంగా ఉండే వీలునే సూచిస్తూంది.

ఇక కర్మ స్థానాన్ని చూడండి.ఇక్కడ కుజ,రవిల కలయక ఉంది. ఒక్క కుజుడుంటేనే బాంబులు,ప్రేలుడు,ఫైరింగ్, రంపు,రచ్చలు,వ్యవహారాలు వస్తాయి.అటువంటిది రవి కూడ ఇక్కడ కలిసాడు కాబట్టి  మన రాష్ట్ర్రం మరో కాశ్మీర్లా తయారై పోయే ప్రమాదం కూడ ఉంది.

పంచమాధిపతి అంటే బుద్దిని సూచించు వాడు. పంచమాధిపత్యం పొందిన బుధుడు రవితో కలవడం వలన ఈగో అహంకారం,కుజుడు కలవడం వలన రెచ్చ కొట్టే మాటలు చేతలకు అవకాశం కలుగుతూంది.

ఒక్క రాహు మాత్రమే పదకొండో స్థానంలో ఉన్నాడు. రాహు అంటే లాటరి. కిరణ్ కు లాభమంటూ జరిగితే ఏదో లాటరి తగిలిన చందాన తగలాలే గాని .. మరేమి లేదు. అట్ ది సేమ్ టైమ్ ఒక్క లాభం జరిగిన వెంటనే కేతు ఐదున ఉన్నాడు కాబట్టి ఎన లేని అపఖ్యాతి అవమానం కూడ జరుగొచ్చు.

ఇప్పటికీ మించి పోయిందేమి లేదు మరో మంచి లగ్నం చూసుకుంటే గండం గట్టేక్కినట్టే

Friday, 13 August 2010

పేదోడి దేవుడు దేవుడై నేటికి ఏడాది

పేదోడి దేవుడుగా ఖ్యాతి గాంచిన  దివంగత రాష్ఠ్ర్ర ముఖ్యమంత్రి జన హృదయ నేత డాక్టర్ వై.ఎస్. రాజశేకరరెడ్డి  హెకికాప్టర్ ప్రమాదంలో మరణించి  నిజంగానే దేవుడై నేటికి ఏడాది పూర్తైంది. మహాత్ముని గురించి వ్యాఖ్యానించిన ఒక మేధావి " ఇలాంటి వ్యక్తి రక్త మాంసాలతో ఈ భూమి మీద బ్రతికాడని  భావితరాలవారు  నమ్మలేరు" అన్నాడుట. సరిగ్గా  వై.ఎస్. గురించి చెప్పాలన్నా  ఇదే మాట చెప్పాలి.

 నేడు వై.ఎస్. లేరని తిరిగి రారని ఆయన పై  తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న వారి గత  చరిత్ర ఏమిటో అందరికి తెలుసు. వారి విశ్వసనీయత ఎటువంటిదో కూడ అందరికి తెలుసు .  ఒక చిన్న కుటుంభంలో ఒక స్త్రీ తన భర్త ఇద్దరి పిల్లలకు అన్నం వండి పెడితేనే ఒక్కో రోజు ఒక్కో లోటు తఠస్తిస్తుంటుంది. అటువంటిది ఒక రాష్ఠ్ర్రాన్ని పరిపాలించడం అంటే ఎలా ఉంటుందో ఊహించుకొండి.

ప్రభుత్వం అంటే కేవలం వై.ఎస్. కాదు. మంత్రివర్గం, సెక్రట్రీస్, జిల్లా స్థాయిలో కలెక్టర్, ఆయా శాఖాధికారులు ,చిన్నా చితకా ఉధ్యోగస్తులు అందరిని కలుపుకుంటే అది ప్రభుత్వం. వై.ఎస్. పుట్టి పెరిగిన నేపద్యం తెలిసిన వారికి వై.ఎస్.లో నానాటికి రూపుదిద్దుకున్న మానవీయతా కోణం ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

స్వంత తండ్రిని పొట్టన పెట్టుకున్నవారు ఎవరిని కలిసారు.. అలా కలిసినప్పుడు వారికి ఎట్టి భరోసా లభించి ఉంటుంది అని ఊహించుకోలేని మూర్ఖుడు కాదు వై.ఎస్. వై.ఎస్. తలచుకుని ఉంటే వై.ఎస్. వైరి వర్గం బతికి బట్ట కట్టేది కాదు. వై.ఎస్. వయస్సుతో పాటు మనస్సు కూడ పెరిగింది.

ప్రజా ప్రస్తానం పేరిట మొదలు పెట్టిన పాద యాత్ర ద్వారా  నాటి రాక్షస పాలనలో ప్రజలు,రైతులు  పడిన పాట్లు చూసి చెలించి పోయాడు. కరిగి పోయాడు. ఎన్నికల హామీలంటే నోటికొచ్చింది వాగడమేనని రాజకీయ చరిత్ర చెబుతుంటే వై.ఎస్. మాత్రం ఎన్నికల సందర్బంగా తానిచ్చిన ప్రతి హామీని నిలబెట్టాలనే  ప్రయత్నించారు, తాను చెప్పిన  చెప్పిన ప్రతి మాట నిలుపుకో చూసారు.

హామీల అమలుకు  పూనుకున్నారు. వై.ఎస్.లో అదేదో ఊహకందని ప్రేరణ, ఉధ్వేగం ప్రవేశించింది. ప్రకృతీ సహకరించింది. అనుకున్న ప్రతి పని ఖచ్చితంగా పూర్తి చెయ్యాలని తపించాడు. జల యజ్నం, రైతులకు ఉచిత విద్యుత్, రేషన్ కార్డ్లులు , పించన్లు, పావలా వడ్డీ రుణాలు,రెండు రూపాయలకే కిలో బియ్యం, విద్యార్థులకు ఫీజుల రీ ఎమ్బర్స్ మెంట్ ఇల ఒకటి కాదు ఎన్నో ఎన్నెన్నో. ఆయనలో మానవత ఉబికింది, కరుణ కట్టలు తెంచుకుంది. అన్నీ అన్నీ ఒక్క సారిగా జరిగి పోవాలని తపించారు.

ప్రభుత్వ యంత్రాంగంతో ఒక పని చెయ్యించటం అంటే మాటలు కాదు.మీలో చాలా మందికి ఏదో ఒక ప్రభుత్వ కార్యాలయంలో  ఏదో ఒక తరుణంలో చిన్నపాటి అనుభవమన్నా కలిగి ఉంటుంది. ఈ వ్యవస్థ నేటిది కాదు. బ్రిటీషు వారు ఏర్పాటు చేసిన వ్యవస్థను అలానే కొనసాగిస్తున్నాం. బ్రిటీషువారు విదేశీయులు కాబట్టి మన మీద నమ్మకం లేక ప్రతి చిన్న పనికి ఎన్నో చెక్ పాయింట్స్ పెట్టేరు. అవి నేటికి అలాగే కొనసాగుతున్నాయి. వై.ఎస్. వ్యవస్థ ప్రక్షాణకో, ఆధునీకరణకో పెద్దగా పూనుకోలేదు. ఆయన పరిపాలన చేపట్టే రోజున అంత వ్యవధి కూడ లేదు.

అంతకు పూర్వం ఉన్న తొమ్మిదేళ్ళ చంద్ర బాబు పరిపాలనతో విసిగి వేసారి, తక్షణ ఊరట, తక్షణ బరోసా కోసం పేద,మద్య తరగతి ప్రజలు ఉవ్విళ్ళూరుతుంటే ఇంకెక్కటి వ్యవస్థ ప్రక్షాళన, పరిపాలనా సంస్కరణ. ఉన్న ప్రభుత్వ యంత్రాంగంతోనే నెట్టుకొచ్చారు.

మహిళలకు పావలా వడ్డీకే లక్షలాది రూపాయలు రుణమివ్వాలని వై.ఎస్. జీ.ఓ పాస్ చేస్తారు అనుకొండి. మహిళలు గ్రూపుగా ఏర్పడాలి. ఆ గ్రూపును ఒక ఎం.పి సిఫార్సు చెయ్యాలి.  బ్యాంకు ఖాతా తెరవాలి.రివాల్వింగ్ ఫండుకు  అప్లై చెయ్యాలి . ఫీల్డ్ ఆఫీసర్ విజిట్ చెయ్యాలి. రివాల్వింగ్ ఫండ్ మంజూరు కావాలి. ఖాతాలో జమ కావాలి. ఈ ప్రాసస్ లో ఏ ఒక్కరు తప్పు చేసినా,పొరభాటు చేసినా టోటల్ స్కీమ్ దెబ్బ తింటుంది. పథకం యొక్క లక్ష్యమే చెదిరిపోతుంది.

వై.ఎస్. ఏమన్నా దేవుడా? (పేదలు అలానే భావిస్తారు అది వేరే సంగతి) ఆయన వద్ద మాయా దర్పణం ఏమన్నా ఉన్నదా? లేదే.. హృదయంతో ఆలోచించి ,బుర్రతో అమలు చెయ్యన్నాడు ఒక మేధావి. వై.ఎస్. హృదయంతోనే ఆలోచించి హృదయంతో అమలు చేసారు. అందుకే ఇన్ని లక్షల బోగస్ రేషన్ కార్డులు ఈ రోజు భయిట పడుతున్నాయి.

2009 ఎన్నికల్లో గలవగానే నేను గొప్ప వాడ్ని అని విర్ర వీగకుండా సీట్లు ఎందుకు తగ్గాయి. మనం అమలు చేసిన
సంక్షేమ పథకాల ద్వార లబ్ది పొందిన  వారిలో సగం మంది  ఓటిచ్చి ఉన్నా ప్రతిపక్షాలకు డెపాజిట్ దక్కేది కాదు కదా ? మరి ఎందుకలా జరగ లేదని బుర్రలు బద్దలు కొట్టుకొని ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించే డెలివరి సిస్టంలోని లోటు బాట్లే ఇందుకు కారణం అని భావించి ప్రతిపక్ష నేతగా తాను చేపట్టిన ప్రజా పస్తానం తరహాలో రచ్చ బండ కార్యక్రమం మొదలు పెట్టి ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యి గవర్నమెంట్ డెలివరి సిస్టమ్లోని లోటు బాట్లను తెలుసుకుని తీర్చి దిద్దాలని నిర్ణయించారు.

ఇదే ఉద్దేశంతో ,అలుపెరుగని సైనుకుని వలే గత సంవత్సరం ఇదే రోజున ఉదయం హైదరాబాదునుండి చిత్తూరుకు
హెలికాప్టర్లో భయిలు  దేరితే  ఇటు చిత్తూరు చేరుకోలేదు.అటు హైదరాబాదుకు తిరిగి వెళ్ళలేదని తెలిసి అఖిలాంద్రులు అవాక్కయ్యేరు.  24గంటల ఉత్కంఠత  తరువాత భయిట పడిన మృత్యులాంటి  వై.ఎస్. మరణ వార్త
వందలాది అభిమానుల గుండెలను  శోక సంద్రంలో ముంచింది.

"వై.ఎస్. బతికుంటే " ఈ మాట ప్రజల నోట రాని రోజంటూ లేదు. రాష్ఠ్ర్ర  విభజన కాడ నుండి, ఒక వరదా , ప్రేలుడు కాడికి ఏ చిన్న ఉత్పాదం జరిగినా వై.ఎస్. ఉంటే ఇలా జరిగేది కాదు అని చెప్పని వారు లేరు. నేడు అవాక్కులు చవాక్కులు పేల్చి వెళ్ళిన మహానేతల పార్టీ వారి నోటే ఈ మాట ఎన్నో వందల సార్లు భయిట పడింది.

ఏం చేద్దాం రాముడు,కృష్ణుడు భూమ్మీద ఉన్నప్పుడు వారికి సైతం ఈ అపవాదులు తప్పలేదు .వై.ఎస్. ఎంత?  వై.ఎస్. రాజు, రారాజు. మహరాజు.అతను    నాడు  బతికి ఉన్నప్పు డు కేవలం ఒక రాష్ఠ్ర్రాన్ని ఏలాడు. ఇప్పుడు ...
కోట్ల కొలది గుండెల్లో కొలువుండి ఏలుతున్నాడు.

వై.ఎస్. అమర్ రహే !

Saturday, 29 May 2010

ఒక రాష్ట్రంగా ఉండటం,లేదా : రహమతుల్లా

"తెలుగు జాతిమనది" అనే పాట లేకుండానే "తల్లా పెళ్ళామా? సినిమా తెలంగాణాలో రిలీజ్ చేయించాడట ఎన్.టి.ఆర్.అవతలి వ్యక్తి సహించడు అని తెలిసినప్పుడు మరో మార్గం వెతుక్కోవటం మంచిది.ఇలాంటి పరిస్థితిలో దగ్గరకుపోయి ఓదార్చే బదులు మృతుల కుటుంబాలకు తలా ఒక లక్ష డి.డి.ద్వారా పంపొచ్చు.ఇక జైఆంధ్ర జైతెలంగాణాలకు విరుగుడుగా ఆరు సూత్రాల ప్రకారం రాష్ట్రంలో ఆరుజోనులు ఏర్పడ్డాయి.కానీ రెవిన్యూ డిపార్ట్ మెంట్ లాంటి కీలక శాఖలకు పోలీసు శాఖలోలాగా జోనల్ ఆఫీసులు ఏర్పడనందున ప్రతి చిన్నపనికీ హైదరాబాదు వెళ్ళాల్సి వస్తోంది.వాస్తవానికి కోస్తా రాయలసీమలవారే దూరాభారాలతో ప్రయాణ ఖర్చు(అనుత్పాదక ఖర్చు) ఎక్కువగా మోస్తున్నారు.హైకోర్టు గుంటూరునుండి తరలిపోయింది .కనీసం యాభై ఏళ్ళకాలంలో బెంచి కూడా ఏర్పాటు చేయలేదు.విజయవాడ,రాజమండ్రి,,తిరుపతి,నంద్యాల,మంచిర్యాల,భద్రాచలం లాంటి కొత్తజిల్లాలు కూడా ఏర్పడలేదు.తెలంగాణ సీమాంధ్ర సరిహద్దుల్లో కొత్తజిల్లాల ఏర్పాటు కొంతన్నా సమైక్యతను నిలబెట్టవచ్చు.రాజధాని నగరానికి తరలించి ఒకేచోట పోగుపెట్టిన అభివృద్ధి కేంద్రాలను ఇప్పటికైనా రాష్ట్రంలోని ఆరు జోన్లకూ తరలించాలి.యానాం ను మనరాష్ట్రం లో కలపాలని కాకినాడ మునిసిపల్ కౌన్సిల్ చాలా కాలం క్రితమే తీర్మానించింది. అక్కడి ప్రముఖులు మల్లాడి,వాసిరెడ్డి,మాజేస్టి,మొదలైనవారంతా ఒక భాష మాట్లాడే వాళ్ళంతా ఒక రాష్ట్రంగా ఉండటం,లేదా భౌగోళీకంగా సమీప ప్రాంతాలు ఒక రాష్ట్రంగా ఉండటం అనే ఏదో ఒక ప్రాతిపధికను అంగీకరించాలి.

రహమతుల్లా గారు. మీ కమెంటును నా బ్లాగులో పోస్ట్ చేసాను. మీ కమెంటు పై నా కమెంటేమంటే 
అన్నీ బాగానే చెబుతూ వచ్చారు. కాని చివర ఏదో ఒకటి అంటున్నారు.
సోనియా, మొదల్గొని ఇక్కడి నాయకులు మినహా సమస్యను తెంచే ఉద్దేశం ఎవ్వరికీ లేదు. ఉంటే తెలంగాణా కావాలో వద్దో తెలంగాణలోనే వోటింగ్ పెట్టిస్తే పోలే. నానిదివరకే తెలింగాణ వస్తే ఏం నష్ఠమంటూ ఒక టపా వ్రాసాను దానిని చదవడానికి ఇక్కడ నొక్కండి

Thursday, 18 March 2010

రానున్నది " జగన్" నామ సంవత్సరం


ఈ టపాలో జగన్ భవిష్యత్తును సంఖ్యా శాస్త్ర్ర ప్రకారం వివరిస్తాను. అందుకు ఉపోద్ఘాతంగా కొన్ని ఫ్లాష్ బ్యాక్స్.

ఇది వరకు పలువురు ప్రముఖుల జాతకాలు అనలైజ్ చేసి విజయవంతంగా వారి భవిష్యత్తును సూచించిన వాడ్ని. ఇటీవల వై.ఎస్. జాతకం అనలైజ్ చేసి సీట్లు తగ్గొచ్చేమో గాని విజయం తథ్యం. ప్రజా రాజ్యానికి ఇరవై నుండి ముప్పై సేట్లే వస్తాయని చెప్పిన వాడ్ని. బ్లాగు డాట్ కాం /స్వామి7867లోను,ఆర్కుట్లోను ప్రస్ఫుటంగా చెప్పాను. నానా బూతులు తిట్టించుకున్నాను.

అంతకు పూర్వమైతే చంద్రబాబు గారి మూత్రం సైతం పెట్రోల్ లా వెలిగిపోతున్న కాలంలోనే వారి సతీమణికి బాబుగారు పదవీచ్యుతడువుతారు, ప్రాణగండం ఉందని వ్రాసినవాడ్ని అంతకు పూర్వం జయలలిత జాతకాన్ని అనలైజ్ చేసి మీరు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని వ్రాసా (2000 సం. డిసెంబరులో) . జ్యోతిష్యం ఫలించి జయ ముఖ్యమంత్రి అయ్యారు. 2001 జూన్ లో త్యాంక్స్ కార్డు కూడ పంపారు.

ఇటీవల మద్రాసులో జరిగిన జ్యోతిష్కుల మహానాడులో స్వామి నిత్యానందా జాతకం
అనలైజ్ చేసి ఎవరో 21 రోజుల్లో నిత్యానందా సమస్యలన్ని పరిష్కారమై పోతాయని చెప్పారట. ముందు దినం నేను నిత్యానందా జాతకం గణించి ఫలితం టైప్ చేసి తెచ్చాను. అందులో నేను వ్రాసుకున్నదేమిటంటే ఇతను అనుమానస్పద మృతికి గురవుతాడు. విష ప్రయోగం కూడ జరుగ వచ్చు అన్నదే.

కాని ఏమాత్రం జంక కుండా నేను తెచ్చిన ఐటం అలానే నా తమిళ బ్లాగులో పెట్టాను.
ఇవన్ని చెప్పడం గొప్పలు చెప్పుకోవడానికి కాదు. నేను జ్యోతిష్కునిగా ఉన్నప్పటికి జ్యోతిష్యాన్ని నమ్ముతున్నాను ఎవరు ఏం చెప్పినా వినను.జాతక చక్రంలోని గ్రహాలు ఏమి చెబితే అదే వింటాను. దానినే పది మందికి చెబుతాను. నేను చెప్పినప్పుడు తిక్క తిక్కగా అనిపిస్తాయి గాని అవి నిజమవుతాయని సూచించటానికే.

జగన్ పుట్టిన సమయం తెలీక పోవడంతో సంఖ్యా శాస్త్ర్రంలో నేను చేసిన కొన్ని అన్వేషణల ఆదారంగా జగన్ భవిష్యత్తును ఇక్కడ సూచిస్తున్నాను. జగన్ పుట్టిన తేది (వికి పీడియా ఆధారంగా) 21.12.1972. ప్రాణ సంఖ్య 3 ( పుట్టిన తేది 21, 2+1చేస్తే ఈ సంఖ్య వస్తుంది) , స్థూల సంఖ్య 7. ( పుట్టిన తేదిలోని అన్ని అంకెలను కూడి సింగిల్ నెంబరు చేస్తే వస్తుంది)
పుట్టిన తేదిలోని 2,1 అంకెలను చూడండి. ఇవి చంద్ర సూర్యులను సూచించే అంకెలు. ఇవి కలిసాయంటే అమావాశ్యని అర్థం కదా? అమావాశ్యలో పుట్టినవాడు దొరన్నా అవుతాడు, దొంగన్నా అవుతాడని ఒక నానుడుంది. ఇందులో నిజం లేక పోలేదు. చంద్రుడు మనోకారకుడు, సూర్యుడు ఆత్మకారకుడు. మనస్సు ఆత్మతో విలీనమైతే మనిషి సాధించ లేనిదంటూ ఏమీ లేదు. అందుకే ఈ నానుడు వచ్చిందేమో. ఇంతకీ జగన్ కూడ మనస్సును,ఆత్మను లక్ష్యం పై ఇటువంటి ఏకాగ్రతతో లగ్నం చేయగల వాడేనని చెప్పొచ్చు.

ఇక 2+1=3 అవుతుంది. మూడో నెంబరు గురుగ్రహాన్ని సూచిస్తుంది. గురువుకు ఎన్నో కారకత్వాలున్నప్పటికి అపనింద మోయించడం ఇతని ప్రప్రధమ కారకత్వం. జగన్ మోసిన నిందలు అంతా ఇంతా కాదు. అయితే ఈ అంకె వర్ణనాతీతమైన దైవ శక్తిని ప్రసాదిస్తుంది. బహుసా ఆ దైవ శక్తే జగన్ సి.ఎం కాకుండా అడ్డుకుందేమో. లేకుంటే రోశయ్యకు అంటిన పెంటలన్ని జగన్ కు కూడ అంటుకుని ఉంటాయిగా.

రాజకీయ వ్యూహ రచన, ప్రజాబలం ఈ రెండింటిని ఇచ్చేది గురుగ్రహమే. ఈ గురుగ్రహం యొక్క బలం తోనే ఆయన ఎం.పి గా ఎన్నికయ్యారు. అయినా ఎందుకు ఆయన వ్యూహాలు బెడిసి కొట్టాయంటే స్థ్లూల సంఖ్యను చూడండి, అది కేతు గ్రహాన్ని సూచించే 7 వ అంకె అయ్యింది. ఈ అంకె పిల్లి కళ్ళవారిని, విదేశీయులను సూచిస్తుంది. గురువుకు కేతువు పగ ఉంది. కాబట్టే జగన్ వ్యూహాలు కొంత బెడిసి కొడుతున్నాయి.

కాని కన్వెర్టడ్ క్రిస్టియన్ కావడంతో ఈ దోషం ఎంతో కాలం బాధ పెట్టదు. త్వరలోనే రిలీఫ్ వస్తుంది. (ఇతర మతాలను సూచించే అంకె కేతు). పనిలో పనిగా ఏప్రల్ మూడో వారంలో తాను చేపట్టనున్న టూర్ లో భాగంగా కాణిపాకం వచ్చి ఒక రాత్రి బస చేసి వెళ్ళినా ఈ దోషం మరింత తగ్గే అవకాశం ఉంది.

ఈ ఏడవ అంకె ఎలా ఫార్మ్ అయ్యిందో చూడాలి మరి. 2+5 కలవడం చేత ఫార్మ్ అయ్యింది. రెండవ అంకె మనస్సును సూచిస్తుందని ఇప్పటికే చెప్పియున్నాను. అంతే కాక పెరిషబుల్ గూడ్స్ ను, కేవలం మానసిక సంతృప్తినిచ్చే విషయాలను సూచించే అంకె 2 . వార్తా పత్రిక కూడ ఈ కోవకు చెందిందే. సాక్షి దిన పత్రికను విజయవంతంగా నడుపుతుండటం అందరికి విదితమే. అంటే జగన్ కు చంద్ర బలం ఉన్నట్టే గా లెక్క.

5 అన్నది బుధుడి అంకె.ఇతను వ్యాపార కారకుడు. విథ్యా కారకుడు, కమ్యూనికేషన్ రంగానికి అధిపతి. మనస్సులో ఉన్న మాటను ఎవరి మనస్సు నొచ్చుకోని విదంగా చెప్పగలగడం ఒక్క బుధబలం కల వారికే చెల్లు. ( గోల్డెన్ తెలంగాణా వాదనను గుర్తుకు తెచ్చుకొండి)

Y.S.JAGAN MOHAN REDDY ఆనే పేరుకు న్యూమరాలజి ప్రకారం వేల్యూ కడితే 53 వస్తుంది. దీనిని సింగిల్ నెంబరు చేస్తే 8 వస్తుంది. ఐదు, మూడు అంకెల గురించి ఇది వరకే చెప్పుకున్నాం. ఈ రెంటిని (5+3) కూడితే వచ్చే ఎనిమిదో అంకె వ్యవసాయం, ఐరన్ ,స్టీల్,సిమెంట్ తదితర రంగాలను సూచిస్తుంది. ఈ రంగాల్లో కూద జగన్ బాగానే రానిస్తున్నారు కాబట్టి శని భలం కూడ ఉన్నట్టే భావించ వలసి ఉంది. ముఖ్యంగా 8 చని పోయిన పూర్వికులను కూడ సూచిస్తుంది. డా.వై.ఎస్. ఆత్మ కూడ జగన్ ఆశయ సాధనకు తోడ్పడటం సుసాధ్యమే.

ఈ గొప్పలన్ని చాలు. భవిష్యత్తు గురించి చెప్పవయ్యా అని చికాకు పడుతున్నారు. ఓకే పాయింటుకొస్తున్నా.ముందుగా నామ సంఖ్య గురించి ఒక్క విషయం ఇది 53 కావడంతో జగన్ తనకు 53 ఏళ్ళ వయస్సు పూర్తి కాక మునుపే అన్ని పదవులు అనుభవించేయాల్సి ఉంది

ప్రాణ సంఖ్యను పట్టి:
ఇతని ప్రాణ సంఖ్య 3. ప్రాణ సంఖ్య మూడుగా ఉన్నవారి జీవితం ఒక రౌండుకు మూడు సం.లు చొప్పున సాగుతుంటుంది. ఈ రౌండ్స్ లో 2,5,7,9,11 వ రౌండ్స్ విజయవంతంగా ఉంటాయి. ఇలా పన్నెండు రౌండ్స్ పూర్తయ్యాక ఒక పెద్ద రవుండ్ పూర్తయ్యి మళ్ళీ ఒక పెద్ద రవుండ్ మొదలవుతుంది. ఇందులోను 2,5,7,9,11 వ రౌండ్స్ బావుంటాయి. ఈ లెక్కన చూస్తే జగన్ కు 36 సం.ల వయస్సు పూర్తయ్యింది. అంటే ఒక పెద్ద రవుండ్ పూర్తయ్యి, మరో పెద్ద రౌండ్ ప్రారంభమైంది. ఇందులో మొదటి రౌండ్లో ఉన్నాడన్న మాట.
ఈ మొదటి రౌండ్ పవాదులు, స్థాన చలనాలతో కూడుకున్నదై ఉంటుంది. అంటే జగన్ 39 ఏళ్ళ వయస్సు పూర్తి చేసుకునేంత వరకు ఇదే వరస ఉండొచ్చనిపిస్తూంది. (ఆంటే2011,డిసెంబరు,21 వరకు) ఆ తరువాత మొదలయ్యే సెకండ్ రవుండ్ (మూడు సం.లవరకు యోగప్రదంగా ఉండె అవకాశం ఉంది)

స్థూల సంఖ్యను పట్టి:
స్థూల సంఖ్య ఏడైనప్పుడు జీవితాన్ని ఏడేసి సం.లకో రౌండు చొప్పున విభజించుకోవాలి. ఈ లెక్కన ప్రస్తుతం జగన్ 38 వ ఏట ఉన్నాడు. . దీనిని ఏడుతో భాగిస్తే ఐదొస్తుంది. అంటే ఐదో రౌండు పూర్తై ఆరవ రవుండ్లో ఉన్నాడన్న మాట. ఈ ఆరవ రౌండు శతృజయం, రుణవిముక్తి, రోగ నివర్తినివ్వాలి. ఈ ఏడు సం.లలొ తొలూత మూడున్నర సం.ల పాటు శతృవులు ఏర్పడతారు .తదుపరి మూడున్నర సం.లో వారందరు నాశనమవుతారు. ఈ లెక్కన చూస్తే కొన్ని నెలలవరకే ప్రత్యర్దుల ఆట సాగుతుందన్న మాట. తదుపరి మూడున్నర సం.ల కాలం జగనుకు ఎదురుండదని నా బావం.

Wednesday, 13 January 2010

విశ్వ ప్రేమ

అమ్మా అమ్మోరు తల్లి !
నీ  ఆట నీది నా ఆట నాది
నీ ఆటకు నేనడ్డు రాను
నా ఆటకు నువ్వడ్డు రాకు
అన్ని ఎన్ని సార్లు చెప్పినా అన్ని సార్లు అడ్డు తగులుతూనే ఉన్నావు

నువ్వు దేవుళ్ళకన్నా ఎక్కువ శక్తి ఉన్నదానివి
ఆ దేవుళ్ళనే కన్నదానివి 
నీ ఆటకు నా ఆట అడ్డమని ఎలా అనుకుంటున్నావే
మానవులకే పరిమితమైన ఇన్ఫిరియారిటి కాంప్లెక్స్
దేవతవైన నీకెలా సోకిందే !
కేవలం మానవమాతృడనైన నేను
జగన్మాతవైన నీ జగన్నాటా దృశ్యాలను ఎలా మార్చగలనే
నా దగ్గర్రున్నది ఒకె గుళిక అది విశ్వ ప్రేమ
అన్ని రోగాలకు,సమస్యలకు దీనినే సిఫార్సు చేస్తుంటాను
ఈ అండచరాచర ప్రపంచాల సృష్ఠికర్తవు నువ్వు
నీ నీ స్థానం .. నీ ఆస్థానం
అయినా ఆగదు నా ప్రస్తానం
నీ ఆయుధాలు నీవి
నా ఆయుధం కూడ నీదే
సాధించాలనుకున్నా ఆదర్శమే నా ఆయుధం
నా మరో ఆయుధం
నా అక్షరం
అదే భలీయం.. ఈ క్షణం నా అక్షరమే రెక్కలు గొడికి
హనుమన్నవలే గాలిలో ఎగిరి
తెలుగు వారి గుండెల కిటికీల్లోకి ఓ భ్రమరంలా దూసుకుని పోగలిగితే
హే భ్రమారాంభా !
అప్పుడు చూస్తావులే .... నా ఆయుధపు పదును
అదను చూసి దెబ్బ కొట్టడం కాదే....
కేవలం పేదరికంతో నన్ను గెలవడం కాదే .....
అఖండ ప్రజానీకం మనస్సులు గెలువు
మానవ హృదయాలను స్వర్థపు చీకటి కమ్మేస్తుంటే ...
రాసుకుంటే రవ్వ రాలు నా అక్షరాలు మరో దీపాన్ని స్మరియింప చేయగలవు
ప్రజల గుండెలను తేజోమయం చేయగలవు.

ఈ సత్యం నీకు తెలుస్తే పేదరికంతో
నన్ను కట్టిపడేసేదానివి కావు....
ఏంచెద్దాం !
వీరిలాగే నీవు కూడ నీ విధివ్రాతకు భానిసవి కదా !
అయినా నా ప్రయత్నం ఆగదు
నాటి రుషులు, మహర్షులు వెదజల్లిన
విశ్వపేమను ఈ విశ్వాన వికసింప చెయ్యడమే నా లక్ష్యం
నాకు లేదు ఆయుక్ష్యం
పిండ ప్రవేశ క్షణం నుండి క్షణం క్షణం నా జీవిత గాదను
నువ్వెటు నడుపుకు పోతున్నావో ఓ పొడుపుకథను విప్పినంత తేలికగా తెలుసుకో గలను.
అందుకే సత్యంతో మెలగడం జ్నాన జ్యోతిగా వెలగడం
మొదలు పెట్టాను
చెదలు పట్టిన విదానాలను విరిచి ఆదర్శాలను అమలు చెయ్యించాలని అరచి అరచి అలిసాను
నువ్వు నాలో వెలిసాక
భూత,భవిష్యత్ ,వర్థమానాలు తెలిసాక
ఈ వ్యర్థ మానవుల పరిరక్షణే ద్యేయంగా వీరి ప్రతినిధినై గొంతెత్తి కూస్తున్నాను
నా ఆయువును దార  పోస్తున్నాను
అమ్మా !
నా ఆయుధాలు నీవి
నా లక్ష్యాలు నీవి
నీవి కానివి ఏవి
అంతా నీ ఆజ్నా  అయినా సడలనివ్వను నా ప్రతిజ్న
ప్రజ్నతోనే చేస్తున్నా ఈ అజ్నాన సమరం
దీంతో కావాలి నా బ్రతుకు అమరం

Note:
నా ఈ కవిత మిమ్మల్ని ఆకట్టుకున్నట్లైతే నా రచనలను మరింత చదవడానికి
ఇక్కడ నొక్కండి
లేదా ఇక్కడా నొక్కొచ్చు

Sunday, 10 January 2010

జగన్ తక్షణ కర్తవ్యం

1.మెజారిటి ఎం.ఎల్.ఏ ల మద్దత్తు ఉన్నప్పటికి సి.ఎం చెయ్యక పోవడం.
2.తొలూత ప్రమాదానికి గురైన హెలికాప్టరును గుర్తించటంలో, తదుపరి వై.ఎస్. పార్థివ దేహాన్ని రెస్క్యూ చెయ్యడంలో సైతం విఫలమైన రోశయ్యను సిఎం చెయ్యడం,
3.మృతి చెందిన దివంగత నేతకు దహన సంస్కారాలు సక్రమంగా నిర్వహించటంలో సైతం విఫలమైన రోశయ్యను సిఎంగా కొనసాగించటం
4వరదలవలన నాలుగు జిల్లాల్లోప్రజా జీవణమే స్థంభించినా కిమ్మనని రోశయ్యను సిఎంగా కొనసాగించటం
5.కేసిఆర్ ఒక కాగితపు పులి. అతనిని చూసి తాను బెదరి, అదిష్ఠానాన్ని భయపెట్టి సమస్యను జటిలం చేసిన రోశయ్యను సిఎంగా కొనసాగించటం
6 .ఎవరో రేణుకా చౌదరి ఫ్లెక్సిని చించితే దానికి గగ్గోలు పెట్టిన వైనం
7 పులి వేందుల సీటులోంచి పోటి చేసే యోచనలో జగన్ ఉన్నప్పటికి దానిని వై.ఎస్.సతీమణికి కేటాయించటం
8 వై.ఎస్.అర్ అవినీతి సొమ్మును సోనియాకు దోచి పెట్టాడని ఆరోపించిన పి.ఆర్ .పి ముంగిట చేయి చాచటం
9.వై.ఎస్.మృతితో గుండె పగిలి చచ్చిన వారి మరణాలను సైతం కించ పరచిన ముసలి నాయకులను కట్టిడి చెయ్యక పోవడం
10. ఏదో ఆంగ్ల పత్రికలో వై.ఎస్.తదననంతరం జరిగిన మరణాలు ఫేక్ అని వ్రాస్తే దానిని ఉటంకించి మాట్లాడిన ముసలి నాయకుల పై చర్యల్లేవు. రష్యన్ వెబ్ సైట్ ప్రచురించిన కథనం ఆధారంగా చర్చ నిర్వహించిన టి.వి.చేనల్స్ పైన మాత్రం కేసులు, అరెస్టులు
11.తివారి ఎటువంటివారని, ఆయన నైజమేమని కాంగ్రెస్ పార్టిలో ప్రతి ఒక్కరికి తెలుసు.తొలూత జగన్ను సి.ఎం చెయ్యాలన్న కోరిక భలమైనప్పుడు అతనిని విదేశాలకు పంపేరు. జగన్ పార్లెమెంటులో సమైఖ్యవాదం వినిపించిన కొన్ని రోజులకే తివారిని ఉచ్చులో దింపి రాజినామా చెయ్యించారు. తివారికి ,వై.ఎస్.కి ఉన్న సత్సంభంధాల దృశ్యా ఆయన జగన్ సి.ఎం కావడానికి సహకరిస్తాడేమోనన్న నెపంతోనే ఈ ఉదంతం జరిగింది.
12.గాలి జనార్థన రెడ్డి వై.ఎస్.కి పుత్ర సమానుడు, జగన్ కి సోదర సమానుడు .జగన్ సి.ఎం కావడానికి అతనెక్కడ సహకరిస్తాడోనని అతనిని నానా రకాలుగా ఇబ్బంది పెట్టారు
13. గత ఎన్నికల్లో బాబు మహా కూటామి కడితే కాంగ్రెస్ ఒంటరి పోరు చేస్తే జగన్ సాక్షి టివి,సాక్షి దినపత్రిక ద్వారా కాంగ్రెస్ విజయానికి ఎంతగానో దోహదపడ్డారు. గత ఎన్నికల్లొ మహా కూటమికంటే కాంగ్రెస్ పార్టికి అదనంగా వచ్చింది కేవలం ఒక్క శాతం ఓట్లే . సాక్షి దినపత్రిక,టివి ల రీడర్ షిప్, వ్యూయర్ షిప్స్ లెక్కిస్తే అప్పుడర్థమవుతుంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టి విజయం ఎవరు పెట్టిన భిక్షో. కనీశం ఆ కృతజ్నత సైతం లేక సాక్షి పై కేసులు పెట్టారు.అరెస్టులకు సైతం తెగించేరు

తక్షణ కర్తవ్యం;
"ఇక మంచి లేదు,మానవత్వం లేదు యుద్దమే" జగన్ ఎన్నికల శంకారావం పూరించు. తొలూత కొత్త పార్టికి అంకురార్పణ చెయ్యి. రాష్ట్ర) వ్యాప్తంగా సుడిగాలి పర్యటన చెయ్యి. ప్రజా ప్రయోజనాల వ్యాజ్యంతో ఎన్నికలు జరిగేలా చెయ్యొచ్చు. అందాక వై.ఎస్. పథకాల అమలుకు, వై.ఎస్. మరణము వెనుక కుట్రలేమన్నా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తుకు వత్తిడి చేద్దాం.

మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను.రాజకీయంలో ఎంత మంచి నిర్ణయం తీసుకున్నామన్నది ముఖ్యము కాదు. ఎంత త్వరగా తీసుకున్నాం. ఎంత చక్కగా అమలు చేసామన్నదే ముఖ్యం.

వై.ఎస్. అమర్ రహే ! జగన్ కో సి.ఎం బనేంగే