
అఫిషియల్గా చూస్తే మీరు నాకన్నా చిన్నవారే. కాని ప్రతి ఒక్కరు (మీకన్నా పెద్దవారు సైతం) అన్న అంటుంటే మీరెక్కడ ఇగో ఫీల్ అవుతారో అని జగనన్నకు అనే శీర్షిక పెట్టాను. ఇక ప్రశ్నలు :
1. వై.ఎస్. తలచుకుని ఉంటే ..అతను తెలంగాణకు సుముఖుడే అయితే ఎప్పుడో వచ్చేది తెలంగాణ. మీరు సైతం పార్లెమెంటులో సమైఖ్యాంద్రకు మద్దత్తుగా ప్లే కార్డులు కూడ ప్రదర్శించేరు. కాని సాక్షిటివి కథనాలు ( కె.సి.ఆర్ కు ప్రాధన్యత) ఆయన మాటలు చూస్తుంటే మీరూ జై తెలంగాణ అనేసారని పిస్తూంది. మీ వైఖరి ఇప్పటికన్నా స్పష్థం చెయ్యాలిగా?
2. పార్టికి మీరే పేరు పెట్టండి అని - ఎస్.ఎమ్.ఎస్. చెయ్యండని సెల్ నెంబరు కూడ ప్రకటిస్తున్నారు. పార్టీ రూపు రేఖలు ప్రదిపాదించమని వెబ్ సైట్ కూడ పెట్టేరు. ఇవన్ని చంద్రబాబు స్టైల్స్. అతనికింత చెడ్డ పేరు రావడానికి కారణం సలహాలివ్వండని కోరడం - ముసాయిదా మీద మీ అభిప్రాయాలు తెలపండి అనడం -పోస్టు కార్డు వ్రాస్తే స్పందిస్తా అనడం వంటి అతి చేష్ఠలే (తీరా చూస్తే సలహాలు -అభిప్రాయాలన్ని భుట్ట దాకలే)
అసాధ్యమని తెలిసినా ఇటువంటివి ప్రకటించడం మంచిదేనా? పైగా www.i4jagan.in హోం పేజిలోని వై.ఎస్. ఆర్ ఫోటో మరీ డల్ గా ఉంది. ఆ ఫోటొ తొలగించి ఈ పోస్టులో నేను ఉంచినంత తేజోమయంగా ఉన్న ఫోటో పెట్టమనండి
3. మీకు మద్దత్తు తెలిపిన ఎమ్.ఎల్.ఏలు రాజినామా చెయ్యరు. కాంగ్రెస్ పార్టి వారిని సస్పెండూ చెయ్యదు. ఎంతకాలం ఈ నాన్చుడు? వై.ఎస్. మరణానంతరం మీ నాన్చుడు వైఖరివలనే ఎంత నష్ఠం జరగాలో జరిగి పోయింది. ఇంకా నాన్చడం దేనికి?
4.వై.ఎస్. మీద ,మీ మీద, మీ కుటుంభ సభ్యుల మీద అవినీతి ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. వాటిని మీరెందుకు తిప్పి కొట్టరు? ఒక ఇంటర్వ్యూ ద్వారా ఆ పని ఎందుకుమీరే చెయ్య కూడదు (సాక్షిలో కాదు ముర్రో)
5. ఒక టివి చానల్, ఒక పత్రికను సైతం విజయ వంతంగా నడపలేని మీరు రాష్ఠ్ర్రాన్ని ఎలా
సక్రమంగా పరిపాలిస్తారు. ఇంకా కూడ సాక్షి నెంబర్ టూగానే ఉంది. ముందుగా వీటిలో వై.ఎస్., మీ పురాణాలు ఆపి నెంబర్ వన్ స్థానానికి తెచ్చే ప్రయత్నం చెయ్యండి. అప్పుడు గాని ఎన్నికల సమయంలో ఇవి మీకు పెద్దగా సాయపడవు.
1.వైఖరి స్పష్టం చెయ్యడం అంటే...ఏమిటో..నాకు అర్థం కాదు.....ఎందుకూ పనికిరాని ఆ వైఖరి తో ఏం చెసుకుంటారు...
ReplyDeleteఇన్నాల్ళు...ఆ బాబుగారిని చంపారు.....ఇప్పుడు..ఈ 'బాబు ' ని.....చంద్రబాబు,ఉంటే ఆయన బాబు....చిరంజీవి,ఇంకో జీవి ముక్త కంఠం తో తెలంగాన కావలని అడిగినా.....సోనియా 'వైఖరి ' తెలంగానకు వ్యతిరెకమైతే ... రాదంతే....
2.అసాధ్యమని తెలిసినా ఇటువంటివి ప్రకటించడం మంచిదేనా?
Lux ad చూసారా??....తోమితే తెల్లగా వస్తారు అంటారు..అలా తెల్లబడిన వాల్లని ఎక్కడ చూడలేదు...ఈ విషయం మీద చీటింగ్ కేసు పెట్టిన వాల్లను కూడా చూడలేదు....వీటిని Marketing Techniques అంటారు.
3.తెలివైన రాజకీయ నాయకుడిని అని అనిపించుకోడానికి.... అలా చెయ్యకపొతే...జగన్ కూడా మీలాగ బ్లాగులు రాసుకోడానికి తప్ప ఎందుకు పనికి రాకుండా పోతాడు.
4.తిప్పి కొట్టడం అంటే.....డాలర్ శేషాద్రి లాగా...మీడియా ముందు ఏడవాలా??
5.ఒక పత్రికను సైతం విజయ వంతంగా నడపలేని మీరు
ఇది మీ భ్రమ
:)) Well said Anon1
ReplyDeleteశ్రద్ధ!
ReplyDeleteమీరు ఒక రుణం అవసరం?
ఒక వ్యాపారం అప్ నక్షత్రం ప్రతికూల Dept చెల్లించడానికి లేదా వ్యాపారం etc ఆర్థిక, మేము, మీకు కావలసిన రుణ మొత్తం ఇవ్వాలని తో (USD $ 1,000 కు $ 10,000,000 డాలర్లు) రుణం అవకాశాన్ని ప్రపంచంలో ఉత్తమ సేవ కోసం ఇక్కడ ఉన్నారు నెలవారీ మరియు వార్షిక తిరిగి ప్రణాళిక ఆసక్తి ఉంటే కూడా తగిన తిరిగి ప్రణాళికలు. మీరు ఈ క్రింది వివరాలు ద్వారా మమ్మల్ని సంప్రదించవచ్చు.
ఏజెంట్ పేరు: కీపర్ బాబ్
ఏజెంట్ ఇమెయిల్: (lexeasyloanfirm@gmail.com)
ధన్యవాదాలు
నిర్వహణ