క్షమించండి !

నా ఈ బ్లాగును అప్డేట్ చెయ్యడం లేదు. ప్రస్తుతం నా మరో తెలుగు బ్లాగ్ రెగ్యులరుగా అప్డేట్ అవుతూంది. అందులోని టపాలను చదవడానికి ఇక్కడ నొక్కండి
Showing posts with label Jaganmohanreddy. Show all posts
Showing posts with label Jaganmohanreddy. Show all posts

Friday, 25 May 2012

సి.బి.ఐ ప్రశ్నలు -జగన్ సమాధానాలు : పూర్తిపాఠం


సి.బి.ఐ : నిన్నే ఒక మంత్రిని అరెస్ట్ చేసాం !
జగన్: ఈ రోజు నన్ను చేస్తారా?

సి.బి.ఐ: అబ్బే.. అలా అని మేం చెప్పామా?
జగన్: ఇంకేం చెబుతారు?

సి.బి.ఐ: అసలు ఈ కేసు -ఆ 26 జీఓలు గురించి మీకేమన్నా తెలుసా?
జగన్: ఒక సామాన్య పౌరునికి ఎంత తెలుసో అంతే తెలుసు .. మీకు ఎక్కువ తెలిసి ఉంటే మీరే చెప్పండి

సి.బి.ఐ: అవన్ని మీ నాన్న ఇచ్చిన జి.ఓలు
జగన్: ఆయన కేవలం మా నాన్నే కాదు.. సోనియా నామినేట్ చేసిన కాంగ్రెస్ పార్టి సి.ఎం

సి.బి.ఐ: అంటే ఆ జీ.ఓలకు సోనియా భాధ్యత వహించాలంటారా?
జగన్: వై.ఎస్ .ని ఆకాశానికి ఎత్తేసిన సోనియా, ఐదు సం.లు సి.ఎంగా కొనసాగించి - మరో సారి కూడ ఆతన్నే సి.ఎం చేసిన సోనియాకు ఆ భాధ్యత ఉండదా?

సి.బి.ఐ: ఆ జీ.ఓల వల్ల కొందరు లబ్ది పొందారు. వారు మీ కంపెనిల్లో పెట్టుబడి పెట్టారు
జగన్: యా..పెట్టారు.. పెట్టుబడి పెట్టారు

సి.బి.ఐ:వాటిని ప్రభుత్వం జారి చేసిన జి.ఓల ద్వారా వారు పొందిన లబ్దికి ప్రతి ఫలంగా మేం భావిస్తున్నాం
జగన్: యు మీన్ కిక్ బ్యాక్స్?

సి.బి.ఐ: యెస్ ! అవి ముమ్మాటికి లంఛాలే..
జగన్: లంచం సొమ్ముకు ఎవడన్నా డివిడెండ్లు, బోనస్లు ఇస్తాడా?

సి.బి.ఐ: మీరు ఇల అడ్డదిడ్డంగా మాట్లాడటం వలనే ఇది ఇందాక వచ్చింది
జగన్: ఇంక ఎందాక పోతుందో కూడ మీరే చెప్పండి

సి.బి.ఐ: అరెస్ట్ చేస్తాం
జగన్: పాపం ఉరి తీసే అధికారం మీకు లేదనుకుంటా

సి.బి.ఐ: చూడండి నేను ఓపెన్గా ఒకటంటా
జగన్: అనండి..

సి.బి.ఐ: కాంగ్రెస్ - మంతా బ్యానర్జి / కాంగ్రెస్ -శరత్ యాదవ్ మాదిరిగా మీరెందుకు సర్దుకు పోకూడదు?
జగన్: బేరమా?

సి.బి.ఐ: అలానే అనుకొండి..
జగన్: కర్ణుడి దగ్గర పుత్ర భిక్ష పెట్టమని కోరిన మగ కుంతిలా ఉంది మీ వాలకం

సి.బి.ఐ: పోనీ .. ఈ ఉప ఎన్నికల తరువాత తె.దే.పా అవిశ్వాస తీర్మానం పెడితే దాన్ని భలపరచమని కమిట్ అయి పోండి.
జగన్: అంటే ఈ పేక మేడల ప్రభుత్వాన్ని మరో రెండేళ్ళు నేను కొనసాగిస్తే అక్రమాస్తులన్ని సక్రమాస్తులు అయి పోతాయన్న మాట..

సి.బి.ఐ: అది మేం చూసుకుంటాం.. చంద్ర బాబు పై కేసుల్లా మీ కేసును కూడ నీరు కారుస్తాం
జగన్: ఈ డీల్ కు నేను ఒప్పుకోకుంటే ..

సి.బి.ఐ: అయితే చట్టం తన పని తాను చేస్తుంది..
జగన్: మీరు మాత్రం ఇలాంటి బ్రోకర్ పనులు చెయ్యకండి . గుడ్ .. బై..

( హెశ్చరిక: ఈ టపా పూర్తిగా కల్పితం - శుక్రవారం నాడు జగన్ సి.బి.ఐ విచారణను ఎదుర్కొంటుంటే చానల్ వారు ఎవరికి తోచినట్టు వారు వార్తలు /అప్డేట్స్ ఇస్తుంటే చూసి చూసి - ఒక వేళ ఇలాంటి డీల్ కూడ జరిగి ఉండొచ్చో ఏమో అనిపించి ఈ టపా వ్రాస్తున్నా.. పొరభాటుగా - ఇదే డిస్కషన్ జరిగి ఉన్నా నేనాశ్చర్య పోను)

Wednesday, 29 December 2010

జగనన్న తమిళ తంబి సందించే 5 ప్రశ్నలు


అఫిషియల్గా చూస్తే మీరు నాకన్నా చిన్నవారే. కాని ప్రతి ఒక్కరు (మీకన్నా పెద్దవారు సైతం) అన్న అంటుంటే మీరెక్కడ ఇగో ఫీల్ అవుతారో అని జగనన్నకు అనే శీర్షిక పెట్టాను. ఇక ప్రశ్నలు :

1. వై.ఎస్. తలచుకుని ఉంటే ..అతను తెలంగాణకు సుముఖుడే అయితే ఎప్పుడో వచ్చేది తెలంగాణ. మీరు సైతం పార్లెమెంటులో సమైఖ్యాంద్రకు మద్దత్తుగా ప్లే కార్డులు కూడ ప్రదర్శించేరు. కాని సాక్షిటివి కథనాలు ( కె.సి.ఆర్ కు ప్రాధన్యత) ఆయన మాటలు చూస్తుంటే మీరూ జై తెలంగాణ అనేసారని పిస్తూంది. మీ వైఖరి ఇప్పటికన్నా స్పష్థం చెయ్యాలిగా?

2. పార్టికి మీరే పేరు పెట్టండి అని - ఎస్.ఎమ్.ఎస్. చెయ్యండని సెల్ నెంబరు కూడ ప్రకటిస్తున్నారు. పార్టీ రూపు రేఖలు ప్రదిపాదించమని వెబ్ సైట్ కూడ పెట్టేరు. ఇవన్ని చంద్రబాబు స్టైల్స్. అతనికింత చెడ్డ పేరు రావడానికి కారణం సలహాలివ్వండని కోరడం - ముసాయిదా మీద మీ అభిప్రాయాలు తెలపండి అనడం -పోస్టు కార్డు వ్రాస్తే స్పందిస్తా అనడం వంటి అతి చేష్ఠలే (తీరా చూస్తే సలహాలు -అభిప్రాయాలన్ని భుట్ట దాకలే)
అసాధ్యమని తెలిసినా ఇటువంటివి ప్రకటించడం మంచిదేనా? పైగా www.i4jagan.in హోం పేజిలోని వై.ఎస్. ఆర్ ఫోటో మరీ డల్ గా ఉంది. ఆ ఫోటొ తొలగించి ఈ పోస్టులో నేను ఉంచినంత తేజోమయంగా ఉన్న ఫోటో పెట్టమనండి


3. మీకు మద్దత్తు తెలిపిన ఎమ్.ఎల్.ఏలు రాజినామా చెయ్యరు. కాంగ్రెస్ పార్టి వారిని సస్పెండూ చెయ్యదు. ఎంతకాలం ఈ నాన్చుడు? వై.ఎస్. మరణానంతరం మీ నాన్చుడు వైఖరివలనే ఎంత నష్ఠం జరగాలో జరిగి పోయింది. ఇంకా నాన్చడం దేనికి?

4.వై.ఎస్. మీద ,మీ మీద, మీ కుటుంభ సభ్యుల మీద అవినీతి ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. వాటిని మీరెందుకు తిప్పి కొట్టరు? ఒక ఇంటర్వ్యూ ద్వారా ఆ పని ఎందుకుమీరే చెయ్య కూడదు (సాక్షిలో కాదు ముర్రో)

5. ఒక టివి చానల్, ఒక పత్రికను సైతం విజయ వంతంగా నడపలేని మీరు రాష్ఠ్ర్రాన్ని ఎలా
సక్రమంగా పరిపాలిస్తారు. ఇంకా కూడ సాక్షి నెంబర్ టూగానే ఉంది. ముందుగా వీటిలో వై.ఎస్., మీ పురాణాలు ఆపి నెంబర్ వన్ స్థానానికి తెచ్చే ప్రయత్నం చెయ్యండి. అప్పుడు గాని ఎన్నికల సమయంలో ఇవి మీకు పెద్దగా సాయపడవు.