టి.ఆర్.ఎస్ - కె.సి.ఆర్ల దుందుడుకు మాటలు,హింసాత్మక చర్యలు కొత్తేమి కాదు. కాని ఇటీవల వై.కా.పా గౌ.అధ్యక్షురాలు విజయమ్మ నేతన్న దర్నాకు విచ్చేసిన అనంతరం వారి హింసాత్మక మాటలు తారాస్థాయికి చేరాయి.
తెలంగాణలో పర్యటించడానికి విజయమ్మకు ఎలాంటి హక్కులున్నవో -ఆమెను అడ్డుకోవడం ఎంత అప్రజాస్వామికమో ఇదివరకే వివరించాను కాబట్తి సూటిగా విషయానికొచ్చేస్తున్నాను.
విజయమ్మ రాక సందర్భంగా టి.ఆర్.ఎస్ అవలంబించిన తీరు -రాళ్ళ వర్షం ఇత్యాది దుష్ప్రవర్తనలను దాటవేసి టి.ఆర్.ఎస్ ను విషేదించడానికి ఏం అవసరమొచ్చిందో చెబుతాను,
విజయమ్మ రాక -దర్నా విజయవంతం కావడం చూసి మతి భ్రమించిన టి.ఆర్.ఎస్ నేతల పిచ్చివాగుళ్ళు ఆకాశాన్నంటాయి. అవి షరా మామూలే.
కాని ఎర్రోళ్ళ శీరినివాసులు అనే ప్రబుద్దుడు "తెలంగాణలోని వైకాపా నేతలను పిట్టలను కాల్చినట్టు కాల్చేస్తాం" అని చెప్పడం -ఆ మాటలు పత్రికల్లో సైతం ప్రచురించ బడడం చూస్తుంటే ..
ఇంతకాలం ఎలక్షన్స్ -కలెక్షన్సుకే పరిమితమైన టి.ఆర్.ఎస్ వైకాపా రాకతో ఇక తమ పప్పులు ఉడకవని "హింసా మార్గాన్ని"ఎంచుకున్నదో అన్న అనుమానం కలుగుతూంది.
వెంటనే రాష్ఠ్ర్ర ప్రభుత్వం ఎర్రోళ్ళ శ్రీనివాసులు మాటలు సంభందించిన క్లిప్పుంగ్స్ కలెక్ట్ చేసి కేసులు నమోదు చేసి - టి.ఆర్.ఎస్‌ను నిషేదించే ప్రక్రియను మొదలు పెట్టాలి.
ఈరోజు కాలుస్తాం అన్నవారు -రేపు కాలుస్తే రాష్ఠ్ర్రం ఏం అయిపోతుంది. ఇటువంటి హింసను ప్రేరేపించే మాటలు చెప్పడం "వాక్ స్వాతంత్ర్యం" కాదు. అలా హింసను ప్రేరేపించే హక్కు ఏ రాజకీయ పార్టికి లేదు.
ఇన్నాళ్ళకు తనకూ వెన్నెముక ఉందని నిరూపించుకున్న కిరణ్ సర్కార్ - టి.ఆర్.ఎస్‌ను నిషేదించి తన భాధ్యతను నిర్వర్తించాలి. లేకుంటే భవిష్యత్తులో ఇలాంటి మాటలే కాదు చేతలూ చోటు చేసుకుంటాయి. రాష్ఠ్ర్రం అగ్ని గుండమవుతుంది.
క్షమించండి !
నా ఈ బ్లాగును అప్డేట్ చెయ్యడం లేదు. ప్రస్తుతం నా మరో తెలుగు బ్లాగ్ రెగ్యులరుగా అప్డేట్ అవుతూంది. అందులోని టపాలను చదవడానికి ఇక్కడ నొక్కండి
Pages
Showing posts with label తెలంగాణ. Show all posts

Tuesday, 24 July 2012
Wednesday, 5 October 2011
తెలంగాణ సాధనకు సరైన మార్గం ఇదే !
Thursday, 10 March 2011
మిలియన్ మార్చ్ : కె.సి.ఆర్ పంథా మార్చుకో

తెలంగాణ రావలంటే పార్లెమెంటులో బిల్లు పెట్టాలి. బా.జ.పా ఏమో ప్రైవేటు బిల్లు పెడదామని చెప్పేసింది. ఆ బిల్లుకు మద్దత్తు ఇవ్వాల్సినవారు ఎం.పీలు .వారి మద్దత్తు కూడ కట్టుకునే ప్రయత్నమేదో చేసుకోవచ్చు. అంతేగాని సహాయ నిరాకరణ, మిలియన్ మార్చ్, అంటూ దిగడం కేవలం రాజకీయ లబ్ది కొసమే అని తేట తెల్లమవుతూంది. సోనియా ధూతగా వచ్చిన చిదంబరం "తెలంగాణ ప్రక్రియ మొదలు పెడుతున్నాం" అని ప్రకటించగానే కె.సి.ఆర్ అండ్ కో భవిష్యత్తు గురించిన తీపి కలల్లో మునిగి పోయేరు. శ్రీ కృష్ణా కమిటిని పట్టించుకోమంటూనే సం కాలం కాలయాపనకు పరోక్షంగా సహకరించేరు.
ఇప్పుడేమో మళ్ళీ రాజకీయ లబ్ది కోసం ఇంటర్ విథ్యార్దులను,ప్రజలను ఇబ్బంది పెట్టడమే కాక ట్యాంక్ బండ్ మీది విగ్రహాలను ( అన్నమయ్య విగ్రహంతో పాటు) ద్వంసం చేసి తమ పట్ల ఉన్న కొద్దొ గొప్పో సింపతిని సైతం పోగొట్టుకుంటున్నారు. ప్రభుత్వం మిలియన్ మార్చ్ కి అనుమతి నిరాకరించడానికి కారణం కూడ కే.సి.ఆర్ డవులాగులో "కానిదానికి లేనిదానికి’ భూకంభం పుట్టిస్తాం -సునామి తెప్పిస్తామని పాత తెలుగు సినిమా డవులాగులన్ని దంచేడు.
అసలే కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న కిరణ్ ప్రభుత్వానికి గుండె పోటు వచ్చినంత పని అయ్యింది. అందుకే అనుమతి నిరాకరించేరు. ఒక పక్కేమో "శాంతియుత ఉధ్యమం’అని చంకలు గుద్దుకోవడం మరో వైపేమో ఏ చిన్న అవకాశం దొరికినా హింసకు,దాడులకు పాల్పడటం ఇదే తెలంగాణా వాదులకు పరిపాటి అయిపోయింది.
అసలు వీటన్నింటికి కారణభూతుడు ఆ ముసలయ్య .అదే రోశయ్య. ఆ రోజు కె.సి.ఆర్ ఆమరణ నిరాహార దిక్ష అని బీరవచనాలు పలికినప్పుడు " అంతేనా.. నా తండ్రే నా బాబే ..చేసుకో నాయనా" అని చెప్పి ఉంటే ఏ రెండో రోజో మూడో రొజో మరుగు దొడ్డిలో పెరుగన్నం తిని మీడియాకి చిక్కి పోయి ఉంటాడు.
అయ్యో భూతం -అమ్మో భూతమని వనికి పోయి అనవసర అరెస్టు- రాద్ద్దాంతాలకు తావిచ్చింది .. ముమ్మాటికి రోశయ్యే. ఓకె గతం గతం. ఇప్ప్టటికైనా కిరణ్ సొనియాకు మరో మారు పాద పుజలు నిర్వహించి " నన్ను వీరు పెట్టేట్టు లేదు తల్లోయి" అని రొదించి ఒక ప్రకటన చెయ్యించున్నా ఇంత దురం వచ్చేది కాదు. ఈయన గారికి మూల విరాట్టువద్ద ఉన్న పట్టు-గౌరవం ఇంతేనేమో?
ఓకె అదీ చేతగాలేదు. మిలియన్ మార్చేగా చేసుకోండయ్యా అని వ్యుహాత్మకంగా అనుమతి ఇచ్చి ఉంటే నేడు వేలల్లో వచ్చిన జనం అప్పుడు లక్షల్లో వచ్చి ఉండే వారు. ఇప్పటికే కె.సి.ఆర్ భారి డవులాగులతో రక్తం వేడెక్కి ఉన్న వారు హింసకు దిగేవారు. అప్పుడు "చట్టం తన పని తాను చేసి ఉంటే" భర్తలు పోయిన భార్యలు,పిల్లలను పోగొట్టుకున్న తల్లి తండ్రులు, తల్లి తండ్రులను పోగొట్టుకున్న పిల్లలే కె.సి.ఆర్ పని పట్టే వారు.
ఇప్పుడేమో రెంటికీ చెడ్డ రేవైంది కిరణ్ పని. కె.సి.ఆర్ ఒక్క మాట గుర్తుంచుకోవాలి.. సిగ్గులేని కాంగ్రెస్ , సత్తాలేని కిరణ్‌లను ఆట పట్టించడం కాదు.. రేపు మిలియన్ మార్చ్ హింస సాకుతో కేంద్ర బలగాలు దిగిపొతే తుమ్మడం /దగ్గడం సరికదా పిత్త్తడం కూడ వీలు కాదు.
కె.సి.ఆర్ తెగేంత దాక లాగుతున్నాడు.తెగితే ఎక్కడ పడతాడో తెలీదు. కె.సి.ఆర్ టేక్ కేర్! కాంగ్రెస్ వ్యుహం మారింది. ఒక్క సి.బి.ఐ భుచి చూపే అంతటి కరుణానిధిని సైతం మియావ్ మియావ్ అనిపించేసేరు. నువ్వెంత.
నీకు దమ్ముంటే,చావ ఉంటే దిల్లికెళ్ళి కూర్చో! ఎంపీల కాలు మొక్కుతావో, ముక్కుతాడే పట్టి లాగుతావో.. బా.జా పా పెడతానంటున్న ప్రైవేటు బిల్లు పెట్టించు.అది వీగి పోక చూడు. అంతేగాని రోజుకో కొత్త నాటకం -రొజుకో భారి డవులాగులతొ ప్రజలను ప్రక్క దోవ పట్టించడం నిన్నే ఓ బఫూన్ చేస్తుంది.
అయినా తెలంగాణ కోసం అమరులైన అమాయకుల కుటుంభాలను సైతం ఆదుకోలేని నువ్వు సమస్త తెలంగాణ ప్రజానీకాన్ని ఎలా ఆదుకుంటావయ్యా.
తెలంగాణ ఇవ్వాలా వద్దా అంటే వద్దన్నదే నా మాట. బహుసా కేంద్ర ,రాష్ఠ్ర ప్రభుత్వాలది ఇదే మాటేమో గాని అందుకు వారు ఎంచుకున్న భాట మాత్రం చారిత్రిక తప్పిదం. కె.సి.ఆర్ దిక్ష సమయానే తెలంగాణ ప్రజల మద్య ఓటింగ్ నిర్వహిద్దాం .. ప్రజా తీర్పు మెరకే తెలంగాణ అని ప్రకటించి ఉంటే ఈ పెంటే లేదు.
హుమ్! ఏం చేద్దాం .. ఒక్క వై.ఎస్. అర్ పొయాడు .రాష్ఠ్ర్రాన్ని శని పట్టుకుంది.వై.ఎస్.ఆర్ ను ఆడిపోసుకునే మేథావులు ఈ తెలంగాణ పెంటను వదిలించుకునే మార్గమూ చూపాలిగా. దద్దమ్మలు.
Thursday, 27 January 2011
తెలంగాణ సమస్యకు సాంబారుగాడి పరిష్క్తారమే అమలు? - ఊరు వాడ కుదేలు?
జగన్ కొత్త పార్టి ఇలా ఉంటే మేలు అనే శీర్షికతో నేను వ్రాసిన టపా చదివే ఉంటారు. చదవని వారు ఇక్కడ నొక్కి చదవండి. ఆ టపాలో ప్రతి రాజకీయపార్టికి చలి జ్వరం పుట్టించే తెలంగాణ సమస్యకు ఒక పరిష్క్తారం చూపాను. ( టపా చదవనివారు క్రింది బొమ్మ చూడండి
ఇది ..నేను చూపిన పరిష్కారం. మరీ ఈ రోజు ఆంద్రజ్యోతిలో వచ్చిన వార్తా చూడండి..
//మరొక్కటి
కాంగ్రెస్ మదిలో ఆప్షన్ 7
తెలంగాణకు రాజ్యాంగ రక్షణలు
మార్చిలో టీఆర్సీ ఏర్పాటు
విధులు, నిధులు, అధికారాలు మరిన్ని ప్రత్యేక చర్యలు
15 నెలలపాటు ప్రయోగాత్మకంగా అమలు
అప్పటికీ ఫలితం లేకుంటే విభజన
'తెహల్కా' ప్రత్యేక కథనం //
నేను చూపిన పరిష్కారం జగన్ పెట్టనున్న కొత్త పార్టి కోసం. నా పరిష్కారం కొత్తపార్టికైతే సరి పోతుంది. కాని కాంగ్రెస్ 2004 ఎన్నికల్ల్లోనే వాగ్దానం చేసి/ గత ఏడాది ప్రక్రియ ప్రారంభితున్నామని ప్రకటించి ఆపై శ్రీ కృష్ణ కమిషన్ పేరిట్ సం. కాలయాపన చేసి "విశ్వసనీయత" ను పోగొట్టుకుంది. ఇప్పుడు మరో పదిహేను నెలలు ప్రయోగాలు చేస్తామంటే తెలంగాణా వాదులు బట్టలూడ దీస్తారు.
నేనైతే వంద రోజుల వ్యవధే పెట్టాన్నది గమనార్హం. వంద రోజుల అనంతరం తెలంగాణ కావాలో వద్దో తెలంగాణ ప్రజల నడుమ ఓటింగ్ నిర్వహించాలని పేర్కొన్నా. కాని వీరు ఫలితం లేకుంటే విభజన అంటున్నారు.
విడి పోవాలని నిర్ణయించిన వారు (నాయకులు) ఎప్పటికి విడిపోదామనే చెబుతారు. కాని ప్రజలేమంటారన్న విషయంలోనే మార్పొస్తుంది. ఆ మార్పు పై వంద రోజుల "చర్యల" పై ఆధార పడి ఉంటుంది.
ఏమిటో .. సాటి బ్లాగర్లు నన్ను పిచ్చోడి క్రింద చూసినా నేను టపా వ్రాయగానే జగన్ 48 గంటల నిరాహార దీక్ష ప్రకటించారు. ఇప్పుడు కాంగ్రెస్ వారు నా బాట పట్టడానికి ప్రయత్నించి మరో లోయలో పడేలా ఉన్నారు.
కాపీ కొట్టడం అంటే మక్కికి మక్కి కొట్టాలి. వీరు చంపడం కూడ పూర్తిగా చంపరు ( నేనంటున్నది ప్రజాస్వమ్యాన్ని ) కనీశం కాపి కొట్టడం కూడ చేతగాని దద్దమ్మలు వీరు

Labels:
Andhrajyothi,
solution,
telangana,
ఆంద్రజ్యోతి,
తెలంగాణ,
పరిష్కారం,
సాంబార్ గాడు
Tuesday, 11 January 2011
తెలంగాణా అంటూ రోడ్డెక్కిడితే నడ్డీ విరిచి
మీకంటే మేమే చాలా వెనుక పడ్డామని సీమాంద్ర నేతలు ఎంత మొత్తుకున్నా తెలంగాణ వాదులు వినిపించుకోలేదు. శంఖంలో పోస్తేనే తీర్థం అన్నట్టుగా శ్రీ కృష్ణా కమిషన్ అదే మాట చెప్పడంతో వారు ఆత్మ రక్షణలో పడేరు.
వీరికి దిల్లీ రాజకీయాలు ఇంకా అర్థమైనట్టు లేదు. దిల్లీ పెద్దల దృష్ఠిలో జగన్ వంటి అశేష ప్రజాధరణ కలిగిన నేతే డోంట్ కేర్ అన్నప్పుడు చంద్ర శేఖర్ రావు వంటివారు ఏ లిస్టులో ఉంటారేమో?
మన రాష్ఠ్ర్రంలో ఉదయం ఐదు, ఐదున్నరకే ఆకాశంలోని చీకటి తొలగడం ప్రారంభిస్తుంది. ఎంతటి ఎఫ్ టివిలు చూసి లేట్ నైట్ నిద్రించినా ఉదయం 9కెల్లా రోడ్డున పడతాం. కానీ దిల్లీ అట్లా కాదు.
వారికి పొద్దు పొడవడమే పదింటికి.పొగ మంచు ,చలి ఈ నేపథ్యంలో వారి స్పందనా తీరు కూడా అలానే ఏడుస్తుంది.
ఇంతకీ జె.ఏ.సి కావచ్చు, టి ఆర్ ఎస్ కావచ్చు పండుగలడ్డొచ్చాయి గాని లేకుంటేనా అని విర్ర వీగుతుంటారు. మన రాజ్యాంగంలో రాష్ఠ్ర్రాలకున్న అధికారాలు అంతంత మాత్రమే. అవీ కేంద్రం తలచుకుని,దయ దలుస్తేనే.
రాష్ఠ్ర్రంలో అటు జగన్ -ఇటు తెలంగాణ సమస్యలు దిల్లీ పెద్దలను కొంత మెరకు హడావుడికి గురిచేస్తుండడం నిర్వివాదాంశం. దిల్లీ వారు ఈ విషయాల పై ఆచి తూచి రంగంలో దిగడానికి కావలసిన సమయాన్ని పండుగలిచ్చాయి.
తెలంగాణా కాంగ్రెస్ నేతలుతిరుగుభాట పట్టడం - జగన్ వెంట ఎమ్.ఎల్.ఏలుండటం కూడ సమస్య కాదు. దిల్లీ జల దీక్షలో " రాష్ఠ్ర్ర ప్రభుత్వ మనుగడ నా దయా దాక్షిణ్యాలమీద ఆధార పడుంది"అన్న జగన్ వ్యాఖ్య ఖచ్చితంగా పుండు మీద కారమే.
ఇక చేసేదేమీ లేక చట్ట సభను సస్పెండ్ చేసినా -నిద్రావస్థలో ఉంచినా -గవర్నర్ పాలనకు ఆదేశించినా.. తెలంగాణా వాదుల పని గోవిందా. ప్రజా స్వామ్యంలో ప్రజలచే ఎన్నుకోబడ్డ ప్రభుత్వం అది ఎంత చెత్త ప్రభుత్వమైనా సరే భవిష్యత్తును ( ఎన్నికలు) దృష్ఠిలో ఉంచుకుని ప్రవస్తింది.గవర్నరుకు గాని/సి.ఎస్./ ఐ.ఏ.ఎస్ లకు గాని ఈ అవసరం ఉండదు కాబట్టి తెలంగాణా అంటూ రోడ్డెక్కిడితే నడ్డీ విరిచి శ్రీ కృష్ణ జన్మ స్థానానికి పంపుతారు.
తె.దే.పా,కాంగ్రెస్ ఎం.ఎల్.ఏలు రెంటికీ చెడి దూబూచులాడుతూ ఉండి పోతారు, ఏదో సందర్భంలో కేసిఆర్ - జేఏసి నడుమ పోరు మొదలవ్వడం కాయం. ఇన్ని అడ్డంకులు సవాళ్ళను ఎదురీది తెలంగాణా సాధించినా దాని పర్యావసనం ఎలా ఉంటుందో టూకీగా చూద్దాం.
1.ఇంత కాలం హైదరా బాదు పై పెట్టిన పెట్టుబళ్ళు హుష్ కాకి అవుతాయి కాబట్టి తెలంగాణ రాష్ఠ్ర్రం ఈ నష్ఠాన్ని ఏదో విదంగా పూడ్చవలసి ఉంటుంది.
2.రాష్ఠ్రాలు రెండైనందున కమాడిటీస్ పై డబుల్ ట్యేక్స్ పడి దరలుపెరిగే అవకాశం
3.ఒక్క తెలంగానా ఇస్తే ఇక గ్రేటర్ రాయల సీమ, జై ఆంథ్రా వంటి ఉధ్యమాలు ఊపందుకుంటాయి
4.రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రజా ప్రతినిదుల ఓట్లకు జనాభా ప్రాతిపదికనే విలువ ఉంటుంది కాబట్టి ఎలక్టోరల్ కాలేజిలో మన ప్రతివిదుల ఓట్లకు విలువ గోవిందా.
5.తెలంగాన ఇచ్చాక లేదా ఆ ప్రక్రియ ప్రారంభమైన వెంటనే టి.ఆర్.ఎస్. కాంగ్రెసులో విలీనమవుతుంది లేదా దాశోహమవుతుంది( మద్యలో కేసిఆర్ జగన్ నినాదం అందుకున్నది కాంగ్రెస్ తో తన బార్గెయినింగ్ పవరును పెంచుకోవడానికే. ఇదిలా జరిగితే
ఇక తెలంగానలో కాంగ్రెస్ పార్టియే మోనోపలి అవుతుంది. నిరంకుశ పాలన సాగుతుంది
6.ఆదాయం సగమై నిర్వహణా వ్యయం రెండింతలౌతాయి
7..ఇంత పెద్ద రాష్ఠ్రంగా ఉండగానే నాడు అంజయ్యకు నేడు రోశయ్యకు ఎనలేని పరాభవం జరిగింది. ఇది కిరణ విషయలోను కొనసాగుతూంది. ఇక చిన్న రాష్ఠ్రంగా తయారైతే నాయకులు సోనియాకి ఫ్లాస్కులు మొయ్యవలసిందే
8.నక్సల్స్ ప్రభావం పెరిగి పోతుంది. ఆదాయం సగమై పోయినందున ప్రజా ప్రతినిదులకు తగిన రక్షణ ఇవ్వడం భారమై రక్షణ సన్నగిల్లి నక్సల్స్ నేతల కిడ్నాప్స్ కు ఉపక్రమిస్తారు. ఇక జైల్లో ఉన్న నక్సల్స్ అందరిని విడుదల చేసే పరిస్థితి వస్తుంది
9.ఇంత పెద్ద రాష్ఠ్రంగా ఉన్నప్పటికీ శాంతి బధ్రతల పరిరక్షణకు కేంద్ర బలగాలకు, పొరుగు రాష్ఠ్ర బలగాలకు చేయి చాచ వలసిన పరిస్థితి. ఇక రాష్ఠ్రం విచ్చిన్నమైతే పరిస్థితి మరింత ధారుణం అవుతుంది
10.ఒక వేళ తెలంగాన ఇచ్చినా కే.సి.ఆర్ అక్కడ వివాద రహిత నేతేమి కాదు కాబట్టి ప్రతి ఎన్నికల్లోను హంగ్ వచ్చి మళ్ళీ మళ్ళీ ఎన్నికలొచ్చే ప్రమాదం ఉంటుంది.
11.తెలంగాన ఆంథ్ర ఎం.పిలను విభజించి పాలించి కేంద్రం రెండు రాష్ఠ్రాల నోరూ కొడుతుంది. నిదులు రాబట్ట లేరు, పథకాలు,జల వినియోగంలో వాటాలు, పరిశ్రమల విషయంలోను మొండి చెయ్యే
12.సమైక్యాంథ్ర ప్రదేశ్ గా ఉండగా వై.ఎస్. తలపెట్టిన జలయజ్ఞం ఏ మాత్రం పూర్తయ్యే అవకాశమే ఉండదు. పైగా ఇందాకా పెట్టిన జల యజ్ఞం పై పెట్టిన డబ్బులు గంగలో కొట్టుకుపోతాయి
13.దేశ వ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా జరిగే కార్యక్రమాలకు ఏ రాష్ఠ్ర ముఖ్యమంత్రిని పిలవాలి, ఏ రాష్ఠ్ర మంత్రులను పిలవాలని తల పట్టుకుని ( పిలిచే వారికి ఖర్చులు డబుల్ అవుతాయి) ఎవరిని పిలవక పోతే పోలేదా అని నిర్ణయిస్తారు
14.తెలంగానాలో తయారైన పంటలను, వస్తువులను ఆంథ్రా వారు, ఆంథ్రాలో తయారైన వస్తువులు పంటలను బహిష్కరించే అవకాశం ఉన్నందున మార్కెటింగ్ సమస్య తలెత్తి పరిశ్రమలన్ని పొరుగు రాష్ఠ్రాలకు తరలే అవకాశం ఉంది. పంటలకు గిట్టు బాటు దరలు లభ్యం కాక రైతు నాశనమవుతాడు
15. సహజంగా ప్రకృతి, పర్యావరణంలో నిర్ణీత కాలంలో పెద్ద మార్పులు చోటు చేసుకుంటాయి. కరవు మొదలైతే పది సం.లు, సకాల వానలు మొదలైతే 5 సం.లకు కొనసాగే అవకాశం ఉంది. ఈ లెక్కన రానున్న 5 సం.లు గడ్డు కాలమే. నిదుల కొరత, యంత్రాంగ ఏర్పాటులో ఆలశ్యం కారణంగా ప్రకృతి ఉత్పాదాలను సైతం ఎదుర్కొనలేని స్థితి వస్తుంది
16.నిదుల కొరత కారణంగా గత ఎన్నికల్లో వై.ఎస్. ఇచ్చిన మాటలు గాలిలో కలిసి పోతాయి. అలాగే వై.ఎస్. అమలు చేసిన సంఖేమ పథకాలకు గండి పడుతుంది.
స్వాతంత్ర్య ఉధ్యమం జరుగుతున్న సమయంలో ప్రతి నేత,ప్రతి వ్యక్తి మనస్సులోను స్వతంత్ర భారతం అంటే అదో స్వర్గ భూమి అన్న భ్రమ ఉండేది. కాని అసలైన నరకం అప్పుడే మొదలైందన్నది గమనార్హం.
తెలంగాణా విషయంలో కూడ అదే జరుగుతుంది. కేసిఆర్ ఏ మాత్రం దూరదృష్ఠి,అంకిత భావం,మనోభలం,విశ్వసనీయత లేని వ్యక్తి -పైగా అనార్కి -ఇతన్ని కట్టిడి చెయ్యడం జేఏసి కాదు కదా దేవుడితరం కూడ కాదు.
పొరభాటునో -గ్రహపాటునో తెలంగాణా ఏర్పడ్డా రెండేళ్ళకే అక్కడ సమైఖ్యవాదం జోరందుకుంటుంది.సామాన్యునికి బతికు భారమవుతుంది.

Friday, 7 January 2011
సమైఖ్యవాదానికి "చెయ్యిచ్చిన " జయేంద్ర : భాగం2
నిజానికి శంకరా కమిషన్ రిపోర్టు గురించి ఒక టపా వ్రాయడమే ఎక్కువ. జయేంద్ర సరస్వతి ఏదో సమస్త హిందువులకు ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తి అన్న అపోహ చాలా మందిలో ఉన్నా అతను కేవలం ఒక కులానికి పరిమితం అన్న సంగతి అందరికీ తెలుసు. పైగా అతను ఓ మాటన్న మాత్రాన విభజన జరిగిపోయేది లేదు.. ఆగేది లేదు.
దీని పై టపా వ్రాయడంలో నా ఉద్దేశం పూజ్యులుగా చలామణి అయ్యేవారు సైతం సందర్భాలను పట్టి స్టాండ్ మార్చుకుని పూజ్యాలుగా మారిపోతారని చూపడమే.
కాని గత జన్మలో జయేంద్రుడు ఏం చేసాడో ఏమో తెలీదు గాని మితృలు రాజేష్ జయేంద్ర తరపున వకాల్తా పుచ్చుకున్నాడు. నన్ను రెచ్చ కొట్టి రచ్చకీడ్చి మరో టపా వ్రాసేలా చేసారు.
గతంలో ఒక సారి ఇలానే ఏదో వాగితే మరెవరో భాగా భుద్ది చెప్పారు. మనిషికో మాట గొడ్డుకో దెబ్బ. ఈ మాట పాపం ఆ మితృనికి తెలీక పోవడం అతని ఖర్మ.
నిజంగా నాకు టపా వ్రాయడానికి సైతం టైమ్ లేదు. తమిళంలో ఐదు వందలకు తక్కువ లేకుండా హిట్స్ కొట్టే నా రచనలు బ్లాగ్లోకంలో వంద రెండొందలకే పరిమితం కావడం కారణంగా ఉత్సుకత కుడ తక్కువే.అయినా ఏదో రోజు నిజం నిలకడ మీద తేలనీ అని వ్రాస్తున్నా.
మరీ ఈ పొడవాటి కమెంటు పై కమెంటు చెయ్యడం తెలివితక్కువ పనేమో అనిపిస్తూంది. ( ఈ సమయంలో ఒక జాతకానికి ఫలితం పంపితే రూ. 250 నాదవుతుంది. కనీశం ఉచిత జ్యోతిష సలహా క్రింద వచ్చి పెండింగ్‌లో ఉన్న ఉత్తరాలకు ప్రత్యుత్తరం పంపితే పుణ్యమన్నా వస్తుంది.)
అయినా ఇలా వ్రాస్తూ పోవడం రాజేష్ కు సమాదానం చెప్పే వంకతో జయేంద్ర గురించిన మరిన్ని సత్యాలను తెలుగు బ్లాగ్లోకానికి చాటాలనే .
రాజేష్ గారి కమెంటులోని ప్రతి మాట వెనుక, మాటకు మాటకు నడుమ ఉన్న పెడర్థాలు,వెటకారాలు వక్ర బాష్యాలను కడిగెయ్యకపోతే నేను వై.ఎస్. అభిమానిని ఎలా అవుతాను?
(గుర్తుకు తెచ్చుకొండి అసెంబ్లి లో వై.ఎస్. డవులాగు - బాధితులు శ్రీ చంద్రబాబు - " నీ అమ్మ ఎందుకు నిన్ను కన్నానా అని బాధ పడేలా కడిగేస్తా)
// "
ఏరా అర్థం అయిందా, ఏవన్నా?//
నాది మృగరాజైన సింహ రాశి. మనుషుల బాసలకే కాదు మృగాల హూంకరింపులను సైతం అర్థం చేసుకోగలను. తమరు ఏరా అని సంభోధించి జయేంద్రకు తగిన శిష్యులనిపించేరు. శభాష్!
కానీ తమరు ఎంతో బెటర్ లెండి. ఊక దంపుడు కమెంట్ వ్రాసేరు. ఆయన గారైతే నన్నూ శంకర్ రామన్‌ని నరికించినట్టుగా నరికించేవారు.
//అదే అండి.. సాములోరు అంటే ముక్కుమూసోకోవాల్సిందె అని ఒకాయన సెప్పుదెబ్బ కొట్టినట్లు జెప్పారుగా. ఇప్పుడీన అఖరికి సలహా లెదా ఆయనకు మంచిది అనిపించిన అభిప్రాయం కూడా చెప్పే హక్కు లేదని తీర్మానం. //
జయేంద్రకు ఓటు హక్కుంటే సాలు .లేకున్నా బాధలేదు.భారతీయుడుగా అతని అభిప్రాయం అతను చెప్పే హక్కు అధికారం మస్తుగా ఉన్నవి. కాని సం.నికోసారి సం.పేరు మారినట్టు అభిప్రాయం మారితే ఎలా? ఆయనగారి ఉపదేశాలూ ఇలా మారి పోతాయేమో? సమాజంలో ఆదర్శనీయులుగా,ఆచరణ యోగ్యులుగా చలామణి అయ్యేవారు కనీశం అలా నటించాలి కదా . మరీ రాజకీయ నాయకుల్లా మాట మారుస్తే ఎల్లా అని ప్రశ్నించడమే నా ఉద్దేశం
//సత్యసాయి బాబా గారు చెప్పినట్లు వీల్లకి అష్తైష్వర్యాలు కావాలి, కానీ ఆ ఇచ్హే అతనికి నూలు పోగు కూడా ఉండకుడదు, అంతే!. //
సత్య సాయి బాబా అంటే .. నేనే భగవంతుడంటుంటారు. ఎవరో చంపడానికొస్తే అలార్మ్ మ్రోగనిచ్చి బతికి బయిట పడ్డారే ఆ మహానుభావులేగా..ఉటంకించడానికి మరో వ్యక్తి మాట గుర్తుకురాలేదా బాసు..
//అర్థం అవుతూనే వుంది.. మీ టపా వెనక దరిద్రపు వుద్దేసం.. ఇంతకు ముందే చెప్పాగదా మీకు యాక్ యాక్-క్వాక్ క్వాక్-ప్రొఫెషన్ జెలసీ సిండ్రోం అంటిందని. అసలే చలికాలం, కొద్దిగా ఆ బాపతు ఎక్కువైనట్లుంది. //
అవున్లెండి .ఎప్పుడు రమ్మంటారు ట్రీట్మెంటుకి ?. ( కొత్త డాక్టరు కన్నా పాత రోగి నయమంట కదా?)
//.ఆదాయం పెరిగింది. విభజనకు ఆదర్శంగా ముందు తమ మఠాన్ని రెండుగా విభజించి ..
ఇదొ తొక్కలొ సాంబారు లాజిక్! ఓహొ.. మఠం అదాయం పెరింగిందా? ఏ లెక్కన? అంటే రేపుదయం తమరి అదాయం ఎక్కువైతే మీ ఇంటిని కూడా రెండుగా చేస్తారా?//
రామకృష్ణ పరమహంస ఎక్కువగా తీపి తింటున్న బాలునికి అది మానమని చెప్పే ముందు తాను మానారు కదా? ఇదే జయేంద్రవంటి మిడి మిడి జ్నానంతో రోజుకో వాగుడు వాగే జయేంద్రలను కొలిచే కొలబద్దం..
ఒక కంపెనీ భాగా ఎదిగిపోతే సూపర్ టాక్స్ కట్టాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు విభజిస్తారు బాస్..
//ఇంకా ఈ లైన్లో పది ముక్కలు వ్రాసినా శర్మలంతా ఏకమై లిటిగేషన్లు
ఆ పెద్దాయనకీ ఆ శర్మలకీ లింకేమిటి సాంబారేసా? మెదడు మొద్దుబారిందా? //
గతంలో నా బ్లాగును నిషేదింప చేసినవారెవరో వారి ఆత్మ సాక్షికి తెలియాలిగాని వారితో నాకేంపని.వారి పాపాన వారు పోతారు అని నా ఉద్దేశం
//స్వామి వారి సెక్స్ స్కాండల్ కూడ ఒకటుందండి బాబూ..మీరు మాన్యులు ఏ.పి justice శ్రీ L.నరసి0హారెడ్డి గారు ఇచ్చిన తీర్పు చదవండి. రెండువేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఒక మఠం పై మూర్ఖపు మీడియా చేసిన పైత్యపు అఘాయిత్యాల గురించి తెలుస్తుంది. అన్నట్లు మరిచా, ఈయన శర్మ కాదు సొ ఏ రకమైన ఫోబియా లేకుండా ఇక్కడ చదవండి.
http://ccc.domaindlx.com/socialcause/JAN1-15/Law.htm
తమని సెప్పుదెబ్బ కొట్టిన ఈ తీర్పును వెలుగులోకి తీసుకు రావడానికి ఉచ్చనీచం మరిచిన మీడియా వెనకడుగేసింది సిగ్గేసి అందుకని, విజయవాడ న్యాయవాదుల సంఘం దీని తెలుగులోకి అనువందించి పంచి పెట్టారు, ప్రతిఫలాపేక్ష లేకుండా. మీకు తెలుగు ప్రతి కావాలంటె వారిని సంప్రదించండి. .//
మీకు నామీద ఎంత కోపమున్నప్పటికి మీడియాను నన్నూ ఒకే దొడ్డిన కట్టేస్తారా? మీరు సూచించేది ఏదో ఒక కేసుకు సంభంధించిందేకాని శంకర్ రామన్ హత్య కేసుకు సంభంధించింది కాదు కదా? దివంగత తమిళ రచయిత్రి అనురాధా రమణన్ పాపం ఆమె అప్పటికే పేషంట్ .రోజులు లెక్కపెట్టుకుంటుంటే ఆ సంఘఠన జరిగిందని ఆరోపణ. దీనికి సంబంధించి ఏదైనా పంచి పెట్టుంటే దాని తాలూకు లింకుకూడ ఇవ్వండి
//అంతే కాదు, ఆనాడు భయంతో ఆ పెద్దాయనకి వ్యతిరేకముగా సాక్ష్యం ఇచ్చిన వాల్లందరూ ఇప్పుడు కోర్టులో నిజం కక్కుతున్నారు, సాంబారు పొగలల్లే. అయినా మీకు తెలియదు, వాసన రావట్లేదు? ఎందుకు? ఫోబియా నా?//
ఇది మీ మాట. నా మాట ఏమో చెప్పనా? ఆ రోజు ముఖ్యమంత్రి జయలలితా ఫుల్ మెజారిటితో ఎవరి దయా భిక్షంతోను అవసరం లేకుండా పవర్ ఫుల్ గా ఉన్నారు. కాబట్టి బాధితులు కరా కంఠంగా నిజం చెప్పేరు. నేడు కరుణానిధి పరిస్థితి నిత్య గండం పూర్ణాయుష్షుగా ఉంది. అందుకే భయపడి ప్లేట్ ఫిరాయించేరు

AP politics,
sankaracharyulu,
telangana,
ఆంద్ర,
తెలంగాణ,
విభజన,
శంకరాచారి
సమైఖ్యవాదానికి "చెయ్యిచ్చిన"జయేంద్ర సరస్వతి
కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి సమైఖ్య వాదానికి చెయ్యిచ్చారు. ప్లేటు ఫిరాయించేరు.గతంలో సమైఖ్య రాష్ఠ్ర్రమే శ్రేయస్కరమని చెప్పిన "పెద్దమనిషి"ఇప్పుడు మాట మార్చారు.హైదరాబాద్ ఉమ్మడి రాజదానిగా రాష్ఠ్ర్రాన్ని రెండు ముక్కలు చెయ్యొచ్చని చెప్పేరు. ఇందుకు తెలంగాణావారు ఒప్పుకోరుగా..ఆందోళనలు జరుగుతాయిగా అని విలేకర్లు ప్రశ్నిస్తే రెండ్రోజులు జరుగుతాయి,తరువాత సర్దుకుంటాయని శెలవిచ్చేరు.
ఇప్పటికే శంకర్ రామన్ హత్య కేసులో ఇరుక్కుని సతమతమవుతున్న జయేంద్ర వారికి ఈ ఉచిత సలహాల జబ్బు ఎలా సోకిందో అర్థం కావడం లేదు. జయేంద్రకు దమ్ముంటే తమిళ నాడును రెండు రాష్ఠ్ర్రాలుగా చెయ్యాలని శలవివ్వాలి.
మఠానికి ఆస్త్లులు పెరిగాయి. ఆదాయం పెరిగింది. విభజనకు ఆదర్శంగా ముందు తమ మఠాన్ని రెండుగా విభజించి ఆతరువాత ఉచిత సలహాలిస్తే మేలన్నది నా అభిప్రాయం.
(ఇంకా ఈ లైన్లో పది ముక్కలు వ్రాసినా శర్మలంతా ఏకమై లిటిగేషన్లు పెట్టి నా బ్లాగు నిషేదింప చెయ్యడం ఖాయం కాబట్టి ఆపుతున్నా)
గమనిక: స్వామి వారి సెక్స్ స్కాండల్ కూడ ఒకటుందండి బాబూ.. బాధితురాలు ఒక రచయిత్రి,
Labels:
srikrishna committee,
telangana,
ఆంద్ర,
జయేంద్ర AP,
తెలంగాణ,
విభజణ
Sunday, 26 December 2010
కాంగ్రెస్ ఎం.పీల ఆక్రోశం వెనుక రాజకీయ అభద్రత
ఆంథ్ర జ్యోతి హెడ్ లైన్ తెలంగాణ హెడ్ లైన్ ( తల+వ్రాత)
ఇక కాంగ్రెస్ తెలంగాణ ఎం.పీల దీక్ష:
అంటే ఇంత కాలం కె.సి.ఆర్ ఇచ్చిన బిరుదును( చవటలు) సార్థకం చేస్తుండి పోయారన్న మాట
*కేసుల ఎత్తివేత కోసం నిరవదిక నిరశన:
నిరశన అంటేనే ఏదో వ్యవధి ఉంటుంది కదా మీ అరెస్టు దాకా? ప్రెసిడెంట్ పాలన విధించేంతవరకా? - సోనియా కన్నెర్ర చేసేంత వరకా? తెలంగాణ వచ్చేంత వరకా ? ఏదో ఒకటి తేల్చండి బాసు
*నేటి నుండే ఆరంభం
అంటే ఇన్నాళ్ళు కాంగ్రెస్ పార్టిని తెలంగాణలో ఎలా అంతం చెయ్యాలన్న పాయింట్ మీద పనిచేసారన్న మాట
*వేదిక గన్ పార్క్:
పోనిలే వేదిక ఎంపికలో సైతం (జ) గన్ ను వదల్లేదు
*దిక్కార స్వరంతో ఉధ్యమంలోకి :
అంటే సోనియా చలితో (భయంతో) ఇంతకాలం స్వరం భయిటకు పొక్కలేదన్న మాట
*రంగంలోకి దిగిన సి.ఎమ్:
దేనికీ? ఇప్పటికే 36 ఎమ్.ఎల్.ఏలను జగన్ కు కట్ట బెట్టారు.. ఉన్న కొంతమందినీ తెలంగాణ ఉధ్యమానికి సంతర్పణ చేసేందుకేనా?
*దీక్ష వద్దని వినతి:
నాలా ఉండరాదూ? మూనాళ్ళ ముచ్చటే అయినా రాజభోగం అని చెప్పారేమో?
*నేతల బేఖాతర్:
అంతేలే ఎలాగూ ప్రెసిడెంట్ రూల్ - ఉప ఎన్నికలు -తప్పడం లేదు - కుర్చీకి కర్చీఫ్ అన్నా వేసి ఉంచాలిగా?
*ఫలించని జానా దౌత్యం:
వై.ఎస్. బతికి ఉండగానే హోమ్ గా ఉన్నప్పుడే హోమ్ ను చక్క దిద్దలేక పోయాడు. ఇప్పుడేం పుడుస్తాడు? నన్ను తెలంగాణ సి.ఎం చెయ్యండి అని అడక్కుంటే సరి
*30న సోనియాకు రాజినామా సమర్పణ
ఓసి మీ తెలివి మండి పోనూ.. తుమ్మితే ఊడిపోయే ముక్కులా తయారైన పదవిని వదులుకోవడానికి సైతం ఆలోచిస్తున్నారా?
*16మంది ఎమ్.ఎల్.ఏలు రాజినామా చేస్తే రాష్ఠ్ర్ర సర్కార్ పడిపోతుంది -కే.కే
జగన్ వెంట ఉన్నవారు చేస్తే ఊడదా కేకె గారు ( అన్నట్టు మీ పుత్ర రత్నం కేసేమైంది?)
*40 మందిమి సిద్దంగా ఉన్నాం -దామోధర్ రెడ్డి
సోనియాకు రాజినామా లేఖలు సమర్పించేందుకే కదా? మీ దుంప తెగా.. మీ ఈ అష్ఠ తెలువులతోనే తెలంగాణలో కాంగ్రెస్‌ను జీరో లెవల్ కి తెచ్చారు కదయ్యా..మీకు దమ్ము,దైర్యం,కమిట్ మెంట్ ఉంటే కొండా సురేఖలా గవర్నరుకు ఇవ్వండి మీ రాజినామాలు
*మేమూ రాజినామా చేస్తాం - మంతృలు
పాపం. రాజ సేవ రోజుల్లెక్కే అన్నప్పుడు ఇంకేం చేస్తారు
*తెలంగాణ నేత సి.ఎమ్.కావల్సింది : సర్వే
ఇప్పటికీ ఈ పిచ్చి మిమ్మల్ని వదిలినట్టు లేదు
సీమాంధ్ర నేతలు బ్రోకర్లు.. వారికి లేని అధిష్ఠానం మనకే ఎందుకు?: గుత్తా
నిజంగానే వారు బ్రోకర్లు. ప్రజల మనోభీష్ఠాన్ని (సమైఖ్యాంథ్ర) ప్రభుత్వం దృష్ఠికి తీసుకెళ్ళారు
హైదరాబాదూ కావాలి: రాజగోపాల్‌రెడ్డి
దిల్లీ వద్దేంటి..

Subscribe to:
Posts (Atom)