క్షమించండి !

నా ఈ బ్లాగును అప్డేట్ చెయ్యడం లేదు. ప్రస్తుతం నా మరో తెలుగు బ్లాగ్ రెగ్యులరుగా అప్డేట్ అవుతూంది. అందులోని టపాలను చదవడానికి ఇక్కడ నొక్కండి

Thursday, 27 January 2011

తెలంగాణ సమస్యకు సాంబారుగాడి పరిష్క్తారమే అమలు? - ఊరు వాడ కుదేలు?

జగన్ కొత్త పార్టి ఇలా ఉంటే మేలు అనే శీర్షికతో నేను వ్రాసిన టపా చదివే ఉంటారు. చదవని వారు ఇక్కడ  నొక్కి చదవండి. ఆ టపాలో ప్రతి రాజకీయపార్టికి చలి జ్వరం పుట్టించే తెలంగాణ సమస్యకు ఒక పరిష్క్తారం చూపాను. ( టపా చదవనివారు క్రింది బొమ్మ చూడండి





ఇది ..నేను చూపిన పరిష్కారం. మరీ ఈ రోజు ఆంద్రజ్యోతిలో వచ్చిన వార్తా చూడండి..

//మరొక్కటి
కాంగ్రెస్ మదిలో ఆప్షన్ 7
తెలంగాణకు రాజ్యాంగ రక్షణలు

మార్చిలో టీఆర్‌సీ ఏర్పాటు
విధులు, నిధులు, అధికారాలు మరిన్ని ప్రత్యేక చర్యలు
15 నెలలపాటు ప్రయోగాత్మకంగా అమలు
అప్పటికీ ఫలితం లేకుంటే విభజన
'తెహల్కా' ప్రత్యేక కథనం //

నేను చూపిన పరిష్కారం జగన్ పెట్టనున్న కొత్త పార్టి కోసం. నా పరిష్కారం కొత్తపార్టికైతే  సరి పోతుంది. కాని కాంగ్రెస్ 2004 ఎన్నికల్ల్లోనే వాగ్దానం చేసి/ గత ఏడాది ప్రక్రియ ప్రారంభితున్నామని ప్రకటించి  ఆపై శ్రీ కృష్ణ కమిషన్ పేరిట్ సం. కాలయాపన చేసి "విశ్వసనీయత" ను పోగొట్టుకుంది. ఇప్పుడు మరో పదిహేను నెలలు ప్రయోగాలు చేస్తామంటే తెలంగాణా వాదులు బట్టలూడ దీస్తారు.

నేనైతే వంద రోజుల వ్యవధే పెట్టాన్నది గమనార్హం.  వంద రోజుల అనంతరం తెలంగాణ కావాలో వద్దో తెలంగాణ ప్రజల నడుమ ఓటింగ్ నిర్వహించాలని పేర్కొన్నా. కాని వీరు ఫలితం లేకుంటే విభజన అంటున్నారు.

విడి పోవాలని నిర్ణయించిన వారు  (నాయకులు) ఎప్పటికి విడిపోదామనే చెబుతారు.  కాని ప్రజలేమంటారన్న విషయంలోనే మార్పొస్తుంది. ఆ మార్పు పై వంద రోజుల "చర్యల" పై ఆధార పడి ఉంటుంది.

ఏమిటో .. సాటి బ్లాగర్లు నన్ను పిచ్చోడి క్రింద చూసినా నేను టపా వ్రాయగానే జగన్ 48 గంటల నిరాహార దీక్ష ప్రకటించారు. ఇప్పుడు కాంగ్రెస్ వారు నా బాట పట్టడానికి ప్రయత్నించి మరో లోయలో పడేలా ఉన్నారు.

కాపీ కొట్టడం అంటే మక్కికి మక్కి కొట్టాలి. వీరు చంపడం కూడ పూర్తిగా చంపరు ( నేనంటున్నది  ప్రజాస్వమ్యాన్ని ) కనీశం కాపి కొట్టడం కూడ చేతగాని దద్దమ్మలు వీరు




1 comment:

  1. పొలికేక28 January 2011 at 00:36

    మీ గురించే రాసినట్టుంది మీరు చూడలేదనుకుంటా..

    http://teluguyogi.blogspot.com/2011/01/blog-post_26.html

    ReplyDelete