ఈ టపాకు అసలు సిసలైన శీర్షిక "ఆధునిక జీవిత విదానంలో ఆథ్యాత్మికత అనివార్యం " అన్నదే కాని శీర్శికలోని విషయం కూడ చివరన ఇచ్చాను.
ఇదివరకే విద్యా,ఉధ్యోగం,పెళ్ళి,పిల్లలు అంతేనా అంటూ ఒక టపా వ్రాసాను .అందుకు కొనసాగింపుగానే ఈ టపా పోస్టు చేస్తున్నాను.
1967లో పుట్టిన నాకు 1987దాకా భయిట ప్రపంచమంటే ఏమో తెలీదు. ఆతరువాత నేను చూసిన ప్రపంచపు చీకటి ప్రదేశాలు అన్నీ ఇన్నీ కావు. పైగా ఆదర్శ వివాహం,నిరుధ్యోగం, పేదరికం ఇవన్నీ నన్ను ఎంతగానో తీర్చి దిద్దాయి.
చూస్తూనే ఉన్నా. ఈ ప్రపంచాన్ని,ప్రజలను,వారికొచ్చే సమస్యలను,వాటికి వారు కనుగొనే పరిష్కారాలను చూస్తూనే ఉన్నా. పెనుమార్పులే చోటు చేసుకున్నాయి.
అప్పట్లో త్రాగుబోతు అంటే వీధికొకరిద్దరే ఉండేవారు. దివాళా కోళ్ళంటే ఊరికి ఒకరిద్దరో ఉండేవారు. క్రిమినల్స్ సంఖ్య కూడ అంతంత మాత్రమే.
పైగా ఇటువంటి వారు సమాజంచే వెలివేయబడినట్టుగా బతికేస్తుంటారు. కాని గత పది సం.లలో వీరి సంఖ్య భారిగా పెరిగిపోయాయి. ప్రతి కుటుంభం మీద క్రైమ్ నీడ కమ్ముకుంటూంది. (భాధిలుగానో /కారకులుగానో) , అంతేకాదు వీరితో ఇంటరాక్ట్ అవ్వడానికి మర్యాదస్తులు సైతం ఉత్సుకత చూపుతున్నారు. ఇంటరాక్ట్ అవుతున్నారు. పైగా అదేదో గొప్పన్న తలంపు కూడ ఉంది.లంచకుండీలు అప్పట్లోను ఉండేవారు.కాని వారి పరిస్థితి ఎయిడ్స్ పేషంట్స్ కంటే ఘోరంగా ఉండేది. ఇప్పట్లో ?
జీవన విధానం మారింది. జనాభా పెరిగింది. పోటి పెరిగింది. యుద్ద ధర్మాలు మారాయి. కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగింది. ప్రతీ ఇది డబ్బుతో కొనాల్సిందే. డబ్బుంటే మరి ఏదన్నా కొనగలమనే పరిస్థితి వచ్చింది.
మా నాన్న జిల్లా ఖజాణా అధికారి .అయినా మేము ప్రభుత్వ పాఠ శాలల్లోనే చదివాం.ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే వైద్యం చెయ్యించుకున్నాం. అప్పట్లో కలెక్టరుగా ఉన్న చటర్జి గారు సైతం, తమ శ్రీమతి గారి ప్రసవానికి ప్రభుత్వాసుపత్రినే ఎంపిక చేసారు.
ఇవన్ని నేను ప్రస్తావించడం వీటినన్నింటిని తక్షణం రూపు మాపాలని కాదు. ఇలా బతుకులు బస్ స్టాండు కన్నా హీనంగా తయారవ్వడంతో మనుషులు రోగాల పుట్టగా తయారయ్యేరు. (మానసికంగా కూడా)
ఐదేళ్ళ బాలునికి సైతం టెన్షన్ ఉంది. షుగర్,బి.పి,అల్సర్,పైల్స్ ఇలా ఒకటి కాదు అన్నివిదాలైన రోగాలతో సతమతమవుతున్నారు.
స్ట్ర్రెస్, కాంప్లెక్సులు,సైకలాజికల్ డిస్ ఆర్డర్లు ఇలా ఒకటి కాదు. అందరు పిచ్చోళ్ళే పెర్సెంటేజిలోనే తేడా. అందుకే నొకి చెబుతున్నా పదేళ్ళ ముందుకన్నా ఆథ్యాత్మికతయొక్క అవసరం రెట్టింతలైంది. ఆథ్యాత్మికత అనివార్యమైంది.
అంటే మోక్షాన్నికోరుకోవడానికో,ఉత్తమ ప్రవృత్తిని అలవాటు చేసుకోవడానికో కాదు. కనీశం రోగాల్లోనుండి, అకాల మృత్యువులనుండి, మానసిక రుగ్మతలనుండి, ఆత్మహత్యలనుండి మనలను మనం రక్షించుకోవడానికైనా ఆథ్యాత్మికత అనివార్యమైంది.
దేనినైనా పొందాలంటే అందుకు గల మార్గాలు కొన్నే A.అవి లేకుండానే బతకడం నేర్చుకోవడంB.వాటిని పొందాలని కుతుకుతలాడక ఉండతం C.పొందినా వాటిని పోగొట్టుకోవడానికి సిద్దంగా ఉండడం.
మీరు ప్రాపంచికంగా సక్సెస్ అవ్వాలన్నా ఈ సూత్రాన్ని ఫాలో అవ్వడం తప్పనిసరి. ఈ ఫార్ములా మీకు అబ్బాలంటే అది ఒక్క ఆథ్యాద్మికతతోనే సాధ్యం.
గత దశాబ్దాల్లో ఆత్యాత్మికత అంటూ మరొకటి లేకుండా ప్రతి ఒక్కరు పరిమిత కోరికలతో,అవి నెరవేరకున్నా నాకు వ్రాసి పెట్టిందీంతే అంటూ ప్రశాంతంగా బ్రతికేసే వారు. ఇప్పుడా పరిస్థితి అసల్లేదు. అందుకే ప్రత్యేకించి ఆథ్యాత్మికత అవసరమైంది.
ప్రకృతికి మనిషికి ఉన్న అనుసంథానం పూర్తిగా తెగి పోయింది. సహజ ప్రసవాలు అరుదై పోయాయి. సిజేరీయన్లు పెరిగి పోయాయి. ఆకలవ్వాలన్నా , తిన్నది అరగాలన్నా, అరిగింది భయిట పడాలన్నా, కోరిక కలగాలన్నా ఇలా ఏం జరగాలన్నా టాబ్లెట్స్, సూదులు,మందులు అనివార్యమై పోయాయి.
మానవుడు నాగరికత సాధించటానికి పూర్వం అడవుల్లో,ఎడారుల్లో,భట్టల్లేక,ఎండల్లో,వానల్లో తిరిగినప్పుడు ఉన్నంత స్టేమినా,అంత:కరణలోని స్ఫురణ్ అన్ని దుమ్ము కొట్టుకు పోయాయి.
తెన్షన్..తెన్షన్..తెన్షన్..
ఇందుకు కారనం మనవ జీవితం ప్రకృతినుండి దూరంగా దూరంగా దూరంగా జారిపోవడమే.ఈ సృష్టికి కేంద్ర భిందువేమిటో, గంగోద్రి ఏదో ఏ వైజ్ఞానికుడూ నిర్ధారించలేక పోయాడు.
కాని ప్రాపంచిక జీవితాన ప్రతి మనిషి తనను కేంద్ర భిందువుగా ఊహించుకుంటాడు. భయిట ప్రపంచంతో ఇమడలేక పోతున్నాడు.
ప్రతి ఒక్కరు ఇంఫిరియర్గా ఫీలవ్వదం. మరేదో సాధిస్తేకాని,సంపాదిస్తే కాని తాను ప్రయోజకుడు కాలేనేమోనని భ్రమించటం ఎక్కువైంది.
మనం ఈ సృష్ఠిలో కేవలం ఒక భాగం మాత్రమే. ఈ సువిశాల సృష్టిలో ఒక బ్యాక్టీరియాకున్నంత ప్రాధన్యమే మనకూ ఉంటుంది. మనమందరం ఈ సృష్థియిక్క ఉమ్మడి ప్రణాళికను సమైఖ్యంగా అమలు చేస్తున్నామంతే.
అవి,ఇవి,అన్ని మరేదో ఒక అదృశ్య హస్తం చే నియంత్రించ బడుతున్నాయి.
ఈ సత్యాన్ని ఎరింగి,సృష్టితో మమేకమై,అహాన్ని పక్కన పెడితే కాని ప్రాపంచికంగా కూడ నాశనమైపోతాం.మనిషిలో శరీరానికి అతీతంగా మరేదో ఉంది (ఆత్మ) అది భగవత్ స్వరూపం అని చెబుతున్నారు.
చెబితే చెప్పారు కాని ..వారు స్వానుభవాన ఎరింగి చెప్పి ఉండవచ్చును గాక. వాటిని కేవలం రీ ప్రొడ్యూస్ చెయ్యడం ఆత్యాత్మికత కానే కాదు. ఇంకా ఆథ్యాత్మికత అంటే ఏమి?
మీరేదో పెద్ద మనస్సు చేసి సృష్ఠిని రక్షించడం కాదు.. ఈ సృష్ఠియే మనలను సర్వైవ్ కానిస్తూందన్న సత్యాన్ని అర్థం చేసుకుంటే అదే ఆథ్యాత్మికత. ప్రకృతికి మళ్ళడమే వాస్తవమైన ఆథ్యాత్మికత ..
ఉ. మగవానిలోని వృష్ణాలు శరీరానికి భయిట కాక లోపలే ఉండి ఉంటే శరీర ఉష్ణోగ్రతకు జీవకణాలు బతికేవి కావు మీరు నేను ఎవ్వరం పుట్టేవారం కాదు.
కాని మనం ఏంచేస్తున్నాం.. అడ్డమైన పని చేసి డబ్బు సంపాయించి వందల రూపాయలు వెచ్చించి ,
కాస్ట్లీ కట్ డ్రాయర్లు కొంటున్నాం, వేలాది రూపాయలు వెచ్చించి జీన్స్ ప్యేంట్లు కొంటున్నాం. లక్షలు పెట్టి టూవీలర్లు కొంటున్నాం. ఇవన్ని ఎందుకు ప్రకృతి దయదలచి బిచ్చం పెట్టి నపుంసకులై , మళ్ళీ వేలాది రూపాయలు వెచ్చించి వయాగ్రాలు కొనడానికే..
షిట్! గో బ్యాక్ టు నేచర్ .. ( రూషో)
0 comments:
Post a Comment