క్షమించండి !

నా ఈ బ్లాగును అప్డేట్ చెయ్యడం లేదు. ప్రస్తుతం నా మరో తెలుగు బ్లాగ్ రెగ్యులరుగా అప్డేట్ అవుతూంది. అందులోని టపాలను చదవడానికి ఇక్కడ నొక్కండి
Showing posts with label విజయం. Show all posts
Showing posts with label విజయం. Show all posts

Thursday, 27 January 2011

వృషణములు(TESTICLES) -వాటి ప్రాధన్యత

ఈ టపాకు అసలు సిసలైన శీర్షిక "ఆధునిక జీవిత విదానంలో ఆథ్యాత్మికత అనివార్యం " అన్నదే  కాని శీర్శికలోని విషయం కూడ చివరన ఇచ్చాను.

ఇదివరకే  విద్యా,ఉధ్యోగం,పెళ్ళి,పిల్లలు అంతేనా అంటూ ఒక టపా వ్రాసాను .అందుకు కొనసాగింపుగానే ఈ టపా పోస్టు చేస్తున్నాను.

1967లో పుట్టిన నాకు 1987దాకా భయిట ప్రపంచమంటే ఏమో తెలీదు. ఆతరువాత నేను చూసిన ప్రపంచపు చీకటి ప్రదేశాలు అన్నీ ఇన్నీ కావు. పైగా ఆదర్శ వివాహం,నిరుధ్యోగం, పేదరికం ఇవన్నీ నన్ను ఎంతగానో తీర్చి దిద్దాయి.

చూస్తూనే ఉన్నా. ఈ ప్రపంచాన్ని,ప్రజలను,వారికొచ్చే సమస్యలను,వాటికి వారు కనుగొనే పరిష్కారాలను చూస్తూనే ఉన్నా. పెనుమార్పులే చోటు చేసుకున్నాయి.

అప్పట్లో త్రాగుబోతు అంటే వీధికొకరిద్దరే ఉండేవారు. దివాళా కోళ్ళంటే ఊరికి ఒకరిద్దరో ఉండేవారు. క్రిమినల్స్ సంఖ్య కూడ అంతంత మాత్రమే.

పైగా ఇటువంటి వారు సమాజంచే వెలివేయబడినట్టుగా బతికేస్తుంటారు. కాని గత పది సం.లలో వీరి సంఖ్య భారిగా పెరిగిపోయాయి. ప్రతి కుటుంభం మీద క్రైమ్ నీడ కమ్ముకుంటూంది. (భాధిలుగానో /కారకులుగానో) , అంతేకాదు వీరితో ఇంటరాక్ట్ అవ్వడానికి మర్యాదస్తులు సైతం ఉత్సుకత చూపుతున్నారు. ఇంటరాక్ట్ అవుతున్నారు. పైగా అదేదో గొప్పన్న తలంపు కూడ ఉంది.లంచకుండీలు అప్పట్లోను ఉండేవారు.కాని వారి పరిస్థితి ఎయిడ్స్ పేషంట్స్ కంటే ఘోరంగా ఉండేది. ఇప్పట్లో ?

జీవన విధానం మారింది. జనాభా పెరిగింది. పోటి పెరిగింది. యుద్ద ధర్మాలు మారాయి. కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగింది. ప్రతీ ఇది డబ్బుతో కొనాల్సిందే. డబ్బుంటే మరి ఏదన్నా కొనగలమనే పరిస్థితి వచ్చింది.

 మా నాన్న జిల్లా ఖజాణా అధికారి .అయినా మేము ప్రభుత్వ పాఠ శాలల్లోనే చదివాం.ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే వైద్యం చెయ్యించుకున్నాం.  అప్పట్లో కలెక్టరుగా ఉన్న చటర్జి గారు సైతం, తమ శ్రీమతి గారి ప్రసవానికి ప్రభుత్వాసుపత్రినే ఎంపిక చేసారు.

ఇవన్ని నేను ప్రస్తావించడం వీటినన్నింటిని తక్షణం రూపు మాపాలని కాదు. ఇలా బతుకులు బస్ స్టాండు కన్నా హీనంగా తయారవ్వడంతో మనుషులు రోగాల పుట్టగా తయారయ్యేరు. (మానసికంగా కూడా)

ఐదేళ్ళ బాలునికి  సైతం టెన్షన్ ఉంది. షుగర్,బి.పి,అల్సర్,పైల్స్ ఇలా ఒకటి కాదు అన్నివిదాలైన రోగాలతో సతమతమవుతున్నారు.

స్ట్ర్రెస్, కాంప్లెక్సులు,సైకలాజికల్ డిస్ ఆర్డర్లు ఇలా ఒకటి కాదు. అందరు పిచ్చోళ్ళే పెర్సెంటేజిలోనే తేడా. అందుకే నొకి చెబుతున్నా పదేళ్ళ ముందుకన్నా ఆథ్యాత్మికతయొక్క అవసరం రెట్టింతలైంది. ఆథ్యాత్మికత అనివార్యమైంది.

అంటే మోక్షాన్నికోరుకోవడానికో,ఉత్తమ ప్రవృత్తిని అలవాటు చేసుకోవడానికో కాదు. కనీశం రోగాల్లోనుండి, అకాల మృత్యువులనుండి, మానసిక రుగ్మతలనుండి, ఆత్మహత్యలనుండి మనలను మనం రక్షించుకోవడానికైనా ఆథ్యాత్మికత అనివార్యమైంది.

దేనినైనా పొందాలంటే అందుకు గల మార్గాలు కొన్నే A.అవి లేకుండానే బతకడం నేర్చుకోవడంB.వాటిని పొందాలని కుతుకుతలాడక ఉండతం C.పొందినా వాటిని పోగొట్టుకోవడానికి సిద్దంగా ఉండడం.

మీరు ప్రాపంచికంగా సక్సెస్ అవ్వాలన్నా ఈ సూత్రాన్ని ఫాలో అవ్వడం తప్పనిసరి. ఈ ఫార్ములా మీకు అబ్బాలంటే అది ఒక్క ఆథ్యాద్మికతతోనే సాధ్యం.

గత  దశాబ్దాల్లో  ఆత్యాత్మికత అంటూ మరొకటి లేకుండా ప్రతి ఒక్కరు పరిమిత కోరికలతో,అవి నెరవేరకున్నా నాకు వ్రాసి పెట్టిందీంతే అంటూ ప్రశాంతంగా బ్రతికేసే వారు. ఇప్పుడా పరిస్థితి అసల్లేదు. అందుకే ప్రత్యేకించి ఆథ్యాత్మికత అవసరమైంది.

ప్రకృతికి మనిషికి ఉన్న అనుసంథానం పూర్తిగా తెగి పోయింది. సహజ ప్రసవాలు అరుదై పోయాయి. సిజేరీయన్లు పెరిగి పోయాయి. ఆకలవ్వాలన్నా , తిన్నది అరగాలన్నా, అరిగింది భయిట పడాలన్నా, కోరిక కలగాలన్నా ఇలా ఏం జరగాలన్నా టాబ్లెట్స్, సూదులు,మందులు అనివార్యమై పోయాయి.

మానవుడు నాగరికత సాధించటానికి పూర్వం అడవుల్లో,ఎడారుల్లో,భట్టల్లేక,ఎండల్లో,వానల్లో తిరిగినప్పుడు ఉన్నంత స్టేమినా,అంత:కరణలోని స్ఫురణ్ అన్ని దుమ్ము కొట్టుకు పోయాయి.

తెన్షన్..తెన్షన్..తెన్షన్..

ఇందుకు కారనం మనవ జీవితం ప్రకృతినుండి దూరంగా దూరంగా దూరంగా జారిపోవడమే.ఈ సృష్టికి కేంద్ర భిందువేమిటో, గంగోద్రి ఏదో  ఏ వైజ్ఞానికుడూ నిర్ధారించలేక పోయాడు.

కాని ప్రాపంచిక జీవితాన ప్రతి మనిషి తనను కేంద్ర భిందువుగా ఊహించుకుంటాడు. భయిట ప్రపంచంతో ఇమడలేక పోతున్నాడు.

ప్రతి ఒక్కరు ఇంఫిరియర్గా ఫీలవ్వదం. మరేదో సాధిస్తేకాని,సంపాదిస్తే కాని తాను ప్రయోజకుడు కాలేనేమోనని భ్రమించటం ఎక్కువైంది.

మనం ఈ సృష్ఠిలో కేవలం ఒక భాగం మాత్రమే. ఈ సువిశాల సృష్టిలో ఒక బ్యాక్టీరియాకున్నంత ప్రాధన్యమే మనకూ ఉంటుంది. మనమందరం ఈ సృష్థియిక్క ఉమ్మడి ప్రణాళికను సమైఖ్యంగా అమలు చేస్తున్నామంతే.
అవి,ఇవి,అన్ని మరేదో ఒక అదృశ్య హస్తం చే నియంత్రించ బడుతున్నాయి.

ఈ సత్యాన్ని ఎరింగి,సృష్టితో మమేకమై,అహాన్ని పక్కన పెడితే కాని ప్రాపంచికంగా కూడ నాశనమైపోతాం.మనిషిలో శరీరానికి అతీతంగా మరేదో ఉంది (ఆత్మ) అది భగవత్ స్వరూపం అని చెబుతున్నారు.

చెబితే చెప్పారు కాని ..వారు స్వానుభవాన ఎరింగి చెప్పి ఉండవచ్చును గాక. వాటిని కేవలం రీ ప్రొడ్యూస్ చెయ్యడం ఆత్యాత్మికత కానే  కాదు. ఇంకా ఆథ్యాత్మికత అంటే ఏమి?

మీరేదో పెద్ద మనస్సు చేసి సృష్ఠిని రక్షించడం కాదు.. ఈ సృష్ఠియే మనలను సర్వైవ్ కానిస్తూందన్న సత్యాన్ని అర్థం చేసుకుంటే అదే ఆథ్యాత్మికత. ప్రకృతికి మళ్ళడమే వాస్తవమైన ఆథ్యాత్మికత ..

ఉ. మగవానిలోని వృష్ణాలు శరీరానికి భయిట కాక లోపలే ఉండి ఉంటే శరీర ఉష్ణోగ్రతకు జీవకణాలు బతికేవి కావు మీరు నేను ఎవ్వరం పుట్టేవారం కాదు.

కాని మనం ఏంచేస్తున్నాం.. అడ్డమైన పని చేసి డబ్బు సంపాయించి వందల రూపాయలు వెచ్చించి ,
కాస్ట్లీ కట్ డ్రాయర్లు కొంటున్నాం, వేలాది రూపాయలు వెచ్చించి జీన్స్ ప్యేంట్లు కొంటున్నాం. లక్షలు పెట్టి టూవీలర్లు కొంటున్నాం. ఇవన్ని ఎందుకు ప్రకృతి  దయదలచి బిచ్చం పెట్టి నపుంసకులై , మళ్ళీ వేలాది రూపాయలు వెచ్చించి వయాగ్రాలు కొనడానికే..

షిట్! గో బ్యాక్ టు నేచర్ .. ( రూషో)

Monday, 17 January 2011

తూ! నా బతుకు..

ఎవరికైనా సరే తమ బతుకు" పై తూ!  నా బతుకు.." అనే భావం కలిగిందంటే చాలా కష్ఠమవుతుంది. ఇలా అనిపించ కూడదంటే కాషాయం కట్టి కాశికి వెళ్ళి పోవాల్సిన అవసరం లేదు. మొదట మన సంపాదన -జీవన విధానంలోని నిరర్థకతను అర్థం చేసుకోవాలి. నిన్నటి నా టపా చదవని వారు ఇక్కడ నొక్కి ఒక మారు చదవండి. 

ఇక పాయింటుకొస్తా:

క్రింద నేను పొందుపరచినవి కేవలం శ్రీరంగ నీతులు కావు. నేను నమ్మినవి -ఏ స్థితిలోను ఏ పరిస్థితిలోను -నాతో ఎవరు ఉన్నా ఎవరు పోయినా నేను పాటించినవి .ఇక గో అహెడ్!

1.సృష్థిలో ఏ జీవరాశికి లేని రెండు సామర్థ్యాలను ప్రకృతి మనకిచ్చింది. ఒకటి ఆలోచనల్లో కంటిన్యుటి, రెండు ఆలోచనలను వెలిబుచ్చడం.కేవలం  సర్వైవల్ ఒక్కటే దీని ద్యేయమంటే సర్వైవల్ కి ఇది అనవసరం. ఇంకాస్త లోతుగా ఆలోచిస్తే మన సర్వైవల్ కు ముప్పుగా మారే అంశాలు కూడ ఈ రెండే.

ఆలోచనల్లో కంటిన్యుటి:
యజమాని అన్నం పెట్టకుంటే కుక్క గారు కూడ ఆలోచిస్తారు. ఈ ఆలోచన ఎందాక కంటిన్యూ అవుతుందంటే తన పళ్ళెం అన్నంతో నిండేదాకే. అంతేగాని ఆ కుక్కగారు తన యజమాని తనకు ఏ ఏ సందర్బాల్లో అన్నం పెట్టలేదని ఆలోచించరు. పళ్ళెంలో అన్నం పడ్డాక సుష్ఠుగా భోంచెయ్యక  ఆ కుక్క గారు తన్కు భోజనం లేట్ చేసిన యజమాణి బూటు కొరుకుదామా? అతన్నే కొరుకుదామా అని ఆలోచించరు. పైగా ఇలా అన్నం కోసం వెల వెల పోయిన తరుణాన్ని బ్లాగులు ఎలా రాద్దామా అని శిల్పం గురించి ఆలోచించరు. కాని మనుషులం ఏం చేద్దామో.. మనుషులుగా మీకే తెలుసు. ఇది సర్వైవల్ కు అవసరమంటారా? ఆటంకమంటారా?

ఆలోచనలను వెలిబుచ్చడం:
ఆలోచనల్లో కంటిన్యుటియే సర్వైవల్ కు ఆటంకమైనప్పుడు ,వాటిని వెలిబుచ్చడం ఎంత ప్రమాదకరమో చెప్పక్కర్లేదు.

మరెలా ఆలోచించాలి?
ఎకనామిక్స్ స్టూడెంట్స్ కి మేక్రో మైక్రో అంటే తెలిసే ఉంటుంది. మన ఆలోచనలు మేక్రో లెవల్లో ఉండాలి. కాని వాటిని నిజం చేసుకోవాలంటే మన ప్రయత్నం మైక్రో లెవల్లో ప్రారంభం కావాలి. మన ప్రయత్నాలకో బ్లూ ప్రింట్ తయారు చేసుకునే దిశగా మన ఆలోచనలు సాగాలి.

సినిమా భాషలో చెప్పాలంటే ..ముందుగా కథ (కల) ఆతరువాత స్క్రీన్ ప్లే (కలను సాకారం చేసుకునే మార్గాలు) ఆ తరువాత దర్శకత్వం (అమలు తీరు) ఇవి తయారైనాక నిర్మాతను పట్టుకోవాలి (వనరులు) . వనరుల లభ్యతకు అనుగునంగా కొన్ని మార్పు చేర్పులు చేసుకోవాలి. ఇలా ఒక్క సారి ఆలోచించి మైండ్లో దాచుకుంటే (నేనైతే వ్రాసుకుంటా - అవి బ్రహ్మ వ్రాతలా ఉంటాయి -సామాన్యులకు అర్థం కావు) మన ప్రతి అడుగు -ప్రతి ఆలోచన దానికి సంభంధించే ఉండాలి కాని పక్క ద్రోవ పడే ప్రసక్తే ఉండ కూడదు.

కల ఓకె. కల సాకారానికి మైక్రో,మేక్రో లెవల్ థింకింగ్ ఓకె. కథ-స్క్ర్రీన్ ప్లే -దర్శకత్వం-నిర్మాత-మార్పులు చేర్పులు ఓకె. వీటి కోసమే ఆలోచించడం -పని చెయ్యడం కూడ ఓకె.

మరి ఇవన్ని ఎందుకు? ఒక వేళ కల  సాకారం అసాధ్యమైతే ఏం చెయ్యాలి? బెడిసి కొట్టి రోడ్డున పడితే ఏం చెయ్యాలి?  కల కంటున్నప్పుడు ఏం చెయ్యాలి? సాకారమవుతుండగా ఏం చెయ్యాలి? సాకారమయ్యాక ఏం చెయ్యాలి?

ఈ ప్రశ్నలకు సమాదానాన్ని ముందుగానే వెతుక్కోవాలి. మీరేంచేసినా చెయ్యకున్నా.. చేస్తున్నా..పూర్తి చేసినా ఏ దశలోను మీరు మరువ కూడని ఒక సంగతి ఉంది. అదేమంటే సాటి మానుషులు.

ఇక్కడే భావాలను వెలి బుచ్చే సామర్థ్యాన్ని మనం సద్వినియీగం చేసుకోవాలి. తల్లి,తండ్రి, అన్న దమ్ములు,అక్క చెల్లెళ్ళు,ఇరుగు పొరుగువారు, భంధు మితృలు,సహపాఠులు ఇలా నెంబర్ ఆఫ్ గ్రూప్స్ ఉంటాయి.

వీరిలో మీ ఆలోచనలను అర్థం చేసుకునే వారితో మీ భావాలను పంచుకోవాలి. మీ 18వ ఏట వీరి సంఖ్య వేలల్లో ఉంటే మీరు సక్సెస్ అయినా కాకున్నా మీ 40 వ ఏట ఈ సంఖ్య సింగిల్ నెంబరుకి పడి పోతే ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదు.

కల కంటున్నది నేను -సాకారానికి బ్లూ ప్రింట్ నాది - కృషి నాది -నేనేంది వీరితో పంచుకోవడం -వీరిని కన్విన్స్ చెయ్యడం - మిడ్ టెర్మ్ రిసల్ట్స్ వచ్చినప్పుడు వీరితో ఎందుకు సెలిబ్రేట్ చేసుకోవడమని మీరు ప్రశ్నిస్తే...

మీ సంపాదన -ఖర్చు - జీవితం అన్నీ వృధా అవుతాయి. శిఖరానికి ఎగిసినా మీలో ఒంటరి తనం -అభద్రతా భావం - తూ..నా బతుకు అన్న ఫీలింగు ఖచ్చితంగా ఏర్పడతాయి. ఇది మిమ్మల్ని stressకి గురి చెయ్యొచ్చు, డెప్రెషన్ కి గురిచెయ్యొచ్చు, ఆత్మహత్యకే కూడ ప్రేరేపించ వచ్చు.

జీవితం కూడ న్యూస్ పేపర్ వంటిదే. జులాయిగా తిరగడం -అమ్మాయిల వెంట పడటం ఇవన్ని సినిమా పేజీల వంటివి.  ఎంతో ఆసక్తిని కలిగిస్తాయి.

"విల్ కిరణ్ కంటిన్యూ యార్!" "ఐ డోంట్ నో.. సింప్లి ఐ డోంట్ నో" కోవకు చెందిన వాడు కేవలం ఒక కౌన్సిలర్ తన ఇంటిని /ఇంటి స్థలాన్ని ఆక్రమించుకుంటే ఆత్మ హత్య చేసుకుంటాడు.

న్యూస్ పేపర్లోని రైతుల ఆత్మ హత్యలు, భూ కబ్జా భాగోతాలు ఎంత బోరనిపించినా ఇవన్ని కూడ న్యూస్ పేపర్లో ఒక భాగమే.

సినిమా పేజి చూడాలనిపించే వయస్సులోనే రైతుల ఆత్మ హత్య గురించి కూడ అర నిమిషం ఆలోచించే ఓపికుంటే  భవిష్యత్తులో "తూ నా బతుకు.." అని నొచ్చుకోవలసిన అవసరం రాదు.

సాటి మనుషుల గురించి మనం ఆలోచించాల్సిన అవసరమేముంది? అని కొందరు ( మేథ్స్ గ్రూఫు వారు) ప్రశ్నిస్తారు.

రేపు నువ్వు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అవుతావు. లక్షలు లక్షలు సంపాదిస్తావు. నీ కొడుకు మందు తాగి బార్లో గొడవ చేసి కాళ్ళు చెయ్యి విరక్కొట్టుకుని యాక్సిడెంట్ అయ్యిందంటాడు. నీకో పాత మితృడు టాక్సి డ్రైవరుగానో - ఆటో డ్రైవరుగానో ఉంటాడు. వాడే నీ కొడుకును హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఉండొచ్చు. అంతకు పూర్వమే నీ కొడుకు బీర్ తాగే స్టేజిలోనే ఆడ్ని గమనించి ఉంటాడు. కాని నువ్వు ఏసి కారులో జోరుగా పాస్ అయిపోతుంటే నీకు ఎలా చెప్పాలో తోచక వదిలేసుంటాడు.

నువ్వెంత పెద్ద భవంతినన్నా నిర్మించుకో.. వద్దనను.పునాది వైపు కూడ ఒక కన్నేసి ఉంచు.సాటి మనుషులే నీకు పునాది. నువ్వెంత పెద్ద పుడింగివి అయినా దానివలన నీ సాటి మనుషులకు ఏం ఒరుగుతుంది? ఈ సమాజానికి ఏం దొరుకుతుందన్నదే ముఖ్యం. ఈ కాన్సెప్ట్ నీ బ్లూ ప్రింట్లో లేకుంటే క్షణ క్షణం భార్య/పార్ట్నర్/లోకల్ గూండా/లంచ కుండీ అయిన పోలీస్ ఆఫీసర్ హింసకు గురవుతూ కుక్క చావు చస్తావు.

లేదా నీ జీవితంయొక్క నిరర్థకత అర్థమై మళ్ళీ ప్రేమలో పడతావు. భార్యను చంపటానికి స్కెచ్ ఏస్తావు. లేదా మరో కంపెని ప్రారంభిస్తావు.లేదా నువ్వు పని చేసే కంపెనియొక్క విదేశీ శాఖకు బదిలి కోరతావు.

నిన్ను ఏ నా కొడుకు గౌరవించినా గౌరవించకున్నా నిన్ను నీ మనస్సు గౌరవించేలా బతకాలి. ఆ గౌరవం సాటి మనుషులతో -సమాజంతో నువ్వు అనుసంధానం అయినప్పుడే లభిస్తుంది. నువ్వెవరిదగ్గరనుండైనా తప్పించుకుని ఏ.సి గదిలో భంధీ కాగలవు. కాని నీ నుండి నువ్వు తప్పించుకో లేవు.

నాకు నాకు అని చంకలు గుద్దుకుంటూ పోతే నీకంటూ ఎవ్వరూ ఉండరు. ఈ క్షణం ప్రారంభించు.. అసలు మన జీవితాలే సాటి వరి కోసం. ఈ సమాజం కోసం. సమాజం ఒక గడ్డి వాము వంటిది. మనమంతా అందులో చీమలం,దోమలం.ఒక్క్ అగ్గిరవ్వ చాలు కాలి భూడిదై పోతాం.

దానిని తడుపు ప్రేమతో,అనురాగంతో,కరుణతో,లలిత కళలతో,మంచితనంతో ,మానవత్వంతో.

నిన్ను మథర్ థెరిసా అయిపోమని చెప్పడం లేదు. ఇదో ట్రీట్మెంట్. సల సల కాగుతున్న నీ రక్తాన్ని చల్ల పరచుకునే ట్రీట్మెంట్.

ప్రతి ఒక్కరూ షూ లేదని బాధ పడితే కాళ్ళు లేని వారేమై పోవాలి?
ప్రతి ఒక్కరూ Adharsh Apartmentలో అలాట్మెంటుకి భార్యలను ప్రజా ప్రతినిదులకు పరుండ చేస్తే ఫుట్పాత్లో తన మలాన్ని తనే తినడానికి ప్రయత్నించిన ఆ దౌర్భాగ్యునికి దిక్కెవరు..

నిజం -సత్యం-సుఖం-శాంతి ఇవి ఆ కోశాన లేవు -ఈ కోశాన లేవు. మద్యలో ఉన్నాయి. అటు ఇటుల నడుమ ఉంది సత్యం. గాంథిలా దళితులు మల విశర్జన చేసిన ప్రదేశాన్ని భార్యచేత శుభ్రం చెయ్యించడంలోను నిజం లేదు. నీ ఇంటి కక్కసుకి ఏ.సి చెయ్యించుకోవడంలోను లేదు నిజం.

మరెక్కడుంది? ఆలోచించు.. పవిత్ర ఖురాన్లో ఒక మాట ఉందని విన్నా. భగవంతుడు చెబుతాడు " మీలో ఏ ఇద్దరు ఏది కోరినా తక్షణం నొసంగ గలను"