టి.ఆర్.ఎస్ - కె.సి.ఆర్ల దుందుడుకు మాటలు,హింసాత్మక చర్యలు కొత్తేమి కాదు. కాని ఇటీవల వై.కా.పా గౌ.అధ్యక్షురాలు విజయమ్మ నేతన్న దర్నాకు విచ్చేసిన అనంతరం వారి హింసాత్మక మాటలు తారాస్థాయికి చేరాయి.
తెలంగాణలో పర్యటించడానికి విజయమ్మకు ఎలాంటి హక్కులున్నవో -ఆమెను అడ్డుకోవడం ఎంత అప్రజాస్వామికమో ఇదివరకే వివరించాను కాబట్తి సూటిగా విషయానికొచ్చేస్తున్నాను.
విజయమ్మ రాక సందర్భంగా టి.ఆర్.ఎస్ అవలంబించిన తీరు -రాళ్ళ వర్షం ఇత్యాది దుష్ప్రవర్తనలను దాటవేసి టి.ఆర్.ఎస్ ను విషేదించడానికి ఏం అవసరమొచ్చిందో చెబుతాను,
విజయమ్మ రాక -దర్నా విజయవంతం కావడం చూసి మతి భ్రమించిన టి.ఆర్.ఎస్ నేతల పిచ్చివాగుళ్ళు ఆకాశాన్నంటాయి. అవి షరా మామూలే.
కాని ఎర్రోళ్ళ శీరినివాసులు అనే ప్రబుద్దుడు "తెలంగాణలోని వైకాపా నేతలను పిట్టలను కాల్చినట్టు కాల్చేస్తాం" అని చెప్పడం -ఆ మాటలు పత్రికల్లో సైతం ప్రచురించ బడడం చూస్తుంటే ..
ఇంతకాలం ఎలక్షన్స్ -కలెక్షన్సుకే పరిమితమైన టి.ఆర్.ఎస్ వైకాపా రాకతో ఇక తమ పప్పులు ఉడకవని "హింసా మార్గాన్ని"ఎంచుకున్నదో అన్న అనుమానం కలుగుతూంది.
వెంటనే రాష్ఠ్ర్ర ప్రభుత్వం ఎర్రోళ్ళ శ్రీనివాసులు మాటలు సంభందించిన క్లిప్పుంగ్స్ కలెక్ట్ చేసి కేసులు నమోదు చేసి - టి.ఆర్.ఎస్‌ను నిషేదించే ప్రక్రియను మొదలు పెట్టాలి.
ఈరోజు కాలుస్తాం అన్నవారు -రేపు కాలుస్తే రాష్ఠ్ర్రం ఏం అయిపోతుంది. ఇటువంటి హింసను ప్రేరేపించే మాటలు చెప్పడం "వాక్ స్వాతంత్ర్యం" కాదు. అలా హింసను ప్రేరేపించే హక్కు ఏ రాజకీయ పార్టికి లేదు.
ఇన్నాళ్ళకు తనకూ వెన్నెముక ఉందని నిరూపించుకున్న కిరణ్ సర్కార్ - టి.ఆర్.ఎస్‌ను నిషేదించి తన భాధ్యతను నిర్వర్తించాలి. లేకుంటే భవిష్యత్తులో ఇలాంటి మాటలే కాదు చేతలూ చోటు చేసుకుంటాయి. రాష్ఠ్ర్రం అగ్ని గుండమవుతుంది.