క్షమించండి !

నా ఈ బ్లాగును అప్డేట్ చెయ్యడం లేదు. ప్రస్తుతం నా మరో తెలుగు బ్లాగ్ రెగ్యులరుగా అప్డేట్ అవుతూంది. అందులోని టపాలను చదవడానికి ఇక్కడ నొక్కండి

Sunday, 6 February 2011

చిరంజీవి లెగ్గుతో కాంగ్రెస్ గుగ్గిపాలు

హెశ్చరిక:

నేను సైతం చిరంజీవి అభిమానినే. అల్లుడా మజాకాలోని డబుల్ మీనింగ్ డైలాగులతో అశ్లీల దృశ్యాలతో విసిగి చీ కొట్టి అభిమానాన్ని విరమించుకున్నవాడ్ని. ఎన్.టి.ఆర్ రాజకీయ ప్రవేశానంతరం ఏర్పడిన ఖాళీని పూరించుకోవడం కోసం చిరు అభిమానిగా మారినవాడను.

విషయానికొస్తే చిరు ప్రజారాజ్యం పార్టిని కాంగ్రెస్ తో విలీనం చేసి సోనియమ్మను ఇటలికి పార్సెల్ చేసే భృహత్తర కార్యక్రమానికి నాంది పలికారు . అందుకు వారికి నా అభినందనలు.

చిరును అభిమానించేవారిలో చాలా మందికి ఆయన్ స్వయం కృషితో పైకొచ్చారన్న భ్రమ ఉండేది. ఈ మాట ఎంతమెరకు నిజమంటే ఆయనగారు ఆల్లుగారి అల్లుడైనంత వరకే. ఆతరువాత లాబియింగ్,కుల రాజాకీయం అంతా చేరి పోయినవి.

ఈ పాత చింతకాయ పచ్చళ్ళ గోల ఇప్పుడెందుకు. పార్టీలు అధికారానికొస్తేనే అవినీతికి అవకాశం వస్తుంది. కాని చిరు పార్టి ప్రకటించగానే "వసూలు" మొదలు పెట్టేరు. కుటుంభ రాజకీయాలు వేరే ట్రాక్.

అత్యుత్తమ పతివ్రతలా వేషం కట్టేరు. ప్రేమా ,సేవా అని ఊరించేరు. సామాజిక న్యాయం అనేరు. వై.ఎస్. రాష్ఠ్ర్రాన్ని దోచి సోనియాకు వాటా ఇస్తున్నానన్నాడు. ఇవన్ని మరవాలనుకున్నా మరువలేనివి.

ఎలాగో గూడారం పీకేసి ఒక ఇంటి వాడయ్యేడు. అదీ కాంగ్రెసు గూటికి చేరాడు. ముందు ముందుంది ముసళ్ళ పండుగా. చిరు జాతకం గురించి అందరు పండితులు ఆహా ఓహో అన్నప్పుడే నేను ఆర్కుట్లో "ఇరవై నుండి ముప్పై సీట్లొస్తాయన్నాను. చిరు అభిమానులు నన్ను బండ భూతులు తిట్టేరు.

తనకు ఏ పదవీ లేదట - పార్టీ వారికి ఐదు ఇస్తారట. చిరుగారికి కేంద్రంలో చోటిస్తారేమో. ఇంకెన్ని మంత్రులు అవినీతి ఆరోపణలతో రాజీనామాలు చెయ్యాల్సి వస్తుంది చూసుకుని చేపడతారు కేంద్ర మంత్రి మండలి విస్తరణ. అప్పుడు చిరుగారికి దక్కు ఒక బెర్తు.

ఎన్.టి.ఆర్ అభిమానిగా నాకు ఈ పరిణామం ఎంతో ఆనందాన్నిస్తుంది. పులి పులే (మరీ ఆయన బొబ్బిలి పులి) నక్క నక్కే ( మరీ ఇది జిత్తుల మారి)

వై.ఎస్. అభిమానిగా ,జగన్ శ్రేయోభిలాషిగా ఈ పరిణామం ఎంతో ఆనందాన్నిస్తుంది. చిరు ఇక పై వై.ఎస్.ను విమర్శించ బోరు.లేరు. పైగా డెఫెండింగ్ చెయ్యాల్సిందే.

యాంటి కాంగ్రెస్ మనస్తత్వం గల నాకు ఈ పరిణామం ఎంతో ఆనందాన్నిస్తుంది. ఎందుకంటే చిరు జాతకం నాకు తెలుసు. ఎక్కడున్నా ఆయన భావుంటాడు. ఆయన ఉన్న చోటే గుగ్గిపాలు. ఐరన్ లెగ్ శాస్త్ర్రితో కాంగ్రెసుకి , సోనియమ్మకు జరుగుతుంది తగిన శాస్తి.

2 comments:

  1. చిరంజీవి - సోనియాల విషయమేమో కానీ

    మీరింకా వైఎస్ ని భజిస్తున్నారు
    జగన్ పట్ల వాత్సల్యం చూపుతున్నారు

    వారిరువురి భాగోతాలు తెలియనంత అమాయకులా మీరు !!

    ReplyDelete
  2. chi chi. maa tirupathi vallani mega fool ni chesadu. sontha oorolle veedini chee kodithe vallu veedini neethikinchukunnaru.

    ReplyDelete