ఇది 2011. కాని జగనేమో ఇంకా స్వాతంత్రయ పోరాటం కాలపు సిద్దాంతాలను వల్లిస్తున్నారు. ఇంకేంది వ్యవసాయం? ఇంకేంది సాగు నీరు? " "వ్యవసాయమే దండగ " తమిళ నాడు ప్రభుత్వం లాగా ఉచిత కలర్ టివి ఇస్తాననక, బా.జ.పా వారిలా యువత చేతికి ఉచిత ల్యాప్ టాప్ ఇస్తామని చెప్పక, కనీశం చేతికో సెల్ ఫోన్ ఇస్తామని ఊరించక ఇదేంటి దరిద్రంగా పోలవరం గీలవరం అంటూ కాకి గోల.
చంద్రబాబు చెప్పినట్టుగా పొలాలు రాజులనుండి బ్రాహ్మణులకి బ్రాహ్మణుల నుండి అగ్ర కులాలకి,అగ్ర కులాలనుండి బడుగు బలహీణ వర్గాల చేతికి వచ్చాయి. పొలం వదులు కున్న వారంతా భాగుపడ్డారు.
ఇరవై శాతం ప్రతిభావంతులను సైతం అందించ లేని పెద్ద పెద్ద చదువులు చదివేరు. విదేశీయుల మోచేతి నీరు త్రాగుతూ ఆరెంకల జీతాలు పుచ్చుకుంటున్నారు. రేపు ఆ దేశాల్లోని నిరుధ్యోగ యువత ఆప్రభుత్వాల మెడలు వంచితే - ప్రభుత్వాలు తంతే బంతిలా వచ్చి పడతారు.
అయినా ఇంకెక్కడి రైతులు..అందరూ ఆత్మహత్యలు చేసుకున్నారంటగా -మిగిలిన వారు కూడ రేపో మాపో చస్తారు. ఫీడ విరగడవుతుంది. జగన్ స్వంత ఆలోచనలు లేని దద్దమ్మ. వై.ఎస్. అనే వృద్దుడు తన చేదస్తం కొద్ది జలయజ్నం అంటే ఇతనూ ఆ నినాదాన్ని అందుకోవడం ఏంది.
తాతల నాన్నల భావానికి దాసుడు జగన్. షిట్ ! అప్పుడెప్పుడో 2003న వై.ఎస్. పాదయాత్ర చేసాడంటే బాబులా,చిరులా ఏ.సి. కార్లో వెళ్ళి "సీన్" క్రియేట్ చెయ్యక ఆర్ట్ ఫిలిమ్ తరహాలో ఈ పాద యాత్రలేమీటో చండాలంగా.
వై.ఎస్. నేతృత్వంలో పార్టికి మెజారిటి తగ్గిన క్షణం నుండే - యు.పి.ఏ ప్రభుత్వానికి మెజారిటి దక్కిన క్షణం నుండే ఆయన దేవతగా అభివర్ణించిన సోనియాలో సైతాన్ దూరింది. దినిని ముందుగా పసికట్టిన ఆ "భూత వైద్యుడు" వజ్రాన్ని వజ్రంతో కొయ్యాలన్నట్టుగా సైతానును సైతానుతో ఎదుర్కోవాలని "ఆపరేషన్ ఆకర్ష " మొదలు పెట్టాడు.
వై.స్. ఆఫర్ చేసినప్పుడు ఆయన ఉద్దేశం ప్ర.రా.పా హెలికాఫ్టరుకు రెండో ఇంజినులా వాడాలన్నదే. కాని నేడు "చెయ్యి" పడిపోయి, ఉన్న ఒక ఇంజిను జామ్ అయిపోయి తాడు కట్టి కాటికి లాక్కెళ్ళటానికి అంటూ చిరును అక్కన చేర్చుకున్నారు దిల్లీ పెద్దలు.
తండ్రి పోతే ఆయన ఆశయాలను కూడ తుక్కు క్రింద డిస్పోజ్ చెయ్యాలి. అది ఆధునిక యువతగా జగన్ చెయ్యాల్సిన పని. ఎవరు ఎటు పోతే నాకేం! నా వ్యాపారాలు .. నా వారి జివితాలు సల్లంగుంటే సాలని సాలించకుండా సంక్షేమం - అభివృద్ది అంటూ గొనగడం దేనికి . రోశయ్యలా - కిరణ్లా సోనియమ్మ కాళ్ళ క్రింద చెప్పులా పడుంటే ఏదో నాడు నెత్తికెక్కించుకునేవారు.
ఆ మాత్రం "లౌక్యం" అలవరుచుకోక విజయానికున్న అయిదు మెట్లల్లో ఒక దాని పై సైతం అడుగు పెట్టక తనకు తానే ఎసరు పెట్టుకున్నాడు జగన్. లేకుంటే రాష్ఠ్ర్రంలోని ఇతర ముఖ్యమంతృల వారసుడి వలే ఏదో ఒక పదవితో ఆనందంగా గడిపేసుండొచ్చు.
పోనిలే భయిట పడ్డాడు. పడిన మరుక్షణం నుండి తనను కాదన్న ప్రభుత్వాన్ని రోడ్డున పడేసే కార్యక్రమం చేపట్టి ఉండాలి. అదీ చేసాడు కాదు. పోనిలే .. కేకే, హనుమంత రావుల్లా ప్రెస్ క్లబ్బుల్లో సల్లంగా మకాం పెట్టి మైకు చేత పట్టి నాలుగు వాగుడు వాగుతూ ఉండి ఉంటే సరిపోయేది. ఎన్నికలకు మూనెల్ల ముందు కేరవాన్లో కేన్వాసింగ్ చేసినా సరిపోయేది.
ఆ దీక్ష ఈ దీక్ష అంటూ చలిలో తాను చచ్చి తనవారిని చంపుతున్నాడు. ఇప్పుడేమో పాదయాత్ర. అన్ని అవుట్ డేటడ్ విదానాలే. ధర్మ న్యాయాలకు "చేదస్తం’ అన్న పేరొచ్చి ఎంతో కాలైమైంది. ఇకనన్నా జగన్ మారాలి. తన తీరు మార్చుకోవాలి.
లేకుంటే వై.ఎస్. లా "ఉన్నవారి" విషయాల్లో జోక్యం చేసుకుని దిక్కు లేని చావు చస్తాడు
nijame, nenu chaalaa saarlu jagan nu vimarsinchaa, kopam tho paina meeru pettina headding chaalaa saarlu raayaboyi nigrahinchukunnaa..., edo rakam gaa meeru raasesaaru. GOOD...
ReplyDelete