క్షమించండి !

నా ఈ బ్లాగును అప్డేట్ చెయ్యడం లేదు. ప్రస్తుతం నా మరో తెలుగు బ్లాగ్ రెగ్యులరుగా అప్డేట్ అవుతూంది. అందులోని టపాలను చదవడానికి ఇక్కడ నొక్కండి

Monday, 2 July 2012

సెప్టంబరు 5 కు అటు ఇటుగా జె.డి పై (బదిలి?) వేటు ఖాయం

ఇదివరకే జగన్ జాతకాన్ని అనలైజ్ చేసి సెప్టంబరు 5 కు అటు ఇటుగా భయిటకొస్తారని సూచించి ఉన్నాను. జె.డి.విషయమై కూడ నా ప్రిడిక్షన్స్ అడపా తడపా తెలియ చేస్తూనే ఉన్నాను . ఈ టపాలో జె.డికి బదిలీ వేటు ఎలా పడుతుందో జ్యోతిష్య రీత్యా తెలియ చేస్తాను.
జే.డి గారిది మేష రాశి.ప్రస్తుతం గోచారంలో శని ఆరున సంచరిస్తున్నాడు.దీంతో జె.డిగారు అత్యంత అతి విశ్వాసంతో -ఆకాశం నుండి ఊడిపడినట్టుగా అపరిచితుడులా ఫీల్ అయి పోతున్నారు. కాని శని గ్రహం స్థాన భ్రంశానికి పూర్వమే తదుపరి రాశిని వీక్షిస్తుంది.అంటే సప్తమ స్థానాన్ని శని చూస్తున్నారు. ఏడో స్థానం ఫ్రెండ్,లవర్,పార్ట్నర్ ,వైఫ్లను సూచించే భావం.శని ఏడున ఉంటే వీరి వలన/వీరికి హాని కలగాలి.

సెప్టెంబరు ఐదుకు మూడు నెలల పూర్వం అంటే జూన్ ఐదునుండే జె.డి గారి సప్తమ శని తన ప్రభావాన్ని చూపుతున్నాడన్న మాట. అందుకే తన క్లాస్ మెట్ చంద్ర బాలతో నడిపిన ఫోన్ సంభాషణలు / మీడియా ఫ్రెండ్స్ కి చేసిన పోన్ కాల్స్ జె.డి గారికి సమస్యలు తెచ్చి పెడుతున్నాయి.

ఇప్పటికే ఈ విషయమై ఫైల్ అయిన పిల్ విచారణకు రాగా హై కోర్టు జె.డి కాల్సును తప్పు పట్టడం -వివరణ ఇవ్వమని ఆదేశించడం కూడ జరిగాయి.

ఇక సెప్టంబరు ఐదుకు శని పంచమ స్థానానికి వస్తే పరాభవము,శ్రుంగ భంగము తప్పవు. సెప్టంబరు 5 కు అటు ఇటుగా జె.డి పై బదిలి వేటు ఖాయం

మే 17 న వాక్కు స్థానానికి వచ్చిన గురుడు ఇంకాస్త దూకుడును ఇచ్చాడు. కాని ఆ గురువు అప్పటికే అక్కడే ఉన్న కేతువుతో కలిసాడు. దీంతో గురుభలం వచ్చినా అది అంతగా ఫలించదన్న మాట.పైగా గురు+కేతు కలయకతో కోర్టులు వ్యాజ్యాలు, పుత్ర హాని,పలుకు బడికి తూట్లు వంటి అశుభ ఫలితాలు తప్పవు.

రాశ్యాధిపతి అయిన కుజుడు జూన్ 21 దాక పూర్వ పుణ్యాన ఉండి భలాన్ని ఇస్తూ వచ్చాడు. కాని ఆ కుజ గ్రహం జూన్ 21 న శతృ,రోగ ,రుణ స్థాణమైన ఆరింటికి మారాడు. దీంతో జె.డి.గారికి శతృ,రోగ ,రుణ పీడలు తప్పవు. ఒక రోడ్డు ప్రమాదం/అగ్ని ప్రమాదం -అరెస్ట్ వంటివి జరిగినా నేనాశ్చర్య పోను.

ఏది ఏమైనప్పటికి జె.డి గారికి జూన్ 21 నుండే " టయ్యాలు" భాగాలేదు. పైగా సెప్టెంబరు ఐదుకు అటు ఇటుగా ఉచ్చు బిగుసుకుంటుందన్నది నా అంచనా.

2 comments:

  1. jagan, sonia kalisthe jarigedade..., jagan medaku maathram uchchu bigusukodu.

    ReplyDelete