
ఈ రోజు రాష్థ్ర్రపతి అభ్యర్ది ప్రణబ్ ప్రసంగించి వెళ్లి పోయాక సి.ఎల్పి సమావేశం జరిగిన జూబ్లి హాల్లో నిప్పు రగలి పొగ కమ్ముకుంది. నిజానికి ఇది చాలా చిన్న సంఘఠన. కాని జ్యోతిష్య కోణంలో -మరీ శకున శాస్త్ర్ర కోణంలో చూస్తే రానున్న మహా ముప్పుకు హేతువు ఈ నిప్పు.
ముప్పు ఎవరికి అన్న సంగతిని చివరన ప్రస్తావిస్తాను. అంతకు పూర్వం ఇలాంటి కొన్ని దుస్సంఘఠనలు ఎలాంటి పర్యావసనాలకు దారి తీసాయో చెబుతాను.
చంద్రబాబు సి.ఎంగా ఉన్న రోజుల్లో పార్టి ఆఫీసులో జెండా ఆవిష్కరణ చేసారు. తీరా చూస్తే అది తలక్రిందులా ఎగిరింది.ఆ సంవత్స్రరమే తిరుమల ఘాట్లో ల్యేండ్ మైన్ ప్రేలుడు - మధ్యంతర ఎన్నికలు - బాబుగారి జమానాకు కాలం చెల్లడం జరిగి పోయాయి.
2003లో అనుకుంటా వై.ఎస్.ఆర్ కాలు విరిగింది. నేను ఆ రోజే చెప్పాను. వై.ఎస్.కు శని వీడింది. తల నుండి దిగిన శని పాదాలగుండా వెళ్ళి పోయాడు అన్నాను. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించడం వైఎస్ సి.ఎం కావడం అందరికి తెలిసిందే.
ఇంత ఎందుకు 2009 ఎన్నికల ప్రచారంలో జూ.ఎన్.టి.ఆర్ తెగ రెచ్చె పోయి వై.ఎస్. ఆర్ పాదయాత్ర చెయ్యడమే ఆక్రమిచాల్సిన భూములను గుర్తించదానికే అని కూడ వాగారు. కాని ఆతరువాత ఆక్సిడెంట్ జరగడం అందరికి విదితం.అలాగే తె.దే.పా కూడ చిత్తుగా ఓడింది.
2009, సెప్టంబరు 2 న వై.ఎస్. చిత్తూరుకు భయలుదేరుతూ సాక్షి విలేకరితో మాట్లాడుతుంటే చూసాను. ముఖంలో కళ లేదు. అదేదో పొగ కమ్ముకున్నట్టుగా బాగా నల్లబడి కనబడింది. అప్పుడే నా మనస్సు గతుక్కుమంది. ఈ విషయాన్ని ఒకరిద్దరు స్నేహితులతో చెప్పాను కూడ. వెళ్ళిన వై.ఎస్ తిరిగి రాని లోకాలకు వెళ్ళి పోయాడు.
రోశయ్య వరద బాధితులను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు అతని కుర్చి క్రింద పాము దర్శనమిచ్చింది. కొన్నాళ్ళకే రోశయ్య పదవీచ్యుతులయ్యారు.
ఇటీవల జరిగిన ఉప ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేతలు ప్రచారం చేస్తుంటే ఒక ఎం.ఎల్.ఏ జారి పడ్డారు. కాంగ్రెస్ రెండు స్థానాలతో సరిపెట్టుకోవల్సి వచ్చింది.
ఇలా ఒకటికాదు రెండు కాదు ఎన్నో ఉధంతాలు నాకు ఇంకా గుర్తున్నాయి. ఇక జూబ్లి హాల్ నిప్పు -పొగల కథకొస్తే ప్రణబ్ ప్రథమ పౌరుడు కానున్న వ్యక్తి. అతనిని ప్రపోజ్ చేసింది సోనియా.
వరిరువురి నడుమ పగ ఏర్పడొచ్చు. ప్రణబ్ లేదా సోనియాకు ఒక ప్రమాదం జరుగ వచ్చు. లేదా ఒక మేజర్ ఆపరేషన్ చెయ్యాల్సిన పరిస్థితి రావచ్చు. కాంగ్రెస్ పార్టి మరో సారి నిలువునా చీలి పోవచ్చు.
ఏం జరుగుతుందో చూద్దాం
గొప్ప వార్త. చాలా సార్లు కాంగ్రెస్ చస్తే బాగుండుననుకున్నాం. ఇప్పుడు జరుగుతుందన్న మాట.!!!
ReplyDeletenijame..., aa time lo naaku koodaa YSR mokham lo pretha kala kanabadindi... nenu koodaa annaa konthamandi tho...
ReplyDelete