క్షమించండి !

నా ఈ బ్లాగును అప్డేట్ చెయ్యడం లేదు. ప్రస్తుతం నా మరో తెలుగు బ్లాగ్ రెగ్యులరుగా అప్డేట్ అవుతూంది. అందులోని టపాలను చదవడానికి ఇక్కడ నొక్కండి

Thursday, 5 July 2012

భారత-ఆంథ్ర రాజకీయాల్లో మతాల మతలబులు

శీర్షిక చూసి ఇదేదో పెద్ద సుత్తు అనుకునేరు. నెనెంత లోతుగా ఆలోచించినా నా ఆలోచనలను చాలా సింపుల్ గా చెబుతాను.డోంట్ వొర్రి!

మొదట రాజకీయాలంటే ఏమిటో చూద్దాం ప్రస్తుతం రాజకీయం అంటే రాజ్యాధికారాన్ని దక్కించుకునే యత్నం అంతే.ఇంతకు మించి ఏ ఏడుపూ లేదు. నిజానికి రాజకీయం అంటే చేంతాడంత డెఫనిషన్ ఇవ్వాలి. కాని అవేవి మీకు ఈ రోజుల్లో కాని సమీప రాజకీయ చరిత్రలో కాని కనిపించవు. కనిపించని చెత్తా చెదారాల(?) గురించి మనకేల?

ఇక మతం కథ కొస్తే ..

మతం-అభిమతం : ఈ రెండు ముక్కలు చూసారు కదా. ఇప్పుడు ఈ రెండు ముక్కలు చూడండి. ఉదయం -అభ్యుదయం. మతం అంటే నాకు తెలిసిన బాష ప్రకారం "నా భావం" అని అర్థం. ఆ భావం కాస్త గొప్పదైతే అభిమతం అనొచ్చునేమో?

ఇంతకీ అది ఎవరి మతం? అసలు మతాల మతలబేమిటి చూద్దాం.

మన కేసిఆర్ అప్పుడప్పుడు ముక్కు నేలకు రాస్తా(రా) అంటుంటారే. ఈ ఆచారం ఎందుకొచ్చుంటుందంటే .. ఇద్దరి మద్యన ద్వంద్వ యుద్దం ( వన్ టు వన్) జరుగుతుందనుకొండి. ఒకతను భాగా దెబ్బలు తిని కింద పడి పోయాడు అనుకొండి. అతన్ని పడ కొట్టిన వాడు పడి పోయిన వాడ్ని చంపి తీరుతాడు.అప్పుడు పడున్నవాడు తన ముక్కు నేలకు రాస్తాడు. అంటే నేనింకా యుద్దం చెయ్యలేను. నీకు సరి తూగను. ఇంకా నన్ను బాధిస్తే అది నీకే అవమానం అని అర్థం.

ఇలాగే మానవుడు ఆఠవిక జీవితంలో - విజ్నానం లేని కారణంగా - తన శక్తికి మించిన ప్రతిదాని ముందు ముక్కు నేలకు రాసేవాడు.
ఇలా చేస్తే ఆ శక్తి తనను బాధించదని చిన్న లాజిక్. అన్ని మతాలకు స్టార్టింగ్ పాయింట్ ఇదే. ఆఠవిక జీవితంలో అతని ముఖ్య వృత్తి వేట. ప్రాణంతో చెలగాటం. దీంతో జ్నానం,విజ్నానమంతా అందని పండే !

స్థిరవాసం వచ్చేసరికి వ్యవసాయం అతని ముఖ్య వృత్తి అయ్యింది. కొద్దో గొప్పో వ్యవధి కూడ దొరికేది. వ్యవసాయం సక్రమంగా సాగాలంటే ఎప్పుడు వాన పడుతుందో - ఎప్పుడు ఎండ కాస్తుందో తెలియాలి. దీంతో ప్రకృతిని నిశితంగా పరిశీలించడం మొదలు పెట్టాడు.

ప్రకృతిలోని సమ తుల్యం , క్రమం, ఒక దానికి మరొకదానికి ఉన్న లింక్ వంటివి బోధ పడి ఉండాలి. దీంతో అతను వీటన్నింటిని ఎవరో ఒకతను నిర్మించి -నిర్వహిస్తున్నాడనే నిర్ణయానికి వచ్చి ఉండ వచ్చు. అతనే సో కాల్డ్ దేవుడు.

పోనీ ఇంత మంది దేవుళ్ళు ఎలా వచ్చారంటే -అప్పట్లో ఇప్పట్లోలా రవాణా - కమ్యూనికేషన్ లేదు. ఒకదానితో మరొకదానికి సమాచారం లేక వేల కొలది గుంపులు (?) వినసిస్తుండేవి. కాని అన్ని గుంపులు సృషిలోని సమతుల్యతతో ప్రారంభించి - - దేవుడు అన్న పాయింట్ దాక ఒకేలా ఆలోచించడం తర్కాతీతమే. ( ఇదెలా జరిగిందో చివరన చెబుతా)

సమాచార లోపం వలన ఒక్కో గుంపు ఒక్కో దెవుడ్ని/దేవుళ్ళను స్థాపించుకున్నారు. ఆ దేవుళ్ళ బయోగ్రఫి,వారిని మచ్చిగ చేసుకునే పద్దతులు వంటివాటిని కలిపితే అదే మతం.

మనుషులకు అంతుపట్టని విషాయాలే అన్ని మతాలకు పునాదులు. (ఇప్పటికీ అంతుపట్టని విషయాలు కొన్ని ఉన్నాయి. అందుకే మతాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి.

ఇది మతాల గురించిన స్థూలమైన బయోగ్రఫి. కాని ఇందులో సూక్ష్మాది సూక్ష్మమైన విషయం ఒకటుంది. ఇది వరకే చెప్పినట్టు వేర్వేరు గుంపులు వేర్వేరు ప్రదేశాల్లో బతుకుతున్నప్పటికి -వారి మద్య ఎటువంటి కమ్యూనికేషన్ లేనప్పటికి వారెలా ఒకేలా ఆలోచించ గలిగారు? వారెలా ప్రకృతి చే ఆకర్షింప పడేరు ? వారెలా దీనికో నిర్మాత -నిర్వాహకుడు ఉన్నాడని భావించేరు? ఆ నిర్వాహకుడ్ని పూజించాలని -అతనికో ఆలయం నిర్మించాలని ఎలా ప్రేరణ పొందేరు?

ఈ ప్రశ్నకు సమాదానం మతాలకు అతీతమైనది. ఇదిలా ఉంటే మతం ఏం చెయ్యాలో నేను చెబుతాను.( అది నిజానికి ఏం చేస్తూందో మీకే తెలుసుగా).

మనిషిలో శరీరం -మనస్సు -బుద్దిలే కాకుండా మరేదో ఉంది -అది ఆ సృష్థి కర్తకు ఏ మాత్రం తీసి పోనిది. "దాని" ఉనికిని ఫీల్ అవ్వ కలిగితే చాలు శరీరం -మనస్సు -బుద్ది క్రియేట్ చేసే నాన్ సెన్స్ ఏది మనిషిని డిస్టర్బ్ చెయ్యదు.

ఆ స్థితికి చేరుకున్నవాడు భగవంతునితో అనుసందింప పడతాడు.అనుసంథానానంతరం అతనికి భగవంతుని మద్య ఎటువంటి తేడా ఉండదు. ఈ సృష్థిలో భగవంతుడు మినహ మరేది లేదు. ఇక్కడ ఉన్నవన్ని భగవంతుని అంశాలే .

ఈ రెండు పంక్తుల్లోని విషయాలను మానవుడు "అనుభవ పూర్వకంగా -అనుభవించి" తెలుసుకునేలా చేసేదే మతం. ఏ మతమైనా ఈ పనే చెయ్యాలి.

కాని ఈ అంతిమ లక్ష్యానికి మానుషులను సిద్దం చేస్తున్నాం అన్న నెపంతో ప్రతి మతం - ప్రతి గురువు మనుషుల సాంఘిక,ఆర్థిక,వ్యక్తిగత జీవితాల పై పెత్త్తనం చెలాయిస్తున్నాయి.

ప్రేమ గొప్పది. ప్రేమికులే అటు ఇటుగా ఉంటారు. స్నేహం గొప్పది స్నేహితులే అటు ఇటు ఉంటారు. అలానే ప్రతి మతం గొప్పది. ఆ మతాల్లోని కొందరు అటు ఇటుగా ఉంటారు.

ఈ చిన్న తేడాను గమనించక ప్రేమ వల్లే పిల్లలు చెడి పోతున్నారు -స్నేహం వలనే యువత పాడై పోతుంది. అని నిర్దారించుకోవడం తప్పు.

అలానే ఎవరో కొందరు చేసే తప్పిదాలకు వారి మతాన్ని భాధ్యులు చెయ్యడం తప్పు. మతాలను వాటి స్థూల రూపంలోనే చూస్తే తేడాలు ఉంటాయి.

మత పెద్దలు వాటిలోని సూక్ష్మాలను బోధించడం లేదు. మతాలు అసలైన లక్ష్యాన్ని ప్రక్కన పెట్టి -వాయిదా వేసుకొని ఆ లక్ష్యానికి మనిషిని సిద్దం చేస్తున్నామన్న నెపంతో కల్లి బొల్లి మాటలు చెబుతూ వారి బుర్ర కరాబ్ చేస్తుండడం వల్లనే మతాల నడుమ వ్యత్యాసాలు.

ఈ వ్యత్యాసాల వలనే మతాలు భారత-ఆంథ్ర రాజకీయాలనే కాదు ప్రపంచ రాజకీయాలను సైతం శాసిస్తున్నాయి.శాసించాలన్న తహతహతో బ్రష్థు పట్టిస్తున్నాయి.

వాటి గురించి ఇంకో సందర్భంలో చూద్దాం. ఆ లోపు మీ ఫీడ్ బ్యాక్ ఇవ్వండి. నా దృష్తిలో లోపముంటే సరి దిద్దుకుని మరి వ్రాస్తా.







0 comments:

Post a Comment