క్షమించండి !
నా ఈ బ్లాగును అప్డేట్ చెయ్యడం లేదు. ప్రస్తుతం నా మరో తెలుగు బ్లాగ్ రెగ్యులరుగా అప్డేట్ అవుతూంది. అందులోని టపాలను చదవడానికి ఇక్కడ నొక్కండి
Pages
Tuesday, 3 July 2012
నేడే జగన్ బెయిల్ పెటిషన్ పై తీర్పు
జగన్ బెయిల్ పెటిషన్ పై తీర్పు కొన్ని గంటల్లో రానుంది. అది వస్తుందా చస్తుందా అన్న విషయంలోకి నే పో దలచ లేదు. ( కోర్టు దిక్కారం క్రింద నోటీసు రాగలదు కాబట్టి) కాని బెయిల్ గురించి - మరీ జగన్ బెయిల్ పెటిషన్ విషయం పై ఉన్న కొన్ని అపోహలను తొలగించడానికే ఈ టపా.
నిజానికి గతంలో జగన్ పెట్టుకున్న బెయిల్ పెటిషన్ను జగన్ తరపు న్యాయవాదులే వెనక్కి తిసుకున్నారు. అంటే వారి ఉద్దేశం బెయిల్ పెటిషన్ పెట్టుకుంటే జగన్ పై కేసు సక్రమమే అని పరోక్షంగా అంగీకరించినట్టవుతుందని భావించి ఉండొచ్చు.
ఇప్పుడెందుకు పెటిషన్ పెట్టుకున్నారంటే జగన్ ప్రెసెన్స్ ఈజ్ మోస్ట్ వాంటడ్ ఇన్ దిస్ కండిషన్. ఈ ఏడాదే .. మించి పోతే 2013 ప్రారంబంలోనే సార్వత్రిక ఎన్నికలు రానున్నాయి. పార్లెమెంటుకు కలిపి. ( తొక్కలో ప్రెసిడెంట్ ఎన్నికల గురించి నేనసలు ఆలోచించడం లేదు)
అందుకే బెయిల్ పెటిషన్ దాఖలు చేసేరు. గాలి బెయిల్ స్కామ్ వ్యవహారం ప్రేలిన రోజున అది విచారణకొచ్చింది కూడ. జగన్ పెట్టుకున్నది స్క్ వాష్ పెటిషన్ మాత్రమే. ( అంటే ఈ కేసే తప్పుడు కేసు నన్నీ కేసునుండి విముక్తుడ్ని చెయ్యండని కోరడం)
తీర్పు చెప్పాల్సిన జడ్జ్ పై మైండ్ గ్యేమ్ ఆడటానికి బెయిల్ స్కామ్ విషయాన్ని సి.బి.ఐ ఏ.బి.ఎన్ కు లీక్ చెయ్యగా ఏబిఎన్ ఆడిన గ్యేమ్ అది.
అవినీతి నిరోధక చట్టమన్నది సి.ఎం,మినిస్టర్, ఐ.ఏ.ఎస్ ,ఐ.పి.ఎస్ వంటి పొజిషన్లో ఉన్నవారికే వర్తిస్తుంది. జగన్ ఆసమయంలొ ప్రభుత్వంలో స్థానం కలిగి ఉండలేదు కాబట్టి వర్తించదన్నది నిర్వివాదాంశం.
అందుకె స్క్ వాష్ పెటిషన్ పెట్టారు. తీరా త్వరలొ రానున్న సార్వత్రిక ఎన్నికల కారణంగా బెయిల్ పెటిషన్ వేసేరు. ఇంతకీ బెయిల్ అన్నది న్యాయ మూర్తి కరుణించి ఇచ్చే వరమేమి కాదు.
బెయిల్ అన్నది నిందితుని హక్కు. బెయిల్ ఇవ్వక పోవడమన్నది కేవలం ఎక్సెప్షన్ మాత్రమే అయ్యుండాలి.( బెయిల్ ఈజ్ ఎ రూల్ - ఇది సాంబారుగాడి వ్యాఖ్య కాదు -మాజి సుప్రీం చీఫ్ జస్టిస్ వి.ఆర్ కృష్ణయ్యర్ వ్యాఖ్య)
బెయిల్ నిరాకరించడానికి చెప్పగల కారణం ఒక్కటే . నిందితుడు సాక్ష్యులను బెదిరించారు -లేదా సాక్ష్యాలను తారు మారు చేసారు అనడమే.
జగన్ విషయంలో ఇలాంటివి ఏమైనా జరిగి ఉంటే గోరంతను కొండంత చేసేసేవారు కదా. కాబట్టి అలాంటివి ఏవి జరుగలేదు.
ప్రత్యేక "శక్తులు" ఏవి పని చెయ్యకుంటే రొటీన్ ప్రాసస్ జరిగితే జగన్ కు బెయిల్ వచ్చి తీరుతుంది అన్నది నా విశ్వాసం. చూద్దాం. ఇంకొన్ని గంటల సస్పెన్సే కదా.. అదీ చూద్దాం. గ్రహ స్థితి ప్రకారమైతే సెప్టెంబరు ఐదునుండి మంచి టైమ్ మొదలవుతుంది.
అది నెల ముందు పని చెయ్యాలి. అంటే జూలై ఐదునుండే .. బెయిల్ లభించినప్పటికి సాగ దీసి ఐదో తేదీన భయిటకు పంపుతారేమో ( సాంప్రదాయాల పాటింపు వంకతో)
వెయిట్ అండ్ సీ..
Subscribe to:
Post Comments (Atom)
బెయిల్‌కు అన్ని పేమెంట్లు జరిగిఫొయినాయి, ముగ్యమంత్రి అమాయకుడైన మన జగనే.
ReplyDelete