క్షమించండి !
నా ఈ బ్లాగును అప్డేట్ చెయ్యడం లేదు. ప్రస్తుతం నా మరో తెలుగు బ్లాగ్ రెగ్యులరుగా అప్డేట్ అవుతూంది. అందులోని టపాలను చదవడానికి ఇక్కడ నొక్కండి
Pages
Sunday, 8 July 2012
తారా చౌదరీలు :ఏబిఎన్ దృష్థిలో అంగడి సరుకులు
ఆంథ్రజ్యోతి -ఈనాడు -ఏబిఎన్ -ఈటివిలను యెల్లోమీడియా అంటుంటే ఎంతో కొంత గిల్టి కలిగేది. పోన్లే వీరు తె.దే.పాను ప్రమోట్ చేస్తున్నారు కాబట్టి తెలుగు దెశం జెండా యెల్లో కాబట్టి ఇలా అంటున్నామని సరిపెట్టుకునే వాడ్ని. కాని ఈ రోజు ఏ.బి.ఎన్లో ఓపెన్ హార్ట్ విథ్ ఆర్కే లో తారా చౌదరి ప్రోగ్రామ్ చూసాక ఆ గిల్టి పూర్తిగా పోయింది. ఈ తారా చౌదరి ఇష్యూ మీడియాల్లో పరుగులు తీస్తున్నా నేనసలు పట్టించుకోలేదు. నా బ్లాగులోకాని -సైట్లోకాని ఆ ప్రస్తావన కూడ లేదు.తమిళంలో కూడ.
ఎందుకంటే తారా చౌదరిలు కోకొల్లలున్నారు. కౌనిసిలర్లు, ఎస్.ఐల రేంజిలో కొందరు, ఎం.ఎల్.ఏలు - ఎస్.పిల రేంజిలో కొందరు ఇక ఆ పై ఆపై రేంజిలో కొందరు. .ఇలా కోకొల్లలుంటారు.
వీరు మినకర పురుగులాంటివారు. నిప్పును వెతుక్కుంటూ వెళ్ళి పడి మాడి మాసై పోయేవారే. ప్రోగ్రామ్లో తారాచౌదరి " నిందితురాలిని కాను బాధితురాలిని" అంటూ పదే పదే చెప్పారు. కాని ఈ విషయంలో బాధితురాలే క్రమేనా బాధించే స్థాయికి ఎదిగిపోతుంది. చివరికి నిందితురాలుగా వెలుస్తుంది.
తారా చౌదరి బ్యేసికల్గా ఒక మనిషి -పైగా బలహీనురాలైన మహిళ ఆమె తన హక్కులను రక్షించుకోవడం -అందుకు ఏ.బి.ఎన్ వేదిక కావడం తప్పేమి కాదు.
ఇక్కడ ప్రోగ్రామ్ దారి తప్పింది ఎక్కడంటే తొలి నుండి తారా చౌదరి నేనే తప్పు చెయ్యలేదు అంటూ వచ్చారు.( ఇది జస్ట్ హిపాక్రసి మాత్రమే అన్నది ఆమె బాడి ల్యాంగువేజ్, బాషా శైలిని పది నిమిషాలు చూస్తే ఎవరన్నా ఈ నిర్ణయానికే వస్తారు -కాని తను ఏ తప్పు చెయ్యలేదని క్లెయిమ్ చేసుకోవడం ఆమె హక్కు)
కాని ఆర్.కె ఏమో ఆమె తప్పు చేసారని -ఇతరులచేత కూడ చెయ్యించారని- అయినా అవన్ని పెర్సనల్ అని -తప్పేమి కాదని చెప్పుకుంటూ వచ్చారు. అతని అసలైన ఉద్దేశం తారా చౌదరిని సెక్స్ వర్కర్గా ప్రేక్షకుల ముందు నిలబెట్టడం తద్వారా ప్రేక్షకుల్లోని "చీకటి కోరికను" ను సంతృప్తి పరచడమే.
దీనిని సైతం అర్థం చేసుకోవచ్చు (రేటింగ్స్ పెరగాలనే తహ తహ ). కాని తారా చౌదరి భయిటపడాలంటే విఠుల పేర్లన్ని చెప్పాలని ప్రోత్సహిస్తూ వచ్చారు. ఇదే యెల్లో జర్నలిజం.
పైగా ఆమె పేరు చెప్పక పోయినప్పటికి -చెప్పక మునుపే సతరు వ్యక్తుల ఫోటోలను ఎక్స్ పోస్ చేసేరుకదా ఇదే యెల్లో జర్నలిజం. కేవలం తారా చౌదరి మాటలను బేస్ చేసుకుని ఫోటోలను ఎక్స్ పోస్ చెయ్యడం ఖచ్చితంగా యెల్లో జర్నలిజమే.
ఏ.బి.ఎన్ బాధ్యతాయుతమైన చానల్ అయ్యుంటే - తారా చౌదరి ఆరోపించిన వ్యక్తుల వద్దనుండి వివరణ కోరి ఉండాలి .వాటిని తన ముందుంచుకుని వాటిని సైతం ఆర్కే ప్రస్తావించి ఉండాలి.
ఏది ఏమైనప్పటికి ఏబిఎన్లో తారా చౌదరి అంగడి సరుకైంది. ఏబిఎన్ యెల్లో మీడియా అని చాటుకుంది
భావి తారా చౌదరీలకు నా సలహా:
ఆకాశానికి నిచ్చెనలు వెయ్యకండి - ఒక స్త్ర్రీ డాక్టర్ అయినా -ఇంజినీరైనా-ఆడిటర్ అయినా పురుషులు మాత్రం ఆమెను స్త్ర్రీగానే చూస్తారు.
తల్లి -తండ్రి -సోదరులు -భర్త -పిల్లలు ఇలా అందరి సహకారం -భద్రత ఉన్నప్పటికి స్త్ర్రీకి రక్షణ లేని సమాజం మనది. స్త్ర్రీ కోరుకునే కనీశ గుర్తింపు - అదీ అర్హతలకు తగిన గుర్తింపు పొందడమే కష్ఠమైన వ్యవస్థ ఇది.
వాస్తవికతను మరవకండి . గొంతమ్మ కోరికలకు గోరీలు కట్టండి .. మీరు సక్రమమైన దారిలో పయణిస్తేనే విజయం గగనం. ఇందులో అక్రమ మార్గాలు ఎంచుకుంటే అది కొరివితో తల గోక్కోవడమే..
తారా చౌదరీలకు నా సలహా:
భయిటకు రండి.. పోరాడండి ..ఒకటి ప్రత్యామ్నాయ మార్గాలు చూపమని ప్రభుత్వాలను నిలదీయండి -లేదా వ్యభిచారానికి చట్ట బద్దత కలిపించమని పోరాడండి.
అలా చెయ్యని పక్షాన మీ కన్నీళ్ళు -మీ గతం అన్ని ఏ.బి.ఎన్ వంటి చానళ్ళల్లో అంగడి సరుకులైతాయే కాని పరిష్కారం ఎండ మావే!
మీరన్నా మీకు స్వంతమైన వళ్ళు అమ్ముకుంటారు - కాని వళ్ళు అమ్ముకుని బతికె మీ కన్నీళ్ళను సైతం అమ్ముకుంటారు.
ఇటువంటి చానళ్ళకి సైతం లైసెన్సులు ఇచ్చిన ప్రభుత్వం - మద్యాన్ని ఏరులై పారనిస్తున్న ప్రభుత్వం - ఇక ఏకంగా మద్యం షాపులనే నిర్వహించనున్న ప్రభుత్వం సెక్స్ వర్కర్స్ కి లైసెన్స్ ఇవ్వక పోతుందా?
బాహుటంగా చెయ్యలేని పనిని రహస్యంగా కూడ చెయ్యకూడదు.. కాదని చేస్తే మీ జీవితాలు ఇలాగే ముగిసి పోతాయి.
Subscribe to:
Post Comments (Atom)
vyabhicharaniki license iste andaroo(ardhika,angabalam vunna varu ) companeelu pedatharu.appudu mahilaku asalu vundadu. alochinchandi.
ReplyDeleteకె.ఎన్.మూర్తిగారు,
ReplyDeleteరోజుకి 8 గంటలే పని చెయ్యాలని రూల్ ఉంది. అయినా డబ్బుకు దాసోహమై రోజుకి 18 గంటలు పనిచేసే వారు ఇప్పటికీ ఉన్నారు.
ఈ రోజుల్లో పెప్సి,కోక్ రాజ్యమెలుతున్నా ఇప్పటికి సోడాలు,లెమన్ సోడాలు అమ్మేవారు - త్రాగేవారు ఉన్నారు.
చట్ట బద్దత కల్పిస్తే కనీశం సెక్స్ వర్కర్స్ కి ఒక ఆప్షన్ అంటూ ఉండేది. స్వతంత్రులుగా ఉండటమా లేక మీరు చెప్పిన ఆర్థిక -అంగ భలం ఉన్నవారి గుప్పిట్లోకి వెళ్లడమా?
నా ఉద్దేశం ప్రస్తుతం చట్ట వ్యతిరేక ప్రొషెషనుగా ఉండడంవలన పెత్తనం చెలాయించి -వారి రక్తాన్ని పీల్చి కండలను వేంచి తినేసే వారికంటే చట్ట బద్దత వచ్చాక దానిని తమ్ గుప్పుట్లోకి తీసుకునే వారు కాసింత బెటర్గా ప్రవర్తించ వలసి ఉంటుంది.
అయినా బూతులు తిడుతూ కమెంట్స్ వస్తాయనుకుంటే ఇలా మానవత్వంతో - సామాజిక స్థితిగతుల పై వాస్తవికతతో కమెంట్ రావడం నిజంగా నాకో షాక్
" బిడ్డల శరీరాలతో వ్యాపారం చేస్తే ఆమె తల్లి కాదు కసాయి"సెక్స్ వర్కర్ ఇంటర్వ్యూ చదవండి నా బ్లాగ్ లో..... లింక్ www.jaijainayaka.blogspot.in
ReplyDeleteబాహుటంగా చెయ్యలేని పనిని రహస్యంగా కూడ చెయ్యకూడదు.. కాదని చేస్తే మీ జీవితాలు ఇలాగే ముగిసి పోతాయి.
ReplyDeleteఈ వాక్యాలు మాత్రం అక్షర సత్యాలు.మన వాళ్ళకు ఇటు వంటి సామాజిక చైతన్యం అవసరం లేదు వారికి కావలసినది వేరు. కాని స౦క్షోభ౦ వారి ఎదుట వున్నప్పుడు కాని వారికి అర్ధం కాదు. మనం ఏమి తప్పు చేసినామో?
Alapati Ramesh Garu,
ReplyDelete//బాహుటంగా చెయ్యలేని పనిని రహస్యంగా కూడ చెయ్యకూడదు.//ఈ మాట అన్నది మహాత్ముడు. తారా చౌదరి లాంటి వారిని తప్పు పట్టడం కన్నా "దిక్కుమాలిన " సలహాలు ఇచ్చి వారిని రెచ్చ కొట్టి వారి ప్రాణాలకు ముప్పు తెచ్చే "మేథావుల"నే నిచ్చుకోవల్సి ఉంది.
ఆమె సి.ఐ.డి కి సి.బి.ఐ కి తనకు తేడా తెలీదని చెప్పడాన్ని గమనించే ఉంటారు. ఒక స్త్ర్రీ సెక్స్ వర్కరే అయినప్పటికి ఆమెకూ హక్కులు ఉంటాయి.
ఆ హక్కులను కాలరాస్తే నిలదీసి శిక్షించే అవకాశమూ వారికి ఉంటాయి. గీరడం -రెచ్చ కొట్టడం -కేసులు పెట్టించుకోవడం - బెయిల్ వచ్చిన వెంటనే "పూర్తిగా" భయిటపడినట్టు ఫీల్ అయి పోయి రిలాక్స్ అయిపోవడం - వారి ప్రాణాలకే ముప్పుగా పరిణమిస్తాయి.