క్షమించండి !

నా ఈ బ్లాగును అప్డేట్ చెయ్యడం లేదు. ప్రస్తుతం నా మరో తెలుగు బ్లాగ్ రెగ్యులరుగా అప్డేట్ అవుతూంది. అందులోని టపాలను చదవడానికి ఇక్కడ నొక్కండి

Monday, 9 July 2012

నాని ఎపిసోడ్లో జూ.ఎన్.టి.ఆర్ చారిత్రిక తప్పిదం

జూ.ఎన్.టి.ఆర్ సన్నిహితుడు ,గుడివాడ ఎం.ఎల్.ఏ కోడాలి నాని జగన్కు జై కొట్టడం - జూ.ఎన్.టి.ఆర్ నాని నిర్ణయానికి తనకు ఏ సంభంధం లేదని ప్రెస్ మీట్ ఇవ్వడం కాని అందరికి విదితమే.

ఆంథ్ర రాష్థ్ర్ర రాజకీయాల్లో అఖండ ప్రజానీకం మద్దత్తు కూడ కట్టుకున్న ముఖ్యమంత్రులు ఇద్దరే. ఒకరు ఎన్.టి.ఆర్ మరొకరు వై.ఎస్.ఆర్.

ఎన్.టి.ఆర్ బతికుండగానే అతను స్థాపించిన పార్టియే అతన్ని చంపితే -వై.ఎస్.ఆర్ మరణానంతరం అతను రెండు సార్లు అధికారంలోకి తెచ్చిన కాంగ్రెస్ పార్టి అతని క్యేరెక్టర్ అసాసినేషన్కు పూనుకోవడం వీరిరువురి మద్య ఉన్న పోలిక.

అదృష్ఠ వశాస్తూ వై.ఎస్. విషయంలో జగన్ తిరుగుబాటు చేసారు. కొంతమెరకు విజయం సాధించారు కూడ. కాని ఎన్.టి.ఆర్ విషయంలో దురదృష్ఠ వశాస్తూ హరి కృష్ణ తిరుగుభాటు చేసి అన్న తెలుగుదేశం ప్రారంభించినప్పటకి ప్రయోజనం లేక మళ్ళీ చంద్రబాబు చెంతే చేరి పోయేరు.

ఒక తరంలో అలా జరిగి పోయింది ..మరో తరంలోనన్నా ఎన్.టి.ఆర్ కు న్యాయం జరుగుతుందని నా బోటి అభిమానులు ఎదురు చూసాం.

అందుకు తగ్గట్టుగానే మహానాడులో లోకేష్ బ్యేనర్లు చూసి హరి కృష్ణ అలగడం -నిలదీయడం వంటివి ఇంకొంత విశ్వాసాన్ని పెంచాయి.

నాడు వంశి - నేడు నాని విషయాలు చూసి ఫోన్లే "సూటిగా ఎదుర్కోక పోయినా" తన అసంతృప్తిని ఇలా భయిట పెడుతున్నాడు జూనియర్ అని సరిపెట్టుకున్నాం.

ఆ మాత్రం సంత్రుప్తిని కూడ నా బోటి వారికి మిగల్చని జూనియర్ "కట్టె కాలేంత వరకు తె.దే.పాను వీడను "అని ప్రకటించి చారిత్రిక తప్పిదం చేసారు.

ఇక్కడ జూనియర్ ఆలోచించుకోవల్సిన విషయం ఒకటుంది. హరికృష్ణ జూనియర్ తల్లిని పెళ్ళి చేసుకుంటే తొలూత ఎన్.టి.ఆర్ సైతం ఆమెను బాయికాట్ చేసిన మాట వాస్తవమే.

కాని కొంతకాలానికి ఎన్.టి.ఆర్ జూనియర్ దగ్గర తీసుకున్నారు.

కాని ఎన్.టి.ఆర్ లక్ష్మి పార్వతి పెళ్ళి చేసుకుంటే మాత్రం - దానిని గోరంత కొండంత చేసి - ఆ మహానుభావుడ్ని వెన్ను పోటు పొడిచి గుండె పోటుతో చనిపోయేలా చేసిన చంద్రబాబు ...............కూడ పీక లేక పోయాడు జూనియర్.

పోనీ శక్తి చాలకుంటే మూలన కూర్చుండి పోవాల్సింది. కాని జూనియర్ ఆ పనీ చెయ్యక సిగ్గు,లజ్జ ,మానం ,పరువు ,ప్రతిష్ఠ లేకుండా చంద్ర బాబు నాయకత్వంలోని తె.దే.పాకు ప్రచారం కూడ చేసేరు.

పోన్లే తను బాబుకు వ్యతిరేకంగా ఏమీ చెయ్యలేక పోయాడు -ఏవో కొన్ని తప్పుడు వ్యూహాలతో భజన సైతం చేసాడు .

వంశి,నాని వంటి వారు అసంతృప్తి గళం వినిపించడానికి కారణం వారు బాబును సెకండరిగా ఉంచుకొని ఎన్.టి.ఆర్ చరిస్మాను -జూ.ఎన్.టి.ఆర్ నాయకత్వాన్ని ముందుకు తెవడమే.

ఈ చిన్న విషయాన్ని అర్థం చేసుకోకుండా - ఎన్.టి.ఆర్ , ఎన్.టి.ఆర్ కుటుంభానికి బాబు చేసిన అన్యాయాలను పరోక్షంగానైనా (వంశి -నానిల ద్వార) ఎదిరించి నిలదీసే అవకాశాన్ని సైతం జూనియర్ జార విడుచుకున్నారు.

ఇది ముమ్మాటికి చారిత్రిక తప్పిదమే. రేపే లోకేష్ బాబు పార్టి పగ్గాలు చేతపట్టి -జూనియర్ని ప్రచారానికి పిలిచినా జూనియర్ వెళ్తారేమో గాని పార్టిలోనే ఎన్.టి.ఆర్ అభిమానులు మాత్రం చీ కొట్టడం గ్యారంటి

2 comments:

  1. ఈ వేళ టీవీ స్క్ర్రోలింగ్ లో చూసేను.కొడాలి నానిని తెలుగు దేశం గౌరవిస్తే అతడు దానిని వైస్సార్ కాంగ్రెసుకు తాకట్టు పెట్టాడట. మరి చంద్రబాబుకు మంత్రిపదవి ఇచ్చి కాంగ్రెసు గౌరవిస్తే అతడు దానిని తెలుగు దేశానికి తాకట్టు పెట్టినట్టుకాదా?

    ReplyDelete
    Replies
    1. పంటుల గోపాల కృష్ణా రావు గారు,
      మీరన్న మాటకు ఇంకొన్ని మాటలు కలుపుతా. కాంగ్రెసులో ఉంటూ - పార్టి ఆదేశిస్తే పిల్లనిచ్చిన మామ పై పోటి చేస్తానని బీరాలు పలికింది ఎవరు? ఓడి - మామ పాదాల చెంత చేరాక -అధికారాన్ని అనుభవిస్తూ -అందుకు కారకుడైన ఎన్.టి.ఆర్ ప్రక్కన గుంట నక్కలా కాచుక్కూర్చుని -లక్ష్మి పార్వతి చొరవను సాకుగా చూపి - ఎన్.టి.ఆర్ పై చెప్పులు వెయ్యించింది ఎవరు?

      పార్టి ఎన్.టి.ఆర్ది, జెండా ఎన్.టి.ఆర్ది, ఎం.ఎల్.ఏలు ఎన్.టి.ఆర్ గెలిపించినవారు కాని కాని వెన్నుపోటుతో గుండె పోటుకు గురి చెసి దిక్కులేని చావుకు గురి చేయడం వెన్నుపోటా?

      నేడో రేపో రాజినామా చెయ్యడానికి సిద్దమై వై.కా.పాలో చేరడం వెన్నుపోటా ..తెలుగు తమ్ముళ్ళు ఆలోచించాలి

      Delete