ఈ ఏడాది మే 28 న జరగాల్సిన తెదేపా మహానాడును వాయిదా వేసిన బాబు ఈ రోజు ఏకంగా రద్దు చేసారు. ఈ విషయం తెలుసుకుని తె.దే.పా కార్యకర్తలు ఎన్.టి.ఆర్ అభిమానులు ఎంతగా ఫీల్ అవుతారో నాకు తెలుసు. ఇందుకు కారణం ఏమని వారికి బహుసా తెలియక పోవచ్చు.
బాబు మైండులో తన తరువాత లోకేష్ అన్న భీజం బలంగా పడిపోయింది. గత మహానాడు సందర్బంగా లోకేష్ ఫ్లెక్సిలు - దాని పట్ల హరి కృష్ణ ఆగ్రహం అంతా తెలిసిందే.
ఒకటి రెండు వారాల్లో లోకేష్ ప్రత్యక్ష రాజకీయాల్లో రావడం ఖాయం. ఈ నేపథ్యంలో మహానాడు అంటూ జరిపితే రాష్ఠ్ర్ర నలుమూల్లోనుండి నాయకులు,కార్యకర్తలు పెద్ద సంఖ్యల్లో ఒక చోటికి చెరుకుంటారు. ఆ సన్నివేశంలో లోకేష్ రాజకీయ ప్రవేశం గురించి పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది.
గత మహానాడు అనుభవాన్ని దృష్ఠిలో ఉంచుకుని ఏకంగా మహానాడునే రద్దు చేసుకున్నారు బాబు. ఈ సందర్భంలో నాకో సంఘఠన గుర్తుకొస్తూంది.
ప్రముఖ శాస్త్ర్రవేత్త ఐన్స్ టీన్ పర్యటనలో ఉన్నారు. అతనితో పాటు ఒక డ్రైవరు కూడ ఉన్నాడు. ప్రతి చోట ఐన్ స్టీన్ అరిగి పోయిన రికార్డులా ఒకే విషయాలను చెబుతుంటే డ్రైవరుకు చిర్రెత్తింది.
ఐన్స్ టీన్ను అడిగాడు "సార్ ! మీ మాటలన్ని నాకు కంఠస్తం అయిపోయాయి. ఒకసారి నాకు చాన్స్ ఇస్తే నేనూ స్పీచ్ ఇస్తా"
ఐన్స్ టీను "ఓకే ప్రొసీడ్ "అన్నారు . డ్రైవరుకు తన బట్టలు ఇచ్చి -తాను డ్రైవర్ బట్టలు వేసుకున్నారు. మరో ఊరికి చేరింది కారు.
అక్కడివారికి ఐన్స్ టీన్ ఎవరో తెలీదు. కాబట్టి డ్ర్రైవరు మైక్ అందుకున్నాడు.
బ్రహ్మాండమైన ఉపన్యాసం దంచాడు.
ఎక్కడా ఎలాంటి తేడా లేదు. స్పీచ్ అనంతరం ఒక వ్యక్తి లేచి ఏదో డౌట్ అడిగాడు. డ్రైవర్ బెంబేలెత్తి పోయాడు. చివరికి కాస్త సమయ స్ఫూర్తితో "ఇది చాలా చిన్న డౌట్ దీనికి మా డ్రైవరే సమాదానం చెప్పగలడు"అంటూ డ్రైవర్ గెట్ అప్లో ఉన్న ఐన్ స్టీన్ను చూపాడు.
ఇక్కడ ఐన్ స్టీన్ స్థానంలో ఎన్.టి.ఆర్ని ; డ్రైవర్ స్థానంలో బాబును ఊహించుకొండి. కాని ఆ డ్రైవరన్నా సమయస్ఫూర్తితో తప్పించుకున్నాడు. కాని బాబు ఏకంగా ఎన్.టి.ఆర్ని చంపి - మరి ఆ పొజిషన్కు వచ్చాడు.
అధికార పీఠం ఓ విచిత్రమైంది.దాని పై కూర్చున్న నక్కకు సైతం పెద్దపులికి దొరకాల్సిన మర్యాదలు జరిగి పోతుంటాయి. ఆ పీఠం దిగితే కాని ఆ నక్కకు సైతం తాను కేవలం నక్కన్న సంగతి గుర్తుకొస్తుంది.
బాబు కథా ఇంతే సి.ఎంగా ఉన్నంతా కాలం నో ప్రాబ్లం. అధికారం చే జారిన తరువాత కాని ఎన్.టి.ఆర్ లేని లోటు కనిపించలేదు. అప్పటికే టూ లేట్ కాబట్టి అసలు సిసలైన ఎన్.టి.ఆర్ అభిమానులంతా అతని పథకాలను అమలు చేస్తూ మానవీయ పరిపాలన అందించిన వై.ఎస్.ఆర్ వైపుకు వెళ్ళి పోయారు.
అయినప్పటికి ఓర్పుతో పార్టిని అంటి పెట్టుకుని ఉన్న ఎన్.టి.ఆర్ అభిమానులు సైతం లోకేష్ బాబు రాకనంతరం ఇప్పటికే బాబు కుమ్మక్కు రాజకీయాలతో విసిగి వేసారి ఉన్న పార్టి క్యేడరు - అభినవ ఎన్.టి.ఆర్లా కాంగ్రెసును ముప్పై చెరువుల నీళ్ళు తాగిస్తున్న జగన్ భాట పట్టడం ఖాయం.
అప్పుడు బాబు కేవలం మహానాడునే కాదు పార్టిని సైతం రద్దు చేసుకోక తప్పదు.
Mastaru mari darunamga thiduthunnaru..edhi Kopama leka chiraka
ReplyDeleteరాజేష్ బట్టినా గారు !
ReplyDeleteనిజానికి బూతులు తిట్టాలి. మచ్చుకు ఒకటి చెబుతాను. చంద్రబాబు సి.ఎంగా ఉన్నప్పుడు " ఇది ప్రజల ప్రభుత్వం. మీరూ సలహాలివ్వండి..పాటిస్తాం. తప్పులు జరిగితే ఫిర్యాదు చెయ్యండి.చర్యలు తీసుకుంటాం . పోస్టు కార్డు వ్రాస్తే స్పందిస్తా" అని ఊకదంపుడు ఉపన్యాసాలు చేస్తుంటే ..1997 నవంబరునుండి దేశ,రాష్ఠ్ర్ర,ఆర్.టి.సి,తిరుమల అభివృద్దిల కోసం యాక్షన్ ప్లాన్న్స్ రూపొందించి పంపాను.
దీని పై సి.ఎం కార్యాలయం స్పందించడానికి ఐదు సం.లు పట్టాయి. మరీ నెను పది,ఇరవైలుగా లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి ఉత్తరాలు ,మెయిల్స్,ఆర్.పి.లు ,ఫ్యాక్సులు ఇవ్వాల్సి వచ్చింది.
ఇంతకీ వారెందుకు దిగి వచ్చి సమాదానం ఇచ్చారో తెలుసా?
"మీది సర్వీసు చార్జీల ప్రభుత్వం కదా ప్రజల ఉత్తరాల పై స్పందించడానికి కూడ సర్వీసు చార్జి అమలు చేస్తున్నారేమో ఈ పది రూ.ఎం.ఓ స్వీకరించి నాకు సమాదానం ఇవ్వండి అంటూ ఎం.ఓ పంపాను.
అయినా సమాదానం లేదు. చివరికి నేను వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేసి ఆ వార్త నాటి వార్త దిన పత్రిక మెయిన్ ఎడిషన్లో వస్తే పరువు కోసం దాట వేత సమాదానం ఇచ్చేరు.
ఇక బాబును చూస్తే -అతని మాటలు వింటే నాకెక్కడ కాలుతుందో మీరే చెప్పండి
పిచ్చ కి పరాకాష్ఠ అంటే....."మానవీయ పరిపాలన అందించిన వై.ఎస్.ఆర్"
ReplyDelete