క్షమించండి !
నా ఈ బ్లాగును అప్డేట్ చెయ్యడం లేదు. ప్రస్తుతం నా మరో తెలుగు బ్లాగ్ రెగ్యులరుగా అప్డేట్ అవుతూంది. అందులోని టపాలను చదవడానికి ఇక్కడ నొక్కండి
Pages
Tuesday, 10 July 2012
చంద్ర బాబంటే నాకెందుకింత మంట?
చంద్ర బాబంటే నాకెందుకింత మంట?
నా టపాలు చదివేవారిలో తరచూ తలెత్తే ప్రశ్న ఇదే ! కొందరైతె నేను రెడ్డి కులస్తుడని అపోహ పడి కమెంట్స్ వేస్తుంటారు. కాని నేను హిందూ -ముదలియార్ కులస్తుడను ( వై.ఎస్. పుణ్యమా అంటూ బి.సి జాబితాలో చేరిన కులాల్లో ఇదీ ఒకటి)
చంద్రబాబు -అతని కార్యాలయం -నాకు చేసిన అన్యాయానికి బూతులు తిట్టాలి. పొరభాటుగా నేను రచయితను కాబట్టి ఆ పని చెయ్యలేక పోతున్నాను.
చంద్ర బాబంటే నాకెందుకింత మంట అనడానికి మచ్చుకు ఒకటి చెబుతాను. చంద్రబాబు సి.ఎంగా ఉన్నప్పుడు " ఇది ప్రజల ప్రభుత్వం. మీరూ సలహాలివ్వండి..పాటిస్తాం. తప్పులు జరిగితే ఫిర్యాదు చెయ్యండి.చర్యలు తీసుకుంటాం . పోస్టు కార్డు వ్రాస్తే స్పందిస్తా" అని ఊకదంపుడు ఉపన్యాసాలు చేస్తుంటే ..1997 నవంబరునుండి దేశ,రాష్ఠ్ర్ర,ఆర్.టి.సి,తిరుమల అభివృద్దిల కోసం యాక్షన్ ప్లాన్న్స్ రూపొందించి పంపాను.
దీని పై చంద్రబాబు సి.ఎం గా ఉన్నప్పుడు అతని కార్యాలయం స్పందించడానికి ఐదు సం.లు పట్టాయి. మరీ ఇందుకు గాను నేను పది,ఇరవైలుగా లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి ఉత్తరాలు ,మెయిల్స్,ఆర్.పి.లు ,ఫ్యాక్సులు ఇవ్వాల్సి వచ్చింది.
ఇంతకీ వారెందుకు దిగి వచ్చి సమాదానం ఇచ్చారో తెలుసా?
"మీది సర్వీసు చార్జీల ప్రభుత్వం కదా ప్రజల ఉత్తరాల పై స్పందించడానికి కూడ సర్వీసు చార్జి అమలు చేస్తున్నారేమో ఈ పది రూ.ఎం.ఓ స్వీకరించి నాకు సమాదానం ఇవ్వండి అంటూ ఎం.ఓ పంపాను. సిగ్గు లేకుండా ఆ పది రూపాయలు స్వీకరించారు.
అయినా సమాదానం లేదు. చివరికి నేను వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేసి ఆ వార్త నాటి వార్త దిన పత్రిక మెయిన్ ఎడిషన్లో వస్తే పరువు కోసం దాట వేత సమాదానం ఇచ్చేరు. ఐదు సం.ల నిర్విరామ రిమైండర్లు,ఫిర్యాదుల అనంతరం వారు పంపిన ఉత్తరం యొక్క స్కాన్ చూసారు కదా?
ఇక బాబును చూస్తే -అతని మాటలు వింటే నాకెక్కడ కాలుతుందో మీరే చెప్పండి
గమనిక: మద్యలో ఎన్నో మలుపులు -అందులో ఒకటి నాడు వై.ఎస్. సి.ఎల్.పి నేతగా ఉండగా అతనికి నేనువ్రాసిన పోస్టు కార్డు పై సి.ఎల్.పి కార్యాలయం స్పందించడం. ఎవరైనా కోరితే ఈ విషయంలో బాబు -అతని కార్యాలయం ఆడిన దొంగాటలన్నింటిని వ్రాస్తా. ఎన్.టి.ఆర్ భవన్ నుండి బెదిరింపు కాల్ రావడం సైతం
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment