ఎన్.టి.ఆర్ పట్ల భక్తికన్నా, వై.ఎస్.ఆర్ పట్ల పూజ్యభావం కన్నా చంద్రబాబు పట్ల వైరుధ్యమే నాలో ఉందని అంగీకరిస్తున్నాను. అయితే ఆ వైరుధ్యానికి కారణం వ్యక్తిగతం కాదు. ఒకప్పుడు కేంద్రంలో సైతం చక్రాలు తిప్పిన బాబు పరిస్థితి ఈ రోజు అగమ్య గోచరంగా మారింది. నిన్న నాని -నేడు కల్పన -రేపు ఇంకెంతమంది? అని తల పట్టుకుంటున్నారు బాబుగారు. రోమ్ నగరం తగలబది పోతుంటే ఫిటేలు వాయించిన నీరో చక్రవర్తిలాగా ఏకంగా పార్టి ఖాళి అయిపోతుంటే తన పుత్రరత్నం లోకేష్ రాజకీయ అరంగేట్రం గురించి కలలు కంటున్నారు బాబు గారు.
కిరణ్,బాబు కుమ్మక్కవ్వడానికి ఎన్ని కారణాలున్నప్పటికి "సొమ్మొక్కడి సోకొకడిది"అన్న చందాన వీరికి దక్కిన అధికారమే వీరిని ఏకం చేసింది అనుకుంటా. ఇంకొకరి రెక్కల కష్ఠంతో వచ్చిన అధికారాన్ని కాజేసి -అనుభవించిన అనుభవం బాబుది. అదే పంథాలో సాగుతున్నది కిరణ్ ఇక మన్సా వాచా ఖర్మేణా కుమ్మక్కు కుదిరి పోయింది.
బాబు పేరు వెలిగిపోతున్నప్పుడే -ఎప్పుడో నేను పసి కట్టాను (కాస్తో కూస్తో సైకాలజి -మానవనైజం -బాడి ల్యాంగువేజీలు తెలిసిన వాడ్ని కాబట్టి). ఇదే ముక్క గుక్క తిప్పకుండా చెబుతూ వచ్చాను. కంచుకి -కనకానికి తేడా కనబడేది అది జారి క్రింద పడ్డప్పుడే .. వినిపించే మోతను పట్టి అంచనా వెయ్యొచ్చు పడ్డది కంచా ? కనకమా? అని.
అలా కాక అధికారమనే పాలిష్తో మిల మిలా మెరిసి పోతున్న వేళ నా మాటలు ఎవరికి రుచించలేదు.అతను హైటెక్ అని అపర చాణక్యుడని పరిపాలనా దక్షుడని కోతలు కోసే వారు.
నిన్న పేర్కొన్నట్టుగా ఒక ఉత్తరానికి ప్రత్యుత్తరం పంపడానికి ఆరేళ్ళు పట్టింది అతని కార్యాలయానికి . మద్యలో జరిగిన తతంగాలను గత టపాలో క్లుప్తంగా వ్రాసి దాట వేసాను. అదే రోజుల్లో కేవలం సి.ఎల్పి నేతగా ఉన్న వైస్సార్ కి ఉత్తరం వ్రాస్తే వెంటనే ప్రత్యుత్తరం రావడం ఏంది? వెనువెంటనే సి.ఎం పేషి " ప్లీజ్ సెండ్ యువర్ ప్రపోజల్స్" అని నోట్ పంపడం ఏంది? అంటే సి.ఎల్పి నుండి -సి.ఎం కార్యాలయానికి ఏదో విదమైన కమ్యూనికేషన్ వెళ్ళి ఉండాలి.లేకుంటే 1997నుండి 2002దాక నిద్రావస్థలో ఉన్న సి.ఎం పేషి కదలడం ఏంది?
ఇది వై.ఎస్.ఆర్ -చంద్రబాబు మద్యన ఉన్న వ్యత్యాసం. ఈ చిన్న సంఘఠన చాలు బాబు -వై.ఎస్.ఆర్లలో ఎవరు పరిపాల దక్షత గలవారని నిర్ణయించడానికి. నాకు ఓపిక లేదు కాని .. దేశం బాగుపడాలి -రాష్థ్ర్రం బాగు పడాలని బాబుకు నేను పంపిన ప్రపోజల్స్ ఏ మటుకు హైజాక్ అయ్యాయో -ఏమెరకు దుర్వినియోగమయ్యాయో - నాకు తెలుసు. ఇది కాక నా పై పోలీస్ ఎన్కొయిరి వెయించాడు .ఇంటలిజెన్స్ ఎన్కొయిరి వెయించాడు. ఒకటి కాదు రెండు కాదు. నానుండి ఎటువంటి కమ్యూనికేషన్ వచ్చినా స్పందించ కూడదని మౌలిక ఆదేశాలుకూడ జారిచేసినట్టు తెలిసింది.
అప్పట్లో బాబు గొప్పవాడని - నేనేదో ఎదవనని నా చుట్టు ఉన్నవారే చెప్పుకునే వారు. కాని ఈ రోజు బాబు అసలు స్వరూపం - అతనెంతటి ఆసమర్థుడో -జిత్తుల మారి నక్కో తెలుసుకున్నారు.
ఈ విషయాల పై జరిగిన విషయాలను చెబితే అదో సీరియల్లా ఏడుస్తుంది.ఆందుకే సవివరంగా వ్రాయడం లేదు. ఏది ఏమైనప్పటికి కాంగ్రెసు పార్టికన్నా - బాబు నేతృత్వంలోని తె.దే.పా చాలా ప్రమాదకరం. బాబు ఎంతటి మానసిక వికలాంగుడంటే -ప్రస్తుతం ఉన్న వత్తిడితో - ఇర్రిటేషనుతో చిరంజీవిలా తె.దే.పాను కాంగ్రెసులో కలిపేసినా నేను ఆశ్చర్యపోను.
ఎలాగూ వల్లభనేని వంశి - కోడాలి నాని వంటి అసలు సిసలైన ఎన్.టి.ఆర్ అభిమానులు - నందమూరి కుటుంభ విధేయులు భయిటకొచ్చేసారు కాబట్టి - ఇక తె.దే.పాకు -ఎన్.టి.ఆర్లకు ఏ సంభంధమూ లేదు.
ఎన్.టి.ఆర్ మానవీయ పాలనను పునరుద్దరించి - మరింత పటిష్ఠం చేసి -జనరంజక పాలన అందించిన వై.ఎస్సారే ఎన్.టి.ఆర్ అసలు సిసలైన వారసుడు.
ఇకనైనా నిజమైన ఎన్.టి.ఆర్ అభిమానులు తె.దే.పాను వీడి వైకాపాలోకి రావాలి. బాబు పని పట్టాలి.
నువ్వేం బాధపడిపోకు. డబ్బులతో మీవాడు వంద సీట్లు తెచ్చుకోగలడు. నిన్ను చూడడు. నీకు కూలి కూడా గిట్టదు
ReplyDeleteYSR veru..., Jagan veru... okavela mana time baagoka jagan CM ayithe..., veedoo nee letters dustbin lo vesthaadu.
ReplyDeleteఅనాని గారు !
ReplyDeleteనిజమే. మీరు చెప్పినట్టు - నేను నా ప్లాన్స్ పంపితే జగన్ డస్ట్ బిన్లో వేసే అవకాశం లేక పోలేదు.
అయితే జగన్ ఏరోజు కూడ పోస్ట్ కార్డు వ్రాయండి స్పందిస్తా అని ఊక దంపుడు కబుర్లు చెప్పలేదు కాబట్టి తప్పు లేదు అనే అనుకుంటా.
ఇవాళ మధ్యానం టివి చూస్తూ ఉంటె నాని తో టీవీ లైవ్ షో వస్తుంది... నాని అన్నాడో అనలేదో నాకు తెలియదు నన్ను వీళ్ళు ఎవరు పార్టి నుంచి సస్పెండ్ చేయటానికి ఇది బాబు దా బాబు బాబుదా అని.. దానికి మరో వైపు మాట్లాడుతున్న vaaru అంట్టున్నాడు... ఇది బాబు పార్టి నే ఇది అతని మామ పెట్టిన పార్టి అతనికి అధికారం ఉంది అని... నాకు ఒక్క విషయం అర్ధం కాలేదు NTR ఏమైనా నాకు ఓపికలేదు పార్టీని నడపలేకపోతున్న మీరు నడపండి అని బాబు న్త్ర్ పార్టి పగ్గాలు ఇచ్చాడా.. ఇది నా మామ పార్టి నాకు అధికారం ఉంది అనటానికి... అప్పుడ్ NTR అవసరం లేదు ఈ రోజు మా మామ పార్టి అని చెప్పుకున్ట్టునారు ఇంతకన్నా దారుణం ఏమి ఉండ్డదు.. పైగా నాని పార్టికి వెన్నుపోటు పొడిచాడు అంట...
ReplyDeleteకనీసం నాని ఎందుకు వెళ్ళవు అని అడగకుంట సస్పెండ్ చేశారు... వీరు మాత్రం వారి ఇంట్లో పెళ్ళిళ్ళకి వెళ్ళవచ్చు కాని వేరే వారువేల్తే పార్టి కి వెన్నుపోటు నా??? వీళ్ళకి మతి ఉందా అసలు... ఎవరికీ ఇష్టం వారిది ఎవరి పార్టీ నచ్చితే అక్కడకు వెళ్తారు... వేరే వారు వెళ్తే ఏమి మాట్లాడని వారు నాని వెళ్తే ఇంత రాదంతం ఎందుకు చేస్తున్నారో... నాని లేకపోతె TDP లేదని వారి ఉద్దేశమా?