ఇన్నాళ్ళు జగన్ ఏ తప్పు చెయ్యలేదు అన్న స్టాండుతో వ్రాస్తూ వచ్చాను. ఈ రోజు ఒక వేళ జగన్ తప్పే చేసి ఉంటే .. అన్న నేపథ్యంలో వ్రాయాలానుకుంటున్నా. ఎందుకంటే జగన్ ప్రత్యర్దులే కాదు -మన బ్లాగ్లోకంలో కూడ చాలా మంది జగన్ దోచుకున్నారు -దాచుకున్నారని కమెంట్స్ వ్రాయడం చూస్తున్నప్పుడు వారి కోణంలోనుండి కూడ కొన్ని విషయాలను చూడాల్సి ఉంది.
వారిలో చాలా మందికున్న అపోహ ఏమంటే జగన్ తప్పు చేసారు. అతన్ని వెనుకేసుకు రావడం ఏంది?
ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. పోలీసులన్నా -ఏసిబి అన్నా- సిబిఐ అన్నా రా అన్నా ఇవన్ని రాజ్యం చేతిలోని అస్త్ర్రాలు. వీటిని జగన్ వంటి ప్రత్యర్దుల మీదికే కాదు మీలాంటి నాలాంటి అమాయకుల మీదకు ప్రయోగించే అవకాశం కూడ ఉంది. జగన్ వంటి రాజకీయ భలం ,ప్రజా భలం ,దన భలం ఉన్నవారే ఇలా ఉక్కిరి బిక్కిరి అయిపోతుంటే జగన్ స్థానంలో మీరో నేనో ఉంటే ఏమై పోయేవారం?
నెను సోనియాను బండ భూతులు తిడుతున్నా. అదృష్ఠం కొద్ది నా బ్లాగులు వెయ్యిమందికి అటి ఇటుగా మాత్రమే చదువ్తుతున్నారు. కాబట్టి బతికి పోయా. లేదా సెంట్రల్ ఇంటలిజెన్స్ వారి దృష్ఠిలో నా రచనలు పడి ఉండక పోవచ్చు. లేదా వారికి తెలుగు తెలిసుండక పోవచ్చు.
పొరభాటుగా నా బ్లాగును మరింత మంది చదివే రోజులొచ్చి -అవి సెంట్రల్ ఇంటలిజెన్స్ కంట పడి -సోనియా దృష్ఠికి వెళ్ళి "అతని కథేమో చూడండి" అంటే ఒక ఎస్.ఐ /లేదా సి.ఐ చాలు వాణి పుత్రుని వాణి మూగ పోవడానికి.
రాజ్యం అంటే దానికి ఒక ముఖం ఉంటుంది. ఆ ముఖం ఎప్పుడూ చురునవ్వు చిందిస్తూ అహ్లాదంగా కనబడుతుంటుంది. ఉదాహరణకు మన కేంద్ర ప్రభుత్వానికి ముఖం సోనియా. అది కన్నెర్ర చేస్తే సి.ఎం కొడుకులు మాత్రమే కాదు ఏకంగా సి.ఎంలు సైతం మెటాష్ అయిపోతారు.
రాజ్యం -రాజ్యాధికారాలకు ముక్కుతాడు వెయ్యాలి. పౌరహక్కుల పై గళం విప్పాలి. ఇదో అరుదైన సందర్భం. ఈ రోజు ఎవరో జగన్కి జరిగినవన్ని మీకో నాకో జరిగే అవకాశం కూడ ఉంది.తస్మాత్ జాగ్రత్త.
పొరభాటుగా మన దేశంలో ఇంకా ప్రజా స్వామ్యం బతికే ఉంది కాబట్టి -దేశ వ్యాప్తంగా ప్రజాభలం ఉన్న నాయకులు ఇంకా ఉన్నారు కాబట్టి సరి పోయింది కాని ..లేకుంటే జస్ట్ ఒక్క సి.బి.ఐతో అందరిని అత:పాతాళానికి తొక్కేసేది ఆమె.
సి.బి.ఐ బూచి చూపి ఎలా ప్రణభ్ ముకర్జికి మద్దత్తు కూడ కడుతున్నారో అలానే తమకు వ్యతిరేకంగా కదిలే కలాలను కకా వికలం చేయగలరు. వేళ్లను కదలీయకుండా చేస్తారు.
పాయింటుకొస్తా. జగన్ తప్పుచేసాడు. తండ్రి ఇచ్చిన జీ.ఓలతో లబ్ది పొందిన వారిచేత తన సంస్థల్లో పెట్తుబడి పెట్తించుకున్నాడు అనుకుందాం. ఈ ప్రక్రియ వై.ఎస్. సి.ఎం అయిన రోజునుండే ప్రారంభమై ఉండాలి. కాని జగన్ పై కేసు నమోదు చేసింది కేవలం పది పదకొండు నెలల పూర్వమే .ఎందుకింత జాప్యం -దీని వెనుక ఉన్న రాజకీయ ఉద్దేశాలు దురుద్దేశాలు ఏవి అన్న సంగతిని కూడ పక్కన పెడతాం.
శంకర్ రావు చేత హైకోర్టుకు లేఖ వ్రాయించేరు. ( ఆయన క్యేరక్టర్ ఎటువంటిది -ఎవరు వ్రాయించారు -ఆ తరువాత అతను వ్రాసిన లేఖ పై హై కోర్టు ఏమంది అన్న విషయాలను కూడ పక్కన పెడదాం)
హై కోర్టు ఏమంది? ఈ ఫిరియాదులకు ప్రాథమిక ఆధారాలు ఏమైనా ఉన్నాయా చూడండి అంది. సి.బి.ఐ వారు ఆఘమేఘాల పై ఉన్నాయి అంటూ సమాదానం ఇచ్చేరు.
శంకర్ సినిమాల్లోలాగా -హాలివుడ్ సినిమాల్లోలాగా రెయిడ్స్ నిర్వహించేరు. ( మునుపు ఎన్నడన్నా ఏ నేత విషయంలోనన్నా ఇంతటి విస్టృత స్థాయిలో రెయిడ్స్ జరిగాయా అన్న విషయాలను కూడ పక్కన పెడదాం.
ఉపఎన్నికల ప్రచారం తారా స్థాయికి చేరుకున్న సందర్భంలో -వై.ఎస్.ఆర్ సి.పికి ఉన్న ఏకైక స్టార్ క్యేంపెయినర్ జగన్ను విచారణకంటూ పిలిచి మూడ్రోజులు విచారణ జరిపి - మూడో రోజు అరెస్ట్ చేసేరు.. ఇప్పటికీ జైల్లోనే ఉన్నారు ( సెప్టెంబరు ఐదుకు అటు ఇటుగా తప్పకుండా బయిటపడతారు అది వేరే విషయం)
మన న్యాయ సూత్రాల సారం ఏమంటే వెయ్యి దోషులు తప్పించుకున్నా సరే ఒక నిర్దోషి కూడ శిక్షించపడ కూడదు అన్నదే.కాని ఇక్కడ మనం జగన్ దోషి అయితే అన్న కోణంలోనే చూస్తున్నాం. జగన్ దోషే అనుకుందాం.(ప్రస్తుతానికి నిందితుడు మాత్రమే)
కేసు-రెయిడ్సు అన్ని సవ్యంగానే జరిగాయనుకుందాం.. కొన్ని గంటల్లో కోర్తు ముందు హాజరు కానున్న వ్యక్తిని అరెస్టు చేసేరు. ఎందుకని?
జగన్ ఉప ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించ కూడదు. కొనసాగిస్తే కాంగ్రెస్ మట్టి కొట్టుకు పోతుంది అన్న ఒక్క భయంతో జగన్ హక్కులను -ప్రజాస్వామిక హక్కులను హరించి వేసేరు. ఇప్పటికీ జగన్ నిందితుడే. దోషి కాదు. దోషి అంటూ నిర్ధారించక మునుపే శిక్ష విధించేసేరు.
బహుసా జగన్కు బెయిల్ దొరికి అతను ప్రచారాన్ని కొనసాగించి ఉంటే ఓడిన రెండు స్థానాల్లో కూడ పార్టి గెలిచేదేమో? ఆ నియోజక వర్గ ప్రజలకు న్యాయం జరిగేదేమో?
జగన్ తప్పే చేసి ఉన్నా అది రుజువు కాక ముందే శిక్ష పడి పోయింది. మరి ఆ శిక్ష కేవలం జగన్కే కాదు. అసంఖ్యాక వై.కా.పా కార్య కర్తలకు -అభిమానులకు - పార్టి ఓడి పోయిన రెండు నియోజక వర్గ ప్రజలకు పడిన శిక్ష.
విచారణ ప్రక్రియ ఎలా సాగాలంటే భవిష్యత్తులో ఆ నిందితుడు నిర్దోషి అని తేలినా అప్పటికి అతనికి ఏ నష్ఠమూ జరిగి పోయే వీల్లేకుండా ఉండాలి.
దోషిగా తేలితే శిక్షించవచ్చు.దానిని ఎవరూ కాదనరు.కాని నేరం రుజువు కాక మునుపే నిందితునికి -అతని సంస్థలకు -వాటిలో పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లకు - అతన్ని నమ్ముకున్న లక్షలాది ప్రజలకు -అభిమానులకు శిక్ష విదించడం ఏం న్యాయం?
అందుకే చెబుతున్నాను జగన్ తప్పు చేసి ఉన్నా - అవినీతికి పాల్పడ్డారనే అనుకున్నా - నేరం రుజువు కాలేదు కాబట్టి ఇందాక సి.బి.ఐ,ఎల్లో మీడియా అవలంభించిన తీరు అన్యాయం -అక్రమం
ఓర్నీ! అందరూ దొంగలేరా!
ReplyDelete