ఈ రోజు రాష్థ్ర్రంలో నడుస్తున్న పాలన నాటి చంద్రబాబు చీకటి యుగాన్ని గుర్తుకు తెస్తుంది. దెబ్బకి ఈ పాలన ఇంకెన్నాళ్ళు అన్న వనుకు పుడుతూంది. రాజన్న రాజ్యం ఎప్పుడెప్పుడు వస్తుందా అన్న తహతహలు ప్రజల్లో పెరిగి పోతున్నాయి.
ఇంతకీ రాజన్న రాజ్యంలో లోపాలే లేవా అంటే ఉన్నవి. కాని ఆ లోపాలకు కారణం వై.ఎస్ మనస్తత్వం. ఎవరిని నొప్పించకూడదన్న తత్వంతో వై.ఎస్. వ్యవహరించారు.
ఉ: అధికారులు.. చంద్రబాబు పాలనలో అధికారులు ఎంతగా వేదించ బడ్డారో అందరికీ తెలుసు. ( సున్నపుడబ్బాలు పట్టుకుని సున్నం కూడ కొట్టించాడు బాబు)
ఇంతకీ అప్పట్లో తె.దే.పా ప్రభుత్వం చేసిందల్లా పోస్టర్లు ముద్రించడం -బ్యానర్లు తయారు చెయ్యడం - షామియానాలు వెయ్యడం -కుర్చీలు ఏర్పాటు చెయ్యడం మాత్రమే ( దీనికి జన్మ భూమి అని పేరు)
కాని వై.ఎస్.ఆర్ ఒక శతాబ్దకాలంలో చెయ్యాల్సిన పనులను కేవలం ఐదు సం.లో చేసి తీరాలని తపించారు. ఎందుకో వై.ఎస్.అధికారుల ముక్కు పిండి పనులు చెయ్యించలేక పోయారు. ఈ ఒక్క పని చేసి ఉంటే 2009 ఎన్నికల్లో ప్రతిపక్షాలకు డిపాజిట్లు సైతం దక్కేవి కాదు.
ఈ పొరభాటు రేపటి రాజన్న రాజ్యంలో దొర్లకూడదు. అందుకని అధికారులను పీడించాలని కాదు. పగ్గాలు చేపట్టిన తక్షణం ప్రభుత్వం యొక్క టాప్ టెన్ ప్రియారిటీస్ ఏమో నిశ్చయించుకోవాలి.
నా ప్రియారిటీస్:
1.ప్రతి పౌరునికి రాజ్యాంగం ప్రసాదించిన జీవించే హక్కును సంరక్షించడమే ప్రభుత్వం యొక్క ప్రప్రధమ ప్రాధన్యతగా ఉండాలి. హత్యలు,ఆత్మహత్యలు,లాక్ అప్ డెత్స్, ప్రమాదాలను వారించే నిర్మణాత్మకమైన చర్యలు చేపట్టాలి. పౌరుల,పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడే వారు ప్ర్పైవేటువడ్డీ వ్యాపారులైనా సరే -ప్రజా ప్రతినుదులైనా సరే ఉక్కుపాదం మోపాలి.
2.ప్రతి పౌరునికి గౌరవప్రదమైన జీవనోపాథి : ఈ పాయింటులోనే రైతులు,నేతన్నలు మొదల్గొని ప్రైవేటు సంస్థల్లోని చిరుద్త్యోగులదాక వస్తారు. వీరి ప్రొడక్టివిటిని పెంచేందుకు -శ్రమకు తగ్గ ప్రతిఫలం అందేందుకు కావల్సిన ప్రతి చర్యకు అత్యథిక ప్రాధన్యత ఇవ్వాలి.
2.పరిమిత ఆదాయ వనరులున్నప్పటికి ప్రతి కుటుంభానికి నాణ్యమైన త్రాగు నీరు, కూడు,గుడ్డ పిల్లలకు నాణ్యమైన విథ్య,వైద్యం అందే ఏర్పాటు
3.ప్రజలతో ప్రత్యక్ష సంభంధమున్న ప్రతి ప్రభుత్వ కార్యాలయంలోను అవినీతికి -ఆశ్రిత పక్షపాతానికి బ్రేక్ ఉ.పోలీసు స్టేషన్స్,ప్రభ్తుత్వ ఆసుపత్రులు
.4.ప్రజలను ప్రత్యక్షంగా ప్రభావించే ఆర్.టి.సి.చార్జీలు,విధ్యుత్ చార్జీలు వంటి వాటిని పెంచకుండా ఆర్.టి.సి,జెన్కో,ట్రాన్స్ కో ల పనితీరును మెరుగు పరచడం.
5.వై.ఎస్.ప్రవేశ పెట్టిన ప్రతి సంక్షేమ పథకాన్ని సమీక్షించి అవి ఏ ఒక్క అనర్హునికి సైతం డైవర్ట్ కాకుండా -ప్రతి అర్హునికి ఆ పథకాలు అందేలా కఠిన చర్యలు.
టాప్ ఫైవ్ ప్రియారిటీలను మాత్రమే ఇక్కడ సూచించాను. జగన్ అభిమానులు మిగిలిన ఐదు ప్రియారిటీస్ని ఇక్కడ సూచిస్తె సంతోషిస్తాను.
ఇలా ప్రియారిటీస్ నిర్ధారించుకుని అధికారులతో సమావేశమై ..ఇక అలా ఉంటే కుదరదు ..ఇలా ఉండి తీరాలి అని స్పష్థం చెయ్యాలి.
రాష్ఠ్రంలోని ప్రతి ప్రభుత్వ అధికారి -ప్రతి ప్రభుత్వ సిబ్బందికి వైధ్య పరీక్షలు నిర్వహించాలి.సమస్యలుంటే వైద్య సదుపాయం కలిగించి నిర్భంద చికిత్స అంద చెయ్యాలి. వారు శారీరక దారుడ్యత, సృజణాత్మక మనస్సు,పవిత్రమైన ఆత్మ గలవారిగా పరిణితి చెందే విదంగా ప్రభ్తువం చూడాలి .
ఉ: వ్యాయామ శాలలు , ద్యాన మందిరాలు , కమ్యూనిటి హాల్స్
(ఇంకో సందర్భంలో కొనసాగిస్తా)
జగన్ ఎన్నికల మానిఫెస్టో తయారు చేస్తున్నావా? జగన్ కుక్క కూడా కాలెత్తి నీమీద పొయ్యదు.
ReplyDelete