క్షమించండి !

నా ఈ బ్లాగును అప్డేట్ చెయ్యడం లేదు. ప్రస్తుతం నా మరో తెలుగు బ్లాగ్ రెగ్యులరుగా అప్డేట్ అవుతూంది. అందులోని టపాలను చదవడానికి ఇక్కడ నొక్కండి

Friday, 27 July 2012

నీతికి ( ఆంద్ర) జ్యోతి - న్యాయానికి రాధాకృష్ణ


దమ్మున్న చానల్ -మా అక్షరం మీ ఆయుధం - వి రిపోర్ట్ యు డిసైడ్ అని బీరాలు పలికే ఆంద్రజ్యోతి - నీతి నిజాయితీలకు నాదే పేటెంట్ అని పెట్రేగి పోయే రాధాకృష్ణల అసలు సవరూపాన్ని ఈ టపాలో భయిట పెడతాను.

రెండో పేజీలో ఒక వ్యాసం:

( ఇటువంటి వాటిని ఎవరు చదువుతారో -ఎందుకు ప్రచురిస్తారో నాకు అర్థం కావడం లేదు - యూత్ సినిమా పేజి -స్పోర్ట్స్ పేజి చూసి చుట్టి అవతల పడేస్తారు - ఇక పెద్దలంటారా వారికి వార్తల అసలు జిష్ఠేమి - అందులో నిజం ఎంత -అబద్దం ఎంత అంతా తెలుసు -ఇటువంటి వారు ఇటువంటి సుత్తి వ్యాసాలు చదివి మనసు మార్చుకుంటారని నెను అనుకోను)

పవర్ కట్ పుణ్యమా అంటూ జస్ట్ టు కిల్ ది టైం ఈ వ్యాసం చదివాను. ఇందులోని కొన్ని అంశాలను ప్రస్తావించి - చివరగా జ్యోతి ఎంతటి నీతి బాహ్యమైన పత్రికో - ఒక్క పాయింట్ చెప్పి టపా పూర్తి చేస్తా.

మొదటి అంశం:

అందులో పవార్ కాంగ్రెస్ మద్దత్తుతో పి.ఎం అవ్వాలనుకున్నారు - అందుకు జగన్ సహకరిస్తారని మీడియేషన్ చేసారు -ఆ మీడియేషన్ ఫలితమే ఎవరూ అడక్కుండా వై.కా.పా ప్రణబ్కు మద్దత్తు ఇవ్వడం లాంటి "హంచస్" ఉన్నాయి.

అక్బరుద్దీన్ ఓవైసి జగన్ను కలవడం -ఓటెయ్యమని అడిగాననడం మనందరికీ తెలుసు.

రెండో అంశం:

టి.ఆర్ .ఎస్ -వై.కా.పా ఒకరి పుట్టలో మరొకరు చెయ్యి పెట్టకూడదని కొలైడ్ అయ్యారట.కాని జగన్ మాట తప్పి విజయలక్ష్మిని సిరిసిల్ల చేనేతల సమస్య పై దర్నా చెయ్యమని పంపారట.

పవార్ కాంగ్రెస్ -జగన్ మద్య కుదిర్చిన రాజి ఫార్ములా (?) ప్రకారం జగన్కు బెయిల్ వచ్చినా - రేపు కాంగ్రెస్ పార్టిని ఓవర్ లుక్ చేసి కాంగ్రెసును భూస్థాపితం చేస్తాడట.

న్యూస్ అండ్ వ్యూస్ అని వినే ఉంటారు. అదృష్ఠవశాస్తూ ఈ విషయాన్ని వ్యూస్ రూఫంలో - వ్యాస రూపంలో అందించి పుణ్యం కట్టుకున్నాడు. కొంప దీసి న్యూస్ రూపంగా ఇచ్చి ఉదయం నుండి మద్యాహ్నం దాక ఏబిఎన్లో డిస్కషన్ పెట్టి చంపలేదు.

అసలు వీరి ఉద్దేశం ఏమి? జగన్ ఆఫ్టర్ ఆల్ నిందితుడు మాత్రమే . బెయిల్ ఈజ్ ఎ రైట్ - జెయిల్ ఈజ్ ఎన్ ఎక్సెప్ష్న అన్నారు మాజి సుప్రీమ్ న్యాయమూర్తి వి.ఆర్ . కృష్ణ అయ్యర్.

తన హక్కును - న్యాయ స్థానంలో పోరాడి పొందవలసిన బెయిల్ను - తన రాజకీయ ప్రత్యర్దుల వద్ద లొంగి పోయి పొందడానికి జగన్ వంటి విద్యావంతుడు -యువనేత -అసంఖ్యాక ప్రజల మద్దత్తు కూడ కట్టుకున్న వ్యక్తి ముందుకొస్తాడా?

తన భంగారు భవితను నాశనం చేసుకుంటాడా? కాంగ్రెస్ మునిగి పోతున్న నావ.ఆరి పోతున్న దీపం. జగన్ సాయం కాంగ్రెసుకు అవసరమవుతుందో ఏమో కాని కాంగ్రెస్ సాయం జగన్కు అవసరం లేదు. కేసులు కోర్టు పరిదిలో ఉండగా కాంగ్రెస్ పొడిచేది ఏముంటుంది?

జగన్ పై కేసులు బాటిల్ నుండి భయిలు దేరిన భూతాలు. మూత తీసింది కాంగ్రెసే అయినా - ఆ కేసులు కోర్టు పరిదిలో ఉన్నందున -ఆ భూతాలను తిరిగి బాటిల్లోకి తెచ్చి మూసే శక్తి కాంగ్రెసుకు లేదు.

ఈ విషయాన్ని అంచనా వెయ్యడానికి పెద్దగా బుర్రకూడ అవసరం లేదు. కిడ్నితో ఆలోచించినా తడుతుంది.

సరే వ్యాసంలోని అసలైన మూడో అంశానికొస్తాను. విజయ లక్ష్మి చేనేత దర్నాకు . చేతిలో బైబుల్తో వచ్చారట. బైబుల్ ఒక పవిత్ర గ్రంథం. ఒక పవిత్ర గ్రంథాన్ని -తనకు నైతిక -ఆథ్యాత్మిక భలాన్ని ఇస్తుందని తాను నమ్మిన గ్రంథంతో రావడం ఐ.పి.సిలోని ఏ సెక్షన్ ప్రకారం నేరమో జ్యోతివారె చెప్పాలి.

ఒక వేళ విజయలక్ష్మి ఈనాడు, ఆంద్రజ్యోతి పత్రికలను చేతిలో పెట్టుకుని వెళ్ళి ఉన్నా చాలా మటుకు ఎల్లో మీడియా అని పేరున్న పత్రికలను చేతిలో పెట్టుకుని రావడమా అని ప్రశ్నించే అవకాశం ఉంటుందో ఏమో గాని బైబుల్ పట్టుకుంటే రాధాకృష్ణకు ఉన్న అభ్యంతరం ఏమో అర్థం కావడం లేదు.

ఇంకో పాయింటు కూడ లేవనెత్తేరు.పాలియస్టర్ మిక్స్ డ్ చీర కట్టుకున్నారట. ఏ అకేషనుకు ఏ చీర కట్టాలి అని ఆలోచించవలసింది నటిమణులు. లేదా చిత్త శుద్ది లేక - ప్రజలను మబ్యపెట్టాలని చూసే వారు ఆలోచించాలి. నిజానికి విజయలక్ష్మి ఒక గృహిణి. సగటు స్త్ర్ర్రీ. ఈ రాష్ఠ్ర్ర ప్రజల కోసం భర్తను పోగొట్టుకుని -కొడుకును జైలు పాలు చేసుకుని -విధి లేని పరిస్థితిలో జగన్ ధూతగా వచ్చారు.

ఆవిడకు రాజకీయ ప్రణాళికలు -దురుద్దేశాలు ఉండి ఉంటే ఖద్దరు చీర దరించి రావడం పెద్ద సమస్యేం కాదు. ఇంకా చెప్పలంటే వై.కా.పా మహిళా విభాగం కార్య కర్తలందరిని ఖద్దరు చీరలు దరింప చెయ్యడం కూడ పెద్ద పనేం కాదు. కాని అవన్ని చాలా నాటకీయంగా ఉంటాయి. అసహ్యంగా ఉంటాయి. అది రాజకీయ ఉద్దేశాలు -దురుద్దేశాలు ఉన్న జిత్తుల మారి నక్కలకే తట్టే ఆలోచన.

ఓకె..టపా క్లైమేక్సుకు చేరుకుంటుంది.

విజయమ్మ దర్నాతో నేతన్నలకు ఒరిగిందెమి లేదని వ్యాసంలో పేర్కొన్నారు. ఈ వ్యాసాన్ని రెండో పేజిలో ప్రచురించిన - అదే న్యూస్ పేపర్లో - ఏడవ పేజిలో ఒక ఐటమ్ ఉంది.

నేతన్నల సమస్యల పై కదలిక
అధికారుల ద్వార మంత్రుల ఆరా

రాజీవ్ విద్యా మిషన్ యూనిఫార్మ్ ఆర్డరును నేతన్నలకిచ్చే విషయమై చర్యలు తీసుకుంటున్నారన్నది దాని సారాంశం. ఇది ఆంద్రజ్యోతికున్న కుత్శిత స్వభావానికి తిరుగు లేని ఆధారం.

విజయమ్మ దర్నా అనంతరం - దర్నా ఫలితంగా -దర్నా ప్రభావంతో నేతన్నల సమస్యల పై కదలిక వచ్చిన వార్తను ప్రచురించిన జ్యోతి - వ్యాసంలో మాత్రం విజయమ్మ దర్నాతో నేతన్నలకు ఒరిగిందెమి లేదని వ్యాసంలో పేర్కొనడం కుట్ర కాదా?

ఇకనైనా రాధాకృష్ణ జగన్ పట్ల తనకున్నవైరాన్ని పక్కన పెట్టి - జర్నలిస్టు విలువలను పాటించాలి. లేకుంటే వై.ఎస్.ఆర్ను -జగన్ను గుండెల్లో పెట్టుకున్న పాఠకులు జ్యోతిని భహిష్కరించడం ఖాయం

మనవి:

బ్లాగ్లోకంలోని తఠస్తులను ఉద్దేశించి ఈ మనవి.

మన లోకంలాగే బ్లాగ్లోకంలోను పార్టిలు,కులాలు,మతాలు ఉంటాయి. కాదనను. అయితే గుడ్డిలో మెల్లగా తఠస్తులు కూడ లేక పోలేదు. ఏ సబ్జెక్టులోనన్నా స్టాండు తీసుకోక - ఇరు పక్షాల వారిని దుయ్యపట్టే నేను కేవలం ఎన్.టి.ఆర్ వై.ఎస్.ఆర్ పై నాకున్న అభిమానాన్ని ముందుగా వెలిబుచ్చడం వల్ల నా మీద ఒక ముద్ర పడి పోయింది.

నేనేమి ఎన్.టి.ఆర్, వై.ఎస్.ఆర్ల దత్త పుతృడ్ని కాను. జగన్ భజన పరుడ్ని కాను. నెను ప్రజాపక్ష పాతిని.ప్రజలు ఎవరిని విశ్వసిస్తే వారిని నేనూ విశ్వసిస్తా. ప్రజలు ఎవరిని విశ్వసిస్తారని నేను భావిస్టే వారిని నేనూ విశ్వసిస్తా. నా అంచనా ఎప్పుడూ ఫెయిల్ అవ్వలేదు.
ఫెయిల్ అయితే తక్షణం క్షమార్పణ కోరుతాను.

ఎన్.టి.ఆర్ మరణంతో ఆయన బాబు పని పట్టలేక పోయాడు కాని -వై.ఎస్.ఆర్ ఆ పని చేసి చూపారు -అదీ ఎన్.టి.ఆర్ని గద్దెనిక్కించిన అదే ఆంద్రప్రజల మద్దత్తుతో. గుంట నక్కలా కాచుక్కూర్చుని -సమయం చూసి దొంగ దెబ్బ తీసిన బాబు పనే ఫట్ అయినప్పుడు - రోశయ్యలు కిరణ్లు చరిత్రలోని చెత్త బుట్టలో పడేది ఖాయం.

నా పాయింట్ ఒక్కటే .ఇది ప్రజాస్వామ్యం. ప్రజలే ప్రభువులు.ప్రజలు ఎవరిని ఆధరిస్తే వారు ప్రజాసేవకులై పరిపాలిస్తారు. వారి పరిపాలన నచ్చకుంటే అదే ప్రజలు వారిని దింపేస్తారు.

పత్రికలు,మేధావులు తమకు తోచిన /అందిన/తెలిసిన నిజా నిజాలను ప్రజలకు చేరవేసే ప్రయత్నం చెయ్యొచ్చు. కాదనను.కాని ఏక పక్షంగా -హిడెన్ అజెండాలతో -అ సహనంతో - కుట్ర పూరిత చర్యలతో ఆ పని చేస్తే వారనుకున్నదీ జరుగదు.పైగా వారూ చరిత్రహీనులుగా మిగిలిపోతారు.

7 comments:

  1. abba emi rassarandi... kobbari noone talaku raasinattu.
    meeru ellage kalakaalam jagan naamasmaran chestu maraninchandi.

    ReplyDelete
  2. jagan ichche biryani potlam thini, mandu kotti, notu theesuku votese gorrela manda lo nuvvoo oka gorrevi... anthenaa... sare...

    ReplyDelete
  3. ఈ వ్యాసం చిదివితే ప్రజలకు నిష్పక్షపాతంగా వార్తలందించవలసిన ఓ దినపత్రిక నిస్సిగ్గుగా తన రాజకీయ ఎజెండాని కుళ్లు బుధ్ధులనూ అనవసరంగా బైటపెట్టకుంటున్నాదనిపిస్తుంది. ఈ పత్రిక ఏనాడైనా బాబుగారి ధర్నాల తర్వాత ప్రజలకేం ఒరిగిందో చెప్పిందా? రాష్ట్రపతి ఎన్నికల్లో జగన్ వారికిష్టమైన వారికి ఓటేయడాన్ని రాజకీయం చేయడం కంటె హీనమైన పని మరొకటుండదు.కేసులనుంచి బయట పడడానికే జగన్ కాంగ్రెసు వారి కాండిడేటుకి ఓటేసారనడం చూస్తే జగన్ని కాంగ్రెసు వారే అరెస్టు చేయించారని ఎప్పుడు కావాలంటే అప్పుడు బయట పడేయగలరనీ ఒప్పుకున్నట్టు అవుతుంది. అంటే జగన్ అరెస్టు కాంగ్రెసు కుట్ర అన్నమాటే కదా?. మరి ఈ మాట ఈ పత్రికలు జగన్ని అరెస్టు చేసినప్పుజెందుకు చెప్పలేదు.ఇప్పుడు మనకు వార్తా పత్రికలు లేవు. పార్టీ కరపత్రికలే ఉన్నాయి.

    ReplyDelete
  4. bhale..., nijame..., jagan ku ranku mogudee RadhaKrishna, The Brave Heart...RK...

    ReplyDelete
  5. all are sailing in the same boat

    ReplyDelete
  6. అది ఎడిట్ పేజీలో వచ్చింది.. న్యూస్ కాదు, వ్యూనే. రాధాకృష్ణ స్టాండే అది. ఇవాళ తమరు కొత్తగా కనిపెట్టిందేంటో చెబుతావా నాయనా

    ReplyDelete
  7. chepaanu kadaa..., ee sambargaadu o verribaagulodu ani.

    ReplyDelete