క్షమించండి !

నా ఈ బ్లాగును అప్డేట్ చెయ్యడం లేదు. ప్రస్తుతం నా మరో తెలుగు బ్లాగ్ రెగ్యులరుగా అప్డేట్ అవుతూంది. అందులోని టపాలను చదవడానికి ఇక్కడ నొక్కండి

Sunday, 29 July 2012

షర్మిల భారతిల పై "ఐ" కుట్టింది

ఎంతటి ఘోర యుద్దం జరిగినప్పటికి ఆ యుద్దంలో స్త్ర్రీలు,పిల్లలు,వృద్దులకు ఎటువంటి హాని కలగకుండా చూడాలన్నిదై ధర్మ శాస్త్ర్రం.

కాని వై.ఎస్.మరణానంతరం జరుగుతున్న ప్రతి విషయం రాష్ఠ్ర్ర రాజకీయాల్లో ఎనాడూ జరుగనివే జరుగుతున్నాయి. జరుగరానివే జరుగుతున్నాయి. ఏం చేద్దాం.. అందులో -ఆ విడ్డూరాల్లో ఒకటే ఐ.టివి షర్మిల -భారతిల పై ప్రసారం చేస్తున్న కథనాలు.

సూర్యాస్తమయం అనంతరం చంద్రోదయానికి కొంత సమయం పడుతుంది. ఆ లోపే విష సర్పాలు బుసకొడతాయి. వాటిని చూసి వానపాములు సైతం బుసకొట్టే ప్రయత్నం చేస్తాయి. అటువంటి వానపాములో ఒకటే ఐ టివి.

చానల్ మారుస్తుంటే అప్పుడపుడు తారాస పడే కొన్ని దృశ్యాలే చూసాను కాని పూర్తిగా చూసే ఓపిక లేదు. ఇన్నాళ్ళ నా అబజర్వేషన్ కరెక్టైతే ఐ.టివి కథనం యొక్క సారాంశం " డా.వై.ఎస్. గారాల పట్తి షర్మిలకు జగన్ సతీమణి భారతి నడుమ ఆధిపత్య పోరు జరుగుతుందన్నదే.

వీరి తెలివిని కాకి ఎత్తుకెళ్ళిందా ఏమి తెలియడం లేదు. సార్వత్రిక ఎన్నికలు జరుగలేదు. వై.కా.పా టూ థెర్డ్ మెజారిటి సాధించలేదు జగన్ సి.ఎం కాలేదు -కనీశం బెయిల్ మీదన్నా జైలునుండి భయిటపడలేదు. అప్పుడే ఆధిపత్య పోరు మొదలైందట.

అబద్దం చెప్పినా అతికినట్టుండాలి. అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్టుగా ఉంది ఈ చానల్ వ్యవహారం. మీడియాలో పోటీ ఉంది కాదనను. వీరికి జగన్ పై వైరం ఉండొచ్చు కాదనను. అయినా పోటీని తట్టుకోవడానికి వీక్షకుల సంఖ్యను పెంచుకోవడమే. అందుకు చెయ్యాల్సింది కాస్త బుర్ర పెట్టి ఆలోచించి మంచి మంచి కార్యక్రమాలు ప్రసారం చేయడమే.

జగన్ మీద వైరం ఉంటే వై.కా.పా సింద్దాంతాలను విమర్శించాలి. ఎం.ఎల్.ఏల పనితీరులో లోపముంటే ఎత్తి చూపాలి. అంతే గాని ఇలా మహిళలను సైతం న్యూస్లోకి లాగడం -కన్నం పెట్టడం కన్నా హేయమైన చర్య.

2 comments:

  1. abbe..., nenu bharathi ki kannu kuttindi... sharmila ku unna craze choosi ani vinnaane... idivaraku.

    anduke sirisilla ku sharmila vellaledu anukunnaa.

    ayinaa... nuvvo verribaagulodivi, prathidaanikee react avuthaav.

    ReplyDelete
  2. kannamaa...? evariki kannam...? emi pettadam...? konchem clear gaa cheppu.

    ReplyDelete