క్షమించండి !

నా ఈ బ్లాగును అప్డేట్ చెయ్యడం లేదు. ప్రస్తుతం నా మరో తెలుగు బ్లాగ్ రెగ్యులరుగా అప్డేట్ అవుతూంది. అందులోని టపాలను చదవడానికి ఇక్కడ నొక్కండి

Monday, 30 July 2012

ఏం రాజకీయాలో ఏమో?

న్యూస్ పేపర్స్ తప్పించి ఇంకేమి చదవను.న్యూస్ చానల్స్ తప్పించి ఇంకేమి చూడను.రాజకీయాలు తప్పించి ఇంకేమి మాట్లాడను. ఈ స్థితికి నేను చేరుకోవడానికి ఎన్నో కారణాలున్నాయి.

అందులో ప్రప్రధమమైనది గతంలో నేనెదుర్కున్న నా పేదరికం. పేదరికం కారణంగా నేనెదుర్కొన్న అవమానాలు. ప్రస్తుతం పూర్తిగా భయిటపడినట్టే .అయినా నాటి దుస్థితి ఇప్పటికీ ఒక పీడకలలా నన్ను వెంటాడుతూనే ఉంది.

నా పేదరికానికి ఇంకెవరినో కారకులు చెయ్యడం నా ఉద్దేశం కాదు. కాని నాతో పోలిస్తే ఏమాత్రం అర్హత లేని ఎదవన్నర ఎదవలు సైతం "ఏదో మార్గాన" రెండు చేతుల్లో సంపాదిస్తుంటే -సంపాదించిన వాటిని అనుత్పాదక రంగాల్లో పోసి -మసి చేసి - తాము చెడి -సమాజాన్ని నాశనం చేస్తుంటే మాత్రం ఈ వ్యవస్థ మీద చిర్రెత్తి పోతుంది.

ఇదే వ్యవస్థలో - ఈ వ్యవస్థలోని లోపాల కారణంగా నేను కటిక పేదరికాన్ని- ఆకలిని ఎదుర్కొన్నాను. ఆకలితో అలమటిస్తున్నప్పటికి నేను కేవలం అది అధర్మమనో , అన్యాయమనో , సిగ్గు పడాల్సిన పననో చెయ్యలేనని వదులుకున్న పనులను ఎందరో లక్షాదికార్లు సైతం దర్జాగా చేస్తున్నారు. విధిలేని పరిస్థితిలో చేసి -చేస్తున్నందుకు సిగ్గు పడుతున్నా ఫర్వాలేదు. ఆ పని చెయ్యలేని వారిని "చేత గానోళ్ళని" తీసి పారేస్తున్నారు.

ఈ స్థితిగతులును మార్చాలంటే అది కేవలం రాజకీయాలతోనే సాధ్యం. అయితే నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి దూకేటంత ఆర్థిక స్థోమత నాకు లేదు.అందుకే ఎవరైతే మానవీయ పరిపాలన అందివ్వగలరో వారికి మద్దత్తు పలుకుతూ .. ఆదర్స ప్రాయమైన నా సూచనలు సలహాలను బ్లాగుల ద్వారా తెలియచేస్తున్నాను.

నేను మద్దత్తు పలికేవారు నా సలహాలు సూచనలను అమలు చెయ్యక పోవచ్చు. కాని వీటిని చదివే మీలో ఏ ఒక్కరో ఒక కలెక్టర్ కావచ్చు -ఒక ఎస్.పి కావచ్చు -ఎం.ఎల్.ఏ/ఎం.పి కావచ్చు.అప్పుడు నా సలహాలు గుర్తుకొచ్చి మీరే అమలు చెయ్యొచ్చు.

ఏది ఏమైనప్పటికి నా తాపత్ర్యం వ్యవస్థలో మార్పు కొరకే. జగన్ విషయంలో ప్రతి ఒక్కరు లేవనెత్తె సంగతి అవినీతి ఆరోపణలే.వాటిని కోర్టులు చూసుకుంటాయి. ఆరోపణలను మినహాయిస్తే నిత్యం ప్రజల్లో ఉండడం -ప్రజా సమస్యల పై స్పందించడం - తాను ఎవరి మీదైతే పోరాడుతున్నాడో -వారితో రాజికి సిద్దమై పోతే చాలు - అతనెదురుకొంటున్న అన్ని సమస్యలు హుష్ కాకి అయిపోతాయి.

అయినా రాజీలేని పోరాటం చేస్తున్నారాయన. పైగా నా ఆదర్శ పురుషుడు ఎన్.టి.ఆర్ - ఎన్.టి.ఆర్ మానవీయ పరిపాలనా విదానాన్ని స్వంతం చేసుకున్న వై.ఎస్. ఒరవడిని కొనసాగిస్తానని కమిట్ అవుతున్నారు. అందుకే ఉడతా పాటి సాయంగా జగన్కు మోరల్ సపోర్ట్ ఇస్తున్నాను.

నేను మొండి ఘఠాన్ని కాబట్టి - జగమొండిని కాబట్టి అన్నీ తట్టుకుని నిలబడ్డాను. భయిటపడ్డాను. కాని సామాన్యుడు ఏమై పోవాలి? రాజకీయాల పై నాకున్న ఆసక్తికి కారణం రాజకీయం సూటిగా సమాజాన్ని ప్రభావించ గలదు. పేదవానికి కాసింత ఊరటనివ్వ గలదు .లేదా వాడి బతుకును గుగ్గిపాలు చెయ్యగలదు .

మొదటి పనిని ఎన్.టి.ఆర్,వై.ఎస్.ఆర్ వంటి వారు చేసారు. చేస్తానని జగన్ ముందుకొస్తున్నారు.కాని ఇవి చాలవు. ఇవన్ని తాత్కాలిక పరిష్కారాలేనని నాకు తెలుసు. ఈ తాత్కాలిక పరిష్కారాలు సైతం లేకుంటే ప్రజలు -మరీ పేద ప్రజలు ఏమై పోవాలి?

శాస్వత పరిష్కారాలు ఎలా ఉండాలో నాకు పూర్తి అవగాహణ ఉంది. అయితే అది అమలయ్యే లోపు ప్రజలు విలవిలలాడి పోతారు. శాస్వత పరిష్కారాలు అమలయ్యే దాక వారి ఉనికిని కాపాడాలంటే - కాస్తో కూస్తో ఊరట కలిగించాలంటే అందుకు కావల్సింది ఎన్.టి.ఆర్ /వై.ఎస్.ఆర్/జగన్ మార్క్ పరిపాలనే.

రేపు జగన్ సి.ఎం కావడం -తాను హామి ఇచ్చిన సంక్షేమ పథకాలను అమలు చెయ్యడం తథ్యం.అయితే కేవలం వాటితో సంతృప్తి చెందే రకం మనిషిని నేను కాను. శాస్వత పరిష్కారాలను ప్రతిపాదిస్తూనే ఉంటాను.ప్రచారం చేస్తూనే ఉంటాను.

అయినా ఈ రాజకీయాల గురించి తరచూ ఆలోచిస్తుంటే బోర్ అనిపిస్తుంది. జీవితమే చాలా ప్రేలవంగా కనిపిస్తుంది.అందుకని ఏం చెయ్యగలను? ఇకనైనా ఆలోచించి ఏదో ఒక "రిలీఫ్" వెతుక్కోవాలి..

8 comments:

  1. ఉండి ఉండి నీకు వైరాగ్యం వచ్చేస్తోందే. జాతకాలు చెప్పుకో బతికిపోతావ్. జగన్గాడు నీమీద ..చ్చ కూడా పొయ్యడు.

    ReplyDelete
  2. డియర్ మిస్టర్ అనాని !
    ఇంతకాలం ఎల్లో సిండికేటుకు వకాల్తా పుచ్చుకుని - మా మీద అనాని కమెంట్లు వేస్తు వచ్చిన నీ లాంటి వారికి ఎవరో వస్తారని ఏదో పోస్తారని ఉండి ఉండవచ్చేమో?

    ఒక నెత పై - అభిమానికి ఉన్న అభిమానం అర్థం కావాలంటే మీ నాయకులు నాయకులై ఉండి ఉండాలి.

    మీరు అతని నాయకత్వ లక్షణాలను అభిమానించి ఉండాలి.ఎలాగో ఈ రెందు లేవు కాబట్టి ఇటువంటి కమెంట్స్ వెస్తుంటారు.

    మీరు వేసే ఇటువంటి ప్రతి కమెంటు మీ+మీరు వకాల్తా పుచ్చుకుంటున్న యెల్లో సిండికేట్ అవలక్షణాలకు తిరుగులేని ఆధారాలని గ్రహించగలరు/

    ReplyDelete
  3. వాణీపుత్రులవారూ,
    పైనున్న Anonumous కామెంటు అభ్యంతరకరంగా ఉంది.
    అయితే 'ఎల్లో సిండికేటు' అనే దాని ప్రస్తావన అతడు/ఆమె చేయలేదే. ఇక్కడ లేని దానిమీద మీరు విరుచుకు పడటం కూడా అభ్యంతరకరమే.
    మీ ఊహ "రేపు జగన్ సి.ఎం కావడం -తాను హామి ఇచ్చిన సంక్షేమ పథకాలను అమలు చెయ్యడం తథ్యం" అని. కావచ్చును, కాకపోవచ్చును. కాని మీ ఊహకు అడ్డుపడేవాళ్ళని సిండికేట్లుగా లెక్కించటానికి ప్రయత్నిస్తున్నారా? అనతికాలంలో అనంతసంపదను జగన్ పోగేసుకుని విలాససౌధాలను నిర్మొగమాటంగా నిర్మించుకొని రాజకీయాలలో దూకి నిరుపేదలకు సేవచేయాలని తపించిపోతున్నాడంటే నమ్మటం చాలా కష్టంగా ఉందని గ్రహించండి. దీని అర్థం మీకు నేను automatic గా వ్యతిరేకపక్షంలో చేరి అవాకులు మాట్లాడుతున్నట్లు కాదు.
    మీరు తరచు స్వర్గీయ NTR గారిని YSR తోనూ, వారి పుత్రరత్నం తోనూ పోల్చటం కూడా అభ్యంతరకరమే. మీ ఊహలో తప్ప NTR కూ వీరికి యేమీ సామ్యం కనబడదు.

    మానవీయ పరిపాలన యేమిటి, అది YSR అందివ్వటమేమిటి? తనవాళ్ళబాగుకోసం జనం సొమ్మును ధారాళంగా దుర్వినియోగపరచిన YSR మానవీయపాలకుడనుకోవటం చాలా దారుణం. ఇది నా అభిప్రాయం. మీ అభిప్రాయంలో YSR కేవలం అపర శ్రీరాముడైతే అది విచారించాల్సిన సంగతి.

    ఇక మీ (గతకాలపు)పేదరికం గుర్రించిన ప్రస్తావన మీ వ్యాసానికి యేమీ ఊతమివ్వలేదని గ్రహించగలరు.

    ReplyDelete
  4. U R True Mr.Syamaleeyam..., nenu jagan nu thiduthunte nannu koodaa pachcha chokkaa gaadini anukuntunnaadu ee sambar gaadu. meeru entha cheppinaa ee verribaaguloduki ardham kaadu. mana noru neppi. veedu koodaa YSR valla akram gaa labdi pondina candidate ayi untaadu. paiki beeda arupulu arusthunnaadu.

    ReplyDelete
  5. నాయనా అనాని !
    నువ్వు ఆకాశరామన్నగా విచ్చేసినా నీ కథా కమేషాలు మొత్తం తిరగతోడి మా తమ్ముళ్ళు అందచేసేసారు. ఇకనైనా నీ న్యూసెన్స్ ఆపక పోతే నీ అసలు పేరు ఊరు ప్రకటించాల్సి ఉంటుంది. టేక్ కేర్..

    వై.ఎస్.ఆర్ ను ఓడించడానికి తె.దే.పా ,ఈ రోజు వై.ఎస్. పేరును మరుగన పడెయ్యడానికి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న నగదు బదిలి పథకం వలన ఎన్ని లక్షల మంది లబ్దిదారులు నష్ఠ పోతారో మీకేం తెలుసు..

    త్వరలో వై.ఎస్ మార్క్ పాలనలో ఒరిగిందేమో? కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగితే ఎంతగా ప్రజలు నష్ఠ పోతారో సవివరంగా తెలియ చేస్తా

    ReplyDelete
  6. sare..., prakatinchu, indulo thappemundi..., ID tho comments isthe ananymous gaa boothulu thiduthunnaaru gaa mari. nenoo ade paddathi follow ayyaanu. indulo thappemundi. ID tho naa laanti vaadu sabhyatha gaa comments isthunte..., mammalni ananymous gaa boothulu thitte comments nu nuvvu publish cheyakoodadu mari.

    ReplyDelete
  7. sorry kannaa..., evadainaa nannu okasaari thidithe, nenu padi saarlu thidathaa. alavaatu maanalekunnaa. appati varakoo sabhyathaa gaa unde nenu control thapputhaa. nannu thittanantha varake eduti vaadiki gouravam..., nannu thittaado..., ayipoyaade...

    once again sorry...

    ReplyDelete
  8. saregaanee..., naa peru, vooru, kadhaa kamaameeshoo prakatisthaanu annavu..., eppudu prakatisthaavaa ani eduru choosthunnaa...

    ReplyDelete