క్షమించండి !
నా ఈ బ్లాగును అప్డేట్ చెయ్యడం లేదు. ప్రస్తుతం నా మరో తెలుగు బ్లాగ్ రెగ్యులరుగా అప్డేట్ అవుతూంది. అందులోని టపాలను చదవడానికి ఇక్కడ నొక్కండి
Pages
Thursday, 2 August 2012
నేతల్లో సూర్య - చంద్రులు
కేవలం నేతల్లోనే కాదు -సామాన్యుల్లోను రెండు వర్గాల వారు ఉంటారు. ఎన్.టి.ఆర్ సూర్యుడు -చంద్రబాబు చంద్రుడు. డా.వై.ఎస్ సూర్యుడు -రోశయ్య,కిరణ్,కె.వి.పి వంటి వారు చంద్రులు (నేను సైతం చంద్రుడి కోవకు చెందినవాడ్నే)
సూర్య చంద్రులు ఇద్దరూ ప్రపంచానికి వెలుగినిచ్చేవారే. కాని సూర్యుడు స్వయంప్రకాశి .చంద్రుడు సూర్యుని తేజాన్ని ప్రతిబింబించేవాడు. సూర్యోదయం మనుషుల్లో మెలకువను,చురుకుదనాన్ని పుట్టిస్తుంది. చంద్రోదయం పగటి పూటంతా కష్ఠించి పని చేసినవారికి , భాద్యతను నిర్వర్తించిన వారికి - అలసిన వారికి కాసింత రిలీఫ్, విశ్రాంతిని ఇస్తుంది.
సూర్యోదయం ప్రారంభంకాక మునుపు ప్రజలు కారు చీకట్లో చిక్కుకుని తాడేదో పామేదో తెలియక -చలితో -భయంతో వనికి పోతుంటారు. సూర్యుడు నడినెత్తి మీదికి వచ్చినప్పుడు "అబ్బబ్బా..ఏం పాడు ఎండో "అని విసుక్కుంటారు కూడ.
సూర్య రశ్మి లేనిదే ఈ భువి పై ఏ పైరు,పంట,జీవరాశి బతక లేవు. అయినా సూర్యుని రాకకు పూర్వం తాము ఎదుర్కొన్న భయము - చలిని బలహీన మనస్కులైన సామాన్యులు మరిచి పోతారు.
చంద్రుడు ఎప్పుడు ఉదయస్తాడా - సూర్యాస్తమయం ఎప్పుడు జరుగుతుందా? ఏం చక్కా కవితలల్లుకోవచ్చు - ప్రియురాళ్ళతో రాసలీలలాడుకోవచ్చని కల కంటారు.
వెయిటింగ్ లిస్టులో ఉన్న చంద్రులకి కాస్త ఉత్సుకత కలుగుతుంది. ప్రజలు సూర్యుడ్ని వ్యతిరేకిస్తున్నారు. ఇదే నేనైయ్యుంటే ఇలా "వేదించే వాడ్ని"కాను . అందరిని చల్లగా చూసుకోగలను అని భావిస్తారు.
తమ కాంతికి మూలం సూర్య రశ్మియే అని - సూరీడు లేకుంటే / అర్దాంతరంగా అస్తమిస్తే ప్రపంచం అల్లకల్లోలమవుతుందని - అర్దాంతరంగా తాము ఉదయించినా ఏమి పొడవలేమని ఆలోచించరు.
సృష్ఠిలో సూర్యుడు ఎంత ముఖ్యమో చంద్రుడు కూడ అంతే ముఖ్యం.కాని ఎవరి పని ఎప్పుడు ఎవరు చెయ్యాలో అప్పుడు ఆ పని చెయ్యాలి.
కాని సృష్ఠి ధర్మాన్ని మరిచి -కేవలం ఉత్సుకతతో - అతివిశ్వాసంతో సూర్యుని పాత్రను పోషించాలని కుతకుతలాడి పోతారు. ముందస్తుగా ఉదయిస్తారు (కె.వి.పి మాత్రం మరీ ఆలశ్యంగా - రుతు పవణాలు పది రోజులు ఆలశ్యమైతేనే ఎంత ఇబ్బందో మనకు తెలుసు -సృష్ఠి క్రమం తప్పితే అంతే సంగతులు -ఇందులో స్పీడు పనికి రానట్టే -ఆలశ్యం కూడ పనికి రాదు)
ఎన్.టి.ఆర్ మరణానంతరం చంద్రబాబుకు - వై.ఎస్.మరణానంతరం రోశయ్య,కిరణ్,కె.వి.పిలకు జరిగింది ఇదే. చంద్రుని కోవకు చెందిన వ్యక్తులు తమ పాత్ర ఏమిటో -తమ ప్లస్ ఏమిటో -తమ మైనస్ ఏమిటో అర్థం చేసుకుని వ్యవహరిస్తే వారికి మేలు జరుగుతుంది. ప్రజలకు మేలు జరుగుతుంది.
అరగుండు బ్రహ్మానందం కూడ హీరో రోల్ చెయ్యగలడు.కాని స్క్రిప్ట్ వేరే అయ్యుండాలి. బ్రహ్మానందాన్ని పెట్టి ఖైది పార్ట్ టూ తీయలేంగా?
చంద్రుని కోవకు చెందిన వ్యక్తియొక్క ప్రధాన భాధ్యత సూర్యాస్తమయంతో డీలా పడ్డ ప్రజలకు "డోంట్ ఒర్రి..రేపు మళ్ళీ సూర్యోదయం జరుగుతుంది. సూర్యుని ప్రభావంతో కార్యోన్ముఖులై కష్ఠించి పని చేసారు. ఇది విశ్రాంతి తీసుకోవలసిన సమయం.రేపటి కార్యాచరణకు సిద్దం కండి.కాసింత రిలాక్స్ అవ్వండి. నేను ఏమీ పొడవలేను - కాని మిమ్మల్ని రిలాక్స్ చెయ్యగలను.మరో సూరీడొస్తాడు అని ఓదార్చాలి .ఊరటనివ్వాలి.
అలా కాక సూరీడు మనల్ని మాడ్చి మసి చేసాడు -సూరీడు ఇక రాడు -ఇక నేనే సూరీడ్ని అని బీరాలు పలికితే కొంత సేపటికి చీకటి కమ్ముకుంటుంది -చలి వనికిస్తుంది -తాడో పామో తెలీని దుస్థితి వస్తుంది.అప్పుడు ప్రజలు సూరీడ్నే కోరుకుంటారు.
కిరణ్ తాను చంద్ర కిరణ్ అని గుర్తెరిగి -తన పాత్రను పోషిస్తే సరే సరే. నేనే సూరిడ్నని భ్రమించి గొప్పలకు పోతే చేతికి చెప్పే..
నేనూ చంద్రుని కోవకు చెందిన వ్యక్తినే.. నా రచనలు చదువుతుంటే కమ్మగా -ఇంపుగా ఉంటుంది. కాని నా వ్రాతలు రచనలు సూరీడ్ని తెస్తాయా? ఊహూ.. "సూరిడొస్తాడనే" విశ్వాసాన్ని కలిగిస్తాయంతే..
ఇది సూర్య చంద్రులకు మద్య ఉన్న వ్యత్యాసం..!
Labels:
congress YSR,
leaders,
leadership qualities,
NTR,
psycology
Subscribe to:
Post Comments (Atom)
వాణీపుత్రులవారూ,
ReplyDelete> నా రచనలు చదువుతుంటే కమ్మగా -ఇంపుగా ఉంటుంది
ఎవరికి?
మీ రచనలు మీకు కమ్మగా -ఇంపుగా ఉంటే వింత యేమీ లేదు.
అందరికీ అలా ఉంటాయని భావించేసుకోవటం భలే వింత.
మీరు ఇలా రాసుకోకుండా ఉండవలసినది అని నా ఉద్దేశం.
శ్యామలీయం గారూ,
ReplyDeleteఅలా వ్రాసుకుంది నా రచనలను పొగుడుకోవడానికి కాదు. జగన్ వంటి సూర్య తత్వమున్న నేత లేనిదే నా రచనలు నిష్ప్రయోజనకరం అని చెప్పడానికే.
ఏం చేద్దాం ఆన్ లైన్లో చదివినప్పుడు స్క్రాల్ చేస్తూ పోవడం వల్ల వచ్చే చిక్కిది.
వాణీపుత్రులవారూ,
ReplyDeleteనేను పూర్తిగా చదివే వ్యాఖ్యానించాను. నేను స్క్రాల్ చేస్తూ పోవడం వల్ల పొరబడి వ్యాఖ్యానించ లేదు.
మీ వీరారాధనకు జగన్ సూర్య తత్వమున్న నేత కావచ్చును కాని పొగడ్త అతి అయితే వినడాని వెగటుగా ఉంటుంది.
మీ పొగడికలూ తెగడికలూ మితిలో ఉంటేనే చదవటనికి యోగ్యంగా ఉంటాయని గ్రహించ గోరుతాను.
mari 'andhrajyothi' Radhakrishna, CBI JD Lakshminarayana lanu rahu kethuvulu ani antaademo ee sambar gaadu. Ha...Ha...Ha...
ReplyDeleteasale RK rankumogudu laa thayaarayaadu jaggoo dada ku.
RK, JD... The Brave Hearts...
అనానిగా..
ReplyDeleteఈ దేశం ఎంతగా నాశనమై పోయినా ఇది భాగుపడుతుందని కొద్దో గొప్పో విశ్వాసం కల్పించేది ఇంకా బతికే ఉన్న ప్రజాస్వామ్యం ఒక్కట్టే.
ప్రజా స్వామ్యంలో ప్రజలే ప్రభువులు . అక్షరాలమ్ముకునే ఫోర్ ట్వంటీలు, బ్యూరాక్రట్లు కాదు.
మీ ఆర్.కెను మా వార్డులో కౌన్సిలరుగా గెలవమను చూద్దాం.. మీ జె.డి మహా ప్రభువును ఏదైనా సిటిలో మేయరుగా గెలవమను చూద్దాం. డెపాజిట్లు దక్కవు..
avunu mari..., 'gorre kasaayi vaadini nammuthundi' annattu gaa thayaarayaaru mana janaalu, iha mana state maro Bihar gaa thayaaruvuddi ilaa ayithe.
Deletesorry..., mana state kaadu..., maa state..., needi tamilnadu kadaa...
డియ మిస్టర్ అనాని !
Deleteతెలుగు వాడినని బీరాలు పలికే నువ్వు ఇంగ్లోషులో టైప్ చేస్తుంటే - అరవ -అని మీరరిచి గీపెట్టే నేను తెలుగులో .
ఇంకో మాట ..ఒక వ్యక్తితో స్నేహం కోరుకున్నప్పుడు అతని గురించి ఏమి తెలియక పోయినా ఫర్వాలేదు. కాని "యవ్వారం" పెట్టుకునే ముందు .....ముందు వెనుక ..తెలుసుకోవాలి.
నేను చిత్తూరు జిల్లాకు చెందిన వాడ్ని.. నా జన్మ స్థలం ఇది. ఇంకో మాట ..బీహార్ గురించి అన్నావు నితిష్ కుమార్ సారథ్యంలో ముందుకు దూసుకు పోతూంది బిహార్.
కిరణ్ ఇంకో ఆరు నెలలుంటే చాలు.. రాష్ఠ్ర్రం బతుకు చిత్తూరు పాత బస్ స్టాండే సుమా..
yavvaaram...? vaadevado goorchi, maniddariki 'yavvaaram' avasaramaa..., naaku telugu type cheyadam theleedu, aa lekhini tho nenu gokkolenu. emito..., svaardha, neecha, raajakeeya naayakula goorchi yavvaaraalu pettesukuntaamaa nuvoo, nenu...?
ReplyDeletenuvvu nannu 'enemy' gaa bhaavisthe cheppu..., inka nenu neeku comments ivvanu. nee blog moham koodaa choodanu.
politics ante cheppu debbaloo untaayi, poola dandaloo untaayi. naa comment ku nuvvu reply ivvu..., daaniki yavvaaram tho emi pani...?
ninnu alaa comment chesthe nuvvemo thega feel ayipothaavu mari. nuvvu maathram ilaa 'yavvaaram' anochchaa...!!!
"నేను చిత్తూరు జిల్లాకు చెందిన వాడ్ని.. నా జన్మ స్థలం ఇది. ఇంకో మాట ..బీహార్ గురించి అన్నావు నితిష్ కుమార్ సారథ్యంలో ముందుకు దూసుకు పోతూంది బిహార్.
కిరణ్ ఇంకో ఆరు నెలలుంటే చాలు.. రాష్ఠ్ర్రం బతుకు చిత్తూరు పాత బస్ స్టాండే సుమా.."
ane ee lines chaalu, naaku reply vachchesindi.
aa paidi anthaa asandarbham, negative impression paduthundi nee paina, automatic gaa jagan paina koodaa negative impression pade pramaadamundi. cool..., cool..., cool.
sare..., naa comments valla neeku chiraaku vasthe cheppu comments ivvanu. sarenaa...
nenu comment ivvaalo..., vaddo..., nuvvu cheppakundaa unte..., nenu 'mounam ardhaangeekaaram' laa bhaavinchi comments isthoo untaanu. sarenaa..., indulo...'yavvaaram' emee ledu. sarenaa...
manam sneham gaa untoo..., ilaa evadino thittukuntoo comments ichchukovachchu. sarenaa...
డియర్ మిస్టర్ అనాని !
Deleteయవ్వారమంటే ఎన్నో అర్థాలున్నాయి.వాదన, డిబేట్ ,చర్చ ఇలా ఎన్నో అర్థాలు. నా యుద్దమంతా ప్రజాస్వామ్యాన్ని -ప్రజాభిప్రాయాన్ని పక్క ద్రోవ పట్టించే బ్యూరాక్రెట్లు,పోలీసు అధికారులు, సి.బి.ఐ లు ,రాజకీయ వ్యభిచారులు, ఇలా ఎంతో మంది ఉన్నారు..
పై పై నిజాలు చూసి కమెంట్స్ గుప్పించే నీ బోటి వారితో కేవలం యవ్వారమే ( నా నిఘంటువు ప్రకారం)