క్షమించండి !

నా ఈ బ్లాగును అప్డేట్ చెయ్యడం లేదు. ప్రస్తుతం నా మరో తెలుగు బ్లాగ్ రెగ్యులరుగా అప్డేట్ అవుతూంది. అందులోని టపాలను చదవడానికి ఇక్కడ నొక్కండి

Sunday, 5 August 2012

చదువెందుకు చదువెందుకు చంక నాకనా?


చిన్నప్పట్లో "చదువెందుకు చదువెందుకు చంక నాకనా మూడెనుములు మేపుకుంటే బువ్వ దొరకదా" అని పాడుకునేవారం. ఇది నిజమో ఏమో అనిపిస్తూంది.

అయితే ఇదీ మా జిల్లాలో అసాధ్యం.ఎందుకంటే రైతు మిత్ర -రైతు భాంధవుడు చంద్రబాబు చలవతో పాడి రైతులకు పాడె సిద్దమై పోయింది.

ఇంతకీ ఈ రోజు నెను స్పర్శించ దలచింది మన విద్యా వ్యవస్థను ..

డా.వై.ఎస్ ఒక యువకుడు పేదవాని కడుపున పుట్టాడన్న ఒకే కారణం చేత అతనికి విద్య అందని పండు కాకూడదన్న ఉన్నతాశయంతో తెచ్చిన పథకం ఫీజు రీ ఎంబర్స్ మెంట్. వై.ఎస్. తెచ్చిన ఇతర పథకాలకు "కోత" విధించినట్టే కొన్ని పథకాలకు తిలోదకాలిచ్చినట్టే ఈ పథకాన్ని కూడ తుంగలో తొక్కాలన్నది ప్రస్తుత ప్రభుత్వం యొక్క ప్లాన్.

అందుకే ప్రైవేటు కళాశాలలకు ఎందుకు అంత డబ్బు ధార పొయ్యడం అదేదో ప్రభుత్వమే కళాశాలలు ఏర్పాటు చేస్తే పోలేదా అని ఆలోచిస్తున్నారు.

కళాశాల అంటే అదేమి భటానాలు దుకానం కాదు.ఇవాళ అనుకుని ఇవాళే పెట్టెయ్యడానికి. మరీ ప్రభుత్వం -మరీ నేటి ప్రభుత్వం గట్టిగా పూనుకున్నా పది సం.లు పడుతుంది.

నాకైతే గట్టిగా పూనుకుంటారన్న విశ్వాసం లేదు. పోని అనుకుంటారన్న నమ్మకం కూడ లేదు.మరి ఎందుకీ ప్రతిపాదన అంటే ఇంకేం "వసూళ్ళ పర్వం" మొదలవుతుంది. "చెల్లింపులు"జరిగాక కళాశాలలు పెట్టడం ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి ఫీజు రీ ఎంబర్స్ మెంట్ కొనసాగుతుందని ప్రకటిస్తారు. ఇందులో నాకెటువంటి అనుమానమూ లేదు.

దీని పై వై.కా.పా గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ దీక్ష చే పట్టనుండటం కూడ మంచిదే. కాదనను. పథకంకొనసాగుతుందా? లేదా అటకకెక్కి జగన్ సారథ్యంలో పున:ప్రారంభం అవుతుందా అన్నవి కూడ పక్కన పెడదాం.

నేను వై.ఎస్సార్ని తప్పు పట్టేటంత మేథావిని కాను.అయితే ఆయన కేవలం హృదయంతో ఆలోచించే వ్యక్తి. ఆయన ప్రక్కనే ఉన్న రోశయ్య వంటి వారు ఏం చేస్తున్నారో ఏమో?

పేద విథ్యార్థుల విద్యా ఖర్చులు భరించడం ధర్మమే. న్యాయమె .కాదనను. కాని ప్రభుత్వ సొమ్ముతో -అంటే నిరుపేదలు సైతం ప్రభుత్వానికి ప్రత్యక్షంగానో -పరోక్షంగానో ఇచ్చే పన్నులతో విద్యను పొందే వారు ఈ రాష్థ్ర్రానికి -ఈ ప్రజలకి ఏం చేస్తారు అన్న ప్రశ్న ఎందుకు ఉత్పన్నం కాలేదు?

అదీ పోన్లే .. విద్య ఓకే. ఆ విద్య ఎటువంటిది? ఆ విద్యతో ఆ విధ్యార్దికి ఒరిగేదేమి? ఆ విద్య కనీశం అతన్నైనా అతని కుటుంభాన్నైనా పోషించగలదో లేదో నిర్ధారించుకోవలసిన అవసరం ఉందా లేదా?

ఇటీవల ఇంజినీర్లుగా భయిట పడ్డ అభ్యర్దుల్లో డెబ్బై శాతం పనికి మాలినవారని ఒక సర్వేలో వెల్లడైంది. నేను బి.కాం చదువుకున్నాను. 1987 లో నుండి ఈ రోజుదాక నేను నాకై నేర్చుకున్న జ్యోతిషం, కంప్యూటర్,వెబ్ పబ్లిషింగ్, నాకు నేనై పాసైన ప్రవేశిక, తెలుగు బాష వంటివి నాకు కూడు పెట్టాయేమో కాని నా విద్య ఏమాత్రం నా జీవన పోరాటంలో నాకు ఉపయోగ పడలేదు. పైగా కాయ కష్ఠం చేసి బతుకు బండి లాగే అవకాశాన్ని మంట కలిపింది.

ఇంగ్లీష్ మీడియం స్కూల్లో 8 వ తరగతి చదువుకునే పిల్లాడు రేషన్ షాపు వద్ద జనం ఉండటాన్ని చూసి
"అంకుల్ ! వీరంతా ఎందుకు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు" అని అడిగాడు. మన చదువులు ఇలా ఏడ్చాయి.

ఒక ప్రభుత్వ అప్పర్ ప్రైమరి స్కూల్లో విద్యావాలంటీరుగా కొన్నాళ్ళు పని చేసాను. అక్కడి హెడ్ మిస్టర్స్, టీచర్స్ కు సైతం ఏమి రాదు. వారు ఏం నేర్పిస్తారో ? పిల్లలు ఏం నేర్చుకుంటారో ఏమో?

ఒక ప్రైవేటు హై స్కూల్లో హింది టీచర్గా జాయిన్ అయ్యాను .8,9,10 తరగతుల్లోని పిల్లల్లో సైతం నూటికి తొంబై మందికి హింది అక్షరాలు సైతం తెలీదు.

ఈ రోజు నిత్యానందా వంటి దొంగ స్వాముల చెంత చేరి వారి చంక నాకుతూ పెంచి పోషించిన తల్లి తండ్రులను వారి ఖర్మకు వదిలి పెట్టేసిన వారూ ఉన్నత విద్యలు పొందిన వారేగా?

ఈ రోజు ఒక న్యాయమూర్తి " విద్యార్హత లేని వారు చట్ట సభల్లోకి రావడం దురదృష్ఠకరం" అన్నాడని చదివాను. ఆయిన గారి దృష్ఠిలో చదువుకున్నవారందరు కదిగిన ముత్యాలో ఏమో?

విద్య అంటే అది విధ్యార్థికి తన తనువు,మనస్సు,బుద్ది,ఆత్మ ,కుటుంభం,సమాజం,రాష్ఠ్ర్రం,దేశం, ప్రపంచాల గురించిన వాస్తవికతను భోధించేదై ఉండాలి.

ఇన్ఫోసిస్ ఉధ్యోగిని నీలిమ కథ చూడండి.ఆవిడ చదువుకో లేదా? ఆ చదువు ఆమె ప్రాణాలను ఎందుకు కాపాడలేక పోయింది.

మన విద్యావ్యవస్థలోనే పెద్ద లోపం ఉంది. విద్య మనిషిని కనీశం ప్రాణాలతో బతికేలా కూడ చెయ్యడం లేదు.ఈ లోపాన్ని సవరించాలి.

మనదేశంలో యువజనమే అత్యధికం అని చంకలు గుద్దుకుంటున్నాం.ఆ యువజనం ఏం చేస్తూంది? బైక్ రేసుల్లో,ర్యాగింగులతో, ఈవ్ టీజింగులతో ,జల్సాల కోసం చెయిన్ స్నాచింగులతో , మత్తు పదార్థాలతో సర్వనాశనమై పోతూంది.

ఫీజు రీ ఎంబర్స్ మెంటు ఇచ్చి - ఉత్తుత్తే డిగ్రీలు చేతికిచ్చేస్తే చాలదు.. ఆ విద్య అతన్ని జీవన పోరాటానికి అర్హునిగా చెయ్యాలి. ఆ విద్య అతనికి -అతని కుటుంభానికి -ఈ సమాజానికి - దేశాని ప్రయోజనకరంగా ఉండాలి , ఈ దిశగా యుద్ద ప్రాతిపదికన స్పందించి - కనీశం తదుపరి విథ్యా సంవత్సరానికైనా సరైన విద్య ప్రతి ఒక్క విథ్యాది ,విథ్యార్థినికి అందేలా చూడాలి.

లేకుంటే కోట్లాది తల్లి తండ్రుల సొమ్ము - ప్రభుత్వ సొమ్ము బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది.

2 comments:

  1. Nuvvu mathram chadvukoni emi labham sanka naaka. Jagan ki support cheyyatledhaaa ??

    ReplyDelete
    Replies
    1. ayinaa..., jagan ku ranku mogudu Andhrajyothy RadhaKrishna unnaadule...

      Delete