క్షమించండి !

నా ఈ బ్లాగును అప్డేట్ చెయ్యడం లేదు. ప్రస్తుతం నా మరో తెలుగు బ్లాగ్ రెగ్యులరుగా అప్డేట్ అవుతూంది. అందులోని టపాలను చదవడానికి ఇక్కడ నొక్కండి

Friday, 10 August 2012

ఆగస్ట్,14 నుండి - సెప్టెంబరు,28 దాక హై అలర్ట్


ఇటీవల నేను వ్రాసిన ప్రో జగన్ తపాలతో నా మీద ఒక ముద్ర పడిన మాట వాస్తవమే. అందుకే - ఆ ముద్ర చెరిపెయ్యడానికే ఈ టపా వ్రాస్తున్నానని భావిస్తే అది పొరభాటు. ప్రో జగన్ అన్న ముద్ర నా మీద పడినందుకు గర్విస్తున్నాను. సమ కాలీనులు నన్నసహించుకున్నా భావితరం నన్నర్థం చేసుకుంటుంది.

ఇక పాయింటుకొస్తా..

పొరభాటుగా నేను జ్యోతిష్కుడ్ని కూడాను. మరీ శని -కుజుల కలయక ఏర్పడనున్న ఈ తరుణంలో కూడ దాని గురించి వ్రాయకుంటే అది నేరమే అవుతుంది. శని కుజుల కలయక తులా రాశిలో ఆగస్ట్,14 నుండి - సెప్టెంబరు,28 దాక ఏర్పడనుంది. ఇది దేశానికి -రాష్ఠ్ర్రానికి నాయకులకు -ప్రజలకు పరీక్షాకాలమని చెప్ప వచ్చును.

రంపు,రచ్చలు,ఎడబాట్లు, అల్లర్లు,హింసా కాండలు,హత్యలు,ఆత్మ హత్యలు, ప్రాణ నష్ఠం , అంగ వైకల్యాన్ని ఇవ్వగల ప్రమాదాలు, విశ్ఫోటాలు అత్యధికంగా సంభవించే అవకాశం ఉంది. రక్తం చెడటం వలన జబ్బులు ప్రవలుతాయి ఉ: ట్యూమర్స్, కురుపులు



ఈ కలయక యొక్క ఎఫెక్ట్ రెండు ,మూడు నెలల పూర్వమే మొదలైనప్పటికి ఇది ఆగస్ట్,14 నుండి తీవ్ర రూపం దాల్చనుంది. ఈ కాలంలో శని -కుజులు కారకత్వం వహించే విషయాలు బాధిస్తాయి. శని -కుజులు కారకత్వం వహించే మనుష్యులు బాధింప పడతారు.

కారకత్వం అంటే ఏమిటి:
ఒక ప్రధాన మంత్రి/ముఖ్యమంత్రి తన మంత్రులకు శాఖలు (పోర్ట్ ఫోలియోస్) విభజించి ఇచ్చినట్టే భగవంతుడు కూడ ఈ ప్రపంచంలోని రంగాలు,వస్తువులు, మనుష్యులు,జంతువులను 9 భాగాలు చేసి (శాఖలుగా విభజించి) నవ గ్రహాలకు వాటి పై ఆధిపత్యం కల్పించి ఉన్నాడు.

మీకు ఒక మంత్రితో సత్సంభందాలుంటే ఆ మంత్రిత్వ శాఖలో అన్ని పనులు అవుతాయికదా. అలానే మీ జాతకంలో ఒక్క గ్రహం మంచి పొజిషన్లో ఉంటే ఆ గ్రహానికి సంభంధించిన రంగాలన్ని అనుకూలిస్తాయి.

శని కారకత్వం:

ఐరన్,స్టీల్,ఆయిల్, సెకండ్ హ్యాండ్ వస్తువులు, దుమ్ము దూళి నిండినవి, కుళ్ళు కంపు వచ్చేవి, జిడ్డు గలవి,నల్ల రంగుగలవి , పడమర దిశ, ఎస్.సి, బి.సి లు క్లాస్ ఫోర్ ఎంప్లాయిస్, పేద ప్రజలను దోచుకునే వ్యాపారాలు, (ఉ. నూటికి పది వడ్డి వ్యాపారం) , యూని ఫార్మ్ దరించిన కార్మికులు, కార్మిక సంఘాలు, నల్లని చాయ కలిగిన వ్యక్తులు, వికలాంగులు (ముఖ్యంగా కుంటి వారు) , నరాల వ్యవస్థ, కాలు, ఆసనం, ఆలశ్యం, బంధించపడటం, అవమానం, వ్యవసాయం, క్వారిలు,స్వరంగాలు, దీర్ఘ కాల ప్రాజక్టులు, దళిత వాడలు (మాల పల్లెలు), మరుగు దొడ్లు, డ్రెయినేజి వ్యవస్థ, సోమరితనం, కూలడానికి సిద్దంగా ఉన్న, కోర్టువ్యాజ్యాల్లో ఉన్న నివాసాలు, కాయులా పడ్డ కర్మా గారాలు, ప్రేతాత్మలు, బక్క చిక్కి పీక్కు పోయిన శరీరం,ముఖం గలవారు,కాళ్ళు,నూనె విత్తనాలు,లాయర్లు, మంద బుద్ది, అశుబ్రత, మరణ సంభంధ ఆదాయాలు, చేదైన వస్తువులు, చెత్త,చెదారం, స్క్రాబ్, భానిస వృత్తులు, మరణ సంభంద వ్యాపారాలు ( ఫ్రీజర్ బాక్స్) , జెయిలు, మార్చువరి,వల్లకాడు, మల బద్దకం ఆలశ్యం.ఎనుములు.

కుజ కారకత్వం

పోలీస్,మిలిటరి, రైల్వే,భూములు,సోదరులు,కెమికల్స్, అగ్ని,ఇందనాలు (ఫ్యూయల్స్) కట్టెలు,విద్యుత్, ప్రేలుడు పదార్థాలు, శతృవులు,మీకన్నా వయస్సులో చిన్నవారు, చిన్నవారిలాకనబడే వారు ( ఫిసిక్ - రూపం) , రాజు కులస్తులు, అగ్ని ముఖ వృత్తి వారు, దక్షిణ దిక్కు,ఉష్ణ రోగాలు, ట్యూమర్స్, రక్త శుద్దిలో సమస్యలు, కడుపులో మంట.పెప్టిక్ అల్సర్, పైల్స్, శస్త్ర్ర చికిత్స, రోడ్డు ప్రమాదం, అగ్ని ప్రమాదం, కోపం,ద్వేషం, రంపు,రచ్చ, కొమ్మున్న జంతువులు,పాలు ,పాల ఉత్పత్తులు, మాంసం, సుబ్రమణ్యస్వామి, స్పోర్ట్స్, వంట, మార్షల్ ఆర్ట్స్,యుద్దాలు, తర్కం, వ్యూహం, పగడం, ఎముకలోని బోన్ మ్యేరో, వ్యాధి నిరోధక శక్తి, బలి, మాంసాహారం.

ఈ కలయక రాశి చక్రంలో ఏడవ రాశి అయిన తుల యందు ఏర్పడనుంది.కావున ఫ్రెండ్,లవర్,పార్ట్నర్,వైఫ్ వగైరాల్లో తీవ్ర ఇబ్బందులొస్తాయి.

పోనీ ఈ కలయక ఎవరికీ అనుకూలం కాదా అంటే వృషభ,సింహ,మకర,దనస్సు రాశుల వారికి అనుకూలం. కాని ఈ గ్రహాల ఉమ్మడి వీక్షణం ఏ భావం పై పడితే ఆ భావ కారకం నశించనూ వచ్చు.

ఈ దుష్ప్రభావాలను తగ్గించుకునేందుకు కుజ,శని సంభంధ పరిహారాలు చేసుకుంటే సరిపోదు. శని-కుజ కలయక సంభంధ పరిహారాలు అనివార్యం.

పరిహారాలు తెలుసుకునేందుకు నాకు మెయిల్ చెయ్యండి: పూర్తిగా ఉచితంగా పంపుతాను. నా మెయిల్:

swamy7867@gmail.com

1 comment:

  1. achcham... jagan party goondaa laa..., sorry, kaaryakartha laa unnaavuraa... ee still lo..., super..., kummaiy..., deenammaa jeevitham...

    ReplyDelete