క్షమించండి !

నా ఈ బ్లాగును అప్డేట్ చెయ్యడం లేదు. ప్రస్తుతం నా మరో తెలుగు బ్లాగ్ రెగ్యులరుగా అప్డేట్ అవుతూంది. అందులోని టపాలను చదవడానికి ఇక్కడ నొక్కండి

Friday, 13 July 2012

జగన్కు అధికారం ఇవ్వాలి : ఏబిఎన్లో ఆర్కే వీక్ ఎండ్ కమెంట్




సెక్స్ వర్కర్ కి పీ.ఆర్.ఓ గా మారిన ఏబిఎన్ అధినేత రాధాకృష్ణ తమ వీక్ ఎండ్ కమెంట్లో జగన్కు అధికారం ఇవ్వాలి అన్నారు. అంటే ఆయన ఉద్దేశం రాష్ఠ్ర్రం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకు వై.ఎస్.ఆరే కారణమట. కాని ఈ విషయాన్ని కాంగ్రెస్ చెప్పలేక పోతుందట.తె.దే.పా పరిస్థితి కూడ కూడ ఇంతేనట. ప్రజలకు జగన్ పై మోజట . అది తీరాలంటే ఒక సారి జగన్కు అధికారం ఇవ్వాలట. ఇస్తే జనానికి జగన్ పట్ల ఉన్న మోజు తీరి పోయి -ఆ తరువాత తె.దే.పా/కాంగ్రెస్లకు ఓటు ఇస్తారట రాష్ఠ్ర్రం భాగుపడుతుందట.

ప్రజాస్వామ్య దేశంలో ప్రజల మెప్పు పొందిన వారు పరిపాలకులు కావాలి. నాయకత్వ లక్షణాలు - ప్రజలకు మేలు చెయ్యాలన్న తపన ఉన్నవారే ప్రజల మెప్పు పొంది పాలకులవుతారు. నాయకత్వ లక్షణాలతో ప్రజల మెప్పు పొంది అధికారం పొందిన వై.ఎస్ ఉన్నంత కాలం ..నేడు రాష్ఠ్ర్రాన్ని పట్టి పీడిస్తున్న ఏ సమస్యా లేదు. ఒకటి రెండు తలెత్తినా వై.ఎస్ సునాయాసంగా -సునితంగా ముసి ముసి నవ్వులతో పరిష్కరించేవారు.

ఎందుకంటే ఆయనలో నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.ప్రజాభలం అతని వెంట ఉంది. రోశయ్యలు,కిరణ్లు ఆ దిశగా కనీశం చూడడం కూడ అసంభవమైంది. ఎందుకంటే వీరిలో నాయకత్వ లక్షణాలు అసల్లేవు. ప్రజాభలం ప్రశ్నే లేదు.

వై.ఎస్.మరణానంతరం ప్రజాభలమున్న జగన్ను సి.ఎం చేసి ఉంటే అసలు ఈ మూడు సం.ల్లో ఎంతో అభివృద్ది జరిగేది. అభివ్రుద్ది మాట అటుంచితే ఇలాంటి "స్థంభన" ఉండేదే కాదు.

ఈ సంగతి మహా మేధావి అయిన ఆర్.కె గారికి కూడ తెలుసు. కాని ఆ రోజు తాము భుజానికెత్తుకున్న బాబును గద్దెనెక్కించాలంటే -ప్రభుత్వం -కాంగ్రెస్ పార్టి బలహీన పడాలి -రాష్ఠ్ర్రం నాశనమై పోయినా ఫర్వాలేదని మెజారిటి ఎం.ఎల్.ఏల మద్దత్తున్న జగన్ను సి.ఎం చెయ్యాలని తూ తూ మంత్రంగానైనా ఒక మాటైనా చెప్పని ఆర్ .కె లాంటివారు కాంగ్రెస్ -జగన్ మద్య చెడేంత వరకు ఆజ్యం పోసిన ఆర్ .కె లాంటివారు రాష్ఠ్ర్రం నేడున్న దుస్థితికి వై.ఎస్సే కారణం అనడం విడ్డూరం.

రాష్ఠ్ర్రం నేడున్న దుస్థితికి కారణం వై.ఎస్. కాదు. వై.ఎస్. మరణానంతరం జగన్మోహన్ రెడ్డికి ప్రజాస్వామ్య బద్దంగా శాసన సభలో అత్యధిక ఎం.ఎల్.ఏల మద్దత్తున్నప్పటికి రోశయ్యను సి.ఎం చెయ్యడాన్ని ఆర్.కె వంటి మేధావులు ప్రశ్నించక పోవడమే అసలు సిసలైన కారణం.

తప్పుడు నిర్ణయం తీసుకోవడం ఎవరికైనా సహజమే - కనీశం తప్పు తెలుసుకుని సవరించుకునే ప్రయత్నం చెయ్యాలి. రోశయ్య విషయంలో తప్పు చేసినా కనీశం కిరణ్కు పదివి కట్ట పెట్ట చూసినప్పుడన్నా "ఇది తప్పు - ఎన్.టి.ఆర్ పూర్వమున్న దుస్థితికి కాంగ్రెసును తీసుకెళ్తున్నారు -ఇది అప్రజా స్వామికం - సి.ఎల్పిలో ఓటింగ్ పెట్టండి - నామినేటడ ముఖ్యమంత్రులతో రాష్ఠ్ర్రానికి -రాష్ఠ్ర్ర ప్రజలకు ఒరిగేది ఏమిలేదని ఆర్.కె వంటి మేథావులు చెప్పి ఉంటే - వ్రాసి ఉంటే ఈ రాష్ఠ్ర్రానికి ఇంతటి దుర్గతి పట్టేది కాదు .

చేయవలసిందంతా చేసి ఇప్పుడు వై.ఎస్ మీదికి నెట్టడం అహేతుకం -అధర్మం -అమానుషం -దివాళాకోరుతనం

గమనిక:
ఈ వీక్ ఎండ్ కమెంట్లో చంద్రబాబును - ఎన్.టి.ఆర్ కుటుంభ సభ్యులను -ప్రత్యేకించి హరి కృష్ట ,జూ.ఎన్.టి.ఆర్లను సైతం ఎడా పెడా విమర్శించారు ఆర్.కె .

ఈ కమెంట్ ఆయన ఎంతటి ఫ్రస్ట్రెషన్లో ఉన్నారో ఇట్టే తెలియ చేస్తూంది. తాము ఎంతగా మోసినా - భుజానికెత్తుకున్నా బాబుకు అధికారం అందని పండుగానే ఉండడం ఆయనలో అసహనాన్ని పెంచినట్టుంది.

చివరికి కొడాలి నాని వై.కా.పాలోకి వెళ్ళడాన్ని జూ.ఎన్.టి.ఆర్ ఉద్దేశ పూర్వకంగానే అడ్డుకోలేదని కూడ చెప్పారంటే ఆర్.కె మానసిక పరిస్థితి ఎలా ఉందో ఇట్టే అర్థమై పోతుంది.



0 comments:

Post a Comment