ఇటీవల జరిగిన ఉపఎన్నికల్లో తుడిచి పెట్తుకు పోయిన కాంగ్రెస్ పార్టి భవిష్యత్ వ్యూహ రచనల గురించి నానా తంటాలు పడ్తూంది. వై.ఎస్.మరణానంతరం ఆ పార్టి వై.ఎస్. పట్ల జగన్ పట్ల ప్రవర్తించిన తీరు - ఎందుకు కొరగాని సి.ఎంలను ప్రజల పై రుద్ది -రాష్ఠ్ర్రంలో అయోమయ స్థితిని ఏర్పరచిన తీరు - దేశ వ్యాప్తంగా అవినీతీ కుంభకోణాలు మండి పోతున్న దరలు , తెలంగాణ విషయంలో అత్యుత్సాహం చూపి -ఆ తరువాత నాన్చుతున్న తీరు ఇవన్ని చూస్తుంటే ఆ పార్తిని భూస్తాపితం చెయ్యాలన్న కశి పుడుతుంది.
అయినప్పటికి ఒకప్పుడు వై.ఎస్. నేతృత్వంలో వెలిగి పోయిన పార్టి ఇలా దయనీయ పరిస్థితికి చేరడం చూస్తుంటే బాధేస్తుంది. చంద్రబాబు నేతృత్వంలోని తె.దే.పా కన్నా - కాంగ్రెస్ పార్తి బెటర్ చాయ్సె.
రానున్న ఎన్నిక్కల్లో ఎలాగో వై.కా.పా మెజారిటి సీట్లు సాధించడం ఖాయం.జగన్ సి.ఎం కావడం ఖాయం. కాని ప్రతిపక్షంలో చంద్రబాబు -తె.దే.పా కన్నా కాంగ్రెస్ ఉంటే ఎంతో కొంత రాష్ఠ్ర్రానికి మేలు జరిగుతుందన్న సదభిప్రాయంతో రాష్ఠ్ర్రంలో కాంగ్రెస్ పార్టి బలపడాలంటే ఎం చెయ్యాలో చెబుతున్నా.
కమిటి ఒకటి వేసి - ఆ కమిటి రోజుకో మంత్రి ఇంట్లో సమావేశం కావడం - విదితమే. కాని పార్టి దయనీయ స్థితికి వారూ కారకులుగా ఉన్న నేపథ్యంలో వారి "సిఫార్సులు" ఏ మెరకు నిజాయితిగా ఉంటాయి? ఏ మెరకు లాభిస్తాయి అన్నది అనుమానమే..
ఇక నా సలహాలు:
టప్ -టు - బాటమ్ చెదులు పట్టిన చెట్టులా తయారైంది కాంగ్రెస్. ఇంకో ఆరు నెలల్లో "అధ్బుతాలు" చేసి చూపించకుంటే దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ గల్లంతు కావడం ఖాయం. కాబట్టి నేనిక్కడ అందిస్తున్న సలహాలను ఆఘ మేఘాల పై అమలు చెయ్యాలి. మూన్నెల్లు నాన్చినా ఈ సలహాలు కూడ పనికి రావు.
స్థూలమైన మార్పుల కన్నా ప్రజల్లో విశ్వసనీయత పెంచే సైకలాజికల్ ట్రీట్మెంట్ అవసరం. కాబట్టి సోనియా వెంటనే పార్టి -యు.పి.ఏ అధ్యక్ష పదవులనుండి తప్పుకోవాలి.
ఉన్న ఎం.పిల్లోనే అత్యధిక ఓట్ల తేడాతో నెగ్గిన నలుగురుని ప్రతిపాదించి -వారిలో ఎవరికి ఐ.ఐ.సి.సి సభ్యుల్లో అత్యధికులు ఓటిస్తే వారిని ఈ పదవులకు నియమించాలి.
రాహుల్ ప్రేలని బుల్లెట్ అని తెలి పోయింది కాబటి వెంటనే అతన్ని పక్కన పెట్టి - ప్రియాంకాను తెరమీదకు తేవాలి. ఆమెను ఉప ప్రధానిగా నియమించి - దేశమంతటా పర్యటించేలా చూడాలి.
మన్మోహన్ సింగ్ గారికి ఉధ్వాసన పలికి ఒక రాజకీయ నాయకుడ్ని ప్రధాని చెయ్యాలి. ( లాలు రాజకీయవేత్తే -అయినా రైల్వేల్లో అధ్బుతాలు సృష్ఠించలేదా)
కళంకిత మంత్రుల్ని వెంటనె ఇంటికి సాగనంపాలి. రాష్ఠ్ర్రాల్లో పార్టి అధ్యక్ష పదవికి ఎన్నికలు నిర్వహించాలి. అలానే కాంగ్రెస్ పాలిత రాష్ఠ్ర్రాల్లో సి.ఎల్పి సమావేశాలు ఏర్పాటు చేసి సీక్రెట్ బ్యేలట్ పెట్టి అందులో నెగ్గిన వారికే సి.ఎం పదవిని కట్ట పెట్టాలి.
ఇక అసలు సిసలైన తంతు:
ప్రజలను ప్రత్యక్షంగా బాధించే దేశంలోని టాప్ టెన్ సమస్యలు పదిని ఎంపిక చేసుకుని వాటి పై అఖిల పక్ష సామావేశం ఏర్పాటు చేసుకుని - అవసరమైన బిల్లులు రూపొందించి - పార్లెమెంట్ సమావేశాలు నిర్వహించి -ఆ బిల్లులను పాస్ చేసి వెంటనే అమలు చెయ్యాలి.
సతరు టాప్ టెన్ సమస్యల్లో సాగు నీటి సమస్యకు ప్రప్రథమ స్థానం కల్పించాలి. నదులను జాతీయం చెయ్యడం - పెండింగులో ఉన్న ప్రాజెక్టులను రాష్ఠ్ర్ర, కేంద్ర నిదులతో పూర్తి చెయ్యడం జరగాలి. ఈ పనులకు జైల్లోని ఖైదీలు మొదల్గొని,నిరుధ్యోగులు, విథ్యార్థి విథ్యార్దినులను సైతం వినియోగించుకోవాలి.
రెండవ అంశంగా ఆర్థిక ఎమెర్జెన్సి విధించి ప్రభుత్వ నిర్వహణా వ్యయాలను కనీశం యాబై శాతానికి తగ్గించాలి. బ్యూరాక్రెట్స్ మీద వత్తిడి తెచ్చి పరిపాలన చురుగ్గా సాగేలా చూడాలి
జాతీయ స్థాయిలో ఇవన్ని చేస్తే అప్పుడు రాష్థ్ర్రాల్లోని ప్రజలకు,కాంగ్రెస్ పార్టి కార్యకర్తలకు ప్రభుత్వం పట్ల పార్టి పట్ల విశ్వాసం మెరుగు పడుతుంది.
ఇక తెలంగాణ విషయానికొస్తే ఆర్థిక ఎమెర్జెన్సి విధించారు కాబట్టి ( ఇది తాత్కాలికమే కావాలి సుమా) సం.ల కాలం తెలంగాణ సంభంధిత ప్రాజెక్టులకు అత్యధిక ప్రాధన్యం ఇచ్చి వాటిని పూర్తి చెయ్యాలి. జల జగడం రాజుకోకుండా చూడటానికే ఈ ఆలశ్యమని సరిగ్గా పన్నెండు నెలలనంతరం రాష్థ్ర్ర విభజన ప్రక్రియ మొదలవుతుందని ప్రకటించాలి.
పనిలో పనిగా రాష్ఠ్ర్ర క్యాబినెట్లోని కళంకిత మంత్రుల్ని తొలగించాలి.
ఇక వై.ఎస్.విషయానికొస్తే ఇప్పటికే వివాదస్పద జీ.ఓలన్ని సక్రమమే అని సి.ఎం చెప్పారు కాబట్టి - ఆరోపణలెదుర్కొంటున్న మంత్రులకు న్యాయ సాయం కూడ ఆఫర్ చేసారు కాబట్టి జగన్ పై ఉన్న క్విట్ ప్రోగో కేసులన్ని వాపసు తీసుకోవాలి.
వై.ఎస్. మా ముఖ్యమంత్రి అని గాలి కబుర్లు చెప్పకుండా వై.ఎస్. ఎన్నికల హామీలను అమలు చెయ్యాలి. ఆయన మరణానంతరం అతని గుర్తుగా చేపడతామని హామి ఇచ్చిన పనులన్నింటిని ఫూర్తి చెయ్యాలి.
ఇక జగన్ పై అక్రమాస్తుల కేసులు కొనసాగినా పార్టికి -ప్రభుత్వానికి ఏ ఇబ్బంది ఉండదు.. ఈ సలహాలను ఇవ్వడం వీటిని కాంగ్రెస్ పార్టి ఫాలో అయిపోయి బాగు పడాలని మాత్రం కాదు.
ఎలాగూ వారిలో బాగుబడే లక్షణాలు లేవు. బాగుపడే వ్రాతలు లేవు. ఈ సలహాలివ్వడం ద్వార ట్రబుల్ షూటర్ అనె బిరుదు దక్కుతుందన్న కక్రుత్తితోనే ఈ సలహాలను ఇక్కడ పొందు పరిచా.
నువ్వు కాంగ్రెస్ బాగుపడాలని ఎందుకనుకుంటున్నావో తెలియదు. దొంగల గుంపు తోడుంటుందనుకుంటున్నావా?
ReplyDeleteఅమ్మ అనానిగా !
Deleteకాంగ్రెస్ -తె.దే.పాల నడుమ ఎవరు నెంబర్ టూ అన్న విషయం పైనే పోటి ఉంటుంది. ఆ పోటీలో బాబు నాయకత్వంలోని తె.దే.పా కన్నా కాంగ్రెస్ - ఒకప్పుడు వై.ఎస్. భలపరచిన కాంగ్రెస్ నెగ్గితేనే రాష్ఠ్రానికి మేలు జరుగుతుందనే ఈ సలహాలు ఇచ్చాను.