క్షమించండి !

నా ఈ బ్లాగును అప్డేట్ చెయ్యడం లేదు. ప్రస్తుతం నా మరో తెలుగు బ్లాగ్ రెగ్యులరుగా అప్డేట్ అవుతూంది. అందులోని టపాలను చదవడానికి ఇక్కడ నొక్కండి

Monday, 16 July 2012

వై.కా.పా తక్షణ కర్తవ్యం : షేడో క్యేబినెట్ & పార్లెల్ బడ్జెట్

చంద్రబాబు సి.ఎంగానే కాదు -ప్రతిపక్ష నేతగా కూడ పూర్తిగా విఫలమైన సంగతి అందరికి తెలిసిందే. వై.కా.పా మాత్రం ఎప్పటికప్పుడు ప్రజా సమస్యల పై స్పందిస్తూ -ప్రభుత్వాన్ని నిలదీస్తూ -ప్రజా పక్షం నిలబడి పోరాడుతూ వస్తూంది.ఈ నేపథ్యంలో వై.కా.పా మరో అడుగు ముందుకేసి షేడో క్యేబినెట్ ఏర్పాటు చేసుకోవాలి.

అంటే పార్టి ఎం.ఎల్.ఏలు ఎం.ఎల్.సిలకు ఒక్కో శాఖను కేటాయించి వారు వాటికే పరిమితమై -లోతుగా అద్యయనం చెయ్యాలి -సమస్యలను గుర్తించాలి -పరిష్కారాలు కనుగొనాలి. వీరిని షేడో మంత్రులుగా పరిగణిస్తారు.

ఇది ఉత్తుత్తి క్యేబినెట్టే అయినా రేపటి అవసరాలకు ఇది మంచి అనుభవాన్ని ఇస్తుంది. నాయకుల్లో ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. నాయకుల నిస్వార్థ శ్రమను చూసి పార్టి తీరు పట్ల ప్రజల ఆధరణ మరింత పెరుగుతుంది.

పార్లెల్ బడ్జెట్:
ప్రభుత్వం బడ్జెట్ దాఖలు చేయడానికి ఎన్నెన్ని కసరత్తులు చేస్తుందో అన్ని కసరత్తులను షేడో క్యేబినెట్ + షేడో ఆర్థిక మంత్రి కూడ చెయ్యాలి.

పార్టి సిద్దాంతాలు - అధినేత హామీలను దృష్ఠిలో పెట్టుకుని సమాంతర బడ్జెట్ రూపొందించాలి. ప్రభుత్వం బడ్జెట్ దాఖలు చేయడానికి నెల ముందే వై.కా.పా తన బడ్జెట్ విడుదల చెయ్యాలి.

ఇలా చెయ్యగలిగినప్పుడు వై.కా.పా ప్రవేశ పెట్టిన బడ్జెట్ ప్రజా క్షేత్రంలో పొందే అధరణను చూసి ప్రభుత్వం కూడ మన బడ్జెట్లోని మంచి అంశాలను టేక్ అప్ చేసే వీలు ఉంటుంది. టేక్ అప్ చెయ్యక పోయినా మనం నిలదీయ వచ్చు.

8 comments:

  1. అవునండీ,

    పదిమంది అనుచరులుంటే చాలు ఒక రాజకీయ పార్టీ పెట్టేయ్యాలి. ఆ పైన యేమి చేసినా రాజకీయనాయకుడి హోదాలో, పార్టీహెడ్డో గుడ్డో హోదాలో బోలెడు సదుపాయాలు సంపాదించుకోవచ్చును.

    పదిమందిని యెన్నిక చేసుకోగలిగితే (దీనికి సవాలక్ష మార్గాలున్నాయి కాని అన్నీ బాగా వైకాపాకే తెలుసులెండీ) ఇంక షాడో మంత్రివర్గమే యేర్పాటు చేసుకోవచ్చును.

    ఒకనాటికి రాష్ట్రంలో ఐదారు షాడో మంత్రివర్గాలుండే తమాషా చూడొచ్చునేమో!

    ReplyDelete
    Replies
    1. శ్యామలీయం గారు,
      మీకెందుకో వై.ఎస్, జగన్ పట్లే కాదు నా పట్ల కూడ ఒక దురభిప్రాయం ఏర్పడిపోయింది. కాబట్టే నేనేం చెప్పినా నెగటివ్ గానే చూస్తున్నారు..స్పందిస్తున్నారు.

      మీరన్నట్టే ప్రతి పార్టి షాడో క్యేబినెట్ పెట్టుకోని, పేర్లెల్ బడ్జెట్ ప్రతిపాదించనీ..వెయ్యి పువ్వులు పుష్పించనీ.. వెయ్యి భావాలు వికసించనీ.

      ప్రజలు దేనిని మెచ్చితే అవే రాజ్యమేలుతాయి.ఇందులో తప్పేముంది?

      Delete
    2. వాణీ పుత్రులవారు,
      నాకు రాఅకీయనాయకుల పట్ల సదభిప్రాయం లేని మాట వాస్తవమే. మీరు YS & Co గురించి యెలాగో అలాగ స్తోత్రపాఠాలు వ్రాస్తున్నారు ప్రతిరోజూ. అవి హాస్యాస్పదంగా ఉంటున్నాయి. కనీసం నాకు.

      ఏదో యెందుకు? ఈ టపానే చూద్దాం. షాడో కాబినెట్ మంచి ఐడియానే తప్పకుండా.
      కాని సభలో 10 శాతం నీట్లు కూడా లేని పార్టీ షాడొ కాబినెట్ పెట్టాలంటే హాస్యాస్పదం కాదా?

      మీరు వ్రాసిన యేదైనా టపా అసమంజసంగా అనిపిస్తే నన్ను వ్యాఖ్యానించవద్దంటే సరే, అలాగే కానివ్వండి!
      కాని మీరు అలా అనవచ్చునా?

      Delete
    3. శ్యామలీయం గారు,
      నేను గ్రౌండ్ లెవల్లోనుండి రాజకీయాలను చూస్తున్నాను. నాకు యధార్థం ఏమిటో తెలుసు. ఎన్నికల్లో ఇరు పక్షాల వారు "లౌఖ్యంగానే" వర్క్ అవుట్ చేస్తారు. కాని లభించే మెజారిటిలో ప్రజాభిప్రాయం ఖచ్చితంగా వెల్లడవుతుంది. నేను ప్రజా పక్షం వహించే ప్రజాస్వామ్య వాదిని. ప్రజలు జగన్ను బలపరుస్తున్నారు. ఇది సెప్టెంబర్ 3 నుండే గమనిస్తున్నా. అందుకే జగన్ను బలపరుస్తున్నాను.

      జగన్ విజయంతో మీరు ఊహించుకుంటున్న "ప్రళయం" ఏది జరుగదు. ఇంకా చెప్పబోతే వై.ఎస్. అందించిన మానవీయ పరిపాలన కొనసాగుతుంది. ఈ రోజు కిరణ్ చేసే పనులు (విద్యుత్ చార్జీల పెంపు లాంటివి) జగన్ చెయ్యలేడు. ప్రజా భలం ఉన్న ఏ నాయకుడు ఇటువంటి పనులకు పాల్పడడు.

      ఇంకా మీ విమర్శలంటారా? యువార్ ఆల్వేస్ వెల్కమ్. మీ అభిప్రాయం నాకు నచ్చక పోవచ్చు. కాని మీ అభిప్రాయాన్ని వెల్లడించే మీ హక్కును కాపాడటం కోసం నా ప్రాణాలు ఫనంగా పెడతా..(వాల్టేర్)

      నేనెందుకు

      Delete
    4. యదార్థం అనేది యేమిటో ఇతరులకు కూడా తెలిసే అవకాశం ఉందని గ్రహించండి. అది మీ అవగాహనకు భిన్నంగా ఉండవచ్చును కూడా. మీరు జగన్ అనే వ్యక్తినో అతని పార్టీనో యెందుకు బలపరుస్తున్నారని అడగలేదు నేను యెన్నడూ. జగన గెలిస్తే ప్రళయం అని నేను ఊహించటమూ లేదు అలాగని మీతో అననూ లేదు. వై.ఎస్. అందించినది మానవీయ పరిపాలన అని మీరనుకుంటున్నారని తెలిసింది - సంతోషం. అలా ఇతరులు కూడా అనుకోవాలని మీరు ఆశించటం వరకు సరే కాని వై.ఎస్. కుటుంబాన్ని ఆకాశానికెత్తుతూ ఒక కరపత్రికను నిర్వహించవలసిన అగత్యం ఉందని నేననుకోవటం లేదు - మీరలా అనుకుంటే నాకేమీ అభ్యంతరం లేదు. నా విమర్శలను మీరు స్వాగతిస్తున్నందుకు కూడా సంతోషం.

      Delete
    5. శ్యామలీయం గారూ , ఎలాగైతే జగన్ పట్ల మీకు సదభిప్రాయం లేదో , అలాగే జగన్ అంటే అభిమానించే జనాలూ వేలూ లక్షల సంఖ్యలోనే ఉన్నారు.

      // పదిమందిని యెన్నిక చేసుకోగలిగితే (దీనికి సవాలక్ష మార్గాలున్నాయి కాని అన్నీ బాగా వైకాపాకే తెలుసులెండీ) // అన్న మీ అవగాహనకు భిన్నంగా కూడా ఉండవచ్చు జనాల అవగాహన.

      // వై.ఎస్. కుటుంబాన్ని ఆకాశానికెత్తుతూ ఒక కరపత్రికను నిర్వహించవలసిన అగత్యం ఉందని నేననుకోవటం లేదు // అది 'అగత్యం ' అని పేరు పెట్టి మీరు కించపరచవలసిన అవసరం కూడా లేదు . ఎవరి అభిమానం వారిది .

      మీ బ్లాగులోకి ప్రవేశించి , ' కవితలూ , పద్యాలు ' పాడుతూ , నిరంతరం అవే వ్రాయాల్సిన ' అగత్యం ' ఏమిటి మీకు అని ఎవరైనా మీకు బోధిస్తే కోపం వస్తుంది , అలాగే ఇదీ - ఎవరి అభిమానం , అభిప్రాయాలు వారివి . మిమ్మల్ని జగన్ అభిమాని గా మారిపొమ్మంటే తప్పు కాని , ఆయన పాటికి ఆయన ఏవో విశ్లేషణ చేసుకుంటే మీకొచ్చే నష్టమేమిటి ?

      "ఒరులేయవి యొనరించిన , నరవర అప్రియము తన మనంబున కగు తా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మ పథములకెల్లన్ ' అనే సూక్తిని గుర్తుంచుకుని కామెంటు పెట్టండి ఈసారి .

      - రమేష్

      Delete
  2. Why shadow government. Run Govt. itself. The Govt itself is paralyzed. Go ahead

    ReplyDelete
  3. Sambar garu,

    YSR palana antha manaveeyam annaru. mari adhento maku kastha ardham ayyettu vivarinchagaralu.
    prajalu jagan ni balaparusthunnaru ani chepparu. meeru jagan ki support ga vote vesina 40% janam gurinchi matladuthunnaru leka jagan ki support ga vote veyyani 60% janam gurinchi matladuthunnara. kastha vivarinchagalaru.

    ReplyDelete