క్షమించండి !

నా ఈ బ్లాగును అప్డేట్ చెయ్యడం లేదు. ప్రస్తుతం నా మరో తెలుగు బ్లాగ్ రెగ్యులరుగా అప్డేట్ అవుతూంది. అందులోని టపాలను చదవడానికి ఇక్కడ నొక్కండి

Tuesday, 18 September 2012

శిరిడి సాయి : రాఘ్ + నాగ్ =నిరాశ


నేను నాస్తుకుడ్ని కాను. రాఘవేంద్ర రావు నా సినిమా గురువు (మానసిక). ఒక సినిమాకి స్క్రీన్ ప్లే ఎలా ఉండాలి అన్న ప్రశ్నకు సమాదానం "కొండ వీటి రాజా"లో నాకు దొరికింది.నాగార్జున విషయంలో మాత్రం నాటి చిరంజీవి అభిమానిగా ఇద్దర్ని పోల్చుకుని కొంత అసహనం -అసహ్యం ఉన్న మాట వాస్తవమే.కాలక్రమంలో చిరంజీవి డొల్లతనం ఎలా భయిటపడి దూరమైపోయానో అలాగే నాగ్ అండర్ ప్లే,డ్రెస్సింగ్ సెన్స్,ఎవర్ గ్రీన్ నెస్ నన్నాకట్టుకున్నాయి.

ఇదీ కాక అన్నమయ్య, శ్రీరామదాసు నన్ను ముగ్దుడ్ని చేసాయి. ఈ సినిమాల్లోను రాఘ్ మార్కు చెత్త కామెడి, బొడ్డు -తేనె సొల్లు ఉన్నప్పటికి తక్కిన విషయాలు వాటిని మరిపించేసాయి.

కాని శిరిడిసాయి విషయంలో మాత్రం ఎందుకో తెలీదు కాని ఒక్క సీనంటే ఒక్క సీను కూడ నన్ను కదిలించలేక పోయాయి. ఎప్పుడో సెకెండ్ రిలీజులో విష్ణుచందర్ నటించిన సినిమా చూసాను. 1999 లో శిరిడి వెళ్ళినప్పుడు సంసాన్ వారు వ్రచురించిన బాబా చరిత్ర తెచ్చుకుని చదివాను .ఇవే శిరిడి బాబా గురించిన నా పరిచయానికి మూలాలు.విష్ణు చందర్ సినిమా పెద్దగా కదిలించక పోయినా బాబా చరిత్ర మాత్రం నన్నెంతగానో ఆకట్టుకుంది.

ఈ సినిమా గురించిన ప్రమోషన్లను టివిల్లో చూస్తుంటేనే నాకు అనుమానం కలిగింది. అయినా అన్నమయ్య, శ్రీరామదాసు అంత గొప్పగా లేకున్నా బాలకృష్ణ కాంబినేషన్లో వచ్చిన భక్తి రస సినిమాలా పరమ చెత్తగా ఉండదు అనుకుని చూసా.

నాగ్ గెట్ అప్,బాడి ల్యేంగువేజి, డైలాగ్ డెలివరి అంతా ఓకే. తారాగణం కూడ ఓకే. రాఘవేంద్ర రావు ఎక్కడ పప్పులో కాలేసాడంటే రామదాసు సినిమాలో బి.జె.పి మార్క్ డైలాగులు పెట్టిన గిల్టితోనో ఎమో ఈ సినిమాలో బాబాను కేవలం లౌకిక వాదిగా చిత్రీకరించడానికే పరిమితమై పోయారు.

రామ దాసు ఎంత గొప్ప సినిమాగా రోపు దిద్దుకుందంటే ఈ మతతత్వ డైలాగులు సైతం ఎవరి దృష్ఠిని ఆకర్షించ లేక పోయాయి.

ఈ శిరిడి సాయి సినిమా ఎంత అతిసామాన్య సినిమాగా రూపు దిద్దుకుందంటే బాబాగా నాగ్ వల్లించే లౌకిక వాదం సైతం రుచించడం లేదు.

నేను చదివిన బాబా చరిత్రను రచించిన రచయిత ఎవరో తెలీదు గాని భక్తి ప్రపత్తులతో అతిశోయక్తులతో వ్రాసినప్పటికి ఉన్నవి ఉన్నట్టు జరిగినవి జరిగినట్టు వ్రాసాడు ( వాటిని డెఫెండ్ చేస్తూ వ్రాసిన వ్యాఖ్యానాలు సోది అనిపించినా).

ఆ చరిత్రను చదివిన నాకు బాబా అనే వ్యక్తి త్రీ డైమన్షన్లో కనబడ్డాడు.ఒక్కో సంఘఠణలో బాబా ప్రవర్తనను చదువుతుంటే .. ఎవరైనా సైకియాట్రిస్ట్ చదివితే "మల్తిపుల్ పర్సనాలిటి డిస్ ఆర్డరు"తో బాధపడుతున్నట్టుంది అనుకుంటాడు.అంతగా వైవిద్యం.ఉట్టి పడుతుంది.

పైగా బాబాతో అన్ని వేళలా ఉన్న వ్యక్తులు కాని - అతిథులు కాని ప్రతి ఒక్కరు ఇట్టే నా కళ్ళ ముందు కదలాడారు. మనుషుల్లో ఎన్ని విదాలనిన గుణ గణాలుంటాయో వాటన్నింటియొక్క పరాకష్ఠను బాబాలోను - బాబాను కలవడానికి వచ్చే అతిథుల్లోను చూడొచ్చు.

ఉదాహరణకి బాబా ఎంత కోపిష్ఠియో అంత సౌమ్యుడు, అతని కోపానికి ఒక ఉదాహరణ : ఒకసారి అతను హిందువా ముస్లీమా అనే చర్చ తారా స్త్జాయికి చేరుతుంది. (బాబా సమక్షంలోనే).అప్పుడు బాబా ఏం చేస్తారో తెలుసా? కోపోద్రేకుడై - తమ బట్టలన్ని విప్పేసి -నగ్నంగా నిల్చుని గర్జిస్తారు.

ఈ సినిమాలోనైతే బాబా సదా చిరునవ్వు చిందుతూ కృత్రిమంగా కన బడతాడు. మరీ విలన్ + ఆలి కామెడి పరమ రోత. రోహిని హత్తాంగడిని వృధా చేసారు. బాబా హిమాలయానికి వెళ్ళడం అక్కడ పాట ..షిట్.. రజని కాంత్ బాబా సినిమా దృశ్యాలు గుర్తుకొచ్చేసాయి.

బాబా తన మరణం ముందు .పాడే పాట కూడ అంతే. మాంచి హీరోలను ఎక్స్ ట్రాలకింద వాడటం దారుణం. అలా వాడినా ఫర్వాలేదు కాని రాఘవేంద్ర రావు తన పై వారికున్న గౌరవాన్ని దుర్వినియోగం చేసారనే చెప్పాలి.

ఏమో మొత్తానికి శిరిడి సాయి సినిమా ఒక క్రిమినల్ వేస్ట్ . ఈ సినిమా తీకుండా ఉండి ఉంటేనే బెటర్ అనిపిస్తూంది.

1 comment: