క్షమించండి !

నా ఈ బ్లాగును అప్డేట్ చెయ్యడం లేదు. ప్రస్తుతం నా మరో తెలుగు బ్లాగ్ రెగ్యులరుగా అప్డేట్ అవుతూంది. అందులోని టపాలను చదవడానికి ఇక్కడ నొక్కండి
Showing posts with label Rosaiah. Show all posts
Showing posts with label Rosaiah. Show all posts

Friday, 15 October 2010

ఎడిటోరియల్ ను సైతం అమ్ముకుంటున్న ఆంద్రజ్యోతి

ఈ ఆరోపణను అన్ని పత్రికల పై చెయ్యాలో ఏమో? ( నేను జ్యోతి మాత్రమే తెప్పిస్తున్నా అన్ని పత్రికలవారు ఈ పనేచేసారేమో? ( ఈ రోజున)

ఇటీవల ప్రతి చిన్న విషయానికి చంద్ర బాబు "ఎక్కడికి పోతున్నారో నా కైతే అర్థం కావడం లేదు" - అనే వాక్యాన్ని ఎడా పెడా చెప్పేస్తున్నారు. ప్రతిపక్షంలో పడ్డాక చంద్ర బాబు" మైండ్ సెట్ భాగా మారింది". పాపం ఆయనగారు సి.ఎంగానే చెడ్డారు. కళ్ళకు గంతలు, చెవుల్లో కాటన్ బేళ్ళు . ఆయనకేం తెలీదు పాపం. లోకల్ ఎమ్.ఎల్.ఏ కన్నా ఎస్.పి మాటే గొప్ప.( తాను నెగ్గి, తనను సి.ఎం చేసింది ఆ అమాయకులేనన్న సంగతిని సెలెక్టివ్ అమ్నీషియా కారణంగా మరిచి పోయారు. అన్నీ సక్రమంగా జరుగుతున్నాయన్న భ్రమలో ఉండి పోయారు. ఆయన కారు క్రింద క్లైమోర్ బాంబు(?) పేలితే గాని, సానుభూతిని క్యేష్ చేసుకోవడానికి ముందస్తుకెళ్ళి ఓడి పోతే గాని పాపం ఆయన మైండ్ సెట్ మారలేదు.

కొందరు కొన్ని పాత్రల్లోనే విజృంభిస్తారు. ఉ. రోశయ్య నెంబర్ టూగా ( వై.ఎస్. దశావతారంలో కమల్ హాసన్ లా భహుపాత్రాభినయం చేసారనుకొండి -అదిష్ఠానానికి వేధేయత కాడనుండి - టి.ఆర్.ఎస్. శాసన సభ పార్టిని చీల్చడం దాక - అన్నింటా బెస్ట్ పెర్ఫార్మెన్సే - కాని ఈ రికార్డు అందరికీ సాధ్యం కాదు కదా?

ఓకే బాబు విషయానికొస్తా. రూలింగ్లో ఉన్నప్పుడు ప్రతిపక్షంవారంతా నెగటివ్ థింకర్స్ అయినట్టుగా బాబు ఒకరే పాజిటివ్ థింకర్ అయినట్టుగా మైండ్ సెట్ మార్చుకోమని సలహా ఇచ్చేవారు. ఎన్నికల సమయంలోనే రాజకీయమని సూత్రీకరించి "ప్రతిదాన్ని రాజకీయం చేస్తున్నారని"మండి పడే వారు. మైండ్ సెట్ మార్చుకోమని సలహాలిచ్చేవారు.

మైండ్ సెట్ ఏమన్నా టి.వి సెట్టా ఎక్చేంజ్ ఆఫర్లో బ్లాక్ ఆండ్ వైట్ ఇచ్చేసి కలర్ తీసుకోవడానికి. ఎలుక తోలు ...నలుపు నలుపే బాబుగారు. సారి! నేనేదో చెప్పాలనుకుని ఈ సోదిలో తగులుకున్నా ఈ మద్య భాబు మాటలే నా నోట (చేత) కూడ వస్తున్నాయి.

ఈ మద్య "ఎక్కడికి పోతున్నారో నా కైతే అర్థం కావడం లేదు" అనే వ్యాఖ్యను ఊత వ్యాఖ్యలా వాడి పారేస్తున్నారు. ( బాబు గారి ఊత్ పదాలు గుర్తున్నాయా? - ఈ విదంగా మనం ముందుకు పోతున్నాం) . నిజానికి ఈ మాట అనాల్సింది దినపత్రికలను ఉద్దేశించే!

హై కోర్టు జడ్జి ముందు పేపర్ క్లిబ్బింగ్ పెడితే యాబైకి సింగిల్ కాలమ్, వందకు డబుల్ కాలమ్ వార్తలొస్తాయి.అవన్నీ తీసెయ్యండి అన్నారుట. ఎన్నికల సమయంలో ప్రకటనలు వార్తల రూపంలో వెలుబడ్డ వైనాన్ని ఏకంగా సుప్రీమ్ కోర్టే ఖండించింది ( అనుకుంటా)

గతంలో ప్రకటనలు స్వీకరించటానికి ఎన్నో నిభందనలుండేవి. ఒక సారి ఈనాడులో చిన్న ప్రకటన ఇవ్వాలని వెళ్ళాను. " జ్యోతిష సలహా రుసుము : రూ. వంద - కంప్యూటర్ జాతకం ఉచితం" అన్న మాటకు అక్కడి సిబ్బంది అభ్యంతరం తెలిపారంటే చూసుకొండి.

ఇప్పట్లో ప్రకటనల విశ్వసనీయతకు మేం భాధ్యులం కామని కంటికి కనబడి చోట ముద్రించుకుని ఒక్క రోజులో భరువు తగ్గే ప్రటనలను సైతం ప్రచురిస్తున్నారు. " వీరు ఎక్కడికి పోతున్నారో నా కైతే అర్థం కావడం లేదు"

గతంలో ప్రకటనను వార్తా రూపంలో ప్రచురించి పొడి పొడి అక్షరాల్లో ఏ డి వి టి అని పెట్టే వారు. ఆతరువాత ప్రకటన దారుల నిభందన మెరకు "స్పాన్సర్డ్ ఫీచర్"అని పెట్టారు. దమ్మున్న చానలని రొమ్ము భాదుకునే ఆంద్రజ్యోతి ఇందులోనూ సంచలనం సృష్టించింది.

Advertisement - Editorial అనే రెండు పదాలను కలిపి అడ్వెర్టోరియల్ అనే కొత్త పదాన్నే సృష్ఠించింది
ఏకంగా రెండు ఫుల్ పేజీలు రోశయ్యగారి విశ్వరూపాన్ని (?) చిత్రీకరించే వార్తలు పెట్టింది. రోశయ్యంటే నాకెంతో గౌరవం. ఆయన మాత్రం ఆర్థిక మంత్రిగా లేకుంటే వై.ఎస్.విచ్చలవిడి సంక్షేమ పథకాలతో రాష్ఠ్ర్ర్రం ఎప్పుడో దివాళాతీసేదని, అసలు వై.ఎస్. చరిస్మాకు పవర్ (ఫైనాస్న్ జెనరేటరే రోశయ్యని చెబుతుండేవాడ్ని. అందుకే ఆయనగారిని విమర్శించాలంటే మాటలు రావడం లేదు ( నేను ఇంకా రాజకీయ నాయకుడ్ని కాలేదుగా.. ఈ గంట పొగిడి తదుపరి గంటే విమర్శనాస్త్ర్రాలు సంథించడానికి)

రోశయ్య అనుకోవచ్చు తన చిరకాల కోరిక (నెంబర్ వన్ అవ్వటం) నెరవేరిందని. కాని ఈ సి.ఎమ్ పదవి అన్నది ఈ టపా అంతా టైప్ చేసాక కంట్రోల్ ఏ నొక్కి ఆ పై డెలిట్ మీట నొక్కినట్టేనని ఆయనగారికి అర్థం కావడంలేదు.

జగన్ రోశయ్యను సి.ఎమ్ గా ప్రతిపాదించినట్టే రోశయ్య సోనియావద్ద హోం మినిస్టర్ కమ్ డెపుటి సి.ఎంగా జగన్ ను ప్రతిపాదించి ఉంటే ఇలా డబ్బులిచ్చి ఎడిటోరియల్ కొనుగోలు చేసే దుస్థితి వచ్చేది కాదు. ఎడిటోరియల్ ను అమ్ముకోవడానికి ఆంద్రజ్యోతికి సిగ్గుండదని నాకు తెలుసు ( ఆ రెండు పత్రికల్లో అదీ ఒకటని వై.ఎస్. ఏనాడో తేల్చారు కాబట్టి) కాని కొనుక్కోవడానికి రోశయ్యకు సిగ్గు లేక పోవడం కాస్తా ఆశ్చర్యాన్ని కలిగించింది.

హుం.. "ఎక్కడికి పోతున్నారో నా కైతే అర్థం కావడం లేదు" అని చెప్పడానికి నేను బాబును కాను. నేను చెప్పదలచిన మాట " అందరం ( ఇటువంటి నీచ సంస్కృతులను ప్రశ్నించకుంటే మనమూ దానిలో భాగస్వాములమే గా) ఎక్కడికి పోతున్నామో నాకు భాగా అర్హ్తమైంది . ఎక్కడికి పోతున్నామంటే " సంపూర్ణ నైతిక పతనానికేసి - బుల్లెట్ ట్రెయిన్ తరహాలో బుల్లెట్ లా దూసుకు పోతున్నాం

Friday, 28 May 2010

జగన్ బెటర్ లేట్ దేన్ నెవర్

 వై.ఎస్. మరణానంతరం జగన్లోని ఎన్నో లోపాలను నేను చూడ కలిగాను. వాటిని సరి దిద్దుకునేందుకు ఎన్నో సలహాలను నా టపాల ద్వారానే కాకుండా వ్యక్తిగత ఫ్యేక్సు, కొరియర్ ద్వారా కూడ పంపాను. ఆయన వాటిలో కొన్నింటిని పాటించటం కాకతాళీయమే కావచ్చు. అయినా సరే వై.ఎస్.ఆర్లో ఎన్.టి.ఆర్ని చూసుకు(న్న)నే ఎన్.టి.ఆర్ అభిమానిగా  మళ్ళీ ఈ టపా వ్రాస్తున్నాను. ( దీని ప్రతిని జగన్ కు కొరియర్ ద్వారా కూడ పంపుతాను.

జగన్ !
కాంగ్రెస్ పార్టి ఆదిష్ఠానం ఉన్నది దిల్లిలో అక్కడ పొద్దు పొడిచేదే పగలు 10 గంటలకు.అక్కడ ఉన్న చలికి ఇక్కడి యువతలోని రక్తపు వేడి  సోకాలంటే చాలా కాలం పడుతుంది. వారికి కావల్సింది శక్తి,యుక్తి గల నాయకులు కారు. వారికి కావల్సింది కాళ్ళు మ్రొక్కే భజన పరులు.అందుకే వై.ఎస్. అంతటి వాడు 33వ ఏట పి.సి.సి.అయినప్పటికి  సి.ఎం కావటానికి 22 సం.లు వెయిట్ చెయ్యవలసి వచ్చింది. చంద్రబాబు ఇంద్రజాలంతో నేడు గొంతు చించుకుంటున్న ముసలి నక్కలన్ని తోక ముడిచి నోళ్ళు మూత పడిన వేళ, ఇక చేసేది ఏమి లేక  దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ స్థితి గతులు అధోగతి పాలై పోతున్న వేళ తప్పని సరి పరిస్థితిలో  వై.ఎస్. ను సి.ఎం చేసి ఆయనగారికి కొంత మెరకు స్వేచ్చను ఇచ్చారేగాని అది వారి నైజం కానే కాదు. పైగా వై.ఎస్. తనకెంతో ప్రజా బలమున్నా, నాయకత్వ లక్షణాలున్నా కొంత మెరకు భజన కూడ చేయ కలిగారు. అందుకే మనగలిగారు. వై.ఎస్. సి.ఎం అయిన కొత్తలో సెంట్రల్ ఇంటలిజెన్స్ ద్వారా ఒక సర్వే కూడ చెయ్యించారు .ముఖ్యమంత్రిని మారుస్తే ఎలా ఉంటుందని. (ఈ విషయం అప్పటి ఆంద్రప్రభలో కూడ వచ్చింది.) మళ్ళీ రెడ్డి కాంగ్రెస్ వస్తుంది. వై.ఎస్సే సి.ఎం అవుతారని తేలడంతో ఆగే పీచే భంధ్ చేసుకున్నారు)

వై.ఎస్ ప్రదర్శించిన విధేయత కేవలం ఒక షో మాత్రమే ఆయన విధేయుడు కాడని సోనియా మేడంగారికి ఎప్పుడో తెలుసు. పైగా రెండవ విడత జరిగిన ఎన్నికల్లో సీట్లు తగ్గిపోవడం సోనియా మేడంకు కొంత మనోధైర్యాన్ని కూడ కలిగించినట్టుంది. వై.ఎస్. బతికుంటే వై.ఎస్.ను కూడ రోశయ్య రేంజిలో ట్రీట్ చేసేవారే (అందుకు వై.ఎస్. ఎలా స్పందించేవారు/ఎలా భుద్ది చెప్పేవారన్నది వేరే కథా)

మీ విషయంలో సోనియా మేడం వైఖరేమో అర్థం చేసుకోవడానికి బుర్ర కూడ అవసరం లేదు. కిడ్ని చాలు. కడప పులితోనే ఏగ లేక చచ్చాం. ఇక పులి బిడ్డతో కూడా ఏగాలా అన్న విసుగే ఈ వైఖరికి కారణం. వై.ఎస్. ఎంతటి విధేయత ప్రదర్శించినప్పటికి ఆయన విధేయుడు కాడని/తామే ఆయన గెలిచి పెట్టే ఎం.పి.సీట్లకు గాను విధేయులమని వారికి తెలుసు. వై.ఎస్. వెర్సస్ హై కమాండ్ రిలేషన్ ఎలా ఉండేదో ఒక్క తిరుపతి మెడికల్ కళాశాలకు భూమి కేటాయింపు వ్యవహారమే గీటు రాయి.

ఉత్తుత్తి సుత్తెందుకు సూటిగా చెబుతున్నా:
ఎటూ ఇక ఆదిష్ఠాణంతో తెగదెంపులు జరిగి పోయినట్టే .. ఇప్పటికైనా పార్టిలీ చీలిక తెచ్చి కొత్త పార్టిగా అవతరించండి. రాష్ఠ్ర్రాన్ని మానవీయ కోణంలో పరిపాలించినవారు  ఇద్దరే ! ఒకర్ ఎం.టి.ఆర్ మరొకరు వై.ఎస్.ఆర్. ఇద్దరి వారసులకు అన్యాయమే జరిగింది. ఇద్దరు సమైఖ్య వాదులే. కాబట్టి ఎన్.టి.ఆర్ వారసులను కలుపుకెళ్ళే ప్రయత్నం చెయ్యండి .స్థానిక ఎన్నికల్లో సత్తా చాటండి. యువతరానికి మరింత దగ్గర కావడానికి ఫేస్ బుక్ /ట్విటర్ లో ఖాతా తెరవండి. బ్లాగుల్లో మీ గురించి వచ్చే కథనాల పై స్వయంగా స్పందించండి. వై.ఎస్. ఆర్ జీవిత చరిత్రను తెలుగు,ఉర్దూ బాషల్లో వ్రాయించి పది లక్షల ప్రతులన్నా ప్రజలకు అందేలా చూడండి. (సరళమైన భాషలో)  వై.ఎస్. ఆర్ జీవితం పై ఒక సి.డి విడుదల చెయ్యండి. డా.రాజశేఖర్ ప్రారంభించిన వై.ఎస్. గురించిన సినిమాలో మీరే టైటిల్ రోల్ పోషించండి. వ్యాపారాలు, బెంగళూర్లకు గుడ్ బై చెప్పండి. మీ పని ఇక్కడే ! మీ శతృత్వమన్నా, మైత్రి భంధమన్నా ఇక్కడి వారితోనే. ఓబుళాపురం మైన్స్ త్రవ్వకంలో సాంకేతిక లోపం కారణంగా  కేవలం కొన్ని మీటర్ల విస్తీర్ణంలో జరిగిన తప్పిదానికి జనార్దన్ రెడ్డిని / మీ తండ్రిగారిని ఆడి పోసుకున్న చంద్రబాబే మీ ప్రధాన శతృవు కావాలి. ఇక్కడి భజన పరులలో ఎవ్వడూ మీకు శతృవు కాడు.స్థానిక ఎన్నికల్లో  మీ సత్తా చాటితే ఎగ్గు సిగ్గు లేని ఆదిష్ఠానం మీ పార్టితో సైతం పొత్తుకు సై అంటూ భజన చేస్తుంది.  మీ యుద్దం భజన పరుల పై కాక ఆదిష్ఠానం పై ఉండాలి. ఇక్కడి భజనపరులు పాపం ఏదో రోజు మీ గుమ్మం ముందు వచ్చి వాలే వారే. కొత్తా పార్టి పెడితే మొత్తం హై టెక్ పద్దతిలో జరిగేలా చూడండి. పార్టికి వెబ్ సైట్, ఆన్ లైన్ మెంబర్ షిప్, ఆన్ లైన్ చాట్, వారంలో ఒక దినం మీరే ఆన్ లైన్ లో ఉండి కార్యకర్తలతో ఇంటరేక్ట్ అవ్వండి.

ఎలాగూ ఎన్.టి.ఆర్ జన్మ దినోత్సవం నాడు ఎన్.టి.ఆర్ అంతటి/వై.ఎస్. ఆర్ అంతటి గుండె నిబ్బరాన్ని ప్రదర్శించేరు. వై.ఎస్,ఆర్ కు అసమ్మతి రాజకీయాలేమి కొత్త కావు. ఇందిరమ్మ పైకే చెప్పులెయ్యించాడన్న ఖ్యాతి కూడ ఉంది. ఎన్.టి.ఆర్ గురించి వేరే చెప్పక్కర్లేదు. ఎలాగో తెగించారు. తెగకొట్టుకుని భయిట పడండి. ఇద్దరు మహా నేతలు మిమ్మలి ఆశీర్వదిస్తారు.

Sunday, 18 April 2010

మే 4 తరువాత రోశయ్యకు ఆదిష్ఠానంతో తగువ ?

వై.ఎస్. మరణానంతరం ప్రతి విషయానికి ఆదిష్ఠానం వైపు చేతులు చూపిస్తూ  అతివినయం ప్రదర్శిస్తూ వచ్చిన రోశయ్య కథ కంచికి చేరనుంది. మే 4 తరువాత రోశయ్యకు ఆదిష్ఠానంతో తగువ రానుంది. జ్యోతిష్య ప్రకారం రోశయ్యది తులా రాశి. ఈ రాశికి మే నాలుగవ తేది వరకే గురుభలం ఉంది. అదృష్ఠాన్ని సూచించే ఐదవ భావమున రాజగ్రహమగు గురు ఉన్నందున కాకతాళీయంగా పదవియోగం పట్టింది. కాని  ఈ గురువు
మే నాలుగున శతృ ,రోగ,రుణ బాధలను సూచించే ఆరో స్థానానికి రానున్నాడు. అలా వచ్చి జూలై 23 వరకు ఉంటాడు.

గురు గ్రహం ప్రభుత్వాన్ని,రాజకీయ అధికారాన్ని, హై కమాండును సూచించే గ్రహం. ఈ గ్రహం శతృ స్థానానికి చేరడం వలన  రోశయ్యకు ఆదిష్ఠానంతో తగువ  రావచ్చు. లేదా హఠాత్తుగా ఆరోగ్యం క్షీణించవచ్చు. లేదా కొత్త వివాదంలో తగులుకుని పదవీచ్యుతుడు కావచ్చు. ఇప్పటికే ఏల్నాటి శని ప్రారంభమైంది. ప్రస్తుతం మిథునం దనస్సు రాశుల్లో కేతువు,రాహువులున్నారు. దనస్సు తులకు దైర్యస్థానం. కాబట్టి కొంత దైర్యాన్ని ప్రదర్శించ వచ్చు. అయితే మిథునం తులకు 9 వ స్థానం అవుతుంది. ఇది హై కమాండును సూచిస్తుంది.ఇక్కడ కేతు ఉండటం వలన హై కమాండుకు దగ్గరగా ఉన్న  ఇతర మతస్తుల లాబితో చిక్కులు వచ్చి రోశయ్య చిక్కుల్లో పడతారు.

ఎలాగూ రోశయ్య ఎంతటి ఐరన్ లెగ్గో సోనియాజీకి ఇప్పటికే అర్థమైయ్యుంటుంది. ఇటీవల జగన్ ప్రారంభించిన ఓదార్పు యాత్ర విశేషాలు ఇప్పటికే ఆమెగారికి చేరే ఉంటుంది. అందుకే మంత్రివర్గ విస్తరణపై ఇంతటి తడపాటు.

కాని సోనియాజి తర్కపూరితంగా ఆలోచిస్తారని నేననుకోను. అలా ఆలోచించేవారైయ్యుంటే జగన్ ను సి.ఎం చేసేవారు. ఇప్పటికీ ఆ నిర్ణయం తీసుకుంటారని నేననుకోను అందుకే జగన్ బాబుకు నా సలహా ఒక్కటే బెటర్ లేట్ దేన్ నెవర్ ! ఎలాగో ప్రజల మద్యే ఉన్నారు. వై.ఎస్. పథకాలు ఎంతగా నీరు గారి పోయాయో సమాచారం సేకరించి పదిహేను రోజుల్లోపు చక్క దిద్దాలని అల్టిమేటం జారి చెయ్యాలి.

అలా చేసినప్పుడు ఆదిష్థాణమే బతరఫ్ చేసినా ఆనందం. లేదా పదిహేను రోజులనంతరం కొత్త పార్టి ప్రకటించేయడమే. పార్టి పేరు: కాంగ్రెస్ (వై.ఎస్.).

ఓదార్పు యాత్రను కాస్త ఎన్నికల ప్రస్తానంగా మార్చుకుంటే సరి పోతుంది. జగన్ జాగో ! రోశయ్యా భాగో !