క్షమించండి !

నా ఈ బ్లాగును అప్డేట్ చెయ్యడం లేదు. ప్రస్తుతం నా మరో తెలుగు బ్లాగ్ రెగ్యులరుగా అప్డేట్ అవుతూంది. అందులోని టపాలను చదవడానికి ఇక్కడ నొక్కండి
Showing posts with label saktheyam. Show all posts
Showing posts with label saktheyam. Show all posts

Saturday, 9 July 2011

ఖబడ్దార్ కనకదుర్గ !


అమ్మా అమ్మోరు తల్లీ !
నిన్ను దేవతగా నిరూపించుకోవలసిన అవసరం నీకు లేకున్నా
మానవునిగా నన్ను నేను నిరూపించుకోవలసిన అవసరం నాకుంది.

నీకు నీ దైవత్వం మీద అనుమానం లేకున్నా
నా మానవత్వం పై నాకు అనుమానం ఉంది

మానవ కళ్యాణానికి పూనుకున్న నాకు నువ్వు కాస్త
తోడ్పాటు అందిస్తావనే
ఈ మనుషులను నా సోదరులుగా - నీ బిడ్డలుగా
అభివర్ణించాను.

నాది సాదా సీదా ప్రణాళిక కాదు
గాంథి మహాత్ముడ్ని ఓవర్ టేక్ చెయ్యడమే కాదు
నిన్ను ఓవర్ టేక్ చెయ్యడం కూడ నా ప్రణాళికలోని అంశమే

కౄర మృగాల పై ఊరేగి ఊరేగి నీలో మృగత్వం పెరిగి
కరుణ కరిగి పోయినట్టుంది

అమ్మా అన్న ఒక్క పిలుపుకే నీ సొమ్మంతా దోచి పెట్టే
నీ గుండే బండ బారినట్టుంది

చెదులు పట్టిన మీ కాల,యుగ ధర్మాలే నీ చేతికి
సంకేళ్ళయినట్టుంది

దైవత్వం అంటే మానవత్వం లేకుండటం కాదు..
ఈ మానవుల జీవన్మరణ పోరాటాలు చూసి
అంతా ఎరింగి - ఎఋకతో మందహాసం చెయ్యడం కాదు

అమ్మా .
ఈ మనుషులను నువ్వు నీ బిడ్డలుగా చూడకుంటే ఫర్వాలేదుగాని
నీ ప్రయోగ శాలలో ఎలుకలుగా మాత్రం చూడకే

మీ ప్రళయ ధర్మానికి విరుద్దంగా రూపొందిన నా "మిషన్" కి నీ తోడ్పాటు కోరడమే
నా పొరభాటైతే సారి ! ఇక పోరుభాటే సరి !!

ఏం హనుమన్న రామ నామంతో రాముడ్ని జయించగా లేనిది
నేను నీ నామంతో నీ పై పోరు ప్రకటిస్తే తప్పా?

ఇక నీదారి నీది.. నాదారి నాది

నన్ను డిస్టర్బ్ చెయ్యకు అన్నా చేసి తీరుతావు
కనుక డోంట్ డిస్టర్బ్ మీ బోర్డు పెట్టుకోను

యు కెన్ డిస్టర్బ్ మీ
ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ యు..

నువ్వేదో సర్వ సవతంత్రివి అని భ్రమిస్తున్నావు
నువ్వు రూపొందించుకున్న స్క్రిప్టుకు నువ్వు భానిసవు

నా వ్రాతలనైతే మూడో కన్నుతో భస్మం చెయ్యగలవేమో?
నా తలవ్రాతను ఏమీ చెయ్యలేవుగా?

ఈ దిక్కుమాలిన ప్రపంచంలో
నీకున్న ఒక్క గానొక దిక్కును నేనే

మహావిశ్వాసంతో వికసించి - నా ఖర్మ నాశనార్థం నువ్వు
పెట్టిన పరీక్షలతో ఉక్కు ఉక్కై ఉన్న నా గుండెను సైతం
అనుమానపు భ్రమరం తొలిచేలా చేసావు

నేను ఒంటరినేమోనన్న శంఖను నాలోకి సందించేసావు
ఇకనూ సదా బ్రీచ్ ఆఫ్ అగ్రీమెంటుకు పాల్పడే నీతో ఏగలేను

మరో 24గంటల్లో నువ్వు నా రక్షణకు నేను ఈ మానవావళి రక్షణకు
కదం తొక్కాలి

లేదా నన్ను నువ్వు - ఈ మానవావణిని నేను రక్షించే మన ఒప్పందం
తనంతట తానే రద్దవుతుంది. రచ్చవుతుంది.

ఖబడ్దార్ కనకదుర్గ !

Sunday, 10 October 2010

సరి కొత్త ఉషస్సు

Note: "శక్తి పూజ" - సైకో అనాలసిస్ శీర్షికన వ్రాసిన టపాను ఇక్కడ క్లిక్ చేసి చదవండి

ఒక తల్లి నలుగురు బిడ్డలను పోషిస్తుంది.
కాని ఆ నలుగురు కలిసి ఒక తల్లిని పోషించ లేక
ఓల్డేజ్ హోమ్ పాలు చేస్తారు
హే మహోదరి!
ఇంతమంది వ్యర్థ మానవులను కడుపారా కన్నా
కడుపులో ,కళ్ళల్లో పెట్టుకుని
దాచుకుంటున్న నిన్ను వీరిలో ఏ ఒక్కరన్నా
తమ గుండెలో దాచుకోలేక
నాలుగు గోడల మద్య భంధించడం విడ్డూరం

త్యాగేశుడు అని శివయ్యను కీర్తించే ఈ లోకంలో నిన్ను
త్యాగేశ్వరిగా ఎందుకు గుర్తించటం లేదు?
రా ..నీ విశ్వరూపంకన్నా విశాలమైన నా గుండెలో దాచుకుంటా..
ఆ నాలుగు గోడల మద్య ఉండి నువ్వు సాధించిందేమి
వాస్తు దోషాలు,గ్రహ దోషాలు అంటని నా గుండెలో స్థిర వాసం చెయ్యి

నా గుండెలో ఉప్పొంగే కవితామృతాన్ని కడుపారా త్రాగు
నా శతృవులు,ద్రోహాలు, నా పేదరికం నా గుండెలో ఉన్న రక్తాన్ని పూర్తిగా పీల్చి వేసినా హిమాలయంతో పోల్చ తగ్గ తెల్ల దనం ,చల్లదనం, నువ్వైనా ఊహించలేని కొత్తదనం, ఉట్టిపడే గట్టి గుండె ఇది.

నువ్వు సరదా పడే త్రిశూలం చేత బట్టి ,ప్రళయ కాల రుద్ర నాట్యం చేసినా అదరదు,బెదరదు.చెదరదు
నేను వ్రాసిన పిచ్చి గీతలకే మురిసి పోయి కాలాగ్నిలో సైతం
స్వర్ణంలా మెరిసేట్లు చేసావు
నా పేదరికానికి కోత విధించావు
వ్రాత మార్చావు
ఈ ప్రపంచమే వినాశానికేసి బుల్లెట్ లా దూసుకుపోతున్నా
నా గుండె ద్రోహాలతో బండ బారినా కొండ శిఖరాల ఇరుకునుండి ఉరకలేస్తూ పరుగు తోసే నదిలా దిగి వచ్చావు

నా కవిత ఈ భూతలం పై చెవిటి రాజ్యమే సాగుతున్నా
సమస్త ప్రజానీకం సృష్ఠి పరిసమాప్తికే సాయ శక్తులా కృషి చేస్తున్నా
ఋషిలా బ్రతకనిచ్చావు

బతుకు నా ద్యేయం కాదు.
జీవించడం నా లక్ష్యం కాదు
కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నా మానవత్వాన్ని జీవింపచెయడమే నా లక్ష్యం.
కక్ష్య దాటుతున్నానని, తక్షణం నీ తీర్పు అమలు చెయ్యాలని అనిపిస్తూందా రా!

ఈ జనులు ఏ ప్రమోషన్ కోసమో, ఇన్ క్రిమెంట్ కోసమే ఇబ్బంది పెడతారని భయపడకు. వీరి కళ్ళు అహంకారంతో మూసుకుపోయాయి.

నువ్వు సర్వాలంకార భూషితురాలై, సింహ వాహణమెక్కి, త్రిశూలం చేతపట్టి సిటి జంక్షన్లో కనబడినా పగటి వేషగత్తెని పక్కకు పోతారు.

నా కథ వేరు..
నువ్వే రూపాన వచ్చినా గుర్తు పడతా .. శిరస్సు వంచుతా
తరచూ రాక్షసులనే వధిస్తుంటే
ఏమున్నది మజా..వెరైటిగా నా తల నరుకు.
నా మస్తిష్కమంతటా  నిండి ఉన్న విశ్వప్రేమ రక్త రూపేణా నీకు పాదాభిషేకం చెయ్యనీ

ఆ చల్లదనంతో కలి పురుషిని కేకలతో గమ్యం మరచిన  వ్యర్థ మానవుల ,వ్యర్థ జీవితాలతో వేడెక్కిన నీ శిరస్సు చల్లబడనీ  ! ఆ చల్లదనంతో, నీ తల్లి గుండే కరగనీ !

సరి కొత్త ఉషస్సును ప్రసాదించు నా జాతికి
పట్టం కట్టు నీతికి

Tuesday, 22 June 2010

అమ్మవారి శత నామావళిలోని నామాల పరమార్థాలు

2000,డిసెంబరు,23 నుండి శాక్తేయంలో అడుగుపెట్టిన నాకు ఎన్నో అనుభవాలు, అనుభూతులు కలిగినవి. వాటిలో ఒకటి అమ్మవారి దివ్య నామాల్లోని గూడార్థాలు. వాటిలో రెండింటికి నాకు స్ఫురించిన అర్థాలను ఈ టపా ద్వారా మీకంద చేస్తున్నా. మీ అభిప్రాయాలను కమెంట్ రూపంలో అంద చేస్తారని భావిస్తున్నా.

అంబికాపుర వాసిని:
అంబరం అంటే ఆకాశం. మూలాధార చక్రం భూ తత్వం. సహస్రారం ఆకాశ తత్వం. కుండలి సహస్రాన్ని అందుకుంటే అంబ సాక్షాత్కరిస్తుంది. ఆకాశాన్ని సూచించే సహస్రారాన్ని అంబరం అని అర్థం చేసుకుంటే  అంబ వసించే స్థానాన్ని అంభికాపురమని చెప్ప  వచ్చుగా. ఈ నేపథ్యంలో ఆవిడ అంబికాపుర వాసిని కాదా?

అన్న పూర్ణేశ్వరి :
అన్నమంటే అందరికి తెలుసు. ఈ ప్రాణుల శరీరాలను నడిపే ఇందనం. అన్నం పరబ్రహ్మ స్వర్పం అంటారుగా. ఉత్తిదే అన్నేశ్వరి అంటే సరి పోయేదిగా . అన్న పూర్ణెశ్వరి అనడం దేనికి? పూర్ణం అంటే తెలుసు నిండుతనం. అన్నానికి నిండుతనాన్ని ఇవ్వడం ఏంది?
అన్నం అన్నమేగా అని మీరు ప్రశ్నిస్తారు.

ఈ రోజు పెగ్గి ఎక్కువై దొడ్డు బియ్యాన్ని ముట్టే వారు లేరు. ఏ మాత్రం స్థోమత ఉన్నా ప్రతి ఒక్కరు ఫైన్ రకమే వాడుతున్నారు.ఒకే ఇంట ఒకే తల్లి చేతి వంట తిన్న నలుగురు కొడుకుల్లో ఇద్దరు దుర్మరణం/అకాల మరణం  పాలయ్యేరు. ఒకతను స్వార్థానికి పరిమితమై భంధు సముద్రానికి, మిత్రమండలికి సైతం దూరమయ్యేడు. ఆ నలుగురిలో ఒకడినైన నేను మాత్రం ఇలా ఉ న్నాను. ఇదెలా సాధ్యమైందంటే వారు ఆరగించిన అన్నానికి ఆ అన్న పూర్ణేశ్వరి పూర్ణత్వాన్ని ప్రసాదించలేదు.

అన్నానికి పూర్ణత్వం ఏమని మీ ప్రశ్న అంతేగా? కేవలం మాంశాన్ని మాత్రమ్ పెంచే అన్నం పూర్ణమైంది కాదు. మరి భుద్దిని పెంచే అన్నం పూర్ణమైందా అంటే అది కాదు. మరి ఏది పూర్ణత్వం గల అన్నమంటే..

ఏదైతే మనిషి హృదయాన్ని పెంచుతుందో, ఏదైతే అతని హృదయంలో సంస్థ ప్రపంచానికి చోటు కలిగిస్తుందో ఆ అన్నమే పూర్ణత్వం సమ కూరిన అన్నం. అన్నానికి పూర్ణత్వం కల్పించే సత్తా ఒక్క అంబకే ఉంది .అందుకే అందుకే ఆవిడకు అన్న పూర్ణేశ్వరి అన్న బిరుదు.

Monday, 22 February 2010

విటులై వ్యభిచారిణుల చుట్టూ తిరిగిన

అమ్మా అమ్మోరు తల్లి !
నాతో కల్లు తాగినవారు
కల్లు కుండలో ఈగల్లా పడి రెక్కలు తడిచి చచ్చారు
నాకైతే కళ్ళు తెరుచుకున్నాయి
అది నీ కడకంటి చూపుతోనే సాధ్యమైంది

నాతో బ్రాంది త్రాగిన వారు
ఆ బ్రాంతినుండి భయిట పడ లేక పోయారు
నేనైతే క్రాంతి వైపు దృష్ఠి మళ్ళించుకో కలిగాను
అది హే చాముండీ !
నీ అండ దండలతోనే సాధ్యమైంది

నాతో పాటు గంజాయిని ఎంజాయి చేసినవారు
ఆ మైకంలోనే మకాం పెట్టేసేరు
కాని కకా వికలం కావలసిన నా జీవితాన్ని
నిర్జీవమై , నీరు కారి పోవలసిన నా జీవితాన్ని
బతికించి, నన్నుఇలా బ్రతకనివ్వడమే
నీ అమ్మతనానికి ఆధారం

నాతో పాటు విటులై వ్యభిచారిణుల చుట్టూ తిరిగిన వారు
ఇందాక ఆ ఆటకు ఆట విడుపు ప్రకటించ లేదు
కాని చాలా మంది పుణ్యపురుషుల్లా కాక
వారిని కేవలం రంద్రాలుగా చూసే మృగత్వంనుండి
విముక్తినిచ్చావు
వారిని సైతం మనుష్యులుగా పరిగణించి
వారి బాగోగులను సైతం ఆలోచించి
గళం విప్పేంతగా నా మనస్సును వైడన్ చేసిన
నీ వైనం రమణీయం. చిరస్మరణీయం

నేనూ వారిలాగే ఆగి పోయేవాడ్ని
హే శక్తీ .. నువ్విచ్చిన శక్తితో సాగి వ్యూహ భంగం చేయగలిగాను

హే శ్రీ విద్యా !
అవన్ని నాలో నదిలా ఉప్పొంగే శక్తి ప్రవహించ చూసే తప్పుడు
పరివాహక ప్రాంతాలన్న జ్నానాన్నిచ్చావు.
ఈ నది నడవ వలసిన పథమేదో
స్ఫురింప చేసావు

నీ పాదాల చెంతకు చేరుకోనిచ్చావు
ఈ అధ్భుతం సాధ్యం కావడానికి నేను పొడిచిందేమి
అన్న అనుమానం వీరికి కలుగ వచ్చు.
నీ రూటే వేరు ! నీ స్కూలే వేరు !
ఇక్కడ భక్తుడు ఏంచేస్తాడన్నది ముఖ్యం కాదు
ఏ భావంతో చేస్తాడన్నదే ముఖ్యం
అసలు ఏది చెయ్యాలనీ లేదు
చెయ్యాలనుకుంటే చాలు

అమ్మా! అమ్మోరు తల్లి !
ఆ అనుకోవడాలు కూడ నీ ఆజ్నతోనే సుసాధ్యమంటే
నేనో బొమ్మను !
నువ్వు నన్నాడించే అమ్మవు!!

త్యాంక్యూ ! త్యాంక్యూ ఫార్ ఎవర్ !!

Monday, 1 February 2010

రేప్ ని వారించలేనప్పుడు

అమ్మా అమ్మోరు తల్లి !
నా కన్నీ గోచరిస్తున్నాయి
నా వేలాది జన్మల స్మృతులు గోచరిస్తున్నాయి
నా లక్ష్యం లక్ష్యాన్ని సాధించడం కాదే
లక్ష్యాన్ని మరువకుండటమే నా లక్ష్యం
నా ద్యేయం విజయం కాదే
అపజయాలను తరచూ అపార్థం చేసుకుంటూ విజయాలుగానే
బాష్యం చెప్పుకుంటూ
తప్పుడు వ్యక్తుల అడ్డు తప్పుకుంటూ పైకి వెళ్ళడం........పైకి .......పైపైకి

స్వార్థ పరుల , పిరికి పందలైన ఈ మనుషులకు దూరంగా...
హే దుర్గే నీ దుర్గానికి దగ్గరగా...

పైకి పైపైకి ఎదగడం

హే అంబా !
ఆనాడే నిర్ణయించా.. నేను ఆత్మాహుతి దళాన్ని కావాలని
నీ బిడ్డలను ఆకలి దోపీడీల గొడ్డలి పోట్లనుండి కాపాడాలని..
అలా చేస్తే నువ్వు నన్ను కాపాడతావన్న కకృతితో
నేనీ ఆత్మ హత్యకు ముస్తాబయ్యాను

నువ్వు అప్పుడప్పుడు కాపాడక పోయినా
నో ప్రోబ్లం !
బ్రీచ్ ఆఫ్ అగ్రీమెంట్ నేరం
నేరానికి నువ్వు పాల్పడినా
నేను పాల్పడను

అర్థం పర్థంలేని రచనలతో
వెయ్యి కాపీల కవితా సంకలానాల విక్రయానికే ఉబ్బి పోయే
ఉత్తుత్తి కవిని కానే నేను

వంద కోట్ల భారతీయుల్లో ఒక్క శాతం వారినన్నా నా శతకాలు
ఒక శతాబ్ద కాలం పాటు శాసించాలన్నదే నా టార్గెట్
చెప్పానుగా..

టార్గెట్ కాదే నా టార్గెట్
టార్గెట్ ను మరువ కుండుటయే నా టార్గెట్

నన్నెందుకు పుట్టుంచావో
దానిని సాధించే శక్తి సామర్థ్యాలతోనే పుట్టింఛావు
నో డవుట్ !

నన్నే యుగాన పుట్టించాలో ఆ యుగాన్నే పుట్టించావు
హ్యేట్శ్ ఆఫ్ !
రిహార్సల్ ను రియల్ అనుకుని లీనమయ్యానే కాని
నీ జగన్నాటకంలోని మలుపులకు నేనెప్పుడూ వ్యతిరేకిని కాను

రేప్ ని వారించలేనప్పుడు ఎంజాయ్ చెయ్యాలన్నాడట ఎవడో మేథావి
నిజమే మారి
ఎక్కడ నా అశ్వం మరెక్కడ నా కవచం ఖడ్గం
ఎక్కడ ఎక్కడ నా సైన్యమని
ఆందోళన చెందను

నా మనసే అశ్వం నా బుద్దే కవచం నా మాటే ,వ్రాతే ఖడ్గం
నా పాఠకులే సైనికులు
నేనెదుగుదును నేనెదుగుదును

ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి

నీ దయే ఉంటే నీ శాపమే వరమై

అమ్మా అమ్మోరు తల్లి !
నువ్వెందుకు నన్నింత కాలం అనామకునిగా ఉంచావో ఇప్ప్డిప్పుడే అర్థమవుతుంది
ఇంతకాలం నెనెవర్నైతే విమర్శిస్తూ వచ్చానో
వారి సమస్త దుర్గుణాలు ఇదివరకే నాలోకి ప్రాకి పోయిన సత్యన్ని గుర్తించ కలుగుతున్నా
అవి నా మానవత్వాన్ని కవళించ చూడటాన్ని గమనిస్తూనే ఉన్నా.
వారికి నాకు ఉన్న తేడా ఒక్కటే వారు కుష్ఠురోగివలే
స్పర్శ కోల్పోయి ఉన్నారు
నేను కోల్ఫొలేదంతే
ఈడెంతగా పాడవుతాడో చూద్దమానేగా నువ్వాగింది.
మరింతగా పాడైపోతాననేగా విజయం నా చేతికందే తరుణంలో నన్ను ఆపింది
నువ్వాగియుండ కుంటే నేను మరో చంద్రబాబునయ్యేవాడినేమో?
నన్నాపియుండ కుంటే మరో కేసిఆర్ ని అయ్యే వాడినేమో?
నిజమే తల్లి!
అందుకు సూచికలు అప్పుడే నాలో ఉన్న సంగతి ఇప్పుడు గోచరిస్తుంది

కాని అమ్మా!
ఇల్లు కాలుతుంటే మురికి నీటితోనైనా ఆర్పి తీరాలి
ఆకాశం వైపే చూస్తుండిపోతే
నువ్వు ఆఘమేఘాలపై వచ్చి నన్ను ఆదుకోవడానికి
నేనేమైన్నా ఆది శంకరుడ్నా
అమ్మా!
అందుకని ఆకాశం వైపు చూడటమే మానేసానని అనుకోకు
రెండు కళ్ళిచ్చావుగా..
కుడికన్ను నేలపై ప్రవహించే మురికి కాలువల వైపు చూస్తున్నా
ఎడమ కన్నుఆకాశం వైపే చూస్తుందే
కంటి తుడుపు సాయాలకు ఆట విడుపులకిది సమయం కాదు
వన్ డే మ్యేచ్ లో ఆకరి ఓవర్లో ఆకరి బాల్ ఇది
నా బౌలింగ్ తో శతృవు క్లీన్ బోల్డ్ కావాలి
అమ్మా !
నా కడుపున పాలు పోస్తావో
నన్నే నవ్వుల పాలు చేస్తావో నీ ఇష్ఠం
శతృ స్త్రీ రూపం దాల్చి తల్లి పాలద్వారా విషాన్ని వినియోగించినా దాంతో పాటు ఆమె ప్రాణాలు సైతం పీల్చేసిన
పీతాంబరదారి సోదరివి నీవు
నువ్వేంచేసినా నా విజయం కొరకే అయ్యుంటుంది
నీ దయే ఉంటే నీ శాపమే వరమై తరియింప చేస్తుంది
అదే లేకుంటే ముప్పై ముక్కోట్ల మంది దేవతల వరాలన్ని
శాపాలై సమాధి చేస్తాయి..

దయ చూడవే..మాయా తెర లాగి పడెయ్యవే
ఓం శక్తి

Saturday, 30 January 2010

సంవాదం

నీవు: నిన్నేమని సంభోధించను ..నువ్వు చండ,ప్రచందులకు తక్కువ, మధు కైటపులకు ఎక్కువ
నేను: రాక్షసులతో కలబడి,కలబడి రాముడంతడి వాడ్ని నన్ను రాక్షసుడంటావా?
నీవు: ఆంత మాత్రం దిగివచ్చినందుకు ఆనందమే
నేను: మరి ఆనందించకు. రామన్న పై కూడ కొన్ని విమర్శలున్నాయి నా మదిలో
నీవు: ఏల మా అందరిని ఆడి పోసుకుంటావు. మరి మావద్దే సాయం అర్థిస్తావు
నేను:నా కార్యానికి మీ కాళ్ళు పట్టడం లేదు. ఇది ప్రజా కార్యం నాకు సాయపడటం మీ కర్మ కాని పూర్తి భాధ్యత నా పై మోపి
మీరు మాత్రం చేతులు ముడుచుకుని కూర్చుంటే ఎలా వదలి పెడ్తాను
నువ్వు:గ్రహం, గృహం,మంత్రం,యంత్రం మంచి చెడ్డ అన్ని చూడాలిగా
నేను:ఇవన్ని మావారి తంతు నాకు సాయ పడటమే మీ వంతు
నీవు:ప్రళయాన్ని ఆపగలవా నీవు
నేను: మీ తడపాట్లు చూస్తుంటే గలననే అనిపిస్తూంది
నీవు: ఏమి ఆపుతావు నీ మొహం
నేను: నీ మొహాన్నే ఆపగలను నా మూడో కంట
నీవు:నీ జెండా ఎగరాలంటే ఎన్నో అజెండాలు మార్చాలి
నేను: మార్చండి. మార్పు లేనిది మార్పొకటే
నీవు:ఇంతకీ నీ డిమాండు ఏమో ఏడువు..
నేను:ఇలా నువ్వడుగుతూనే ఉండాలి అయితే నేనేమి ఆడుగగూడది
నీవు:పోని నీలక్ష్యమేమో అదన్నా ఏడువు
నేను:ప్రపంచపు భిక్ష పాత్రగా తయారైన నా దేశాన్ని అక్షయ పాత్రగా మార్చాలి
నీవు:తద్వారా నీకు ఒరిగేది
నేను:భవిష్యత్తులో నా అభిమాని ఎవడన్నా తంతి తపాలా శాఖా మంత్రి అయితే నా మొఖంతో తపాలా బిళ్ళ విడుదలవుతుంది
నీవు:అదేందో నీ కలంతో సాధించుకోగల అల్ప కోరిక కదా. నా శూలంతో ఏం పని?
నేను:నా కలం అంతగా కదలాలంటే నాకో సైన్యం కావాలి అది ఆకలి దోపిడీల నాశనమే ద్యేయంగా కదలాలి.దాని తాకిడికి ఈ దేశాన్ని పట్టిన వ్రష్ఠు వదలాలి
నీవు:అంతొద్దు ఫీజు పోతుంది
నేను:పోని ..శూలినివై నీవుండి నీకు ప్రతిరూపమైన నా మాతృభూమి పరిరక్షణలో నాకు ఫీజు పోతే నీకు పోయినట్టేగా
నీవు:పిచ్చివాడా దేశ రక్షణ నీ ఒక్కనితో  సంభవమా?
నేను:హే శాంభవి ! నీ సాయమే నాకుంటే అసంభవాలను సంభవం చెయ్యడం నాకు సరదా
నీవు:నేను నీకు సాయపడతానని నీకు వరమిచ్చినట్లు నాకు గుర్తు లేదు
నేను:పోనిలే ఇప్పుడిస్తే పోలే
నీవు:ఎప్పటికీ ఇవ్వను
నేను:పోనిలే నీ సాయం తెచ్చుకునే ఉపాయం ఉండే ఉండి ఉంటుంది
నీవు:ఏమిటా ఉపాయం ఇలా వచ్చి రాని బాషలో పిచ్చి పిచ్చిగా గీకడమేనా?
నేను:సంజీవిణి మంత్ర సిద్దులు,రాక్షసగురువర్యుడైన శుక్రాచారి నా జాతకాన వాక్ స్థానంలో ఉండి నా పిచ్చి మాటలకు ప్రాణం పోస్తాడు.పరమోచ్చ స్థితి పొందిన గురుబలంతో నా మాట కాగలదు భావి  భారతానికి అభ్యుదయ భాట
నీవు: ఓరి టక్కరి !నీ కలంలో సారా ఉందో, సిరా ఉందో ..
నేను:అయితే నా భుట్టలో పడ్డావన్న మాట. పోనిలే తల్లి బతికించావు. ఇంత మాత్రం నీలో రసికత్వం నీలో ఉందనుకోలేదు..నన్నేదో రాక్షసులకు పోల్చినట్టు గుర్తు వధిస్తే పోలే
నీవు:నీకు  నా దర్శన భాగ్యం కలగ కూడదనే ఆగుతున్నా
నేను:పిచ్చి తల్లి నీ దర్శనమే కావాలనుకుంటే నాకు 48 దినములు చాలే .పేదవానికి అతని పళ్ళంలో మూడు పూటలా నువ్వు అన్న పూర్ణేశ్వరివై దర్శనమివ్వాలన్నదే నా డిమాండు. నన్ను వధించటానికి గుండెలు చాలక సాకులు చెభుతున్నావు. నన్ను వధించనొస్తే నాకు నీ దర్శనం కలిగి పోతుందనే గా నీ కుళ్ళు  పోని నా కళ్ళు గట్టిగా మూసుకుంటా , నీ ఖడ్గంతో నా తలకాయ కోసుకెళ్ళు హాయిగా..
నీవు:నీలో జ్నాన దీపం వెలిగించింది నీ సుఖ సంతోషాలు నీ ముక్తి కొరకే ఇలా అందరికీ వకాల్తా పుచ్చుకోవడానికి కాదు.
నేను: ఇంత మూర్ఖంగా ఆలోచిస్తావనుకోలేదు. నువ్వు ఒక్క దీపం వెలిగించావు. అక్కడికి నీ పని అయి పోతుంది. ఆ దీపంతో కోటి దీపాలు వెలిగించబడినా నీకొచ్చిన నష్ఠమేమిటే
నీవు: నష్ఠం కాదు. అది అజెండాకు విరుద్దం
నేను:పోనీ నేను సుఖ సంతోషాలతో జీవించి ముక్తి పొందాలన్నది నీ అజెండాలో ఒక భాగమే గా ?
నీవు :అవును
నేను:మరి స్వార్థంతో ముక్తి అసంభవం ఈ పాయింటు నీకు సమ్మతమే గా
నువ్వు:ముమ్మాటికి
నెను:అయితే నేనొక్కడ్ని సుఖ సంతోషాలతో వర్దిల్లి స్వార్థంతో  నా మానస సరోవరం కలుషితమై పోతే నువ్వెలా స్థిరవాసం చెయ్యగలవే నా గుండెలో
నీవు: కలిలో కాలుష్యాలకు తట్టుకునేలా తగిన ఏర్పాట్లతో  ముస్తాబయ్యాకే  వస్తా నీ మానస సరోవరానికి
నేను: సరే ..ముక్తినిచ్చేది నువ్వే కాబట్టి నువ్వెలాకో ఇస్తావు. ఇక భుక్తి కథకొస్తే..
నువ్వన్నట్టే నేను స్వార్థం పెంచి సుఖంగా బ్రతుకుతున్నప్పుడు ఈ దుష్ఠ పాలకుల ఆఠవిక పాలనకు బలై తన ఉనికిని కాపాడుకోవాలన్న తపనతో మానవత్వం మరచి మ్రుగమైన బాధితుడొకడు నా ఇంటి పై పడితే
నీవు:అది అజెండాలో లేదు .. అయినా దేశం కోసం ప్రాణ త్యాగం చేస్తానని విర్ర వీగావు. అప్పుడే ప్రాణం మీద ఇంత తీపా..
నేను: అమ్మా నేను నా దేశం కోసం  మరణిస్తే ఆ మరణ మ్దంగం వెనుక మానవత్వం ద్వనిస్తుంది. మరి నా సోదరుడే నా ఇంటి పై పడినప్పుడు నేనతన్ని చంపినా మానవత్వం మంట కలుస్తుంది ..ఆ పెనుగులాటలో నా ప్రాణం పోతే మానవత్వం బగ్గున కాలి బూడిదే అవుతుంది .. నా సమకాలీనులు ఈ సంఘఠణను కేవలం బ్యేనర్ వార్తగా చూసి మర్చి పోవచ్చు .. కాని నేను కలలుకనె నవ భారతం ఆవిర్భవించాక భావితరం నన్ను క్యేనిబల్ గా నిర్దారిస్తుంది. ఆ నిర్ధారణ నాకు కాదు నీకు చంప పెట్టువంటిది
నీవు:నేను సృష్ఠి కర్తను
నేను:పిల్లలు తల్లి తండ్రుల భానిసలు కారు. తల్లితండ్రులు పిల్లలను ఈ లోకానికి రానిచ్చిన ముఖద్వారాలు మాత్రమే..స్వేచ్చ నా జన్మహక్కు . దానిని ఎవరి కొరకూ చివరికి నీ కొరకు సైతం వదులు కోను.
నీవు:బిడ్డా..అహం బ్రహ్మస్మి అన్న మాటకు ప్రాణం పోసావు.సర్వ స్వతంత్ర్యాయై నమ: అని నన్ను స్తుతించి  స్తుతించి యధ్భావం తధ్భవతి అన్నట్టుగా తయారయ్యావు.ఇక నీకు నాకు బేదాల్లేవు. అన్నీ నీలో ఉంటాయి నాతో సహా
నేను: త్యాంక్స్ అమ్మా.. అమృత సేవనంతో నిత్య యవ్వన సంభూతురాలివయ్యావు కాబట్టి ఎన్ని యుగాలు గడిచినా నిన్ను వృద్దాప్యం,జఠత్వం స్పర్సించలేదు. అందుకే మన మద్య జెనరేషన్ గ్యేప్,కమ్యూనికేషన్ గ్యేప్ రాలేదు.అర్థం చేసుకోగలిగావు. అంతే చాలు ..ఓం శక్తి.

Thursday, 28 January 2010

నాడు నేడు

అమ్మా !
నాడు అన్యాయానికి తలవంచక
ప్రజల దృష్ఠిలో విధివంచితుడనైనా నీ విధి కంచె లోపే నిశ్చింతగా ఉండేవాడ్ని
నేడు న్యాయానికి నిలబడక పిరికిలా పారిపోతూ
నాకు నేను దొరికి పోయి గిల్టితో చచ్చి పోతున్నా
పేదరికం తుఫానులా
నన్ను అతలాకుతలం చేసినా
మరణంతో హలో చెప్పే దమ్ముండేది
నేడు..
వనరులున్నా వాటిని సద్వినియోగం చెయ్యక
లక్ష్య సాధనకు వెచ్చించక
అచ్చం నా సమకాలీనులవలే
మానవత్వానికి సమాధి కడుతున్నా
అమ్మా !
నాకన్నీ కావాలని ఏనాడూ కోరలేదు
నేడూ అంతే ..
కాసిన్ని వనరులు చూపావు
ఈ దేశాం గురించిన నా కలకు
అక్షర రూపం ఇవ్వనీ
ప్రపంచ బిక్షా పాత్ర ఇదని సర్దుకుని
నిస్సత్తువతో నీరుగారిపోవడం కన్నా
దీనిని ప్రపంచ అక్షయ పాత్రగా మలచ గల మార్గం ఒకటుందని
ఆ మార్గాన ఆడుగు ముందుకేస్టే ఆ స్వర్గం దిగి వస్తుందని వివరించనీ..

నన్ను మాత్రమే చూడు

అమ్మా అమ్మోరు తల్లి !
నన్ను చూడు నన్ను మాత్రమే చూడు
నా చుట్టు ఉన్న చీకటిని చూడకు
నేను నిన్నే చూసా
నిన్ను మాత్రమే చూసా
నీ వెనుకున్న భూతు పురాణాల గాదలను చూడలేదు
నీ వెనుకున్న బలుల భరతాలు చూడలేదు
నాలాగే నువ్వూ నన్ను మాత్రమే చూడు
అమ్మా నీకు ఎన్ని సార్లు చెప్పానే
వెన్ను విరిగిన దేశం కోశం పొట్ట చేత పట్టి
పట్టడన్నం కోశం తమ సర్వశ్వం ఒడ్డుతున్న
నీ బిడ్డల కోశమే ఈ యుద్దమని
నేను పొట్ట చేత పట్టుకునే  బ్రతికినా
నువ్వాదుకుంటావన్న విశ్వాసంతోనే
నా లక్ష్యాన్ని జార విడువ లేదని ...
అసలు ......అసలు ఏమిటి నీ ఉద్దేశం?
ఎలాగైతేనేం ..కమిట్ అయ్యాడు
ఇక దారి తప్పడన్న అతి విశ్వాసం ఏమన్నా దాగుందా
నీ నిర్లక్ష్యం వెనుక..

నన్ను పుట్టించిన నీకే నా మనస్సులోని పెను భూతాలు
కనిపించలేదంటే అవి ఎంతటి లోతుల్లో ఉంటాయో
నన్నెంతగా తింటాయో ఊహించుకోవే

అమ్మా !
సన్మార్గంలో విజయం సాధించ లేకుంటే
దున్మార్గాన నన్ను నడిపించడానికి నాలోనే ఉన్నాయి
పెను భూతాలు
అమ్మా ..ఇప్పటికన్నా నన్ను చూడు.. నన్ను మాత్రమే చూడు
కర్ణుడు కౌరవులతో ఉన్నాడని అతని సహజ కవచ కుండలాలు ఊడి పోయాయా?
వాటికన్నా తీసిపోయావా నువ్వు
నా చుట్టూ ఉన్న చీకటేదో నాకు తెలుసు. నువ్వు దిగి వస్తే అది
తనంతట తనే తొలుగుతుంది
నా ఆత్మ కోటి సూర్యప్రకాశంతో వెలుతుంది
అది తొలిగేంతవరకు నువ్వు కాచుక్కూర్చుంటే తేజోమయివన్న
నీ బిరుదు మెటాష్ అవుతుంది
రావే ..నింగినుండి దిగి వస్తావో
మూలాధారమునుండి లేచెస్తావో నాకో తెలీదు
రా రావే తక్షణం రా..
అపాయాలకు , నువ్వు ప్రసాదించే ఉపాయలకు  సరిగ్గా 13 నెలల తేడా ఉంది.
ఇదేనా నీ శిష్ఠ రక్షణ.. ఇదేనా నీ దుష్ఠ శిక్షణ

నువ్వే దెయ్యమైయ్యుంటే ఒక్క తులశి ముక్కతో నిన్నాపి ఉంటా
ప్రియురాలివైయ్యుంటే గుడ్ బై చెప్పి ఉంటా..
భార్యవైయ్యుంటే విడాకులే ఇచ్చి ఉంటే
పార్ట్నర్ అయ్యి ఉంటే డీడ్ చించి మొఖాన కొట్టి ఉంటా
ఫ్రెండ్ వై య్యుంటే నీతో శతృత్వానికే సై అనుంటా

ఏదీ కాక అన్నీ నీవై ఇలా చంపుకు తింటున్నావేంటి
హ్రీంకారం జపించా..121 నెలలు నిర్విరామంగా ఎండా ,వానా,పస్తు,
విందు,దనం,పేదరికం,సన్మానం,అవమానం ఏది వచ్చినా ఏది పోయినా జపించా.. నీకు పసుపు నీరు ఉంచా
నీవు రక్తానికి అలవాటు పడ్డ డ్రాగులావలే తయారయ్యావు
నీతో ఎలాగే ఏగడం

Wednesday, 27 January 2010

నిందా స్థుతి

హే అంభికా పురవాసిని!
నీ అంభికాపురాన  అష్ఠ దిక్కుల్లోను ఉన్నది పరీక్షల పేరిట
నీవు ప్రదర్శించే నీ సేడిజమే..ఆ ప్రదేశానికి కేంద్ర  బింధువు కేవలం నీ అహంకారం

అందుకేనేమో నీ బిడ్దలు సైతం స్యేడిస్తులుగా ఉన్నారు
బలహీణుల పట్ల స్యేడిజంగా భయిట పడే కృరత్వం
భలవంతుల పట్ల మసాకిజంగా దర్శనమిస్తుంది
అందుకేనేమో..

పాలకులు పెట్టే హింసలను ఎంజాయి చేస్తూ వారిలోనే ఏదో ఒక  గ్రూపును ఎన్నుకుంటున్నారు. పార్టీల పేరు చెప్పి తన్నుకుంటున్నారు

నువ్వు అష్ఠైశ్వర్య ప్రధాయినివే
ఎవరికి?
అగ్ర రాజ్యానికి, స్వదేశి టాప్ టెన్ ట్రిల్లియనర్లకు
మత వైషమ్యాలను రెచ్చ కొట్టి
మరి ఈ దేశాన్ని విభజించ చూసే పొరుగు దేశానికి
కొమ్ము కాసే  మూర్ఖులకు
అరిచేత వైకుంటాన్ని చూపి స్వంత
మామకు భూలోకానే  యమలోకాన్ని సృష్ఠించిన
వెన్ను పోటు వెదవలకు

నువ్వు అనుగ్రహ ప్రధాయినివా..?
 ఎవరికి ?
 వడ్డీలు కట్నాలు లంచాలు దండుకుంటున్న
దగుల్ బాజీలకు,అధములకు

నీవు అఖిలాండేశ్వరివా?  కాదు
అఖిలాండాన్ని పాలించేది అగ్ర రాజ్యం
ఇక్కడి  దేశాధినేతలు ఏ బ్రాండు క్యేండోం వాడాలో కూడ వారే నిర్ణయిస్తారు

ఈ విషయాన మేము కాస్త అదృష్ఠవంతులం
మమ్మల్ని ఏలే అవకాశాన్ని ఆకలి దోపిడీలకు ఇచ్చావు.
నువ్వు అభయవరద హస్తినివా..
కాదు..
అభయమిస్తానని ఆశ చూపి ఆపదలోకి నెట్టి లౌకిక జీవితం
వరదై భక్తుడు శవమై కొట్టుకుపోతుంటే
చూస్తుండి పోయే చేత కానిదానివి

నువ్వు అమృతమయివా?
కాదు ఈ మాట నిజమైతే నీ ఈ సృష్ఠి కూడ అమృతమయమై ఉండి ఉండాలి
నీలో సగం శివుడున్నాడుగా అతడారగించిన అలాహలం నీలోను ప్రవహిస్తుందేమో?
అందుకే ఈ సృష్ఠి ఇలా ఏడ్చింది

నువ్వు ఆనందమయివా?
ఈ మాట నిజమే కాబోలు
అందుకే ఉన్నవాని దోపిడి, లేనివాని ఆకలి స్థూలంగా వేరే అయినా
ఇరువురిని ఆనందానికి చేరువగా అదే మరణలోక ద్వారానికి
దగ్గరగా నడిపిస్తున్నాయి.
ప్రస్తుతానికి ఏం జరిగినా అతి త్వరలో  అంతా ఆనందంగా పరమానందంగా
మారక తప్పదు.
నువ్వు అన్న పూర్ణేశ్వరివా?
మా దేశ పరిస్థితిని పట్టి చూస్తేనే ఇందులో నలబై శాతం అబద్దముంది
అవును నా దేశాన నలబై శాతం మంది పస్తున్నారుగా

నువ్వు ఆద్యంత శివరూపిణివా
నాలా నమ్మి చెడి పడి చచ్చినవారి బూడిదలేగా నువ్వు వాడే టాల్కం పౌడర్
శివుని చిరునవ్వు ప్రమాద  సూచికైతే
నువ్వు జస్ట్ నీ ఉనికితోనే కునుకు లేకుండా చేస్తున్నావు
వనుకు పుట్టించేస్తున్నావు శభాష్ !

అన్నట్టు నీకన్నా  శివయ్యే బెటర్ అతను  చిరునవ్వుతో రాక్షసులనే భూడిద చేస్తాడు
కాని నువ్వు పట్టు వస్త్రాలు మోసిన  గాడిద చందాన నిన్ను నీ నామాన్ని మోసే నావంటి భక్తులను సైతం దగ్దం చేస్తావు

నువ్వు  ఆధార శక్తివా?
కాదు. ఈ బిరుదు
అసంబంధం
మా జీవన రథాన్ని నడిపే ఇందనం దనం. అదే ఇక్కడి ఆధార శక్తి
అదొక్కటే దర్మాన్ని సైతం నిద్ర లేప గలదు
ప్రళయ కాల దుర్గను సైతమ్ నిద్రింప చేస్తుంది.

నువ్వు ఆర్థ జన రక్షిణివా?
కాదు అర్ద రక్షిణివి
కన్నవానికి  కాసింత ప్రేమ చూపకున్నా తనకంటే ఉన్న వానికి బూట్లు మోసే అర్థ జనులకే రక్షిణివి.

నువ్వు బింధు స్వరూపిణివని మా వారు గుర్తించారులే
అందుకే మా వారు నిత్యం నిన్ను సారా బింధువుల్లో వెతుకుతున్నారు

నువ్వు చతుర్వర్గ భల  ప్రధాయినివా?
కాదు ఇక్కడ జరిగే పవర్ వార్లో మని,మాఫియా, మీడియాలే త్రివర్గ భలాలు.
వాటిని నువ్వు ఈయ జాలవు.

నువ్వు చంద్ర మండల వాసినివా?
మా వాళ్ళు చంద్రమండలం వెళ్ళినప్పుడు నువ్వు ఏదో యుగాన తాంబూలం దరించిన వేళ గిల్లి పారేసిన కిళ్ళి ముక్కలు సైతం వారికి కనిపించలేదెందుకు?

నువ్వు దివ్య సుందరివా?
ఏ అందాల రాశి పోటీలో పాల్గొని గెలిచావే .. నీ తరపున ఏ ఈవ్ టీజింగ్ కేసు మా పోలీసులకు అందలేదు..
నువ్వు దివ్య సుందరివా?
మా మునిముని టు ది పవర్ అఫ్ ట్రిల్లియన్స్ భామ్మవు నువ్వు
న్ఉవ్వు దివ్య సుందరివి కావడమేమిటే
నువ్వు దైత్య నాథ గృహిణివా?
ఏ గృహిణియన్నా తన శరీరంలో సగం, భర్త శరీరంలో సగం నరికి వేస్తుందా?
______________

మహా రచయిత్రి

అమ్మా అమ్మోరు తల్లి !
ఎన్నో కథలు చదివేను
మరెన్నో కథలు వ్రాసాను
ఎందరో మనుషుల జీవితాలను చూస్తున్నాను
వింటున్నాను
మరెందరో మనుషుల జీవిత సుఖ దుఖాల్లో పాలు పంచుకున్నాను
అయితే అమ్మా !
నా జీవన గాదలో మాత్రం ఎందుకే ఇంతటి డ్రాగింగ్
నా తల్లికి కుచేలుని భార్య పేరు కుదిరింది కాబట్టె
ఈ దారిద్రియం ఇలా వెంటాడుతుందా
పుట్టిన నాటినుండి నేటి వరకు
ఏదో రూపంలో ఏదో మూతాదులో
దారిద్రియం !దారిద్రియం!!
ఈ దారిద్రియాన్ని దగ్దం  చేసేందుకు
ఎంతగానో దిగ జారాను
కాని దారిద్రియంలో మాత్రం మార్పు లేదు
నీడలా..పాపంలా.శాపంలా..మరణంలా వెంటాడుతూనే ఉంది
అవీ గడిచి పోయాయి
తపస్సు చేసాను
ఒకే భీజాన్ని 9 సం.లుగా ద్యానిస్తూనేఉన్నాను
ఏవో కొన్ని అధ్భుతాలు జరుగుతున్నాయిగాని
నా దారిద్రియం మాత్రం దగ్దం కావడం లేదు
ఎందుకు?
1967 1986 మద్యన గడిచిన 19 సం.ల కాలాన్ని విడిచి పెడదాం
అప్పుడు నేను కేవలం తెలివైన చిలుకను మాత్రమే
మరి నేడు
 హే మదుర మీనాక్షి !
 చేతిలోని చిలకంత స్థాయికి ఎదిగాను
హే అంబా!
నా పలుకులు నీ పలుకులంతటి భీబత్సాన్ని సృష్ఠించేస్తున్నాయి
పూజ్యులు పూజ్యాలవుతున్నారు
రాజ్యాలే గడ గడ వనుకుతున్నాయి
మరి నా దారిద్రియం మటుకు
కొన ప్రాణంతోనన్నా కొట్టు మిట్టాడుతూనే ఉంది
పొరబాటున నా దారిద్రియానికి
చిరంజీవత్వం ప్రసాదించ లేదుగదా?
పొరభాటున నా దారిద్రియానికి అమృత సేవనం గావించలేదుగదా?
నేను చెయ్యాలి యుద్దం
అందుకు నా దారిద్రియం కావాలి దగ్దం

Saturday, 23 January 2010

నాతో వీరికి మిగిలేది నాశనం

అమ్మా అమ్మోరు తల్లి !
ఎటో వెళ్ళి పోతుంది ఈ జీవితం
మరేదీ కాదిందులో శాస్వతం
అయినా ........
ఎటో కదిలి లక్ష్యం వదలి వెళ్ళి పోతున్న జీవితం
పెను భూతమై బెదర కొడుతుంది
అందమైన కలలను చెదర కొడుతుంది
ఎ లెటర్ టు ది గ్రాండ్ ఫాదర్లో మనవడిలా ఉన్న నేను
తాతవు కాకున్నా జగన్మాతవైన నీకు వ్రాస్తున్నా ఈ లేఖ
ఈ మళ్ళింపులతో ఘఠణలు సంఘఠణలు ఎక్కువై
జ్నాపకాల మోత పెరిగి పోయింది

జీవితం , నాకు నేను
గీసి ఉంచిన లక్ష్మణ రేఖను దాటేసుంది
స్వార్థపు డ్రాగులాను వాటేస్తుంది
సర్పంలా కాటేస్తుంది
నాలో దడ పుడుతుంది
ఆత్మ విశ్వాసపు జాడ కనబడటం లేదు

నేననుకున్నంత కాదేమో నవ భారత పున:నిర్మాణం
నేననుకున్నంత తేలిక కాదేమో నా సందేశాన్ని వినిపించటం
అమ్మా నిన్ను తలచుకుంటూ
కమ్మని గేయాలు వల్లించుకుంటూ
గుండెలో తుళ్ళింతలతో తొలకరి చినుకులవంటి
నీ కరుణామృత జల్లులతో తడిసి ముద్దైయ్యేటంతటి
స్వార్థం నా గుండెలో లేదెందుకో

సమ సమాజ సృష్ఠియే ద్యేయంగా సంపూర్ణ నాస్తికత్వంతో
ఫుల్ టైం శ్రమించే నాలో నిస్వార్థం లేదెందుకో?

అమ్మా !
ఈ రెండు గుర్రాల పై స్వారి నా బుర్రెలో వెర్రెక్కిస్తూందే
నేనూ మనిషినే కాదా?
మరి ఇంత పెద్ద గుండెను ఇచ్చినా(కె)వెందుకే?
ఆ గుండెలో నిండుగా వెలసితివెందుకే?

వెలిసావు సరే నన్ను కలిసావు సరే
ఈ మూర్ఖులకు నేను విక్రమార్కుడనన్న సంగతి చెప్పవెందుకే?
ఈ అగుచాట్లు తప్పవెందుకే?

వీరిని ఉద్దరించ వచ్చిన నన్ను చీదరించటం...
చీదరించిన పాపానికి చితికి పోవడం
ఇంతేనా వీరికి నాకు ఉన్న సంబరం

అమ్మా !
నాతో వీరికి మిగిలేది నాశనం
ఒక్కడు సమ సమాజ సృష్ఠికై నేను పొందిన వరం
వీరి అజ్నానంతో వీరు నాకు కల్పించే అవమానాలతో వీరి పట్ల శాపంగా మారిందే

అమ్మా దయ చూడవే !
నేను ప్రజా రక్షకుడ్ని నా చేత ప్రజా భక్షణ చెయ్యిస్తావా?