క్షమించండి !
నా ఈ బ్లాగును అప్డేట్ చెయ్యడం లేదు. ప్రస్తుతం నా మరో తెలుగు బ్లాగ్ రెగ్యులరుగా అప్డేట్ అవుతూంది. అందులోని టపాలను చదవడానికి ఇక్కడ నొక్కండి
Pages
Tuesday, 26 October 2010
నేటి మైక్రో ఫైనాన్స్ అధినేత ఒకప్పటి బ్యేంక్ కరప్ట్
ఆడువారి మాటలకు మూలాలు వేరులే
ప్రతి మగవాడు ఆడదాన్ని అర్థం చేసుకోలేక చచ్చి పోతున్నాడు. ఆడవాళ్ళు మగవారిని ఏం చక్కా అర్థం చేసుకొని రిమోట్ తో టివి చానళ్ళు మార్చి ఆడుకున్నట్టు ఆడుకుంటున్నారు. ఇదెలా సాధ్యమైంది వారికి? ఇక్కడ ఆడవాళ్ళు అంటే ఏ ప్రియురాలినో,భార్యనో, ఉంపుడుగెత్తనో ,వేశ్యనో మాత్రం చెప్పలేదు. ప్రతి ఆడది చేసే పని ఇదే.
ఈ నైపుణ్యం స్త్ర్రీకి మాత్రం ఎలా వచ్చింది. మగవాడెందుకు "ఇలా" తయారయ్యాడు. స్త్ర్రీ ఏ రూపంలో ఎదురైనా ఆమెవద్దనుండి ఏదో ఆశించి ఆశించినదానిని పొందలేక, ఏదో రోజు పొందొచ్చు అన్న విశ్వాసంతో ఎందుకిలా జీవితం వృధా చేసుకుంటున్నాడు.
ఈ ప్రశ్నలకు జవాబుగా ఈ టపా వ్రాస్తున్నా. ఇంతకీ ఈ టపా వ్రాయడం వెనుక మరో కుట్ర కూడ ఉంది. అదేమంటే సూక్ష్మ రూణాల పేరిట అమ్మలక్కలను నిత్యం క్షోభలకు గురి చేసి,ఆమె రక్తం పీల్చి, పరువు తీసి ,రోడ్డున పడేసి, చివరికి కాటికి చేర్చిన పెద్దమనుషులు ఎవరు? వారి బినామి ఎవడు? అతని "గత చరిత్ర ఏమీటి అన్న విషయాలను సైతం ఈ రోజు చెప్ప దలచా.
మరీ కీలకమైన విషయం. పది మంది ఎక్కువ చదివితే అంత మేలు కాబట్టే ఆడ,మగ సంభంధాలను ఇక్కడ ప్రస్తావించా.
మనుషుల్లోనే కాదు ఏ జీవరాశిలో చూసినా ఆడ పుట్టుక గట్టిదే. మగ దోమలు కుట్టలేవు. మగ సింహాలు పిల్లలను చూసుకుంటూ గుహలోనే ఉంటాయి. ఇది ప్రకృతి ధర్మం.
ఈ ప్రకృతి ఏ ప్రాణి వద్దనుండైనా ఎక్స్ పెక్ట్ చేసేది ఒకటే అది వ్యాప్తి చెందడం. ఈ ప్రక్రియలో స్త్ర్రీ యొక్క భాగస్వామ్యమే కీలమైంది. పురుషుడు చేసే పని కేవలం వీర్య కణాలను ఆమె గర్భంలో చేర్చడమే. కాని స్త్ర్రీ పది నెలలు మోసి,కని పోషించాలి.
ఇంతటి రిస్కుండడంతో తన శ్రమ వృధా పోకూడదనే ఆలోచన ఆమెలో సహజసిద్దంగానే ఉంది. అందుకే ప్రక్రుతి ఆమెకు ఎన్నో అదనపు శక్తులను, సామర్థ్యాలను ప్రసాదించింది. పురుషుడు సర్వైవ్ అయితే కేవలం ఒక ప్రాణమే రక్షించ పడుతుంది. (అతని ప్రాణం) కాని స్త్ర్రీ మరీ గర్భస్త స్త్ర్ర్రీ సర్వైవ్ అయితే?
అందుకే ప్రకృతి స్త్ర్రీకి ఆపదను పసిగట్టే తెలివి, అంచనా వేసే సామర్థ్యం, ఆచి తూచి సరైన నిర్ణయం తీసుకుని తక్షణం స్పందించే సాహసం, తదుపరి ఎన్ని కష్ఠాలొచ్చినా దృఢంగా నిలబడ గలిగే నిబ్బరం ఇలా ఎన్నో ఇచ్చింది ( మరీ అదనంగా)
మనకు ఆరేడు వాసనలు తెలుస్తే ఎక్కువ.. వారికి వేల కొలది వాసనలు తెలుస్తాయి. మనకు హరివిల్లులోని రంగులనే తెలుసు. కాని వారికి వేల కొలది రంగుల నడుమ వ్యత్యాసం తెలుస్తుంది. ఇంతే కాదు వారికి వ్యాది నిరోధక శక్తి ఎక్కువ. ఇవన్ని ఒక ఎత్తైతే
సెక్స్ . సెక్సులో పురుషుడు ఏడు కదలికలకు నాక్ అవుట్. కాని స్త్ర్రీకి 23 కదలికలు కావాలట. సంఖ్య విషయంలోను పురుషుడు ఒక్క రన్ కే అవుట్. మరీ ఆరోగ్యవంతులు, మగ మహారాజులైతే రెండు లేదా మూడు రన్లకు ఖచ్చితంగా రన్ అవుట్టే. మరి స్త్ర్రీ ? ఒకే రాత్రి 23 సార్లు భావప్రాప్తి పొంద గలదు అదీ ఎటువంటి అలసట లేకనే.
ఈ ఒక్క కారణం చేత పురుషుడు స్త్ర్రీ అంటేనే వనికి పోయే స్థితికి చేరుకున్నాడు. ఆమె యోణిని భంధించలేని చేతగాని పురుష ప్రపంచం ఆమెనే భంధించింది.
ప్రకృతి ప్రతి జీవికిచ్చిన డ్యూటి ఒక్కటే అది వ్యాప్తి చెందడం. (ఇది డబ్బుతోను సాధ్యం) సృష్ఠించడం (ఇదీ డబ్బుతోను సాధ్యం). మన సమాజం సెక్సును దాదాపు నిషేదించడంతో మైథునానికి (సెక్స్) దనాన్ని ప్రత్యామ్నాయంగా ఎంచుకున్నాడు మగవాడు. ఏనాడూ భావప్రాప్తి చెందక అసంతృప్తుతాలుగా ఉన్న స్త్ర్రీలోని పవర్ ( అది ఒకే పవర్ అదే సెక్స్ పవర్ - అది క్రిందకు జారితే సెక్స్ పవర్ పైకి ప్రాకితే యోగిక్ పవర్) బాటిల్లో భూతం కాచుకు కూర్చుంది.
పౌష్థికాహారం లేమి, విద్యలేమి,స్వేచ్చలేమి,ఉధోగవకాశం లేమిలతో ఆమెలోని వ్యాప్తి చెందే తపన, సృష్టించాలన్న తపన లోలోన ఉబుకుతూనే ఉంది. పురుషునికన్నా ఏ నలబై ఏళ్ళ వయస్సుకో పెళ్ళైతే సెక్స్ పై నిషేదం సడలుతుంది. అతనికి భావ ప్రాప్తి కలుగుతుంది. మరి స్త్ర్రీకి?
ఆమె కామంతో దహించి పోతుండేదని చెప్పను. స్త్ర్రీ కామం చాలా వరకు ఆమెకు దర్శనమిచ్చే అవకాశాలే అరుదు( గర్భం గురించిన భయం, అభద్రత, సమాజం గురించిన దిగులు ఇవే ఆవిడ కామాన్ని తొక్కివేస్తాయి - అందుకే అది సృజణాత్మకతగా, సృష్ఠించే తపనగా ఉబుకుతుండే)
బాబు పుణ్యమా అంటూ డ్వాక్రా గ్రూపులు, వై.ఎస్. పుణ్యమా అంటూ పవలా వడ్డీలు ఆమెకు ,ఆమెలోని సృజణాత్మకతకు,వ్యాప్తి చెందాలన్న కోరికకు,సృష్ఠించాలన్న తపనకు తలుపులు తీసాయి. ఆవిడ మైథునానికి ప్రత్యామ్నాయంగా దనాన్ని ఎంచుకుంది.
మగవాడు ఒక బిడ్డను కంటేనే తండ్రి అవుతాడు ( కన్నా తండ్రి కాలేని పింజారులూ ఉన్నారు) కాని స్త్ర్రీ పుట్టడం పుట్టడమే తల్లిగా పుడుతుంది. ఆమెలోని మాతృత్వమే ఆమెకు శతృవైంది. పెదనాన్న కొడుకు పెళ్ళికి సైతం తన లోను డబ్బు సర్దింది. మొగుడు పది రూ వడ్డీలో తగులుకు పోతే లోను డబ్బు సర్దింది. ఆర్థక శాస్త్ర్రం మరెన్నింటిని అన్ ప్రొడక్టివ్ యాక్టివిటీస్ గా పేర్కొందో అన్నీ చేసింది మహిళ.
కట్టలు తెంచ్చుకున్న కృష్ణమ్మలా పరవళ్ళు తొక్కింది. ఇక్కడి కృర సత్యాలు ఆవిడకు తెలియవు. ఒకరి నష్ఠంతోనే మరొకరి లాభం సాధ్యమని తెలీదు. ఇక్కడి వనరులన్ని ఒక బ్లాక్ హోల్ గుండా వెళ్ళి పోతున్నాయని.అవి అవతలకు చేరవు. ఇవతలకు తిరిగి రావని ఆమెకి తెలీదు పాపం. ఆమెకున్న తపనల్లా వ్యాప్తి చెందడం. తిరునాళ్ళకెళ్ళింది,పెళ్ళి పేరంటాలకెళ్ళింది, పుణ్య క్షేత్రాలకు వెళ్ళింది. తన కలల ఇంటిని నిర్మించింది. పొదరిల్లుగా అలంకరించింది. ముక్కు పుల్ల కొంటే వందని ,అమ్మ పోతే ఇరవై ముప్పై రూపాయలేనని ఆమెకు తెలీదు పాపం.
నల్లదనం,అవినీతి సొమ్ములను స్విస్ బ్యాంకులో దాచుకునే రోజులు పోయాయి. తాము "కష్ఠపడి"సంపాదించిన సొమ్ముకు వడ్డీ కూడ గిట్టుపాటు కావాలనుకున్న బడా నేతలు సూక్ష్మ రుణ సంస్థల్లో, నెట్ వర్కుల్లో పెట్టుబడి పెట్టేరు.
విక్రమ్. తను ఒక దశలో బ్యాంక్ కరప్ట్ గా ప్రకటించ బడనున్నానని స్వయంగా తెలిపిన పెద్దమనిషి.ఇతనికి రాజమాత సోనియా, రాజకుమారుడు రాహుల్ లాబి పరిచయం. ఫోటోలు దిగాడు. వల పన్నాడు. మహిళాలోకం అందులో చిక్కుకు పోయింది.
రుణమిచ్చేవాడు ఎదుటివారు ఆ డబ్బుతో ఏం చెయ్యనున్నారు, వారికి ఏమాత్రం అది లాభిస్తుంది, ఎంత మెరకు వారు తిరిగి చెల్లించగలరని అంచనా వేసుకుని రుణమిస్తాడు. కాని విక్రమ్ గారి ఎస్.ఎస్.కేవంటివి మరిన్ని వచ్చాయి.
ఒకే మహిళ పన్నెండు గౄపుల్లో మెంబరు. పది గౄపుల్లోను అప్పు పుడుతుంది. మరీ చెల్లింపులు? తీసుకున్న రుణాన్ని,దనాన్ని ఆవిడ దనంగా చూడ లేదు.కేవలం డబ్బుగా చూడలేదు. తనలో యుగ యుగాలుగా పేరుకు పోయిన సృష్ఠించే శక్తికి ఊతంగా భావించింది. "సృష్ఠించింది" మరి ఈ రోజు పరిస్థితి?
రోశయ్య తాతయ్య లేక లేక స్పందించి ఒక పనికి మాలిన ఆర్డినెన్స్ తెస్తే "అందులోని కఠినమైన అంశాల గురించి పునరాలోచించాలని సాక్శాత్తు కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి సూచిస్తారు. మైక్రో ఫైనాన్సుల జోలికి వెళ్ళ దలచలేదని.వారే స్వయం నియంత్రణతో పని చేస్తారని చెబుతున్నారు.
హే మహిళా! నీలోని మాతృ మూర్తికి నా పాదాభివందనం
నువ్వు ఈ ప్రకృతికి ప్రతి రూపానివి.
అవును ప్రకృతికి ప్రతివి
ప్రకృతి జగతికిచ్చిన నిధివి
ప్రకృతి యొక్క ప్రతి - నిధివి
ప్రకృతి ఆజ్నానుసారం
నువ్వు సృష్ఠించాలనుకున్నది సబబే
కాని అంతకు పూర్వం ఇక్కడి వ్యవస్థలు
ద్వంసం చెయ్యి.
నువ్వు నేను కొలిచే అంబవు జగదంబవు
పలుకు .. హే! అంబా పలుకు..
నీ గుస గుసలకే ఈ మగ పురుగుల
చెవులనుండి రక్తం కారాలి
ఏరులై పారాలి
నువ్వు నీ గుండె ఘోషను ఘోషించు
గుండే ఆగి చస్తుంది ఈ పురుషుల ప్రపంచం
ప్రేమించడమే తెలుసు. నీకు మాతృత్వమే తెలుసు.
డబ్బుతో చేసే సృషి కేవలం పేక మేడ
అది కూలినప్పుడు మన కొంపలు కూలి పోతాయి
డబ్బును అర్థం చేసుకో ప్రకృతి నీకిచ్చిన వరం
నిత్య అద్యయనం.
అద్యయనం చెయ్యి డబ్బు గురించిన మర్మాలు
1.డబ్బు రక్తం వంటిది . అది సమాజమనే శరీరమంతటా సర్క్యులేట్ అవుతూ ఉండాలి. లెకుంటే క్రమేణా ఆ శరీరానికి /సమాజానికి పక్షవాతం వస్తుంది
2.డబ్బు ఎటువంటి మూర్ఖుడనైనా జ్నానిగా మార్చ గల సరస్వతి ఆకు
3.డబ్బు మూగవాడిని సైతం పలికించగలదు ,గృడ్డి వాడ్ని సైతం చూసేలా చేస్తుంది. అవిటి వాడ్ని సైతం క్లాప్స్ కొట్టేలా చేస్తుంది, కుంటివాడ్ని సైతం మనకేసి పరుగు తీసేలా చేస్తుంది
4.డబ్బు ఏ బాషస్తునికైన అర్థమయ్యే బాష
5. డబ్బు తేనె నిండిన పాత్ర వంటిది ..దాని ఎడ్జి (Edge) మీద వాలి కొంత ఆరగిస్తే ఆకలి తీరుతుంది, ఆనందం కలుగుతుంది. దానిలోకి దూకితే రెక్కలు తడిసి అందులోనే మునిగి ఊపిరాడక చచ్చి పోతాం
6.డబ్బు ఆక్సిజన్ కన్నా గొప్పది. డబ్బుతో ఆక్సిజన్ న్ సైతం కొనగలం.
7.డబ్బుతో మానవుడు కాలం,దూరాన్ని గెలవగలగడం అతని అదృష్ఠం ..కొన్ని సార్లు గుండెలను కూడ గెలవకలగడం అతని దురదృష్ఠం
8.డబ్బు ........దాని అవసరంతో ప్రయత్నించేవానికి ఎండమావి. తీరిగ్గా ప్రయత్నించేవానికి సెలయేరు
9.డబ్బు పటిష్ఠమైన ఆత్మగౌరవం గల వస్తువు..కేవలం ఆహాన్ని సంతృప్తి కోసం ఖర్చు పెట్టే వానిని వీడి వెళ్ళి పోతుంది.
10.డబ్బు ఆత్మ గౌరవంతో బ్రతికేలా చేస్తుంది. కాని దానిని పొందాలంటే బలి చేయవలసింది కూడ దానినే
11. డబ్బు జీవితాన్ని తేజోమయం చేసే దీపం. కొన్ని సందర్బాల్లో దానిని గుగ్గి పాలు చేసే అగ్ని కూడ అదే
12.డబ్బు బుల్లెట్ వంటిది. ట్రిగ్గర్ నొక్కాక బుల్లెట్ పై అధికారాన్ని పోగొట్టుకున్నట్టే డబ్బును వెచ్చించాక దానిపై అధికారం కోల్పోతాం. ప్రేలుతున్న తుపాకీకంటే గురిపెట్ట బడిన తుపాకీకె ఆజ్నాపించే అధికారం ఎక్కువ
13.డబ్బు భగవంతునికన్నా గొప్పది. ఎందుకంటే మానవుడు దేవుడ్ని కొనడానికి ప్రయత్నించేది ఆ డబ్బుతోనే
14.అప్పు చేస్తే దానికి చెల్లించవలసింది కేవలం వడ్డీ మాత్రమే కాదు. వెంకటేశుడే గాని కుభేరుని వద్ద అప్పు చేసే వడ్డీ చెల్లించే కమిట్ మెంట్ లేకుండా ఉండి ఉంటే మన చచ్చు కోరికలను సైతం వింటుండే వాడూ కాదు. కానుకలు స్వీకరింఛి నెరవేర్చేవాడూ కాదు
15.డబ్బు బోగి మంటలు వంటిది మరీ దగ్గరకెళ్తే కాలి పోతాం. మరీ దూరమైతే పేదరికపు చలి వనికిస్తుంది.
16.డబ్బు ఎంతటి కురూపినైనా అందగత్తగా నిలబెట్టగల బ్యూటిషియన్
17.డబ్బుంటే పరాయి మనుష్యులు సైతం దగ్గరవుతారేమో కాని, స్వంత మనుష్యులు దూరమవుతారు.
18.డబ్బు బుర్రతో ఆలోచించే తెలివిని ఇస్తుంది హృదయంతో ఆలోచించే మానవత్వాన్ని సమాధి చేస్తుంది.
19.డబ్బు విచిత్రమైంది. అదున్నప్పుడు గాని,వస్తున్నప్పుడు గాని దాని ద్యాసే ఉండదు. దాని ద్యాస ఉన్నంత వరకు డబ్బే రాదు.
20.మనిషి ప్రతిదాన్నిమరణంతో ముడేసి ఆలోచిస్తాడు.. చీకటి, ఒంటరితనం,తిరస్కారం, ఏకాంతం,అవమానం, పేదరికం, ఆకలి,వృద్ద్దాప్యం ఇలా ఎన్నింటినో మరణ సమానంగా దలుస్తాడు. వీటిని గెలవడానికి డబ్బు సాయం చేస్తుందని డబ్బును ప్రాణ సమానంగా చూస్తాడు. డబ్బు మరణం యొక్క చాయలతో చేసే యుద్దంలో సహకరిస్తుందేమో గాని ,మరణపు ఛాయలకు సైతం వెళ్ళ లేదు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment