క్షమించండి !

నా ఈ బ్లాగును అప్డేట్ చెయ్యడం లేదు. ప్రస్తుతం నా మరో తెలుగు బ్లాగ్ రెగ్యులరుగా అప్డేట్ అవుతూంది. అందులోని టపాలను చదవడానికి ఇక్కడ నొక్కండి

Monday, 25 October 2010

విజయ రహస్యం -SECRET OF SUCCESS

విజయం పట్ల తపనలేని వారు ఎవరుంటారు. అనర్హుడు, బుద్ది హీనుడు,పావలా విలేకరి, అర్ద రూపాయి రచయిత ఇలా ఒకరేం ఖర్మ ప్రతి ఒక్కరు విజయాన్ని కోరుకుంటారు. విజయం మీకేమిస్తుంది? అసలు మీ పోరాటాలేవి? ఆ పోరాటాలకు మూలం ఏది? విజయం మిమ్మల్నేం చేసుతుంది?

ఈ ప్రశ్నలకు సమాధానం తెలపాలనే ఈ టపా. మానవుడు ఏ పని చేసినా ఆ పనులకు అతనిని ప్రేరేపించేవి రెండు. ఒకటి చచ్చే కోరిక.రెండు చంపే కోరిక. ( ఇది నా కల్పితం ఏమీ లేదు ముర్రో.. సైకాలజిలో ఉంది)

ఎందుకీ పాడు కోరికలు? ఈ ప్రశ్నకు కావాలంటే నేను నా లోతైన ఆద్యయనంతో వెలికి తీసిన , ఈ సృష్ఠిలోని సమస్త ప్రాణుల ప్రతి  కదలికకు బాష్యంగా నిలవ గల  సమాధానం చెప్ప గలను.  ఇదివరకే ఏదో టపాలో ఈ టాప్ సీక్రెట్ ను వివరించినట్టు గుర్తు కాబట్టి  దీనిని దాట వేసి విజయం వైపుకే వస్తున్నా.

ఇది వరకే చెప్పాను ( సైకాలజి చెబుతుందని) మనిషి ఏ పని చేసినా ,అది స్థూలంగా ఏ పని అయినా సరే దాని వెనుక ఉన్న ప్రేరణలు రెండే ఒకటి చంపటం మరొకటి చావడం.  మానవుడు ఆఠవిక జీవితం సాగించినా,సంచార జీవితంలో ఉన్నా ,స్థిరవాసం ఏర్పరచుక్న్నా అతనిని అహర్నిశలు వెంటాడి వేదిస్తూ, వనికిస్తూ , తొలచి వేసేది మరణం మరణం మరణం ఒక్కటే..

దెయ్యాలంటే భయపడేవానికే అడుగడుగునా దెయ్యాలు కనిపిస్తుంటాయి.అలా మరణం అంటే  వనికి పోయే మానవ మస్తిష్కానికి ప్రతి చిన్న విషయంలోను మరణం దర్శనమిచ్చి అతన్ని బెంబేలెత్తిస్తుంది.

చీకటి, తిరస్కారం, పేదరికం,ఆకలి, అనామకత్వం,అయిన వారి నుండి దూరం చేసి మరణంతో చేరువ చేసే కాలం, వృద్దాప్యం (మళ్ళీ చెప్పాలా : ఇది మరణానికి చేరువ చేస్తుంది) ఇలా ఒకటి కాదు ప్రతిదానితో మరణాన్ని ముడి వేసుకుని వాటినుండి భయట పడాలని మనిషి తెగ ఆరాట పడి పోతుంటాడు.

వీటిని మరణం యొక్క చాయలని చెప్పొచ్చు. మానవుడు మరణంతోనే తను యుద్దం చేస్తున్నామన్న భ్రమలో మరణం యొక్క చాయలతో యుద్దం చేస్తూ క్షణం క్షణం మరణ యాతన పడుతుంటాడు.

ఎప్పుడో ఒక సారి మాత్రమే ఎదురు కానున్న మరణంతో కరచాలనం చేసే దమ్ము లేక మరణం యొక్క చాయలతో యుద్దం చెయ్యడం ఎంతటు మూర్ఖత్వమో మీరే ఆలోచించండి.

మీరు విజయాలని ఏ ఏ విషయాలను చెబుతారో అవన్ని మరణం యొక్క చాయలతో చేసిన యుద్దాల్లో లభించిన మద్యంతర ఊరడింపులే.

విద్య :
విద్యతో ఉధ్యోగం వస్తుంది. ఉధ్యోగం వస్తే పెళ్ళి అవుతుంది. పెళ్ళవుతే ఒక భార్య వస్తుంది. ఆమె మీ ఒంటరితనాన్ని పోగొడుతుంది. ఒంటరితనం మరణానికి ప్రతీక.

ఇందులోని చేదు నిజం ఏమంటే చాలా మంది భార్యా మణులు మరణ యతన పెట్టేస్తుంటే, కొందరు ఉత్తమ స్త్ర్రీలు మరణాన్నే ప్రసాదించేస్తారు.

మీరు విజయమని భావించే ప్రతి విషయమూ ఇటువంటిదే.ఇటువంటి ఫలితాలనే ఇస్తుంది. స్థూల వస్తువుతో చేసే యుద్దం గెలుపోటములను ఇస్తుంది కాని చాయలతో చేసే యుద్దం ఏం చేస్తుంది?

ఇంకో ఉదాహరణ కూడ చెబుతా:
మీరు ముసలితనాన్ని వాయిదా వెయ్యడం కోసం ఏవేవో తంటాలు పడుతుంటారు. (హేర్ డై వేసుకోవడం మొదల్గొని , ప్లాస్టిక్ సర్జరి, వాకింగ్,జాగింగ్,యోగా, ద్యానం) అందుకని మరణం ఎప్పటికీ మీ చాయలకు రాదా? ఖచ్చితంగా వస్తుంది.

అందుకే నేను చెప్పడం ఏమంటే మీ విజయాలు వృధా. ఎందుకంటే మీ యుద్దాలే వృధా. ఎందుకంటే మీ యుద్దం స్థూల వస్తువుతో సాగడం లేదు. కేవలం నీడలతో సాగుతూంది.

పైగా మీరు విజయం కోసం పడే ఆరాటం మిమ్మల్ని మరణానికి చేరువ చేస్తుంది. అంటే మనలో ఎవ్వరూ విద్య ,ఉధ్యోగం,పెళ్ళి,సంతానం,పేరు,ప్రఖ్యాతలు,దనం, అధికారం తదితర విజయాలకు ఆరాటపడకూడదా అని మీ ప్రశ్నించవచ్చు.

నెనలా అనడం లేదు. అసలు విషయం తెలుసుకుంటే లో గుట్టును రట్టు చేస్తే మీ యుద్దాల అనర్థాన్ని, పేరడిని, పిచ్చితనాన్ని అర్థం చేసుకుంటే మీ యుద్దం ఒక చదరంగంలా ఉల్లాసంగా సాగుతుంది.

ఎప్పుడైతే గెలుపోటముల అర్థరాహిత్యం మీ అంతరాత్మకు అర్థమై పోతుందో మీ లో ఎటువంటి టెన్షన్, ఆతృత ఉండదు. అలా రిలేక్స్ గ్యేమ్ సాగినప్పుడు మరణం యొక్క చాయలతో మీరు చేస్తున్నా యుద్దాల్లో ఇన్ని తప్పటడుగులు,కుళ్ళు కుతంత్రం, అవినీతి,అన్యాయం,అధర్మం ఉండవు కాక ఉండవు.

ఇటీవల నా తమిళ బ్లాగులో ఆన్ లైన్ మితృడు సాటి బ్లాగర్ సుకుమార్ జి ఒక అధ్భుతమైన వ్యాఖ్య చేసాడు. ( మన జీవితాల గురించి)

ఎముకలను త్రవ్వ పోయిన కుక్క ఆ గోతిలో తనే పడినట్టుగా ఉందట మన జీవితాలు. అలా కాకూడదనే తల పగల కొట్టుకుని మీరు తలపట్టుకునే ఈ టపా వ్రాసాను

ఇక ఉంటాను బాస్..

0 comments:

Post a Comment