విజయం పట్ల తపనలేని వారు ఎవరుంటారు. అనర్హుడు, బుద్ది హీనుడు,పావలా విలేకరి, అర్ద రూపాయి రచయిత ఇలా ఒకరేం ఖర్మ ప్రతి ఒక్కరు విజయాన్ని కోరుకుంటారు. విజయం మీకేమిస్తుంది? అసలు మీ పోరాటాలేవి? ఆ పోరాటాలకు మూలం ఏది? విజయం మిమ్మల్నేం చేసుతుంది?
ఈ ప్రశ్నలకు సమాధానం తెలపాలనే ఈ టపా. మానవుడు ఏ పని చేసినా ఆ పనులకు అతనిని ప్రేరేపించేవి రెండు. ఒకటి చచ్చే కోరిక.రెండు చంపే కోరిక. ( ఇది నా కల్పితం ఏమీ లేదు ముర్రో.. సైకాలజిలో ఉంది)
ఎందుకీ పాడు కోరికలు? ఈ ప్రశ్నకు కావాలంటే నేను నా లోతైన ఆద్యయనంతో వెలికి తీసిన , ఈ సృష్ఠిలోని సమస్త ప్రాణుల ప్రతి కదలికకు బాష్యంగా నిలవ గల సమాధానం చెప్ప గలను. ఇదివరకే ఏదో టపాలో ఈ టాప్ సీక్రెట్ ను వివరించినట్టు గుర్తు కాబట్టి దీనిని దాట వేసి విజయం వైపుకే వస్తున్నా.
ఇది వరకే చెప్పాను ( సైకాలజి చెబుతుందని) మనిషి ఏ పని చేసినా ,అది స్థూలంగా ఏ పని అయినా సరే దాని వెనుక ఉన్న ప్రేరణలు రెండే ఒకటి చంపటం మరొకటి చావడం. మానవుడు ఆఠవిక జీవితం సాగించినా,సంచార జీవితంలో ఉన్నా ,స్థిరవాసం ఏర్పరచుక్న్నా అతనిని అహర్నిశలు వెంటాడి వేదిస్తూ, వనికిస్తూ , తొలచి వేసేది మరణం మరణం మరణం ఒక్కటే..
దెయ్యాలంటే భయపడేవానికే అడుగడుగునా దెయ్యాలు కనిపిస్తుంటాయి.అలా మరణం అంటే వనికి పోయే మానవ మస్తిష్కానికి ప్రతి చిన్న విషయంలోను మరణం దర్శనమిచ్చి అతన్ని బెంబేలెత్తిస్తుంది.
చీకటి, తిరస్కారం, పేదరికం,ఆకలి, అనామకత్వం,అయిన వారి నుండి దూరం చేసి మరణంతో చేరువ చేసే కాలం, వృద్దాప్యం (మళ్ళీ చెప్పాలా : ఇది మరణానికి చేరువ చేస్తుంది) ఇలా ఒకటి కాదు ప్రతిదానితో మరణాన్ని ముడి వేసుకుని వాటినుండి భయట పడాలని మనిషి తెగ ఆరాట పడి పోతుంటాడు.
వీటిని మరణం యొక్క చాయలని చెప్పొచ్చు. మానవుడు మరణంతోనే తను యుద్దం చేస్తున్నామన్న భ్రమలో మరణం యొక్క చాయలతో యుద్దం చేస్తూ క్షణం క్షణం మరణ యాతన పడుతుంటాడు.
ఎప్పుడో ఒక సారి మాత్రమే ఎదురు కానున్న మరణంతో కరచాలనం చేసే దమ్ము లేక మరణం యొక్క చాయలతో యుద్దం చెయ్యడం ఎంతటు మూర్ఖత్వమో మీరే ఆలోచించండి.
మీరు విజయాలని ఏ ఏ విషయాలను చెబుతారో అవన్ని మరణం యొక్క చాయలతో చేసిన యుద్దాల్లో లభించిన మద్యంతర ఊరడింపులే.
విద్య :
విద్యతో ఉధ్యోగం వస్తుంది. ఉధ్యోగం వస్తే పెళ్ళి అవుతుంది. పెళ్ళవుతే ఒక భార్య వస్తుంది. ఆమె మీ ఒంటరితనాన్ని పోగొడుతుంది. ఒంటరితనం మరణానికి ప్రతీక.
ఇందులోని చేదు నిజం ఏమంటే చాలా మంది భార్యా మణులు మరణ యతన పెట్టేస్తుంటే, కొందరు ఉత్తమ స్త్ర్రీలు మరణాన్నే ప్రసాదించేస్తారు.
మీరు విజయమని భావించే ప్రతి విషయమూ ఇటువంటిదే.ఇటువంటి ఫలితాలనే ఇస్తుంది. స్థూల వస్తువుతో చేసే యుద్దం గెలుపోటములను ఇస్తుంది కాని చాయలతో చేసే యుద్దం ఏం చేస్తుంది?
ఇంకో ఉదాహరణ కూడ చెబుతా:
మీరు ముసలితనాన్ని వాయిదా వెయ్యడం కోసం ఏవేవో తంటాలు పడుతుంటారు. (హేర్ డై వేసుకోవడం మొదల్గొని , ప్లాస్టిక్ సర్జరి, వాకింగ్,జాగింగ్,యోగా, ద్యానం) అందుకని మరణం ఎప్పటికీ మీ చాయలకు రాదా? ఖచ్చితంగా వస్తుంది.
అందుకే నేను చెప్పడం ఏమంటే మీ విజయాలు వృధా. ఎందుకంటే మీ యుద్దాలే వృధా. ఎందుకంటే మీ యుద్దం స్థూల వస్తువుతో సాగడం లేదు. కేవలం నీడలతో సాగుతూంది.
పైగా మీరు విజయం కోసం పడే ఆరాటం మిమ్మల్ని మరణానికి చేరువ చేస్తుంది. అంటే మనలో ఎవ్వరూ విద్య ,ఉధ్యోగం,పెళ్ళి,సంతానం,పేరు,ప్రఖ్యాతలు,దనం, అధికారం తదితర విజయాలకు ఆరాటపడకూడదా అని మీ ప్రశ్నించవచ్చు.
నెనలా అనడం లేదు. అసలు విషయం తెలుసుకుంటే లో గుట్టును రట్టు చేస్తే మీ యుద్దాల అనర్థాన్ని, పేరడిని, పిచ్చితనాన్ని అర్థం చేసుకుంటే మీ యుద్దం ఒక చదరంగంలా ఉల్లాసంగా సాగుతుంది.
ఎప్పుడైతే గెలుపోటముల అర్థరాహిత్యం మీ అంతరాత్మకు అర్థమై పోతుందో మీ లో ఎటువంటి టెన్షన్, ఆతృత ఉండదు. అలా రిలేక్స్ గ్యేమ్ సాగినప్పుడు మరణం యొక్క చాయలతో మీరు చేస్తున్నా యుద్దాల్లో ఇన్ని తప్పటడుగులు,కుళ్ళు కుతంత్రం, అవినీతి,అన్యాయం,అధర్మం ఉండవు కాక ఉండవు.
ఇటీవల నా తమిళ బ్లాగులో ఆన్ లైన్ మితృడు సాటి బ్లాగర్ సుకుమార్ జి ఒక అధ్భుతమైన వ్యాఖ్య చేసాడు. ( మన జీవితాల గురించి)
ఎముకలను త్రవ్వ పోయిన కుక్క ఆ గోతిలో తనే పడినట్టుగా ఉందట మన జీవితాలు. అలా కాకూడదనే తల పగల కొట్టుకుని మీరు తలపట్టుకునే ఈ టపా వ్రాసాను
ఇక ఉంటాను బాస్..
క్షమించండి !
నా ఈ బ్లాగును అప్డేట్ చెయ్యడం లేదు. ప్రస్తుతం నా మరో తెలుగు బ్లాగ్ రెగ్యులరుగా అప్డేట్ అవుతూంది. అందులోని టపాలను చదవడానికి ఇక్కడ నొక్కండి
Pages
Showing posts with label secrets. Show all posts
Showing posts with label secrets. Show all posts
Monday, 25 October 2010
Monday, 27 September 2010
తమిళ బ్లాగ్లోకంలో నా విజయ రహస్యాలు
తెలుగు బ్లాగ్లోకంలోనైతే ఒక పొలిటికల్ స్టాండ్ తీసుకుని వ్రాస్తూ వచ్చాను http://www.blaagu.com/swamy7867 ఎన్.టి.ఆర్ మరియు వై.ఎస్.ఆర్ అనుకూల వైఖరి కారణంగా కొంత నష్ఠం జరిగి ఉండవచ్చు. కాని తమిళ బ్లాగ్లోకంలో ఉద్దేశ పూర్వకంగా కాక పోయినా కాకతాళీయంగా ఒక స్టాండ్ అంటూ లేక పోయింది . ఏ వర్గం తప్పు చేసినా ఖండిస్తూ వచ్చాను.
అయితే కుల వ్యవస్థకు,కులాహంకారానికి ,ముఖ్యంగా బ్రాహ్మణుల కులాహంకారానికి వ్యతిరేకంగా నా రచనలు ఉన్నవి
పెరియార్ తమ యావద్ జీవితాన్ని ధార పోసి నెలకొల్పిన " పగుత్తరివు" ( విచక్షణా జ్ఞానం) అక్కడ చెక్కు చెదరకుండటంతో ఇదీ నాకో ప్లస్ పాయింట్ అయ్యింది. పెరియార్ అనుకూల వైఖరిని కొనసాగించాను.
బ్రాహ్మణుల కులాహంకారం, విద్య విషయంలో వారు అవలంబించే స్వార్థ పూరిత వ్యూహాలంటే నాకు పరమ చికాకు.
అటు పెరియార్ ను కొనియాడుతూ ఇటు జ్యోతిష్యం ఆథ్యాత్మిక విషయాలు ఎలా వ్రాసానంటే... దేవుడున్నాడనడానికి దేవునితో పెద్ద అనుసంథానం అవసరం లేదు. దేవుడు లేడు అనాలంటేనే దేవునితో అసలు సిసలైన అనుసంథానం అవసరం వాదిస్తూ వచ్చాను . అది పెరియార్ కు ఉండేదేమోనని వాదిస్తూ వచ్చాను.
నాకు సాటి బ్లాగర్లకు ఉన్న తేడా జ్యోతిష్యం,వాస్తుల్లో నాకు ఉన్న ప్రానీణ్యత. పైగా స్వతా: కుదిరిన సెక్సాలజి మరియు సైకాలజి సంబంధ టపాలు నా బ్లాగుకు ఒక వైవిద్యాన్ని తెచ్చి పెట్టాయి.సెక్స్ అంటే స్వాతివంటి మాస్ పత్రికల్లో వచ్చే సరసమైన కథల్లా కాకుండా ఎజుకేటివ్ గా వ్రాస్తూ వచ్చాను. ఉ. అడల్ట్ జోక్స్ అందించినప్పటికి వాటి వెనుక ఉన్న సైకాలజిని అనలైజ్ చేసాను.
కేవలం అక్రమ సంభంధాల చిట్టా విప్ప కుండా వాటికున్న కారణాలను అన్ని కోణాల్లోనుండి వివరించాను. అదెలా కుదిరిందో కాని సక్సెస్ మాత్రం వరించింది. చెప్పడం మరిచాను ముఖ్యంగా నేను బ్లాగర్ల గ్రూపు రాజకీయాల్లో తల దూర్చ లేదు.
హెశ్చరిక:
ప్రస్తుతం తమిళ బ్లాగ్లోకానికి ఒక అగ్ని పరీక్ష పెట్టాను ప్రస్తుతం నా బ్లాగుకు 243 మంది సభ్యులే ఉన్నారు.ఈ సంఖ్య అక్టో. రెండు లోపు ఐదొందలు కావాలి కాకుంటే కొత్త టపాలు వెయ్యనని అల్టిమేటం జారి చేసాను. ఒక వేళ ఈ సంఖ్య అసాధ్యమైతే తెలుగు బ్లాగ్లోకం పైనే దృష్థి కేంద్రీకరించాలని నా ప్లాన్.

Subscribe to:
Posts (Atom)