క్షమించండి !

నా ఈ బ్లాగును అప్డేట్ చెయ్యడం లేదు. ప్రస్తుతం నా మరో తెలుగు బ్లాగ్ రెగ్యులరుగా అప్డేట్ అవుతూంది. అందులోని టపాలను చదవడానికి ఇక్కడ నొక్కండి

Saturday, 30 October 2010

మానవుడి ఆలోచనలకు మూలం

ఆనాటి చందమామలో రాకుమారులు రాక్షసులతో శతవిదాల పోరాడి ఓడిపోతారు. చివరికి ఎవరో ఋషి  క్లూ ఇస్తే  సప్త సముద్రాలు దాటుకుని వెళ్ళి  అంత పెద్ద రాక్షసుని  ప్రాణాలను ఏ పిచ్చికలోనో,ఎలుకలోనో ఉంటే వాటిని చంపి రాక్షసుడ్ని చంపేవారు.

మానవులను  దేశద్రోహులుగా, క్రిమినల్స్ గా, లంచ కుండీలుగా ( ఈ లిస్ట్ చాలా పొడవైంది కాబట్టి ఇక్కడికి ఆపుతున్నాను) మార్చేసేవి అతని ఆలోచనలే. ఒక మనిషిలోని  ఆలోచనలన్నీ ( పాజిటివ్ + నెగటివ్)  కార్య రూపం  దాలుస్తే సమాజం పని గోవిందా.. అమలు కాకుంటే అతని మానసిక ఆరోగ్యం గోవిందా..

ఇదేం చిక్కు ? దీనికి పరిష్కారం లేదా?

మానవుల ఆలోచనలు కూడ అంతే పైకి చూడటానికి ఎంతో గజి బిజిగా, జఠిలంగా,  ఉండి ఆల్జీబ్రాలా తికమక పెడతాయి. కానీ ఆలోచనల మూలాలను చేదించ కలిగితే అవి రెండో ఎక్కంలా ఇట్టే అర్థమై పోతాయి.

ఇటీవల కాలంలో సైన్స్ భాగా అభివృద్ది చెందింది. మనుషుల్లోని వివిధ ప్రవృత్తులకు కారణం రక్తంలో కలిసే కొన్ని రసాయనాలే అని నిర్థారించేరు. మీరు పిరికి పందగా ఉండటానికి కారణం అదో రసాయనం . మీ పక్కింటి యాంగ్రి యంగ్ మేన్ చెయిన్ స్మోకరుగా ,విమనైజరుగా, ఎదవగా ఉండటానికి కారణం అదేదో కెమికల్.

వీటిని స్రవించేవి గ్రంథులు. గంథుల రారాజు హైపోతలామస్. హైపోతలామస్ యొక్క ఆజ్నానుసారమే ఇతర గ్రంథులు పని చేస్తుంటాయి. అంటే మానవునిలో వివిధ ప్రవృత్తులను, చెలరేపే రసాయనాలను స్రవించడం అన్న మాట.

ఈ గ్రంథులను కట్టిడి చేసే  హైపోతలామసును కట్టిడి చేసేవి మన ఆలోచనలే. హమ్మయ్యా .. ఒక వృత్తం ( రౌండ్)  పూర్తైంది. అవును బాసూ ఈ సృష్ఠిలో అన్నీ వృత్తాకారంలోనే ఉంటాయి. మీరు ఎంత పొడవాటి గిర్రను గీసినా అది ఒక వృత్తాకారంలోని భాగమే. దాని సాగదీస్తే అది ఖచ్చితంగా వృత్తమై తీరుతుంది.

సమస్యలకు మూలం రసాయనాలని చెప్పి- వాటికి కారణం గ్రంథులని చెప్పి- వాటిని కట్టిడి చేసేది హైపోతలామసేనని చెప్పి- చివరికి ఆ హైపోతలామసును కట్టిడి చేసేది మన ఆలోచనలే అంటే బి.పి పెరిగిపోదూ? చిర్రెత్తదూ?

కాని ఇది నిజం.  సత్యం. క్యేబరే లాంటి అర కొరా సత్య కాదు . నగ్న సత్యం.  మరి ఆలోచనలకూ మూలాలు ఎక్కడున్నాయి? సెక్సు  పరిచయమైన విదానంలో ఉంటాయి. సెక్సును ఎదుర్కొన్న రీతిలో ఉంటాయని పాత మాటే చెబుతాననుకుంటే పప్పులో కాలేస్తారు.

సైకాలజి పిల్లవాడు పెరిగే వాతావరణం అతని క్యేరక్టరును,ఆలోచనా విదానాన్ని నిర్ణయిస్తుందని సైకాలజి చెబుతూంది. కాని నా అనుభవంలో చూసినప్పుడు ఆ వాతావరణాన్ని సైతం అతని జాతకమే నిర్ణయిస్తుంది.

ఉదాహరణకు: ఒక పిల్లవాడు కన్యారాశి/లగ్నంలో పుటాడనుకొండి. అరే కడుపులో పడ్డాడనుకొండి. క్రమేణా అతని చుట్టూ ఉన్నవారిలో ఒకరు రోగిష్ఠిగా ఒకరు అప్పుల అప్పారావుగా,ఒకరు కోర్టు కేసులకు తిరిగేవారుగా, తయారవుతారు.

ఇదెందుకూ అంటే ఆ పిల్లవాని భవిష్యత్ కూడ ఇదే కాబట్టి ఆ వాతావరణంలో పెరిగితేనే వాడలా తయారవుతాడని.

సైకాలజి చెప్పే కాన్సెప్టు కరెక్టే. పెరిగిన వాతావరణమే మన ఆలోచనలను నిర్థారిస్తాయి. మరి ఆ వాతావరణాన్నే నిర్ణయించేవి గ్రహాలైనప్పుడు ఏం చెయ్యాలి?

అందరూ నావద్ద జ్యోతిష సలహా తీసుకొండని కేన్వాస్ చెయ్యను. బేసికల్ గా నేను హ్యుమేనిస్టుని. చాలా మంది జ్యోతిష్కులు ఇన్ హ్యూమన్ గా ఇర్రెస్పాన్సిబిల్ గా బిహేవ్ చెయ్యడం చూసి అదేందో చూద్దామని దిగినవాడ్ని. నాకు జోతిషం వచ్చు కాని నేను కేవలం జ్యోతిష్కుడను కాను.కాలేను.

పోనీ పై పిల్లవాడు కన్యా రాశి/లగ్నంలోనే ఎందుకు పుట్టాలి? దీనిని నిర్ణయించిన శక్తి ఏది? అంటే అది అతనే. ఇదెలా సాధ్యమని మీరడగొచ్చు. చెబుతా.

మనిషి కోతినుండే వచ్చాడు. కాని అన్ని కోతులూ మనిషి కాలేదుగా? కాని ఏదో ఒక రోజు కావచ్చుగా?

ఇదే ది లా (Law) ఇక్కడ కూడ పని చేస్తుంది. ప్రతి మానవుడు ఏదో రోజు ముక్తిని పొందాలి (ముక్తి మీన్స్ జనన మరణ చక్రం నుండి విడిపడటం)

Action - Reaction థియరి ప్రకారం ప్రతి ధ్వనికీ ప్రతిధ్వని వినిపించి తీరుతుంది. నేను ఇక్కడ ఏదో మొక్కకి నీరు పోస్టే నాలోను ఏదో భాగం తడుస్తుంది. నేనో పువ్వును పీకి పారేస్తే నాలోనుండి కూడ  ఏదో రాలి పోతుంది. మోక్షం -ముక్తి అంటారుగా ఈ సంస్థ సృష్ఠినుండి నేను వేరు కాను. నేనీ సృష్ఠిలో విడదీయలేని ఒక అంతర్భాగాన్ని అని ఎక్స్ పీరియన్స్ కావడమే ముక్తియేమో?

ఈ స్థితికి చేరుకునేంత వరకు పునరభి జననం పునరభిమరణం కొనసాగుతూనే ఉంటుంది. సారీ .........సబ్జెక్టునుండి కాస్త పక్కకు పోయాననిపిస్తూంది . హు.. ఆ పిల్లాడి కథకే వస్తాం అతను ఎందుకు ఆ రాశి లగ్నంలోనే పుట్టాలి?

ప్రతి ఆత్మయొక్క టార్గెట్ తాను సృష్థిలోని అంతర్భాగమని ఎక్స్ పీరియన్స్ కావడమే.  కాని అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు ఈ స్థితి అసాధ్యమవుతుంది.

మీ చేతిలో గొడుగున్నప్పుడు మీరు వానలో తడువగలరా? గొడుగే లేకుంటే నొచ్చుకుంటూనో, తిట్టుకుంటూనో తడిచి తీరతారు. నిండా మునిగినవానికి చలి లేదు చందాన ఒక స్థితిలో వానను ఎంజాయి చెయ్యడం కూడ మొదలు పెడతారు.

ఇక్కడ వానంటే సృష్ఠి. గొడుగు అంటే మీ లైఫ్ సెక్యూరిటి .  అలానే మానవుడు భధ్రత కోసం ఉవ్విళ్ళూరినంత కాలం వాడు తను సృష్ఠిలో ఒక భాగమని  తెలుసుకోలేడు.

సమస్యలకు దూరంగా ఉన్నంత కాలం అతను సృష్ఠికి దూరంగానే బ్రతికేస్తుంటాడు. మనిశియొక్క శరీరం,మనస్సు,భుద్ది పూర్తిగా విఫలమైనప్పుడే అతనికి ఆత్మ సాక్షాత్కారం జరుగుతుంది.

గత జన్మలో మరణానంతరం తాను ఆత్మ స్వరూపుడుగా ఉన్నప్పూడు, ఆ జన్మలో  ఎటువంటి భధ్రతలు ,ఎటువంటి సుఖాలు తనను కేవలం శరీరంగా,మనస్సుగా,భుద్దిగా ఫీలయ్యేలా చేసి  ఆత్మ సాక్షాత్కారానికి దూరం చేసాయో వాటినంతా లిస్ట్ అవుట్ చేసుకుని - సతరు భధ్రతలు,సుఖాలు లేని జీవితాన్నిడిసైన్ చేసుకుని, అటువంటి జీవితాన్ని కలుగ చేసే గ్రహస్థితి వచ్చేంత దాకా కాచుక్కూర్చొని, అందుకు అనువైన తల్లి ,తండ్రులకు అనువైన వాతావరణంలో పుడుతుంది.

నిజానికి మీ జీవితం మీరు ఓకే చేసిన స్క్రిప్టే. కాని మనలో ఎవరికీ తమ జీవితం మీద సంతృప్తి లేదు. ఎంతటి మహాత్ముడైనా ఏదో ఒక తరుణంలో " తూ ..నా.. బతుకు.." అని విసుక్కోకుండ ఉండరు.

ఈ జీవితాన్ని ఏరి కోరి ఎంపిక చేసి కాచుక్కూర్చున్నప్పుడు మీరు ఆత్మ స్వరూపులుగా ఉన్నారు. ఇప్పుడు ఆత్మను ఈగో మూసేసింది. అప్పట్లో మీ ద్యేయం ముక్తి.ఇప్పట్లో మీ ద్యేయం భుక్తి. మనం కోరుకున్న జీవితమే ప్రసాదించ బడినప్పుడు ఆలోచనలకు అవసరమేముంది?

కాని మనం పొరబడ్డాం . ఎవరో ఎక్కడ నుండో ఒక పనికి మాలిన స్క్రిప్టు వ్రాసి అందులో మనలను భలవంతంగా ఇరికించేసారని పొరబడ్డాం .అందుకే ఇన్ని ఆలోచనలు. ఆలోచనల మూలం మరేమి లేదు

ఒక పక్క జీవిస్తూనే మరో పక్క జీవితాన్ని విశ్లేషించుకోవడం, అలా ఉంటే ఇలా ఉంటే,అలా జరిగి ఉంటే ,ఇలా జరిగి ఉంటే అని ఊహించుకోవడం, ఇదెక్కడికి దారి తీస్తుందో ? ఈ సమస్య ఎలా ముంచనుందోనని గాబరా పడటం ఇవే మన  ఆలోచనలన్నింటికి మూలం.

స్క్రిపుటు వ్రాసింది మనమేనన్న చిన్న విషయాన్ని అర్థం చేసుకో కలిగితే ఆలోచనలకసలు తావే లేదు. జస్ట్ బతికేస్తుంటాం. హైపోతలామస్ పర్ఫెక్టుగా పని చేస్తుంది. ఇతర గ్రందులను చక్కగా కట్టిడి చేస్తుంది. రసాయనాలు చక్కగా స్రవిస్తాయి. మన ప్రవృత్తి ప్రకృతికి అనుగుణంగా ఉంటుంది.

కావల్సిందల్లా జస్ట్ అర్థం చేసుకోవడమే...



మవుతూ ఉంటాడు.

4 comments:

  1. i am expecting nd also suspecting a future "BAABA" FROM U SISHYAA..The 2nd half of the post is really good...

    ReplyDelete
  2. Namasthe guruvu gaaru,
    meeraagnaapiste addemundi? tappaka vraasthaa
    Baba means? puttaparthi?

    ReplyDelete
  3. గురువుగారూ,
    షిర్డి బాబాగారితో నాకు మంచి అనుసంథానం ఉంది. అంటే నేను గురువారం నాన్- వెజ్ తినను అని పట్టు పట్టి హోస్టులను ఇబ్బంది పెట్టే సామాన్య భక్తుడను కాను.

    బాబాతో నాకు కలిగిన అనుభవాల గురించి ఏకంగా సిరియలే వ్రాసాను నా తమిళ బ్లాగులో.

    షిర్డిలో బాబా సంస్థాన్లో నేడు జరిగే వన్ని ఉత్తమమైన కార్యక్రమాలే అని నేను వాదించను.

    గంగ పవిత్రంగా మొదలైనా మద్యలో చెత్తా చెదారం కలిసి పోతాయిగా.. ఏం చేద్దాం

    ReplyDelete