క్షమించండి !

నా ఈ బ్లాగును అప్డేట్ చెయ్యడం లేదు. ప్రస్తుతం నా మరో తెలుగు బ్లాగ్ రెగ్యులరుగా అప్డేట్ అవుతూంది. అందులోని టపాలను చదవడానికి ఇక్కడ నొక్కండి

Friday, 29 October 2010

మీరు స్కూలుకు వెళ్ళిన తొలి రోజు

గర్బంలోని శిశువుకు  ప్రాణం పోసి అంత కాలం రక్షణ కల్పించిన గర్భాశయమే నిర్ణీత కాలం దాటి పోతే మృత్యు కూపంగా  మారి పోతుంది. (ఇది జీవితంలో మనం అర్థం చేసుకోవలసిన ఒక గొప్ప సత్యాన్ని సూచిస్తుంది - అదేమిటో ఈ టపా చివరలో వివరిస్తాను)

పసి కందువును తల్లినుండి కొద్దిగా వేరు చేస్తే ఆక్సిజన్ సిలిండర్ పీకేసిన ఐ.సి యూనిట్ రోగిలా  విల విలలాడి పోతుంది. మరి కొంతకాలానికి తండ్రి, మామ్మ,బామ్మ,అత్తమ్మ,అన్నయ్యల ముఖాలు, వారి స్పర్శ అలవాటు చేసుకుంటుంది. (కొందరి పిల్లల విషయంలో ఇది కాస్తా ఆలశ్యమవుతుంది - వీరు భవిష్యత్తులో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు .అదేమిటో ఈ టపా టపా చివరలో వివరిస్తాను.

ఇంకొంతకాలానికి ఈ ప్రపంచంలోకి జేత్ర యాత్ర మొదలు పెడుతుంది, పాక్కుంటూ అటు ఇటు తిరుగుతుంది.అన్నీ సవ్యంగా ఉంటే తల్లి వంక కూడ తిరిగి చూడదు.  ఇబ్బంది కలిగితే  మాత్రం కెవ్వున అరిచి తల్లి ఒడిలోకి చేరుకుంటుంది ( పెద్దయ్యాక  సైతం కొందరు ఇలానే ప్రవర్తిస్తుంటారు. పెద్ద,చిన్న విషయాలకు సైతం ఎవరినో ఆశ్రయిస్తుంటారు.

మొట్ట మొదటి సారి మీరు స్కూలుకి పంప బడిన రోజు,ఆ రోజుటి దృశ్యాలు మీకు గుర్తున్నాయా? జంతు వధ శాలకు పంఫ బడే మేకపోతు కూడా అంతగా గింజుకోనుండదు. కాని మీరు? కాని  కొంతకాలానికి సర్దు భాటు అయ్యాక స్కూల్లో సహపాఠులతో సత్సంభంధాలు ఏర్పడ్డాక స్కూలంటే అదో ఎంజాయ్మెంట్ గా మారి పోతుంది.

లెక్కలయ్యోరు గిల్లినా, తెలుగయ్యోరు మొటిక్కాయలు వేసినా, సైస్న్ టీచరు బెద్దంతో బడిత పూజ చేసినా అవేమి లెక్కలో ఉండేవి కావు. అర గంట ముందే  స్కూలు చేరేవారం. ఏ ఒక్క నిమిషం దొరికినా బిగ్గరగా అరుస్తూ , గొడవ చేస్తూ ఎంజాయి చేసే వారం.

మొదటి రోజు వెళ్ళను గాక వెళ్ళను ముర్రో అంటూ పొర్లి పొర్లి ఏడ్చిన స్కూలు అదే. తీరా  మనలను ఆనందంతోముంచెత్తిన  స్కూలూ అదే. మొదటి రోజుటి స్కూలూ అదే ..  కడాపటి రోజుటి స్కూలు అదే. ఎవడన్నా స్నేహితుడు ఇతరత్రా కారణాలచే మనం చేరనున్న హై స్కూల్లో చేరడం లేదని తెలుస్తే  ఎంతగానో చింతించే వారం. మనమూ ఆ స్కూల్లోనే చేరాలని పట్టు పట్టేవారం. లేదా మన స్నేహితుడ్ని సైతం మనం చేరనున్న స్కూల్లోనె చేరాలని వత్తిడి చేసే వారం.

ఈ తంతు ఎలిమెంటరి స్కూలు నుండి హై స్కూలు వెళ్ళేటప్పుడే కాదు, హై స్కూలునుండి జూనియర్ కాలేజి,జూనియర్ కాలేజినుండి కాలేజికి, నిరుధ్యోగ జీవితం నుండి  ఉధ్యోగంలోకి వెళ్ళినప్పుడు కూడా ఇలానే కొనసాగుతుంది. మెజారిటి సంఖ్య వారు ఎలానో సర్దుకుని సర్దేసుకుంటుంటారు. మరి కొందరే..ఇబ్బంది పడేది ( వారి కథ ఈ టపా చివరలో చూద్దాం)

ఈ రోజు కోర్టుల్లో అసంఖ్యాక  కేసులు పెండింగ్లో  ఉన్నాయని,అవన్ని పరిష్కారం కావాలంటే కొన్ని దశాబ్దాలు  పడ్తాయని చదివే ఉంటారు. ఆ పెండింగ్ కేసులో ఉధ్యోగ బదిలీలను సవాలు చేస్తూ వేసిన కేసులు కూడ అధికంగా ఉంటాయి.

అలానే పెళ్ళై పుట్టిల్లు వీడి మెట్టింటి వాతావరణం సూట్ అవ్వక కుంటి సాకులు వెతుక్కుని గొడవ బడి పుట్టింటిలోనే గడిపే మహిళలూ లేక పోలేదు. వీరి కేసులు సైతం కోర్టుల్లో పెండింగ్లో ఉంటాయి.

మరి ఈ నేపథ్యాలన్ని సూచించేది ఏమిటో మీకర్థమయ్యిందా?

జీవితంలో మార్పు అన్నది అనివార్యం. మార్పు తొలూత మనలను హడలెత్తిస్తాయి. మనలో మెజారిటి వారు కొద్దిగా ఇబ్బంది పడినా మార్పును అంగీకరించి ఆ మార్పుకి ఇమిడి పోతాం. మరి కొందరు ( అదృష్ఠ వశాస్తూ కొందరే) భాగా ఇబ్బంది పడి,మార్పును తిరస్కరిస్తూ, తామూ ఇబ్బంది పడి ఇతరులనూ ఇబ్బంది పెట్టేస్తుంటారు.

ఈ మార్పుల వెనుక మరో ఉద్దేశం కూడ ఉంది.అదేమంటే వ్యాప్తి చెందటం. తల్లి ఒడినుండి,కుటుంభ సభ్యుల ఒడిలోకి, కుటుంబం నుండి బడికి,బడి నుండి హై స్కూలుకి ( మనం తిరగాడ వలసిన ఏరియా వైశాల్యం పెరుగుతూ ఉంటుంది) కాలేజి,ఉధ్యోగం...

ఈ వ్యాప్తి చెందే తపన అందరికీ ఉండదు. ఫిట్టస్ట్ ఆఫ్ ది సర్వైవల్ అంటారే అలా అర్హులకే ..కలుగుతుంది. ప్రకృతి మనకిచ్చిన ఏకైక పవర్ సెక్స్ పవర్. అదే అన్ని శక్తులకు మూలం. గాంథి తాత స్వాతంత్ర్య సమరం చేసినా, కసబ్ హోటెల్ మీద దాడులు చేసినా స్థూలంగా చూస్తేనే ఈ పనులు వేర్వేరుగా కనిపిస్తాయి.

కాని సూక్ష్మంగా చూస్తే ఆ పనులనుచెయించిన శక్తియొక్క ప్రదర్శనలు మాత్రమే.ప్రకృతి పవర్ ఇచ్చింది.అది సెక్స్ పవర్. దాని ఉద్దేశం వ్యాప్తి చెందటం. వొరికింగ్ ఏరియా పెంచుకోవడం.( అంటే భూ కబ్జా కు పాల్పడటమే కాదు - వీథికో ముండను ఉంచుకోవడమే కాదు ఇలా చేసేవారి ఉద్దేశం కూడ వ్యాప్తి చెందటమే అన్నది గమనార్హం.

నిజానికి వ్యాప్తి చెందటం అంటే మన వ్యాపారానికి బ్రాంచీలు పెట్టుకోవడమే కాదు స్వార్థం వీడాలి. ఇది ఎవరిలో పుంసత్వం, మగతనం మరీ ఎక్కువగా ఉందో వారికే సాధ్యం ఇతరులు తమ కుటుంభం భంధువర్గాలకే పరిమితమవుతారు.

ఈ వ్యాప్తి చెందే తపనకు పరాకాష్ఠ మరణించటం. ఇదేమిటని ఉలిక్కి పడకండి . ఈ సృష్ఠి చాలా విశాలమైంది. ఈ విశ్వమంతటా మనం వ్యాపించాలంటే అందుకు ఈ శరీరం అడ్డమొస్తుంది. శరీరాన్ని అడ్డు తప్పిస్తే కాని ఈ సువిశాల విశ్వమంతటా మనం వ్యాప్తి చెందటం అసంభమవుతుంది.

తొలి నుండి ఎవరైతే మార్పును,వ్యాప్తి చెందటాన్ని వ్యతిరేకిస్తూ వచ్చారో వారే మరణమంటే జడుచుకుని చస్తారు(?) మరణానికే కాదు మరణము యొక్క నీడలకు సైతం వనికి పోతారు. ( చీకటి -ముసలితనం ఒంటరి తనం -పేదరికం- తిరస్కారం -ఇలా అన్నింటికి వనికి పోయి వీటిని పార ద్రోలడం కోసం  బుల్లి మరణాన్ని (వీర్య స్కలన సమయంలో) ఆస్వాదించటం కోసం సెక్సులో దిగుతారు. దీనిని దాదాపుగా నిషేదించి ఉంచిన సమాజానికి భయపడి   డబ్బు వెంట,అధికారం వెంట పరుగులు తీస్తుంటారు. లేదా సెక్స్ కోరికలను అనగ త్రిక్కి హింసకు పాల్పడుతుంటారు. భర్తలు భార్యను, భార్యలు పిల్లలను,అధ్యాపకులు విథ్యార్థులను,పోలీసులు అమాయకులను హింసించటానికి కారణం కూడా ఇదే.

వాస్తవంగా వ్యాప్తి చెందడం అంటే అది స్వార్థాన్ని వీడటమే .ఇది శక్తిమంతులకే సాధ్యం. పురుషోత్తములకే సాధ్యం. స్వార్థమంటే కృంగి పోవడం. ఇది ప్రకృతికే,ప్రకృతి యొక్క ప్రాథమిక చట్టానికే వ్యతిరేకం, స్వార్థం మరణంతో సమానం. స్వార్థం మనిషిని వ్యాప్తి చెందనీయదు.

నిస్వార్థం పున:జన్మ వంటిది. మీ ఒక్కో సారి స్వార్థం వీడి నిస్వార్థంగా పని చేసినప్పుడెల్లా కొత్తగా పుడతారు. స్వార్థంతో వ్యవహరించినప్పుడల్లా మరణిస్తారు. కనీశం మీలోని ఏదో కొంత భాగం మరణిస్తుంది.

జీవితంలో మార్పు అనివార్యం.ఆ మార్పు మనలను వ్యాప్తి చెందనీయడానికే. స్వార్థమంటే కృంగి పోవడం. నిశ్వార్థమంటే వ్యాప్తి చెందటం. మీరు ఇప్పటి నుండే మార్పులను అంగీకరిస్తూ, స్వార్థం వీడుతూ వ్యాప్తి చెందుతూ పోతే ఈ ప్రాసస్ లోని చివరి అంకం కూడ (మరణం) మీకు ఆనందాన్నే ఇస్తుంది.లేకుంటే అను క్షణం మీ మదిలో దాగి మిమ్మల్ని దెయ్యంలా పీడించి క్షణ క్షణం మరణ యాతన అనుభవించేలా చేస్తుంది

4 comments:

  1. To a well organized mind, Death is nothing but the beginning of next adventure.

    --Albus Dumbledore

    ReplyDelete
  2. గురువు గారూ ఈ మాటన్న పెద్దాయన ఎవరోగాని ఆయనకి సైతం చావు భయం ఉన్నట్టుంది. చావంటే మరేమీ లేదు జస్ట్ ఒక మార్పు. మనలను మరింత వ్యాపింప చేసే మార్పు. జీవితంలో మార్పులను వాటి ఉద్దేశాన్ని అర్థం చేసుకుని అచ్చంగా అంగీకరిసూ వచ్చినవానికి మరణం అన్నది జస్ట్ ఒక మార్పు మాత్రమే. ఇందులో సాహసమనాల్సిన అవసరం ఏముంది?

    ReplyDelete
  3. ఆ పెద్దయన చెప్పింది దాదాపుగా మీ అభిప్రాయానికి చాలా దగ్గరగా ఉందనే రాశాను. అడ్వంచర్ అనే ఒక్క పదం చూసి మీరు మరోలా అర్థం చేసుకున్నట్టున్నారు.

    ReplyDelete
  4. వీక్ ఎండ్ పొలిటీషియన్ గారూ,
    నా ఆత్రం ఏమంటే ఇప్పటికే మన జనాలు చావుకు జడిసి సెక్స్ వెనుక డబ్బు వెనుక,అధికారం వెనుక హింస వెనుక పరుగులు తీస్తూ చచ్చిపోతున్నారు. మనోళ్ళకి అడ్వెంచర్ అంటే పడదుగా.. మరీ జడుచుకుంటారేమోనని నేను జడిసి పోయి అలా వ్రాసానంతే.

    మీ రాకకు ,తమ వ్యాఖ్యకు థ్యాంక్స్

    ReplyDelete