క్షమించండి !

నా ఈ బ్లాగును అప్డేట్ చెయ్యడం లేదు. ప్రస్తుతం నా మరో తెలుగు బ్లాగ్ రెగ్యులరుగా అప్డేట్ అవుతూంది. అందులోని టపాలను చదవడానికి ఇక్కడ నొక్కండి

Saturday, 30 October 2010

బ్లాగులు నాలో రేఖెత్తించిన భావాలు

 అఖిలవనిత :: రావి ఆకు చిత్రాలెన్నో!
ఆకాశ వీథిలో ప్రకృతి గీసే వైవిద్య భరిత ఆయిల్ పెయింటింగులు కూడ బెటర్ చాయ్సేమో

 కాలాస్త్రి :: స్వదేశాగమనం
మన స్వదేశం ఆత్మ స్వరూపమే. శరీరం, మనస్సు,బుద్ది దేశాల్లో తిరిగి ఓడితే ఆత్మ దేశంలో ఉండటాన్ని గుర్తించవచ్చు

 మన తెలుగు చందమామ :: పాపయ్య గారి అద్భుత చిత్రాలు
నేటి పిల్లలకు గగనంలోని చందమామా తెలీదు.. గతంలోని చందమామా తెలీదు.. స్పైడర్ మ్యేన్ తెలుసు. శక్తిమాన్ తెలుసు

వేణువు :: అద్భుత వర్ణ చిత్రాల సృష్టికర్త.... ఎంటీవీ ఆచార్య!
ఇదేంటి బాసూ చిత్రంగా చిత్రాల గురించే మరో టపా?

 చందు - నేనింతే :: యురేకా! అక్టోబర్ లో రోజు కో బ్లాగ్ ఈ రోజుతో ముగిసింది
ఈ సృష్ఠిలో దేనికీ అంతముండదు బాసూ.. అమ్మవారికి ఆద్యంత రహితా అని ఒక పేరుంది.ఇక్కడ అన్నీ ఆవిడ స్వరూపాలేగా.అంతం కాదిది ఆరంభం అనుకొని నవంబరులో సైతం రోజుకో బ్లాగు కార్యక్రమం మొదలు పెట్టండి

తెలుగిల్లు :: ‘తిక్క’ కుదిరింది …. తెలుగు వాడి- వేడి గెలిచింది.
తిక్క కుదరకుంటే రాష్ఠ్ర్ర రాజకీయాల్లో దిక్కు మొక్కూ లేక పోయే వారు. తెలుగు లలిత కళా తోరణం  అంటే అదేదో తమ ఇంటి గుమ్మానికి  కట్టిన మావిడాకుల తోరణం, పీకి పారేద్దాం  అనుకున్నారు.. పాపం!

 మౌక్తికం :: స్నేహ సంస్కృతి
స్నేహమా ఇంకొకటా.. జనాభా విపరీతంగా పెరిగి పోయి జనం జనాన్ని చూసి చీదరించుకునే రోజులొచ్చేసాయి. కిలో మీటరు నడుస్తే కాని నర మానవుడ్ని చూడలేని రోజులు రావాలి బాసు అప్పుడే మనోళ్ళకి స్నేహం విలువ తెలుస్తుంది.

వంటింటి చిట్కాలు :: సౌందర్య చిట్కా 6
సౌందర్యం దృశ్యంలో లేదు బాసు. చూసే కళ్ళల్లో, మనసులో ఉంటాయి. వాల్మీకి మహర్షి రామాయణంలో ఒక కాండకు హనుమన్న పేరు పెట్టుకోవాలనుకుని చెబితే హనుమన్న ససేమిరా అన్నాడు. సర్లే పోవోయ్ నేను సుందరా కాండా అని పేరు పెట్టుకుంటా అన్నాడుట మహర్షి.

ఆంజనేయ స్వామి సర్లేవోయి అని వెళ్ళి పోయాడు. ఇంటికి పోతే అంజనా దేవి (హనుమన్న తల్లి) "సుందరా ! వచ్చేసావా అంటూ ఎదురొచ్చిందటా" అందుకే చెబుతున్నా సౌందర్యం దృశ్యంలో లేదు బాసు. చూసే కళ్ళల్లో, మనసులో ఉంటాయి.

రాజు మెచ్చింది రంభ కాదా ఏంటి?

శంకరాభరణం :: సమస్యా పూరణం - 139
కొంప దీసి ఈ టపా పేదవాని బతుకు గురించి కాదుకదా..

శాస్త్ర విజ్ఞానము :: చంద్రుడిపై తొలి బొమ్మరిల్లు
అవున్లే నాయనా ఎలాగో  ఈ భూ గ్రహాన్ని బ్ర ష్ఠు పట్టించేసాం

కొండ మీద ఉన్న చెట్లు నరికేసాం
గాలి,ఎండా,వానా కాలగతిని మార్చేసాం
 కర్మాగారాలంటు నదులల్లో విషం కలిపేసి తల్లి చెల్లి అనేసాం
రేపు ఆక్సిజను కొరత వస్తే కొట్టుకెళ్ళి ప్రాణాలు వాయిదాల్లో కొనుక్కుంటాం

ఇక చంద్రగ్రహం వంతా.. కానీ కానీ ఖూని..

మనసాతుళ్ళి పడకే అతిగా ఆశ పడకే ::
వివేకానంద స్వామి ఒక మాటన్నాడు " నీ మనస్సుకన్నా గొప్ప వస్తువు ఈ భూప్రపంచంలోనే లేదు.ఒక వేళ మరేదన్నా గొప్పదనిపిస్తే నీ మనస్సు భలహీనంగా ఉంది"అర్దంకావడంలేదు...చివరికి మాస్నేహమే

 సరదాకి చిరు కవిత :: సుబ్బి రామి రెడ్డి డబ్బులిచ్చి,
కష్ఠార్జితమైతే "తల నొప్పి వినాశ తిలకం " కొంటాం  మరీ భెవార్సుగా వచ్చిందాంతో తలనొప్పేగా కొనాలి

తెలుగు :: కళామతల్లికి దివ్య నీరాజనం-తెలుగు కళాతోరణం
నాటకాలొచ్చే గ్రామీన కళలు అంతరించే - సినిమాలొచ్చి నాటకాలకు ఎసర్ పెట్టే - టివిలు వచ్చే సినిమాలను ముంచే మరేదో వచ్చి టివిలను ముంచేస్తాయిలే బాసూ.. ఇక కళ అంటే మ్యూజియంలో ఎతుక్కోవలసిందేగా

 కథా మంజరి :: నటనాలయమ్
పొరభాటున ఇది రాజకీయ టపా కాదు కదా?

 మారుతీయం :: తెలుగోడు
తలుగు తల్లికి పుడితే వాడు తెలుగోడై పోడు గురువా.. తెలుగు పౌరుషం ఉండాలి మరి

 హైదరాబాదు బుక్ ట్రస్టు :: మనసున్న మహా గాయని
మరి యుపిఏ చేర్ పెర్సన్ సోనియాకూడా గాయినియే ( అంటే మనస్సు లేని గాయిని) దేశంలో ఎక్కడ చూసినా అవినీతి  పల్లవే..లేటెస్టుగా మహారాష్ఠ్ర్రా

 నాతో నేను నా గురించి... :: హెచ్చవేత - చైనీయుల పద్దతి(ట)
తనతో తానే ఉంటే తను ఎంత పెద్ద ఎదవో తెలిసి పోతుందనే గా ఇన్ని పార్టీలు,కాఫి బార్లు, సోషియల్ నెట్వర్కులు

 భావ నిక్షిప్త :: భూదేవికి విష్ణువిచ్చిన వరాలు, బలరాముని లీలలు ఇతర భాగవత విశేషాలు.
"ఎవరక్కడా ! కొంప దీసి ఇది ఏ క్రీస్తు పూర్వపు సంవత్సరమో కాదు కదా.. వరాలంట వరాలు అవన్ని వాయిదా తీరి పోయి భూదేవి కొనప్రాణంతో కొట్టుమిట్టాడుతూంది ( అణు ఒప్పందం చారిత్రిక ముందడుగటా)

 ఇది నారద బ్లాగు. ఇక్కడ స్వేచ్చ బాగా ఎక్కువ. :: బ్లాగ్లలో గొడవలకి పరిష్కారం ఏమిటి ?
"అంతా అదిష్ఠానం చూసుకుంటుందని నిద్రపోతే సరి

 రేఖా చిత్రం :: నిజ జీవితంలో హాస్యం!!
నిజ జీవితంలో శోకరసం తప్పా హాస్య రసం ఎక్కడుంది గురువుగారూ మీకు కల్పనా చాతుర్యం మరీ ఎక్కువనుకుంటా

తెలుగిల్లు :: చదువులమ్మ సాక్షిగా కన్యాశుల్కంతో కళ్యాణం
ఓల్డ్ ఈస్ గోల్డ్ అనుక్కున్నదేమో ఆ వధువ..

చెప్పు దెబ్బలు-పూలదండలు :: కెలుకుడు ఆపండ్రా బాబోయ్, బ్లాగోయ్!
కెలికితే గాని సక్రమంగా ఉడకదు  దొరా! పరిపక్వత రావాలంటే ఈ కెలుకుడు,ఏంపుడు అంతా చెయ్యాల్సిందేగా

//aanamdam :: భగవంతుడు చండశాసనుడు కాదు//
అంటే ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నుకున్నామా ఏంటి

//కరుణా సముద్రుడు//
ఇందులో చేపల వేటకు పోతే మన జాలర్లను పాకిస్తాన్, శ్రీలంకా మిలిటరి వారు కాల్చి పడెయ్యరుగా

//మనకు జన్మజన్మల ఆత్మ బంధువు..//
ఆత్మతోనే లింకు చెడి అవస్థలు పడుతుంటే ఆ అత్మకు ఒక భంధువు కూడాను

వర్తమాన విషయాలపై తెలుగు జనరల్ నాలెడ్జి :: హోమీ జహంగీర్ భాభా (Homi Jehangir Bhabha)
ఇది వర్తమానమా బాసూ.. మీ కాలనిలోనో,మీ మండలంలోనో ఎవడో కుర్రాడు  ఉంటాడు..ఆడు ఏదో కనిపెట్టి ఉంటాడు ఆడ్ని కలిసి వ్రాయప్పా.. అతని అన్వేషణ గురించి

 శ్రీ-పదములు :: నవంబర్ 2010 రాశి ఫలాలు
మన ఫలాలన్ని పెద్దోళ్లు లాక్కుని , వద్దని   రాల్చినవే గా  మనకు దక్కే ఫలాలు

 వరూధిని :: అప్పు చెయ్య కుండా పప్పు కూడు ఎలా తిన వచ్చు?

0 comments:

Post a Comment