క్షమించండి !

నా ఈ బ్లాగును అప్డేట్ చెయ్యడం లేదు. ప్రస్తుతం నా మరో తెలుగు బ్లాగ్ రెగ్యులరుగా అప్డేట్ అవుతూంది. అందులోని టపాలను చదవడానికి ఇక్కడ నొక్కండి

Monday, 31 January 2011

ఇస్లాం -క్రైస్తవ మతాల్లోను బ్రాహ్మణీయం

నెను హిందూ మతంలోని వేదాలు , వాటి డొల్లతనం, వాటిని అడ్డం పెట్టుకుని జరిగే దోపిడి, కుల వ్యవస్థ, కుల వివక్షత,బ్రాహ్మణియాలను విమర్శిస్తుటే కొందరు మితృలు ఇతరమతాల గురించి ఎందుకు మాట్లాడవని  కార్నర్ చేసేరు. ఏ చరిత్ర చూసినా ఏమున్నది గర్వ కారణం అన్నట్టుగా ఏ మతంలోనన్నా ఇవి తప్పని సరి ఉంటాయి.

ప్రేమ గొప్పది -ప్రేమికులే ఈవ్ టిజింగ్ కేసు పెట్టుకుంటారు -యాసిడ్ దాడి చేస్తారు. స్నేహం గొప్పది -స్నేహితులే ద్రోహాలు చేస్తుంటారు. ఏ నది అన్నా పవిత్రంగానే మొదలవుతుంది. దారిలోనే మలినాలు, శవాలు కలిసి పోతాయి. మతాలు కూడ అంతే.

మతాలు కొందరు పునీతుల అభిమతాలే. ఇవీ నదీ నదములవంటివే.  పుట్టినప్పుడు అవి క్రిస్టల్ క్లియరుగా ఉండి ఉండవచ్చు. వారితో ప్రత్యక్షంగా కలిసి మెలిసి ఉన్నవారు - అలా కలిసి మెలిసి ఉన్నవారితో కలిసి మెలిసి ఉన్నవారు ఇలా రెండు మూడు తరాలదాక ఈ క్రిస్టల్ క్లియర్ పవిత్రత కొనసాగి ఉండ వచ్చు .

కాని కాలక్రమంలో చెత్త,చెదారం కలిసి పోయాయి. ఓషో చెప్పిన ఒక విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తాను.

"తప్పుడు వ్యక్తి సరైన మార్గంలో పయణించినా గమ్యాన్ని చేరుకోలేడు -సరైన వ్యక్తి తప్పుడు మార్గంలో పయణించినా గమ్యాన్ని తప్పక చేరుకుంటాడు"

సమస్య మార్గాలకు సంభందించింది కాదు.మనుషులకు సంభంధించింది.

తమిళ కవి కన్నదాశన్ చెప్పేరు " ఏం చేద్దాం ! గొప్ప సిద్దాంతాల పట్ల పనికిమాలినవారే ఆకర్షితులవుతారు. గొప్ప మేథావులు పనికిమాలిన సిద్దాంతాల పట్ల ఆకర్షితులవుతారు. గొప్పవారు గొప్ప సిద్దాంతాల పట్ల ఆకర్షితులై జాతిని నాడిపి ఉంటే మన దేశం ఇలా ఉండేది కాదు"

జీవితంలో ఆధునికత ఎంతకెంత పెరిగిందో మనిషిలో అహంకారం కూడ అంతకంత పెరిగి పోయింది. అహం పెరిగి పోతూ ఉంటే ప్రకృతితో అనుసంధానం తెగి పోయింది. అహం వీడి -  పక్రుతితో,సృష్ఠితో,సృష్థికర్తతో ఏకమై పునీతులు వెలిబుచ్చిన అభిమాతాల -మతాల సారమేదో మనకు అర్థం కావడం లేదు.

అర్ఠం కాని వారే -అర్థం చేసుకోవడానికి ప్రయత్నించనివారే మతపెద్దలయ్యేరు. ఇక మతాలు మెటాషే.

నబి (స-అజం) గారి జీవితంలో ఒక సంఘఠన.చివరి ఘడియలు దగ్గరయ్యాయి. ఎందుకో ఆయన చాలా అన్ ఈజిగా ఫీలయ్యేరు. భార్యను అడిగేరు

 " ఇంట్లో డబ్బేమన్నా దాచావా?"

"అవునండి ..మీ పరిస్థితి ఇలా ఉంటే ..ఎప్పుడు ఏం అవసరం అవుతుందో అని కొన్ని దినార్లు దాచాను"

"వెంటనే వాటిని ఎవరికన్నా ఇచ్చెయ్యి"

"ఈ వేళకు ఎవరొస్తారండి?"

సరిగ్గా అదే క్షణంలో భయిటనుండి ఒక ఆర్థుని ఆర్థనాదం వినిపించింది. ఆమె వెళ్ళి ఆ దినార్లను అతనికిచ్చి వచ్చింది.

నబి(స-అజం) చెప్పేరు :

"అకాలంలో వీటిని పుచ్చుకోవడానికి ఒకతన్ని పంపిన భగవంతుడే ..నాకు అవసరమైనప్పుడు ఇచ్చి పోవడానికి కూడ ఒకతనిని పంపుతాడు. ఇంతకాలం ఆస్తికునిగా బతికిన నన్ను మరణించే సమయాన నాస్తికుడ్ఇగా చనిపొమ్మంటావా?"

నబి మన సాధువులు, సిద్ద పురుషుల్లాంటి వారు కాదు. ప్రపంచంలోనే పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించినవారు. సామ్రాజ్య ఖజానా ఆయన కనుసైగల్లో తెరుచుకుంటుంది. కాని ఆయన ఆలోచనా -ప్రవర్తనా ఇలా ఉన్నాయి.

కాని ఇప్పట్లో ఇస్లాం మతగురువుల్లో ఇటువంటి ప్రవృత్తిని ఎక్స్ పెక్ట్ చెయ్యగలమా?

ఆఠవిక జీవితం -పాశవిక జీవితం అని చెప్పుకొన్న రోజుల్లోనే మనిషి -తన  మనస్సు ఎంతో నిర్మలంగా ఉండేవి. ముఖ్యంగా సైకియాట్రి సమస్యలు ఉండేవి కావు. వేదం అనర్థమైనా -మంత్రాలు తంత్రాలే అయినా అతనికి అవి ఉపయోగ పడ్డాయి. కాని ఆధునిక మానవునికి - అధునాతన జీవితం గడుపుతున్న ఈ రోజుల్లో ఎంతమెరకు ఉపయోగ పడతాయి.

ఎడతెగని రక్త స్రావంతో బాధపడే ఒక  స్త్ర్రీ యేసుక్రీస్తు బట్టలను తాకగానే స్వస్థత పొందింది.జీసస్ "నీ విశ్వాసమే నిన్ను రక్షించింది" అన్నారు. ఈ నిజాయితి, ముక్కు సూటితనం పావలా ఫాదర్లో సైతం చూడగలమా? కనీశం ఎదురు చూడగలమా?

రామకృష్ణ పరమహంసులు దివంగతులైన తరువాత స్వామి వివేకానంద మఠ నిర్మాణం కోసం పైసా పైసా "అడుక్కు తిని" కూడ పెట్టి ఒక భూమి కొన్నారు. పశ్చిమ బెంగాల్లో కరవు వచ్చింది. ఒక్క క్షణం ఆగలేదు "అమ్మేద్దాం" అన్నాడు.

ఈ నిక్కచ్చితనాన్ని -మానవత్వాన్ని నేటి హిందూ మత గురువుల్లో ఏ ఒక్కరి వద్దన్నా చూడగలమా? కనీశం ఎదురు చూడగలమా?

ఇస్లాం -క్రైస్తవ మతాల్లోను బ్రాహ్మణీయం అని మొదలు పెట్టి ఇవన్ని చెప్పడం దేనికంటే .. హిందూ మతంలో బ్రాహ్మణుల పాత్రను ఇస్లాం -క్రైస్తవ మతాల్లో ఇమామ్ లు, ఫాదర్లు పోషిస్తున్నారు. "మీ కోసం ప్రార్థన చేస్తాం - మీరు మాకోసం పని చెయ్యండి -మేము ఏ పని చెయ్యం" గోపాలునిగా కాల జ్నానం రచించిన బ్రహ్మంగారెక్కడ?  వీరెక్కడ ?

బేవార్సుగా వచ్చింది తింటూ కూర్చుంటే - వీరు ఉపదేశాలు గుప్పిస్తుంటే ఆ ఉపదేశాలే పునీతుల అభిమతంగా పుట్టిన మతమనే నదీ నదములల్లో చెత్తా చెదారాలను కలిపాయి. వాటిని తొలగించి - కాస్త మానవత్వమన్న క్లోరిన్ కలిపి - ప్రాక్టికాలిటి అన్న బ్లీచింగ్ పవుడర్ వేసి గాని ఆ నీరును తాగము.

ఈ పని చెయ్యక అలానే తాగితే మత పిచ్చి -కుల పిచ్చి -మత చాందస వాదాలు -పరమత దూషణ వంటి జబ్బులకు గురవుతాం.
టేక్ కేర్.

2 comments:

  1. పొలికేక1 February 2011 at 10:13

    మరి దీనికేమంటారు ?

    http://durgeswara.blogspot.com/2011/02/blog-post.html

    ReplyDelete