అహం ఉన్నవాని పైనే గ్రహం పని చేస్తుంది. అహం అంటే " నేను చేస్తున్నాను" అన్న ఫీలింగుతో చెయ్యడం.
నా ప్రయత్నాలన్ని సున్నల్లాంటివి ఇవీ భగవంతుని అనుమతితోనే సాధ్యమవుతున్నవి. భగవంతుడు దయ దలచి సంఖ్య వేయాలి.ఆయన కుడి పక్కన వేస్తాడో,ఎడమ ప్రక్క వేస్తాడో అసలు వెయ్యడో అది ఆయన ఇష్ఠం అని భావించి పని చెయ్యండి.
ఏ పనినన్నా ఇది నా పని అన దలచి మొదలు పెడితేనే దాని పై మన జాతకం పని చేస్తుంది. నేను కాస్త పశాంతంగా ఉండి ఇంకా చక్కగా భగవంతుడ్ని ద్యానం చేసుకునే వీలు కల్పించే పని ఇది. ఈ పనైతే దేవునికి ఇంకాస్త దగ్గర కావచ్చు అని భావించి ప్రయత్నం చెయ్యండి.
ఆప్పుడు గ్రహాల కన్నా భగవంతుని కరుణే మీ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది.
మరో సంగతి ఏమంటె స్వార్థం కోసం పని చేసినప్పుడే గ్రహాలు పని చేస్తాయి. నిస్వార్థంతో - ఇతరులకోసం మన ప్రయత్నాలు సాగినప్పుడు -మన ప్రయత్నంతో ప్రయోజణం పొందనున్న అశేష ప్రజానీకం జాతకాలు పని చేస్తాయి.
కాబట్టి అహం వీడండి ! స్వార్థం వీడండి !!
0 comments:
Post a Comment