క్షమించండి !

నా ఈ బ్లాగును అప్డేట్ చెయ్యడం లేదు. ప్రస్తుతం నా మరో తెలుగు బ్లాగ్ రెగ్యులరుగా అప్డేట్ అవుతూంది. అందులోని టపాలను చదవడానికి ఇక్కడ నొక్కండి
Showing posts with label Ego. Show all posts
Showing posts with label Ego. Show all posts

Wednesday, 2 February 2011

అహం -గ్రహం

అహం ఉన్నవాని పైనే గ్రహం పని చేస్తుంది. అహం అంటే " నేను చేస్తున్నాను" అన్న ఫీలింగుతో చెయ్యడం.

నా ప్రయత్నాలన్ని సున్నల్లాంటివి ఇవీ భగవంతుని అనుమతితోనే సాధ్యమవుతున్నవి. భగవంతుడు దయ దలచి సంఖ్య వేయాలి.ఆయన కుడి పక్కన వేస్తాడో,ఎడమ ప్రక్క వేస్తాడో అసలు వెయ్యడో అది ఆయన ఇష్ఠం అని భావించి పని చెయ్యండి.

ఏ పనినన్నా ఇది నా పని అన దలచి మొదలు పెడితేనే దాని పై మన జాతకం పని చేస్తుంది.  నేను కాస్త పశాంతంగా ఉండి ఇంకా చక్కగా భగవంతుడ్ని ద్యానం చేసుకునే వీలు కల్పించే పని ఇది. ఈ పనైతే దేవునికి ఇంకాస్త దగ్గర కావచ్చు అని భావించి ప్రయత్నం చెయ్యండి.

ఆప్పుడు గ్రహాల కన్నా భగవంతుని కరుణే మీ జీవితాన్ని  ప్రభావితం చేస్తుంది.

మరో సంగతి ఏమంటె స్వార్థం కోసం పని చేసినప్పుడే  గ్రహాలు పని చేస్తాయి. నిస్వార్థంతో - ఇతరులకోసం మన ప్రయత్నాలు సాగినప్పుడు -మన ప్రయత్నంతో ప్రయోజణం పొందనున్న అశేష ప్రజానీకం జాతకాలు పని చేస్తాయి.

కాబట్టి అహం వీడండి ! స్వార్థం వీడండి !!

Friday, 14 January 2011

నా రచనలు మీలో కొందరికెందుకింత చికాకనిపిస్తాయంటే!

నాకే తెలీకుండా నేను నిజాలు వ్రాసేస్తున్నాను. అవి మీకు తెలియనివని కావు. తెలిసినా వాటి స్థానంలో కొన్ని అందమైన అబద్దాలను సర్దేసుకుని హాయిగా బ్రతికేస్తున్నారు. నేను మీరు నమ్మడానికి,అంగీకరించడానికి(మరీ బాహుటంగా) సిద్ద్దంగాలేని కొన్ని విషయాలను ప్రస్తావించేస్తున్నాను.

కొందరు మహిళలు వారి వయస్సు 40 దాటేస్తున్నా చిన్న పిల్లల్లా నంగి నంగిగా,ముద్దు ముద్దుగా మాట్లాడటానికి ప్రయత్నిస్తుంటారు. అదే కోవకు చెందినవారికి నా మాటలు పుండు మీద కారం చల్లినట్టు పని చేస్తున్నాయి.

నాకు ఈ ప్రపంచంతో/దేశంతో/రాష్ఠ్ర్రంతో  పెద్దగా పని లేదు. నేను ఏదీ ఆశించడం లేదు. నాకు ఉధ్యోగం వద్దు, బ్యాంక్ రుణం వద్దు,అగ్రెడెషన్ వద్దు,ప్రభుత్వం వారు విలేకరులకిచ్చే ఇంటి పట్టాలు వద్దు, నేను బ్రెడ్ హంటర్ గా ఉండగా పేదవాడన్న్న హోదాలో  ఎం.ఆర్.ఓ ఇచ్చిన పట్టాను సైతం క్యేన్సల్ చెయ్యించుకున్నాను. ప్రజలతో కూడ నాకు పని లేదు. వీరి ఆలోచనలు, మాటలు,చేతలు అన్నింటికి నేను వ్యతిరేకమే. పైగా నా అసంతృపితిని ముక్కు సూటిగా చెప్పేస్తుంటాను కూడా.

నేను ఇప్పట్లో (ఐదు -పది సం.ల దాక ఎన్నికల్లో పోటి చేసే ఉద్దేశం కూడ లేదు. మీరు ఇది అహం అనుకోకుంటే ఇంకో మాట కూడ చెప్పగలను. ప్రజలకే నాతో పనుంది, నాక్కావల్సిన యాభై నూరు రూపాయలు నిజాయితిగా,చట్టబద్దంగా మరే మార్గంలోనన్నా సంపాదించుకునే సత్తా,దమ్ము నాకున్నాయి. నాకు చాలా పనులు తెలుసు. (వాటి వివరాలు చెబితే మరీ చికాకు పడతారు -ఎందుకూ కొరగాని వారు).అయితే నా జ్యోతిషం,నా మేథస్సు నా ఒక్కనివద్దే లభిస్తాయి. అంటే నాదే పై చెయ్యి.

నేను కాస్త మనస్సు చంపుకుంటే, నిజాలు మాట్లాడటం మానేస్తే ఇంకా ఎక్కువగానే సంపాదించగలను. నేను సెక్స్ గురించి,దాని ఆవశ్యకత గురించి వ్రాయకున్నా నాకొచ్చిన నష్ఠమేమి లేదు. పైగా ఇంకాస్త గుడ్ విల్ పెరిగి,ఇంకో పది మంది జ్యోతిష సలహా కోసం నన్ను సంప్రదిస్తారు. ఇంకా పది రాళ్ళు ఎక్కువే సంపాదించుకో కలుగుతా.

అయినా చిర్రెత్తించే కథనాలు,టపాలు ఎందుకు వ్రాస్తున్నానా అని ఆలోచిస్తుంటే నాకు కొన్ని విషయాలు స్ఫురించాయి.

కేవలం  నా వ్యక్తిగత అభివృద్దికైతే నాకిన్ని విషయాల పై అవగాహణ ఉండాల్సిన అవసరమే లేదు. కేవలం నేనొక్కడ్ని సుఖ పడాలంటే నేను చెయ్యవలసిందీ ఏమీ లేదు. మరి ఎందుకీ ఏడుపు అని మీరడగవచ్చు.

నెనీ స్థాయికి రావడానికి నాకెన్నో ట్రీట్మెంట్స్ అవసరమాయే. నేనూ మీలో చాలా మందిలాగే ఉన్నా. కాని నేటి నాలా నేను మారడానికి చాలా కాలం పట్టింది.కారణం ఏ ఎదవా పూర్తి నిజాలు వ్రాసి ఉంచలే. నాకు దొరికినవన్ని అందమైన అబద్దాలే, ఆచరణ సాధ్యం కాని ఆదర్శాలే.

వాస్కోడకామా, కొలంబస్ల వలే ఎటువంటి రూట్ మ్యేప్ లేకనే ప్రయాణం చేసా.. నా ప్రాణాలకు సైతం ముప్పు తెచ్చుకున్నా. మరి నా పరిస్థితి మరెవ్వరికి రాకూడదన్న కరుణే నన్నిలా చేదు నిజాలను ఏకరవు పెట్టిస్తూంది.

పది మంది మన్నెనలు కోరి చేసే రచనలు పాఠకుని అహాన్ని సంతృప్తి పరుస్తాయి. మరి నేను కేవలం వీరి పట్ల కరుణ కొద్ది వ్రాస్తున్నా. నాకు వీరి మన్నెనలు అవసరం లేదు. నాలుగు ముక్కలు అలా వ్రాసుంటే మరెందరికో ఉపయోగపడేవిగా అన్న ఆలోచన నా 80వ ఏట కలిగిందనుకొండి. నేనేం చెయ్యగలను? ఏమీ చెయ్యలేను. గిల్టితో మధనపడటం మిన:

అందుకే అనుక్కున్న విషయాలు,అనుకున్న రీతిలో చెప్పేస్తున్నా. ఈ రోజు మీలో చాలా మంది కూడ నన్నో ఎదవక్రింద చూడవచ్చు. కాని ఇంటర్ నెట్ +  గూగుల్ పుణ్యమా అంటూ నా ఈ రచనలు చిరంజీవత్వం పొంది బతికే ఉంటాయి. కొన్నాళ్ళకే అబద్దాల పై చికాకు కలిగి నిజాలను నిర్భ్హయంగా ఎదుర్కొనే దమ్ము,దైర్యం కలిగి నా రచనలకోసం వెతికే వారి సంఖ్య పెద్దదై ఉంటుంది.

కాబట్టే వ్రాస్తున్నా ..జస్ట్ సాటి మనుషుల మీద ప్రేమతో ,కరుణతో - రేపు నన్ను గిల్టి బాధించకూడదన్న ఏకైక కారణంతో వ్రాస్తున్నా.

Monday, 16 August 2010

అహంకారంతో అత:పాతాళం

మహా భారతంలో భీముడు ఆంజనేయ స్వామిని  కలుసుకున్నసన్నివేశం  అందరికి తెలిసిందే.
ద్రౌపది కోరుకున్న పుష్పాన్ని తేవడం కోసం వెళ్ళడం. దారిన ముసలి కోతి దారికి అడ్డంగా తోక పెట్టి
కూర్చుని ఉంటే భీముడు ఆ వానరంతో వాగ్వాదానికి దిగి ఆ తోకను కదల్చ లేక పోవడం కొన్ని సినిమాల్లో కూడ చూసి ఉంటారు. మనిషిలో అహంకారం ప్రవేశిస్తే అతను మంచివాడైతే మరుక్షణమే భగవంతుడు అతనికి గర్వ భంగం గావించి రక్షిస్తాడు. అతను చెడ్డవాడైతే భగవంతుడు అతని అహంకారాన్ని మరింత పెరిగేలా చేసి సర్వ నాశనం చేస్తాడు.

ఇటువంటి గర్వ భంగ దృశ్యాలు పురాణాల్లో కోకొల్లలు ఉంటాయి. ఆ కోవకు చెందిందే ఇంకొకదానిని ఇప్పుడు చూద్దం.

అనుకోకుండా అర్జునుడు ఆంజనేయ స్వామి కలుసుకున్నారు.  పిచ్చా పాటి మాట్లాడుతున్నారు. రాముని సేతు బంధనం గురించి ప్రస్తావన వచ్చింది. అర్జునుడు నేనైతే లంకకు భాణాలతోనే సేతు నిర్మించేవాడ్ని అని విర్ర వీగాడు.ఆంజనేయ స్వామి సతరు సేతు నిర్మించింది మనుషుల కోసం కాదని కోతుల కొసమని అదని ఇదని సర్ది చెబుతున్న కొద్ది అర్జునుడు నేటి రాజకీయ నాయకుల్లా వాగడం వాగడమే. ఆంజనేయ స్వామికి కోపం వచ్చింది

"సర్లేవయ్యా ఇప్పుడు నిర్మించు భాణాలతో సేతు. ఈ ఒక్క వానరం దాటికి తట్టుకుని నిలబడుతుందేమో చూద్దాం. ఆతరువాత లంకకు నిర్మిద్దువుగాని సేతు" అన్నాడు.

మాటా మాటా పెరిగింది .అర్జునుడు తాను నిర్మించే సేతువును హనుమన్న కూల్చేస్తే ప్రాణ  త్యాగం చేసుకుంటానని శపథమే చేసాడు.

భాణాలతో సేతు నిర్మించాడు. హనుమన్న రాముడ్ని దలచి దాని పై తన కాలి బొటన వేలు మోపాడు. అంతే.సేతు కుప్ప కూలింది. అర్జుడు బిత్తర పోయాడు. కాసేపట్లో తేరుకుని ఆత్మాహుతికి ఉపక్రమించాడు. ఈ సంగతిని జ్నాన దృషితో తెలుసుకున్న కృష్ణుడు పరుగు పరుగున  స్పాటుకు వచ్చాడు.

జడ్జి లేకుండా కాస్కున్న పందెం చెల్లదని తాను న్యాయ నిర్ణేతగా ఉండగా మళ్ళీ సేతు నిర్మాణం జరగాలని కన్విన్స్ చేసాడు. అర్జునిడిలోని అహం ఎప్పుడో పటా పంచలైంది.

అహంకారం గతానుభవాన్నిపట్టి బుద్దిలో పుడుతుంది. గతమే మళ్ళీ మళ్ళీ పునరావృతం కావాలని రూలేమి లేదు. అంతటి కాలా గాంధి కామరాజ్ని  ఒక విథ్యార్థి నేత ఓడించాడు. పురచ్చి తలైవిగా (విప్లవ నాయకి) చలామణి అవుతున్న జయలలితను ఒక మెడికల్ షాపు అతను ఓడించాడు

గతానికి వర్థమానానికి పోలికే ఉండదు.ఏ సెకండుకా సెకండు కొంగ్ర్త్తొత్తగా జనియిస్తుంది.  సర్లే వ్యాఖ్యాణాలు కాని గాని కథకొస్తాం. ప్రస్తుతం అర్జునుడిలోని అహం హుష్ కాకి అయ్యింది. కృష్ణుడ్ని తలచుకుని భక్తి ప్రప్తత్తులతో భాణాలతో  సేతు నిర్మాణం చేసాడు.

ఇక్కడ అర్జునిడిలో మాయమైన అహంకారం  ఆంజనేయ స్వామి  మదిలో ప్రవేశించింది. ఈ సారి హనుమన్న కాలి బొటన వ్రేలు  మోపడం సరికదా .. సేతు పై ఎక్కి ఎంత దూకినా సేతు కదల్లేదు.

ఈ జీవితమే ఒక ఆక్సిడెంట్. ఇక్కడ ఎవరికి ఏది లభించినా అది ఏక్సిడెంటల్. ఎవరు ఏది పోగొట్టుకున్నా అది యాక్సిడెంటల్. ఏదో వస్తే / పొందితే /దక్కితే తాను గొప్పని , మరేదో పోతే/పోగొట్టుకుంటే /దక్కకుంటే తాను ఎదవని ఎవరూ నిర్దారించుకోవలసిన అవసరం లేదు.

మన ప్రయత్నం అన్నది చెక్కులో సున్నలు పెడుతూ వెళ్ళడమే. అంకె పడేది భగవత్ కృపతోనే. అది ఏడమ వైపు పడుతుందో, కుడి వైపు పడుతుందో, అసలు పడుతుందో పడదో అది అతనికే ఎరుక.