క్షమించండి !

నా ఈ బ్లాగును అప్డేట్ చెయ్యడం లేదు. ప్రస్తుతం నా మరో తెలుగు బ్లాగ్ రెగ్యులరుగా అప్డేట్ అవుతూంది. అందులోని టపాలను చదవడానికి ఇక్కడ నొక్కండి
Showing posts with label రచన. Show all posts
Showing posts with label రచన. Show all posts

Friday, 14 January 2011

నా రచనలు మీలో కొందరికెందుకింత చికాకనిపిస్తాయంటే!

నాకే తెలీకుండా నేను నిజాలు వ్రాసేస్తున్నాను. అవి మీకు తెలియనివని కావు. తెలిసినా వాటి స్థానంలో కొన్ని అందమైన అబద్దాలను సర్దేసుకుని హాయిగా బ్రతికేస్తున్నారు. నేను మీరు నమ్మడానికి,అంగీకరించడానికి(మరీ బాహుటంగా) సిద్ద్దంగాలేని కొన్ని విషయాలను ప్రస్తావించేస్తున్నాను.

కొందరు మహిళలు వారి వయస్సు 40 దాటేస్తున్నా చిన్న పిల్లల్లా నంగి నంగిగా,ముద్దు ముద్దుగా మాట్లాడటానికి ప్రయత్నిస్తుంటారు. అదే కోవకు చెందినవారికి నా మాటలు పుండు మీద కారం చల్లినట్టు పని చేస్తున్నాయి.

నాకు ఈ ప్రపంచంతో/దేశంతో/రాష్ఠ్ర్రంతో  పెద్దగా పని లేదు. నేను ఏదీ ఆశించడం లేదు. నాకు ఉధ్యోగం వద్దు, బ్యాంక్ రుణం వద్దు,అగ్రెడెషన్ వద్దు,ప్రభుత్వం వారు విలేకరులకిచ్చే ఇంటి పట్టాలు వద్దు, నేను బ్రెడ్ హంటర్ గా ఉండగా పేదవాడన్న్న హోదాలో  ఎం.ఆర్.ఓ ఇచ్చిన పట్టాను సైతం క్యేన్సల్ చెయ్యించుకున్నాను. ప్రజలతో కూడ నాకు పని లేదు. వీరి ఆలోచనలు, మాటలు,చేతలు అన్నింటికి నేను వ్యతిరేకమే. పైగా నా అసంతృపితిని ముక్కు సూటిగా చెప్పేస్తుంటాను కూడా.

నేను ఇప్పట్లో (ఐదు -పది సం.ల దాక ఎన్నికల్లో పోటి చేసే ఉద్దేశం కూడ లేదు. మీరు ఇది అహం అనుకోకుంటే ఇంకో మాట కూడ చెప్పగలను. ప్రజలకే నాతో పనుంది, నాక్కావల్సిన యాభై నూరు రూపాయలు నిజాయితిగా,చట్టబద్దంగా మరే మార్గంలోనన్నా సంపాదించుకునే సత్తా,దమ్ము నాకున్నాయి. నాకు చాలా పనులు తెలుసు. (వాటి వివరాలు చెబితే మరీ చికాకు పడతారు -ఎందుకూ కొరగాని వారు).అయితే నా జ్యోతిషం,నా మేథస్సు నా ఒక్కనివద్దే లభిస్తాయి. అంటే నాదే పై చెయ్యి.

నేను కాస్త మనస్సు చంపుకుంటే, నిజాలు మాట్లాడటం మానేస్తే ఇంకా ఎక్కువగానే సంపాదించగలను. నేను సెక్స్ గురించి,దాని ఆవశ్యకత గురించి వ్రాయకున్నా నాకొచ్చిన నష్ఠమేమి లేదు. పైగా ఇంకాస్త గుడ్ విల్ పెరిగి,ఇంకో పది మంది జ్యోతిష సలహా కోసం నన్ను సంప్రదిస్తారు. ఇంకా పది రాళ్ళు ఎక్కువే సంపాదించుకో కలుగుతా.

అయినా చిర్రెత్తించే కథనాలు,టపాలు ఎందుకు వ్రాస్తున్నానా అని ఆలోచిస్తుంటే నాకు కొన్ని విషయాలు స్ఫురించాయి.

కేవలం  నా వ్యక్తిగత అభివృద్దికైతే నాకిన్ని విషయాల పై అవగాహణ ఉండాల్సిన అవసరమే లేదు. కేవలం నేనొక్కడ్ని సుఖ పడాలంటే నేను చెయ్యవలసిందీ ఏమీ లేదు. మరి ఎందుకీ ఏడుపు అని మీరడగవచ్చు.

నెనీ స్థాయికి రావడానికి నాకెన్నో ట్రీట్మెంట్స్ అవసరమాయే. నేనూ మీలో చాలా మందిలాగే ఉన్నా. కాని నేటి నాలా నేను మారడానికి చాలా కాలం పట్టింది.కారణం ఏ ఎదవా పూర్తి నిజాలు వ్రాసి ఉంచలే. నాకు దొరికినవన్ని అందమైన అబద్దాలే, ఆచరణ సాధ్యం కాని ఆదర్శాలే.

వాస్కోడకామా, కొలంబస్ల వలే ఎటువంటి రూట్ మ్యేప్ లేకనే ప్రయాణం చేసా.. నా ప్రాణాలకు సైతం ముప్పు తెచ్చుకున్నా. మరి నా పరిస్థితి మరెవ్వరికి రాకూడదన్న కరుణే నన్నిలా చేదు నిజాలను ఏకరవు పెట్టిస్తూంది.

పది మంది మన్నెనలు కోరి చేసే రచనలు పాఠకుని అహాన్ని సంతృప్తి పరుస్తాయి. మరి నేను కేవలం వీరి పట్ల కరుణ కొద్ది వ్రాస్తున్నా. నాకు వీరి మన్నెనలు అవసరం లేదు. నాలుగు ముక్కలు అలా వ్రాసుంటే మరెందరికో ఉపయోగపడేవిగా అన్న ఆలోచన నా 80వ ఏట కలిగిందనుకొండి. నేనేం చెయ్యగలను? ఏమీ చెయ్యలేను. గిల్టితో మధనపడటం మిన:

అందుకే అనుక్కున్న విషయాలు,అనుకున్న రీతిలో చెప్పేస్తున్నా. ఈ రోజు మీలో చాలా మంది కూడ నన్నో ఎదవక్రింద చూడవచ్చు. కాని ఇంటర్ నెట్ +  గూగుల్ పుణ్యమా అంటూ నా ఈ రచనలు చిరంజీవత్వం పొంది బతికే ఉంటాయి. కొన్నాళ్ళకే అబద్దాల పై చికాకు కలిగి నిజాలను నిర్భ్హయంగా ఎదుర్కొనే దమ్ము,దైర్యం కలిగి నా రచనలకోసం వెతికే వారి సంఖ్య పెద్దదై ఉంటుంది.

కాబట్టే వ్రాస్తున్నా ..జస్ట్ సాటి మనుషుల మీద ప్రేమతో ,కరుణతో - రేపు నన్ను గిల్టి బాధించకూడదన్న ఏకైక కారణంతో వ్రాస్తున్నా.

Wednesday, 29 December 2010

నిద్రలేని రాత్రులు

గురువుగారు,
ఈ టపా చదవనొచ్చారంటే మీకూ రచనంటే ఆసక్తి ఉందనే అర్థం . మీరు "రచయితలు - హోమీ సెక్సువల్స్ ఒకే కోవకు చెందినవారనే నా ఈ టపాను కూడ ఇష్ఠపడతారు. దానిని చదివేందుకు ఇక్కడ నొక్కండి


జాగారం నాకు కొత్తేమి కాదు
సుఫి సంస్కృతిలో జాగారం భాల పాఠం
బ్రహ్మ ముహూర్తాన నిద్ర లేవడం కష్ఠమేమో గాని ఇలా జాగారం చెయ్యడం భాగా అలవాటు ఎస్.ఎస్.సి పరీక్షలకు మేల్కొని మేల్కొని ఈ జాగారం ఇలా అలవాటైంది
ఈ మాట వ్రాస్తున్న ఈ నా కార్యాలయానికి ఎదురుగా ఓ మసీదు
రెండు నిమిషాలకు పూర్వం రామాలయంనుండి సుప్రభాతం వినిపిస్తుండే
ఇప్ప్డుడేమో అల్లాహు అక్బర్
నేను ఇంటినుండి భయిటపదుతుండగా చర్చి గంట మోగింది

మన మానసిక స్థితిని పట్టి అన్నీ అహ్లాదంగానే అనిపిస్తాయేమో?

ఈ సృష్ఠిలోనే నాకు అత్యంత సన్నిహితమైంది నా మనస్సు.
మనసంటే గత సంఘఠనల,అనుభవాల కూర్పని యు.జి.కృష్ణ మూర్తి అంటారు

నాకేమో జన్మ జన్మల జ్నాపకాల కూర్పనిపిస్తూంది..
జ్నాపాకలంటే పత్రికా కార్యాలయాల్లో దుమ్ము దూళీలతో ఉండే ఫైల్ కాపీల్లాంటిది కాదు

అవి ఏ క్రమంలో పొందుపరచ బడ్డాయోకాని
ఏ క్రమంలో కోరుకుంటే ఆక్రమంలో లేస్తాయి

మరి సినిమాల్లోలాగా మాండేజ్ షాట్స్ లా కాక ఆల్ ఇండియా రేడియో ప్రాంతీయ వార్తల్లోని ఆడియో క్లిబ్బింగుల్లా కాక
టివి చానల్స్ లోని ఫ్లాష్ న్యూస్ లా కాక
జస్ట్ స్ఫురిస్తాయి..

ఒక ఉత్తమ  ఎడిటర్ ఎడిట్ చేసినంత నేర్పుతో స్ఫురిస్తాయి. మద్యలో రెండేసి అరగంటలు మిన: రాత్రంతా ఆన్ లైన్లో గడిపాను.

అక్షరాలు టైప్ చేస్తుంటే అవి అక్షరాలుగానే కనిపిస్తున్నాయి

పదాలు టైప్ చేస్తుంటే అవి పదాలుగా కనిపిస్తున్నాయి

విసిరేసినట్టుగా ఉన్నాయి గాని వాటి మద్య అమరిక ,భావం బోధ పడటం లేదు

కూర్పు,నేర్పు ,అతుకు ,అమరిక లేవనిపించాయి
ఇలా చేతకలం పట్టి కాయితం పై వ్రాస్తుంటే అదో  " తుత్తి"

ఒక సారి యూనికోడ్లో టైప్ చేసి పారేస్తే అది చిరంజీవత్వం పొంది ఎన్ని అవతారాలైనా ఎత్తగలదు.

Saturday, 25 December 2010

రండి నా బ్లాగులో వ్రాయండి నాకు నచ్చితే రూ.100 పారితోషికం


అవును బాసు!
రండి నా బ్లాగులో వ్రాయండి నాకు నచ్చితే రూ.100 పారితోషికం. కాని నాది ఒకే నిభంధన:

మీరు నన్ను,నా రచనలను పర్రున చింపినా బాధలేదు అయితే మీ రచనలు బాధ్యతాయుతమైనవిగా ఉండాలి. నా ప్రియారిటీస్ ఇలా ఉంటాయి.

మీ రచనలు క్రింది విషయాలకు సంభంధించి ఉంటే నాకు నచ్చే అవకాశం ఉంటుంది

*ప్రజల ప్రాణాలను ఎలా కాపాడాలి ? ( హత్యలు,ఆత్మ హత్యలు,దాడులు,ప్రమాదాలను వారించే మార్గాలు)

*విద్యా,విద్యా విదానంలోని లోపాలు సవరించుకునే మార్గాలు. యువతరం -మాట -బాట -ఎలా ఉండాలి? ఎలా ఉన్నాయి?

* ప్రజలు తమకు కావలసిన నిత్యావసరాలను తమ స్వయం కృషితో ఎలా సమకూర్చుకో వచ్చు అన్న విషయం పై సూచనలు (వృత్తి,ఉధ్యోగం,వ్యాపారం, సెర్వీసెస్ ఏదైనా సరే చట్ట బద్దంగా,దర్మ బద్దంగా)

*వివాహం -సంతానం -పిల్లల పెంపు

*ఆథ్యాత్మికం -జ్యోతిష్యం

*ద్యానం -యోగం

గమనిక: మీరు మీ రచనలను స్వేచ్చగా నా బ్లాగులో ప్రచురించుకోవచ్చు. ఇందుకు మీరు చెయ్యవలసిందల్లా మీ సుముఖతను నాకు మెయిల్ ద్వారా తెలపడమే .. నేను మీకు గూగుల్ ద్వారా ఆహ్వాణం పంపుతాను. మీరు ఆ ఆహ్వాణాన్ని మన్నించుటకు సతరు లింకును క్లిక్ చేస్తే చాలు మీరు నా బ్లాగులో టీమ్ మెంబర్ అవుతారు. మీకంటూ ఒక ఐడి -మీకంటూ ఒక పాస్ వోర్డు. ఇక రెచ్చిపోవచ్చు.

చెప్పడం మరిచాను.పారితోషికం ఎమ్.ఓ ద్వారే పంప బడుతుంది. అందుకు కాను మీ పోస్టల్ అడ్రస్ ఇవ్వాల్సి ఉంది. మీ ఫోటోతో ఎంపిక విషయాన్ని బ్లాగులో తెలపాలంటే మీ ఫోటో అటాచ్ చెయ్యండి

హెచ్చరిక:

నా రచనలు నా కు పారితోషికం తెచ్చివ్వక పోయినా - ఆన్ లైన్ జ్యోతిష సలహా ద్వారా పది రూపాయలు వస్తున్నాయి. తెలుగు పాఠక లోకానికి ఇలా థ్యాంక్స్ చెప్పాలనుకున్నాను ( నావి మంచి రచనలు కాక పోయినా మంచి రచనలు ఇలాగన్నా అందుతాయికదా?