క్షమించండి !

నా ఈ బ్లాగును అప్డేట్ చెయ్యడం లేదు. ప్రస్తుతం నా మరో తెలుగు బ్లాగ్ రెగ్యులరుగా అప్డేట్ అవుతూంది. అందులోని టపాలను చదవడానికి ఇక్కడ నొక్కండి

Thursday, 3 February 2011

ప్రతి అనర్థం వెనుకా ఒక పరమార్థం

చిన్నప్పట్లో మా నాన్న ఊళ్ళో ఉన్న రోజుల్లో ( ఆయన్ నిజాయితి గల జిల్లా అధికారి కాబట్టి జిల్లానుండి జిల్లాకు ఫుట్ బాల్ ఆడేవారు) ఉదయమే పూజ గదికి పిలిచి నుదుట విభూది దరియింప చేసి కాని స్కూలుకు పంపడు. "రాముడు మంచి బాలుడు"రేంజిలోనే పెరిగాను. నేను అలానే కొనసాగి ఉంటే నేడు బ్లాగ్లోకంలో "వారు" విసిరే ప్రశ్నలకు ఉరిపోసుకుని చచ్చుంటాను. కాని నా జీవితంలో అనర్థాలు అనర్కళంగా చోటు చేసుకున్నాయి.

"డోంట్స్ " అన్న పట్టికలో ఒక హత్య, దొంగతనం ,రేప్ వంటి  పది  విషయాలు తప్ప అన్నింటిలో కొన్నింటితో  పరిచయం - కొన్నింటిలో ప్రావీణ్యం అన్ని లభించాయి. అప్పట్లో నాకు సైతం నా మైండ్లో ఒక ప్రశ్న నిరంతరం ఫ్లాష్ అవుతుండేది. " నేనెలా బాగు పడతానా?" అని.

కాని జీవితం నా భవిష్యత్ కోసమే నన్ను మోల్డ్ చేసింది అన్న సంగతిని  ఇప్పుడిప్పుడే అర్థం చేసుకో కలుగుతున్నాను. చాలా మంది తల్లి తండ్రులు తమ పిల్లల గురించి చెప్పే ఏకైక కంప్లెయింట్ " నా మాట అసలు వినడు సార్!"

నేను వారికిలా చెప్పేవాడ్ని " మీరు చెప్పింది విన్నాడంటే వాడు చెత్త ఎదవ అని అర్థం. వాడిలో ఏమాత్రం ప్రతిభో,క్రియేటివిటియో, ఒరిజినాలిటియో లేదని అర్థం. వినమని ఎందుకు వత్తిడి చేస్తారు. ప్రతిపాదించండి ,సలహా ఇవ్వండి.దానిని పాటించడంలో అతనికి కలిగే సమస్య ఏదో అడిగి తెలుసుకొండి డిస్కస్ చెయ్యండి "

నా జాతకంలో గురువు పరమోచ్చ స్థానంలో ఉన్నాడు కాబట్టో ఏమో నాకన్నా పది ఇరవై సం.ల వయస్సుగలవారు సైతం నన్నాశ్రయించి  సలహాలు కోరుతుంటారు. తమ పిల్లలను సైతం నావద్దకు తీసుకొచ్చేవారు.  కేవలం జ్యోతిష్కునిగానే కాదు నా గతం -వర్థమానం రెండూ పోల్చుకోగా వారిలో కలిగిన గౌరవమది అనుకుంటా.

నేను రాముడు మంచి బాలుడు రేంజిలో బతికి ఉంటే ఇలా నన్నాశ్రయించే వారే కాదనుకుంటా. చేతగాని దద్దమ్మలు ఎంత ఉత్తములుగా ఉన్నా వేస్ట్. చావ ఉన్నవాడు, శక్తి మంతుడు చెడ్డవాడుగా ఉన్నా ఫర్వాలేదు. ఏదో రోజు పరివర్తన చెందుతాడు. నిజానికి చావా ,శక్తి ,నిజాయితి ఉన్నవాడెవడైనా సరే అతని జీవితం విలన్లాగే మొదలవుతుందనుకుంటా.

నేడు సమాజం మంచివారుగా,ఉత్తములుగా నెత్తికెక్కించుకొంటున్న వారిలో చాలా మంది అవకాశం దొరికితే ఎంతటి మోసానికైనా ఎగబడతారు. "ఇంత కాలం మంచిగా బతికి ఏం సాధించాం" అన్నది వారి కాన్సెప్ట్ అయ్యుంటుందేమో?

ఇదే చెడ్డవాడుగా ఉండి పరివర్తన చెందిన వాడు అవకాశాలు కలిగినప్పుడు అర క్షణం కూడా ఆలోచించకుండా "తూ ..మళ్ళీ ఆ  పీతి బతుకు అవసరమా" అనుకొని మొఖం మీదే తిరస్కరిస్తాడు.

ఏమో .. ఈ టపా ఇలా సాగిపోతుంది. పోనీ ఒక చిన్న కథ చెప్పి ముగిస్తా.

ఒక రాజు . మంగలి అతనికి  షెవింగ్ చేస్తుంటే చిన్న టాకా పడింది. రాజు పిచ్చి కుక్కలా అరవడం మొదలు పెట్టాడు. ఆ వేళక్కక్కడికి వచ్చిన మంత్రి "అంతా మంచికే జరిగింది..ఎందుకు అనవసర రాద్దాంతమన్నాడు"

రాజు కోపం మంత్రి మీదికి డైవర్ట్ అయ్యింది. అతన్ని జైల్లో పెట్తమన్నాడు. అప్పటికి మంత్రి "అంతా మంచికే"అంటూ జైలుకెళ్ళాడు. రాజు మంది మహర్భలంతో వేటకు బయలు దేరాడు. నర భలి ఇచ్చే గుంపురాజును చెరబట్టింది.రాజుతో వెళ్ళినవారంతా పారిపోయారు.

రాజును పవిత్ర స్నానం చెయ్యించే వేళ మొఖం మీద గాటు చూసి బలికి పనికి రాడని తరిమేసారు. బతుకు జీవుడా అని రాజు ఊరు చేరాడు. మంత్రిని విడిపించి విషయం చెప్పాడు.

"నాకు గాటు పడింది - నరబలి నుండి తప్పించుకొచ్చాను. మరి నిన్ను జైల్లో పెట్టినప్పుడు కూడ"అంతా మంచికే అన్నావే"  -రాజు

నీతో ఉన్నవారంతా పిరికి పందలు పారి పోయేరు. నేనలా చెయ్యలేను.నీతో పాటుగా పట్టుబడి ఉంటాను. నా ఒంట్లో గాట్లేవి లేవు కాబట్టి నన్ను బలి ఇచ్చి ఉంటారు..

ప్రతి అనర్థం వెనుకా ఒక పరమార్థం ఉండి తీరుతుంది.

0 comments:

Post a Comment